జలంధర్
జలంధర్
జల్లందర్ | |
---|---|
నగరం | |
Coordinates: 31°15′25″N 75°26′36″E / 31.2569°N 75.4432°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | జలంధర్ |
Elevation | 228 మీ (748 అ.) |
జనాభా (2011) | |
• Total | 8,62,196 |
Demonym | జలంధరియే |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 144 001 |
టెలిఫోన్ కోడ్ | +91-181-XXX XXXX |
Vehicle registration | PB08 and PB90 |
అక్షరాస్యత | 82.3% |
జలంధర్ పంజాబ్ రాష్ట్రంలోని నగరం. దీన్ని బ్రిటిష్ వాళ్ళు జల్లందర్ అని పిలిచేవారు.[1] జలంధర్ నుండి ఇతర ప్రదేశాలకు చక్కటి రోడ్డు రైలు సౌకర్యాలున్నాయి. జలంధర్ చండీగఢ్ నుండి వాయవ్యంగా 146 కి.మీ.[2] దూరం లోను, అమృత్‌సర్ నుండి ఆగ్నేయంగా 82.5 కిమీ దూరం లోనూ ఉంది.
జలంధర్ జిల్లా చరిత్ర పురాతన, మధ్యయుగ, ఆధునిక మూడు కాలాలను కలిగి ఉంది.
పురాణాలు, మహాభారతాలలో కనిపించే రాక్షస రాజు జలంధరుడి పేరిట నగరానికి పేరు వచ్చి ఉండవచ్చు. వేదాలలో పేర్కొన్న ప్రకార్ం చూస్తే జలంధర్ నగరాన్ని దేవస్య వర్మ స్థాపించాడు. ఇది రాముడి కుమారుడైన లవుడి రాజ్యానికి రాజధాని అని కూడా ప్రతీతి.
నీటితో పరివేష్ఠితమైన భూమి అనీ జలంధరకు అర్థం. సత్లజ్, బియాస్ అనే రెండు నదుల మధ్య ఉన్న భూమి కాబట్టి ఈ నగరానికి ఈ పేరు వచ్చి ఉండవచ్చు.[3] ప్రస్తుత జలంధర్ జిల్లా ప్రాంతం సింధు లోయ నాగరికతలో భాగం.
గజ్నవీడుల హయాంలో, 1058, 1089 ల మధ్య, ఇబ్రహీం ఘజనీ జలంధర్‌ను ఆక్రమించాడు [4] ఇది తరువాత ఢిల్లీ సుల్తానేట్, మొఘల్ సామ్రాజ్యాల్లో లాహోర్ ప్రావిన్స్‌లో భాగమైంది. 18 వ శతాబ్దం మొఘలుల విచ్ఛిన్నం తరువాత పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కుల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలతో ఏర్పడిన అరాచకం మధ్య జలంధర్ ఆటుపోట్లకు గురైంది. 1766 లో దీనిని ఫైజుల్లాపూరియా మిస్ల్ స్వాధీనం చేసుకున్నాడు. 1811 లో రంజిత్ సింగ్ దీనిని సిక్కు సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు.[5]
1849 లో, ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత, జలంధర్ నగరం అదే పేరుతో ఉన్న డివిజనుకు, జిల్లాకూ ముఖ్య పట్టణమైంది. 19 వ శతాబ్దం మధ్యలో, జలంధర్ ప్రజలతో క్రిక్కిరిసి పోయిందని భావించారు. ఇక్కడి నుండి ప్రజలను కొత్తగా కాలువ నీటి సౌకర్యం ఏర్పడిన ఇతర ప్రాంతాలకు తరలించారు [6]
టర్కీ పట్ల తమ విధానాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 1920 ప్రారంభంలో ఖిలాఫత్ ఉద్యమం జిల్లాలో ప్రారంభమైంది. మహాత్మా గాంధీ ఈ ఉద్యమానికి సానుభూతి, మద్దతును అందించాడు. అయితే ప్రతిస్పందనగా జిల్లాను దేశద్రోహ సమావేశాల చట్టం ప్రకారం 'ప్రకటించిన ప్రాంతం' గా గుర్తించారు.
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం జలంధర్ జనాభా 8,73,725, వీరిలో 4,63,975 మంది పురుషులు, 4,09,750 మంది మహిళలు ఉన్నారు.
