షేర్-ఎ-పంజాబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేర్-ఎ-పంజాబ్
పేరుషేర్-ఎ-పంజాబ్
ఇతరపేర్లుషేర్
స్థాపన2012
రంగులు  నీలము
ప్రధాన కోచ్భారతదేశం రాజిందర్ సింగ్
సహాయ కోచ్భారతదేశం బలదేవ్ సింగ్
మేనేజర్అలోయిసిస్ ఎడ్వర్డ్స్ వీడియో విశ్లేషకుడు = భారతదేశం అన్మోలక్ సింగ్
నాయకుడుభారతదేశం ప్రభ్‌జ్యోత్ సింగ్
స్వంత మైదానముసుర్జీత్ హాకీ స్టేడియం, జలంధర్
(సామర్థ్యము 7,000)
ఉత్తమ ప్రదర్శన2012విజేతలు
ఉత్తమ స్కోరర్భారతదేశం దీపక్ ఠాకూర్ (12 గోల్స్)
అధికారిక వెబ్సైటుఅధికారిక ఫేస్‌బుక్ పేజీ
Home
Away

షేర్-ఎ-పంజాబ్ (పంజాబీ: ਸ਼ੇਰ-ਏ-ਪੰਜਾਬ) పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరానికి చెందిన ఒక ప్రొఫెషనల్ హాకీ జట్టు. ఇది ప్రపంచ హాకీ సిరీస్ పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక హాకీ జట్టు. ఈ జట్టు ప్రస్తుత నాయకుడిగా భారత జాతీయ హాకీ క్రీడాకారుడు, ఫార్వర్డ్ స్థానంలో ఆడుతున్న ప్రభ్‌జ్యోత్ సింగ్, శిక్షకుడిగా భారత హాకీ జట్టు మాజీ శిక్షకుడు రాజిందర్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఈ జట్టు స్వంతమైదానము జలంధర్ లోని సుర్జీత్ హాకీ స్టేడియం[1].

షేర్-ఎ-పంజాబ్ జట్టు 2012లో ప్రారంభమైన ప్రప్రథమ వరల్డ్ హాకీ సిరీస్ పోటీలలో పుణె జట్టును 5–2 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది[2] ఈ పోటీలలో జట్టులోని దీపక్ ఠాకూర్ అందరికంటే అత్యధికంగా 12 గోల్స్ చేశాడు.[3].

నేపధ్యము

[మార్చు]

2012 లో జరిగిన పోటీలు

[మార్చు]

షేర్-ఎ-పంజాబ్ జట్టు తన విజయ ప్రస్థానాన్ని స్వంత మైదానంలో చెన్నై చీతాస్ జట్టును 5–2 తో ఓడించడం ద్వారా ప్రారంభించింది. మొదటి మూడు పోటీలను విజయాలతో ఆరంభించిన ఈ జట్టు తర్వాత రెండు పోటీలలో ఢిల్లీ విజార్డ్స్, చండీగఢ్ కోమెట్స్ జట్ల చేతిలో 1–2, 1–3 తేడాతో వరుసగా ఓడిపోయింది. కానీ తర్వాత పుంజుకొని తర్వాత 5 పోటీలలో వరుసగా గెలిచి సెమీ ఫైనల్ పోటీలలో దూసుకెళ్ళింది. ఈ క్రమంలో తమ జట్టు నాయకుడు ప్రభ్‌జ్యోత్ సింగ్ తొడ కండరాల గాయంతో పోటీలనుండి గెలుపొందడం ఈ జట్టులో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది [4].సెమీఫైనల్ పోటీలలో ప్రవేశించిన మొదటి జట్టుగా ఇది నిలిచింది. వీళ్ళు తమ స్వంత మైదానంలోనూ, ఇరత మైదానాలలో భోపాల్ బాద్‌షాస్, ముంబై మరైన్స్ జట్లను ఓడించారు. నిలకడైన ప్రదర్శనతో పోటీల ఆసాంతం పాయింట్ల పట్టికలో తమ అగ్ర స్థానాన్ని నిలుపుకున్నారు. కానీ తమ చివరి మూడు పోటీలలో కేవలం ఒకటి మాత్రమే నెగ్గడం ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థాన్ని చండీగఢ్ కోమెట్స్ జట్టుకు కోల్పోయారు. వారికన్నా 3 పాయింట్లు తక్కువగా సాధించి ద్వితీయ స్థానంలో లీగ్ పోటీలను ముగించారు.

