Jump to content

ముక్త్‌సర్

అక్షాంశ రేఖాంశాలు: 30°17′N 74°19′E / 30.29°N 74.31°E / 30.29; 74.31
వికీపీడియా నుండి
ముక్త్‌సర్
పట్టణం
శ్రీ ముక్త్‌సర్ సాహిబ్
ముక్త్‌సర్ లోని గురుద్వారా
ముక్త్‌సర్ లోని గురుద్వారా
శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ is located in Punjab
శ్రీ ముక్త్‌సర్ సాహిబ్
శ్రీ ముక్త్‌సర్ సాహిబ్
పంజాబ్‌లో పట్టణ స్థానం
Coordinates: 30°17′N 74°19′E / 30.29°N 74.31°E / 30.29; 74.31
దేశం India
రాష్ట్రంపంజాబ్
Government
 • BodyMunicipal council of Sri Muktsar Sahib
విస్తీర్ణం
 • Total12.66 చ. మై (32.80 కి.మీ2)
Elevation
648.52 అ. (197.67 మీ)
జనాభా
 (2011)
 • Total1,17,085
 • Rankపంజాబ్ పట్టణాల్లో 14 వ స్థానం
DemonymMuktsari
Time zoneUTC+5:30
PIN Code
152026
టెలిఫోన్ కోడ్01633
Vehicle registrationPB 30

ముక్త్‌సర్, పంజాబ్‌, శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ముక్త్‌సర్ జనాభా 1,17,085 కు చేరుకుంది, [1] జనాభా పరంగా ఇది పంజాబ్‌లోని అతిపెద్ద పట్టణాల్లో 14 వ స్థానంలో ఉంది. చారిత్రికంగా ఖిద్రానా లేదా ఖిద్రానే ది ధాబ్ అని పిలిచే ఈ నగరాన్ని 1995 లో జిల్లా ముఖ్య పట్టణంగా చేసారు. 1705 లో ముక్త్‌సర్ యుద్ధం తరువాత ఈ నగరానికి ముక్త్‌సర్ అని పేరు పెట్టారని కాలక్రమ ఆధారాలు సూచిస్తున్నాయి. 2012 లో ప్రభుత్వం, అధికారికంగా నగరం పేరును శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ గా మార్చింది, [2] కానీ ఎక్కువగా దీన్ని అనధికారిక పేరైన ముక్త్‌సర్ అనే పిలుస్తారు.

చరిత్ర

[మార్చు]

ముక్త్‌సర్ యుద్ధం

[మార్చు]
1705, ముక్త్‌సర్ యుద్ధం గురించి చిత్రకారుడి ఊహ

1705 లో, మొఘలులతో చంకౌర్ యుద్ధం తరువాత, [[గురు గోవింద సింగ్|గురు గోవింద్ సింగ్]] ఒక రక్షణాత్మకమైన ప్రదేశం కోసం వెతకడం ప్రారంభించాడు. బ్రార్ నేతకు చెందిన ఒక అనుభవజ్ఞుడైన గైడ్ సహాయంతో అతను, ఖిద్రాన్ ది ధాబ్ చేరుకున్నాడు. అక్కడ అతను శత్రువును ఎదుర్క్జోవాలని నిర్ణయించుకున్నాడు. సిర్హింద్ యొక్క సుబేదారైన వజీర్ ఖాన్ ఆధ్వర్యంలో కనీసం 10,000 మంది సైనికులతో కూడిన సామ్రాజ్య దళం తనను వెంటాడుతున్నట్లు అతనికి వార్తలు వచ్చాయి. అంతకుముందు, 1704 లో, ఆనందపూర్ సాహిబ్‌లోని గురు గోవింద్ సింగ్ సైన్యం వద్ద ఉన్న ఆహార నిల్వలు అయిపోయినప్పుడు, మాఝాకు చెందిన 40 మంది సిక్కు సైనికులు అతనిని విడిచి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు, తాము గురు గోవింద్ సింగ్ అనుచరులైన సిక్కులం కాదని, ఇకపై అతను తమకు గురువు కాదనీ ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఇప్పుడు, ఆ 40 మంది పారిపోయిన వారు తమ తప్పును గ్రహించి, మాయి భాగో అనే ఒక మహిళా సైనికుని ప్రేరణతో గురువు బలగాలలో తిరిగి చేరారు. సిక్కులు మొఘల్ దళాలను ఎదుర్కొన్నారు. సిక్కు సైనికుల సంఖ్య ఎంత అనేది వివాదాస్పదంగా ఉంది. లతీఫ్ వంటి చరిత్రకారులు ఇది 12,000 వరకు ఉండవచ్చని అనగా, సిక్కు చరిత్రకారులు మాత్రం చాలా తక్కువ అని చెప్పారు. కొతమందైతే నలభై మంది మాత్రమే నని అన్నారు. మట్టిదిబ్బపై తమ వ్యూహాత్మక స్థానం నుండి, మొగలు సైన్యంపైకి వారు బాణాలు వేసి, శత్రువులలో చాలా మందిని చంపారు. సిక్కుల తీవ్రంగా ప్రతిఘటించారు.