అక్షరాస్యత 86.22 శాతంగా ఉంది.[7] పురుషుల్లో అక్షరాస్యత రేటు 88.82% ఆడవారిలో 83.30%
1947 లో భారతదేశ విభజనకు ముందు, జలంధర్‌లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండేవారు. 1941 పంజాబ్ జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలు జనాభాలో 45.2% ఉన్నారు, హిందువులు, సిక్కులు 27.6%, 26.5% ఉండేవారు.[9] పదేళ్ల వ్యవధిలో, 1941 నుండి 1951 వరకు, జలంధర్‌లో ముస్లిం జనాభా 45.2% నుండి 0.2%కి తగ్గిపోయింది.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]స్మార్ట్ సిటీ ప్రాజెక్టు రెండవ దశలో జలంధర్‌ను ఎంపిక చేశారు, ఈ ప్రాజెక్టు ప్నులను ప్రారంభించడానికి మున్సిపల్ కార్పొరేషన్‌కు 200 కోట్లు కేటాయించారు.
జలంధర్, ఫర్నిచరు, గ్లాస్ వంటి వస్తువులను ఎగుమతి చేస్తుంది. క్రీడా పరికరాల తయారీకి ప్రపంచ కేంద్రంగా ఉంది. జలంధర్‌లో తయారైన క్రీడా పరికరాలను ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ వంటి అనేక అంతర్జాతీయ క్రీడల పోటీల్లో ఉపయోగించారు. ఇది చేతి పనిముట్ల తయారీకి కేంద్రంగా ఉంది. నగరం తోలు పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. తోలుతో చేసిన పాదరక్షలు, తోలు వస్తువులు, ఫర్నిచరు ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్ తదితర భారతీయ నగరాల్లోని ఎగుమతి సంస్థలకు విక్రయిస్తారు.
రవాణా
[మార్చు]విమానాలు
[మార్చు]సమీప విమానాశ్రయం ఆదంపూర్ విమానాశ్రయం. ప్రస్తుతం స్పైస్ జెట్ ఢిల్లీకి విమానాలు నడుపుతోంది. అమృత్సర్‌లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం.
రైలు
[మార్చు]ముంబై, కలకత్తా, చెన్నై, పాట్నా, గౌహతి, పూణే, హరిద్వార్, వారణాసి, జైపూర్, జమ్మూ తవి వంటి ప్రధాన నగరాలకు జలంధర్ నుండి నేరుగా రైళ్ళున్నాయి జలంధర్ సిటీ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళే కొన్ని ప్రతిష్ఠాత్మక రైళ్లు హౌరా మెయిల్, గోల్డెన్ టెంపుల్ మెయిల్ (ఫ్రాంటియర్ మెయిల్), న్యూ ఢిల్లీ అమృత్సర్ శతాబ్డి ఎక్స్‌ప్రెస్, పస్చిమ్ ఎక్స్‌ప్రెస్లు. ఇప్పుడు జమ్మూ మార్గంలో చాలా రైళ్లను మాతా వైష్ణో దేవి-కత్రా వరకు పొడిగించారు.
షహీద్-ఎ-ఆజమ్ సర్దార్ భగత్ సింగ్ ISBT (జలంధర్) నుండి హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పెప్సు, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, రాజస్థాన్ లోని పలు ప్రదేశాలకు ప్రభుత్వ ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి.
నగరంలో ప్రభుత్వ క్రీడా కళాశాల ఉంది. ఇది అనేక జాతీయ క్రీడా మండళ్ళకు కేంద్రంగా ఉంది. ఈ కళాశాలలో, క్రికెట్, హాకీ, ఈత, వాలీబాల్, బాస్కెట్‌బాల్ వంటి అనేక క్రీడలు ఆడతారు.