షేర్-ఎ-పంజాబ్ జట్టు సెమీ ఫైనల్ పోటీలలో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన కర్ణాటక లయన్స్ జట్టును ఎదుర్కొన్నది[5].పోటీ ప్రారంభంలో ప్రత్యర్థి జట్టుకు ఒక గోల్ సమర్పించుకున్నా, పుంజుకొని ఆడి చివరకు 4–1 గోల్స్ తేడాతో గెలిచి ఫైనల్ పోటీకి దూసుకెళ్ళింది[6]. ఫైనల్ లో పుణె స్ట్రైకర్స్ జట్టును 5–2 గోల్స్ తేడాతో ఓడించి మొట్టమొదటి ప్రపంచ హాకీ సిరీస్ కప్పును కైవసం చేసుకున్నది[7]. జట్టులోని దీపక్ ఠాకూర్ అందరికంటే ఎక్కువగా 12 గోల్స్ చేశాడు. టోర్నీ లోని అన్ని పోటీలలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ళ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.[8]

జట్టు కూర్పు

[మార్చు]

జట్టు నాయకుడిగా ప్రభ్‌జ్యోత్ సింగ్, శిక్షకుడిగా రాజిందర్ సింగ్ నియమించబడ్డారు. [9]

ఆటగాడు జాతీయత ఆడిన పోటీలు చేసిన గోల్స్
గోల్ కీపర్లు
ఆంటోని కిండ్లర్  కెనడా -
దినేష్ ఎక్కా  భారతదేశం 8 -
సుఖ్‌జీత్ సింగ్  భారతదేశం 8 -
స్ట్రైకర్స్
ఆకాశ్‌దీప్ సింగ్  భారతదేశం
దీపక్ ఠాకూర్  భారతదేశం 16 12
దీదర్ సింగ్  భారతదేశం 5
గగన్ అజీత్ సింగ్  భారతదేశం 16 5
గగన్‌దీప్ సింగ్  భారతదేశం 9 1
గుర్జంత్ సింగ్  భారతదేశం 16
ఇందర్‌జీత్ సింగ్  భారతదేశం 16 1
కరంజీత్ సింగ్  భారతదేశం 16 2
మన్‌దీప్ ఆంటిల్  భారతదేశం 16 3
ప్రభ్‌దీప్ సింగ్ సీనియర్  భారతదేశం 15
ప్రభ్‌జ్యోత్ సింగ్ (నాయకుడు)  భారతదేశం 13 10
మిడ్ ఫీల్డర్స్
గుర్మైల్ సింగ్  భారతదేశం
ఇమ్రాన్ ఖాన్  భారతదేశం 8
జస్‌బీర్ సింగ్  భారతదేశం 15
మధ్యూ హోచ్‌కిస్  ఆస్ట్రేలియా 16 4
సింరన్ జీత్ సింగ్  భారతదేశం 6
వి. ఎస్. వినయ  భారతదేశం 14 2
డిఫెండర్లు
బిక్రంజీత్ సింగ్  భారతదేశం 5 3
హర్పాల్ సింగ్ (ఉప నాయకుడు)  భారతదేశం 16 1
హర్‌ప్రీత్ సింగ్  భారతదేశం 16 8
మైక్ గుంథర్  జర్మనీ 6
తారీఖ్ అజీజ్  పాకిస్తాన్ 15 2
ప్రభ్‌దీప్ రామ్  భారతదేశం 1
విలియం జాల్కొ  భారతదేశం 15

పోటీలు, ఫలితాలు

[మార్చు]
జట్టు చేసిన గోల్స్ 54 (సరాసరి ఒక్క మ్యాచ్‌కి 3.38 గోల్స్)
ప్రత్యర్థి చేసిన గోల్స్ 38 (సరాసరి ఒక్క మ్యాచ్‌కి 2.38 గోల్స్)
ఎక్కువ గోల్స్ చేసినవారు భారతదేశం దీపక్ ఠాకూర్ (12 గోల్స్)
జట్టు స్థానము: 4వ స్థానము
క్రమసంఖ్య తేదీ స్కోరు ప్రత్యర్థి వేదిక నివేదిక
1 1 మార్చి 5 - 2 చెన్నై చీతాస్ జలంధర్ పోటీ 2
2 3 మార్చి 6 - 1 కర్ణాటక లయన్స్ జలంధర్ పోటీ 6
3 4 మార్చి 3 - 3 పుణె స్ట్రైకర్స్ జలంధర్ పోటీ 9
4 7 మార్చి 1 - 2 ఢిల్లీ విజార్డ్స్ జలంధర్ పోటీ 15
5 8 మార్చి 1 - 3 చండీగఢ్ కోమెట్స్ చండీగఢ్ పోటీ 17
6 10 మార్చి 3 - 2 భోపాల్ బాద్షాస్ భోపాల్ పోటీ 22
7 14 మార్చి 3 - 2 ముంబై మరైన్స్ ముంబై పోటీ 27
8 16 మార్చి 5 - 2 చండీగఢ్ కోమెట్స్ జలంధర్ పోటీ 31
9 17 మార్చి 4 - 3 భోపాల్ బాద్షాస్ జలంధర్ పోటీ 33
10 21 మార్చి 2 - 1 ముంబై మరైన్స్ జలంధర్ పోటీ 39
11 23 మార్చి 1 - 2 కర్ణాటక లయన్స్ బెంగలూరు పోటీ 42
12 25 మార్చి 4 - 2 చెన్నై చీతాస్ చెన్నై పోటీ 45
13 27 మార్చి 2 - 3 పుణె స్ట్రైకర్స్ పుణె పోటీ 49
14 30 మార్చి 5 - 7 ఢిల్లీ విజార్డ్స్ ఢిల్లీ పోటీ 55
15 1 ఏప్రిల్ 4 - 1 కర్ణాటక లయన్స్ బెంగలూరు సెమీఫైనల్ 1
16 2 ఏప్రిల్ 5 - 2 పుణె స్ట్రైకర్స్ ముంబై ఫైనల్
లీగ్ పోటీలలో తుది స్థానము: ద్వితీయ
విజేతలు