దాహంతో శత్రు సైనికులు కలవరపడ్డారు. నీళ్ళ కోసం వాళ్ళు ఖిద్రానా సరస్సు చేరుకోవడం సాధ్యం కాలేదు. ఇది దాదాపుగా ఎడారి లాంటి భూభాగం. వేసవి వేడి గరిష్ట స్థాయికి చేరుకుంది. గురువుకు దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసు. అందుకే అతడు చెరువు చుట్టూ రక్షణను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది తప్పిస్తే శత్రువులకు అందుబాటు లోని మరో నీటి వనరు పదిహేను మైళ్ళ వెనక ఉంది. దాహంతో, వేడితో, సిక్కుల ప్రతిఘటనతో మొఘల్ సైన్యం వెనక్కి తగ్గింది. గురు గోవింద్ సింగ్ ఈ చివరి మొఘల్-ఖల్సా యుద్ధంలో గెలిచాడు. దీనిలో భారీగా ప్రాణనష్టం జరిగింది. యుద్ధం చివరలో, అతను బ్రతికి ఉన్నవారి కోసం వెతుకుతున్నప్పుడు, గాయపడిన మాయి భాగో కనిపించింది. పారిపోయి తిరిగొచ్చిన నలభై మంది యుద్ధరంగంలో పోరాడుతూ తమ ప్రాణాలను ఎలా అర్పించారో ఆమె అతడికి చెప్పింది. మాయి భాగో కోలుకొని ముక్త్‌సర్ యుద్ధం తరువాత గురు సమక్షంలోనే ఉండిపోయింది. గురు గోవింద్ సింగ్, తన సిక్కు అనుచరులతో కలిసి దహన సంస్కారాల కోసం మృతదేహాలను సేకరిస్తున్నప్పుడు, మహాన్ సింగ్ అనే వ్యక్తిని చూసాడు. అతను కొన ఊపిరితో ఉన్నాడు. గురువును చూసిన తరువాత, అతను లేవడానికి ప్రయత్నం చేశాడు. గురువు ఒక్కసారి అతన్ని ఆలింగనం చేసుకుని అతని పక్కనే కూర్చున్నాడు. అలసిపోయిన మహాన్ సింగ్, తాను గురువుకు చెందిన సిక్కును కాదని ఇచ్చిన పత్రాన్ని నాశనం చేయమని కన్నీటితో అభ్యర్థించాడు. గురు గోవింద్ సింగ్ ఆ పత్రాన్ని చించివేసాక, మహాన్ సింగ్ మరణించాడు. ఇది ఆ 40 మంది సిక్కులకు " ముక్తి " అని అర్ధం అని ఒక పురాణ నమ్మకం. అందువల్లనే, ఈ నగరానికి ముక్త్‌సర్ అని పేరు వచ్చింది. ఇక్కడ " సర్ " అనే పదం " సరోవర్ " అనే పదం నుండి వచ్చింది. ఇది కిద్రానా చెరువుకు సూచన.

ముక్త్‌సర్ యుద్ధం తరువాత

[మార్చు]

సిక్కులపై మారణకాండ జరిగే రోజుల్లో జస్సా సింగ్, ముక్త్‌సర్ అరణ్యాలలో ఆశ్రయం పొందాడు.

ముక్త్‌సర్, కోట్కాపురా, మారి, ముడ్కి భూభాగాలు ఫరీద్‌కోట్ రాష్ట్రంతో కలిసి ఒకే రాజ్యాన్ని ఏర్పరచాయి. దాని రాజధాని కోట్కాపురా. 1807 లో, దివాన్ మోఖం చంద్ ఈ భూభాగం మొత్తాన్ని తేజ్ సింగ్ నుండి స్వాధీనం చేసుకుని దాన్ని లాహోర్ సంస్థానానికి చేర్చాడు. మోఖం చంద్ ముక్త్‌సర్, కోట్కాపురమ్ మారి వద్ద ఠాణాలను స్థాపించాడు. అప్పటి నుండి ఈ ఠాణాలకు లోబడి ఉన్న గ్రామాలను ప్రత్యేక భూభాగాలుగా భావించారు.