విద్య
[మార్చు]జలంధర్‌లో కింది ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి
విశ్వవిద్యాలయాలు
[మార్చు]- అపీజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నికల్ క్యాంపస్, జలంధర్ (పంజాబ్) [10]
- DAV ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
- DAV విశ్వవిద్యాలయం
- KMV కళాశాల
- దోబా కాలేజ్
- GNA విశ్వవిద్యాలయం
- గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం [11] ప్రాంతీయ ప్రాంగణం
- లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం
- లియాల్పూర్ ఖల్సా కాలేజ్ ఫర్ ఉమెన్
- లియాల్పూర్ ఖల్సా కళాశాల
- ఖల్సా కళాశాల
- మాతా గుజ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్
- మెహర్ చంద్ పాలిటెక్నిక్ కళాశాల
- ఎన్‌ఐటి జలంధర్
- పంజాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
- పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం
- DAV కళాశాల, జలంధర్
- అపీజే స్కూల్, మహావీర్ మార్గ్ [12]
- అపీజయ్ స్కూల్, రామ మండి [13]
- డాఫోడిల్స్ కిండర్ గార్టెన్ & కాన్వెంట్ స్కూల్ [14]
- MGN పబ్లిక్ స్కూల్, ఆదర్శ్ నగర్ [15]
- SD మోడల్ స్కూల్ జలంధర్ కాంట్ [16]
దేవాలయాలు
[మార్చు]పట్టణ ప్రముఖులు
[మార్చు]పేరు | వృత్తి |
---|---|
యష్ చోప్రా | సినిమా నిర్మాత, దర్శకుడు[17] |
సునీల్ దత్ | నటుడు[18] |
కుందన్ లాల్ సైగల్ | నటుడు/గాయకుడు[19] |
అంరీష్ పురి | నటుడు[20] |
జగ్జీత్ సింగ్ | గాయకుడు |
జనరల్ జియా ఉల్ హక్ | పాకిస్తాన్ మాజీ నియంత |
అజిత్ పాల్ సింగ్ | హాకీ ఆటగాడు |
సుర్జిత్ సింగ్ రణధావా | హాకీ ఆటగాడు |
పర్గత్ సింగ్ | హాకీ ఆటగాడు |
ఇందర్ కుమార్ గుజ్రాల్ | మాజీ ప్రధానమంత్రి |
హర్‌భజన్ సింగ్ | క్రికెట్ ఆటగాడు |
లాలా అమరనాథ్ | క్రికెట్ ఆటగాడు |
లాలా జగత్ నారాయణ్ | స్వాతంత్ర్య సమర యోధుడు |
స్వరణ్ సింగ్ | రాజకీయ నాయకుడు |
కర్తార్ సింగ్ దుగ్గల్ | రచయిత |
గురుదయాళ్ సింగ్ | రచయిత |
స్వామి శ్రద్ధానంద | ఆర్య సామాజికుడు, తత్వవేత్త |
అరుణ్ శౌరి | రాజకీయ నాయకుడు, పాత్రికేయుడు |
బూటా సింగ్ | మాజీ కేంద్ర మంత్రి |
మూలాలు
[మార్చు]- ↑ "Imperial Gazetteer2 of India, Volume 14, page 231 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library". dsal.uchicago.edu. Retrieved 2019-08-14.
- ↑ "Jalandhar to Chandigarh". Jalandhar to Chandigarh (in ఇంగ్లీష్). Retrieved 2020-01-31.
- ↑ "Welcome to Official Website of Jalandhar District, Punjab". Archived from the original on 9 July 2015. Retrieved 8 July 2015.
- ↑ John Hutchison, Jean Philippe Vogel, History of the Panjab Hill States, Asian Educational Services, 1994 - Punjab Hill States (India), p.122
- ↑ Parminder Singh Grover Moga, Davinderjit Singh, Discover Punjab: Attractions of Punjab, Parminder Singh Grover, 20 May 2011
- ↑ Tom G. Kessinger, University of California, Berkeley. Center for South and Southeast Asia Studies, Vilyatpur, 1848-1968: Social and Economic Change in a North Indian Village, University of California Press, 1 Jan 1974, p.16
- ↑ "Jalandhar City Population Census 2011-2019 | Punjab". Archived from the original on 28 December 2016. Retrieved 24 March 2017.
- ↑ "Jalandhar City Population Census 2011". Census2011. Archived from the original on 28 డిసెంబరు 2016. Retrieved 24 మార్చి 2017.
- ↑ [1]
- ↑ "Top MBA, MCA Colleges in North India, Punjab, Jalandhar - Apeejay Institute of Management Technical Campus". Archived from the original on 17 February 2016. Retrieved 19 March 2016.
- ↑ [2]
- ↑ Apeejay School
- ↑ [3]
- ↑ Daffodils Kindergarten & Convent School[permanent dead link]
- ↑ [4][permanent dead link]
- ↑ "SD MODEL SCHOOL | An English Medium Co-Educational Institution" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-10-25.
- ↑ "Archived copy". Archived from the original on 7 July 2015. Retrieved 4 July 2015.
{{cite news}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "village khurd in jalandhar". Archived from the original on 5 July 2015. Retrieved 4 July 2015.
- ↑ "imdb". Archived from the original on 25 December 2018. Retrieved 1 July 2018.
- ↑ "veethi". Archived from the original on 5 July 2015. Retrieved 4 July 2015.