గణాంకాలు

[మార్చు]
పోటీ కాలము పోటీలు విజేత ఫలితం తేలనివి ఓటమి గెలుపు శాతము
2012 16 10 1 5 62.50%
స్వంత మైదానము 7 5 1 1 71.43%
ఇతర మైదానాలు 9 5 0 4 55.56%
మొత్తం ప్రదర్శన 16 10 1 5 62.50%
ప్రదర్శన ఫలితాలు
జట్టు చేసిన గోల్స్ 54 (సరాసరి ఒక్క మ్యాచ్‌కి 3.38 గోల్స్)
ప్రత్యర్థి చేసిన గోల్స్ 38 (సరాసరి ఒక్క మ్యాచ్‌కి 2.38 గోల్స్)
ఎక్కువ గోల్స్ చేసినవారు భారతదేశం దీపక్ ఠాకూర్ (12 గోల్స్)
ప్రస్తుత స్థానము : 4
ప్రత్యర్థుల ప్రదర్శన
ప్రత్యర్థి పోటీలు గెలిచినవి డ్రా ఓడినవి చేసిన గోల్స్ ఇచ్చిన గోల్స్ గెలుపు %
భోపాల్ బాద్షాస్ 2 2 0 0 7 5 100.00%
ఛత్తీస్‌గడ్ కోమెట్స్ 2 1 0 1 6 5 50.00%
చెన్నై చీతాస్ 2 2 0 0 9 4 100.00%
డిల్లీ విజార్డ్స్ 2 0 0 2 6 9 0.00%
కర్ణాటక లయన్స్ 3 2 0 1 11 4 66.67%
ముంబై మెరైన్స్ 2 2 0 0 5 3 100.00%
పుణె స్ట్రైకర్స్ 3 1 1 1 10 8 33.33%

హాట్రిక్కులు

[మార్చు]
క్రమ సంఖ్య. ఆటగాడు ప్రత్యర్థి ఫలితము సమయము (సీజన్) వేదిక నివేదిక
1 భారతదేశం దీపక్ ఠాకూర్ చండీగఢ్ కోమెట్స్ 5 – 2 2012 జలంధర్సుర్జీత్ హాకీ స్టేడియం 16 మార్చి 2012 Archived 2013-01-27 at the Wayback Machine
2 భారతదేశం ప్రభ్‌జ్యోత్ సింగ్ ఢిల్లీ విజార్డ్స్ 5 – 7 2012 ఢిల్లీధ్యాన్‌చంద్ జాతీయ మైదానము 30 మార్చి 2012 Archived 2012-05-09 at the Wayback Machine

మూలాలు

[మార్చు]
  1. "Sher-e-Punjab". The Fans of Hockey. Archived from the original on 2018-12-25. Retrieved May 12, 2012.
  2. "Sher-E-Punjab crowned WSH champions". ESPN. April 3, 2012. Archived from the original on 2012-07-29. Retrieved May 12, 2012.
  3. "Top Scorers". World Series Hockey. Archived from the original on 2018-12-25. Retrieved May 12, 2012.
  4. Krishna Kanta Chakraborty (March 25, 2012). "Sher-E-Punjab enter World Series Hockey semifinals". The Times of India. Retrieved May 12, 2012.
  5. Press Trust of India (March 31, 2012). "WSH semifinal: Karnataka to face Sher-e-Punjab on Sunday". NDTV. Archived from the original on 2012-07-02. Retrieved May 12, 2012.
  6. "Sher-e-Punjab enter final of World Series Hockey". The Times of India. April 1, 2012. Retrieved May 12, 2012.
  7. "Sher-E-Punjab crowned WSH champions". ESPN. April 3, 2012. Archived from the original on 2012-07-29. Retrieved May 12, 2012.
  8. "World Series Hockey Top Scorers". World Series Hockey. Archived from the original on 2012-05-03. Retrieved May 15, 2012.
  9. "Sher-e-Punjab". World Series Hockey. Archived from the original on 2018-12-25. Retrieved February 28, 2012.

ఇవి కూడా చూడండి

[మార్చు]