నామ్‌ధారి శాఖ నాయకుడు రామ్ సింగ్ 1861 లో మేళా మాగి సందర్భంగా ముక్త్‌సర్‌ను సందర్శించి తన సందేశాన్ని అందించాడు . అయితే, అతని సిక్కు వ్యతిరేక విధానాలకు గాను జరిమానా రూపంలో స్థానిక చెరువు కట్ట నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును చెల్లించక నందున ముక్త్‌సర్ గురుద్వారా పూజారులు రామ్ సింగ్ కోసం ప్రార్థన చేయడానికి నిరాకరించారు. [3]

ఆధునిక చరిత్ర

[మార్చు]

1947 ఆగష్టులో భారతదేశం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, పశ్చిమ పంజాబ్ నుండి ముస్లిమేతరులు తూర్పు పంజాబుకు, ఇటు నుండి ముస్లింలు అటూ వలస వెళ్లారు. బహావల్పూర్ సంస్థానం నుండి, మోంట్‌గోమేరీ, లాహోర్ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో శరణార్థులు ఫిరోజ్‌పూర్ జిల్లా వెంబడి సరిహద్దు మీదుగా భారతదేశంలోకి ప్రవేశించారు. ముక్త్‌సర్ ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఒక భాగంగా ఉండేది. 1951 జనాభా లెక్కల ప్రకారం, పాకిస్తాన్ నుండి 3,49,767 మంది శరణార్థులు ఫిరోజ్‌పూర్ జిల్లాలో స్థిరపడ్డారు. ఇందులో ముక్త్‌సర్, మోగా తహసీళ్ళు కూడా ఉన్నాయి. [3]

ముక్త్‌సర్ నగరం 1947 ఆగస్టు నుండి 1972 ఆగస్టు వరకు ఫిరోజ్‌పూర్ జిల్లా లోని తహసీలుగానే ఉండిపోయింది. తరువాత ఇది కొత్తగా ఏర్పరచిన ఫరీద్‌కోట్ జిల్లా లోని తహసీలుగా మారింది. 1995 నవంబరులో ముక్త్‌సర్ జిల్లా ఏర్పడింది. 2012 ఫిబ్రవరిలో ఈ నగరాన్ని అధికారికంగా శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ గా మార్చారు. [2]

భౌగోళికం

[మార్చు]

ముక్త్‌సర్ పంజాబ్ రాష్ట్రపు నైరుతి భాగంలో ఉంది. నగర విస్తీర్ణం 32.8 చ.కి.మీ [4] నగరం 30 ° 29 '0 "ఉత్తర అక్షాంశం, 74 ° 31' 0" తూర్పు రేఖాంశాల వద్ద ఉంది. [5] ముక్త్‌సర్ నుండి భటిండా 53 కి.మీ. ఆగ్నేయంలో, ఫిరోజ్‌పూర్ 52 కి.మీ. ఉత్తరాన, ఫరీద్కోట్ 50 కి.మీ. ఈశాన్యంలో, అబోహర్ 56 కి.మీ. నైరుతి లోనూ ఉన్నాయి. [6] రాష్ట్ర రాజధాని చండీగఢ్ 249 కి.మీ. దూరంలో ఉంది. లుధియానా నగరం 148 కి.మీ., అమృత్‌సర్ 167 కి.మీ. దూరంలోను,. భారత రాజధాని న్యూ ఢిల్లీ 398 కి.మీ. దూరం లోనూ ఉన్నాయి

జనాభా

[మార్చు]

ముక్త్‌సర్, పంజాబ్లో అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో 14 వ స్థానంలో ఉంది. [1] 2011 జనాభా లెక్కల ప్రకారం, ముక్త్‌సర్ పట్టణంలో 117,085 జనాభా ఉంది, వీరిలో పురుషులు 61,725 (52.87%), మహిళలు 55,022 (46.99%). నగరంలో మొత్తం గృహాల సంఖ్య 23,644. ఆరేళ్ళ కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభా 13,981. వారిలో 7,646 మంది పురుషులు, 6,335 మంది మహిళలు ఉన్నారు. నగరంలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 78,606 కాగా, 44,089 మంది పురుషులు, 34,517 మంది మహిళలు. నగరంలో షెడ్యూల్డ్ కుల జనాభా 38,381, వీరిలో 20,118 మంది పురుషులు, 18,263 మంది మహిళలూ ఉన్నారు [4] [7]

నగర జనాభాలో ప్రధాన మతాలు సిక్కు మతం. హిందూ మతం. బౌద్ధమతం, జైన మతం, ఇస్లాం, క్రైస్తవ మతాలకు చెందినవారు కూడా ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Cities having population 1 lakh and above, Census 2011" (PDF).
  2. 2.0 2.1 "Govt approves change in names of 25 towns". Bennett, Coleman & Co. Ltd. PTI. 12 February 2012. Retrieved 5 July 2015.
  3. 3.0 3.1 "CHAPTER II HISTORY". Department of Revenue, Government of Punjab. Archived from the original on 7 జూన్ 2015. Retrieved 28 June 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "pbrev2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 "DISTRICT CENSUS HANDBOOK MUKTSAR" (PDF). Retrieved 10 July 2015.
  5. "Muktsar Map — Satellite Images of Muktsar". Maplandia.com. Retrieved 8 July 2015.
  6. "Punjab Map". www.mapsofindia.com. Retrieved 5 July 2015.
  7. "Punjab (03)Muktsar (044)Muktsar(00241)Muktsar (M Cl)(800217)Muktsar (M Cl)TOWN". The Registrar General & Census Commissioner, India, New Delhi. Retrieved 10 July 2015.