మాన్సా
మాన్సా | |
---|---|
పట్టణం | |
Coordinates: Khalsa ayurveda medical college nanagal kalanansa 29°59′N 75°23′E / 29.98°N 75.38°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | మాన్సా |
Elevation | 212 మీ (696 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 82,956 |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 151505 |
టెలిఫోన్ కోడ్ | 01652 |
Vehicle registration | PB-31 |
మాన్సా పంజాబ్, మాన్సా జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. ఇది 1952 నుండి పట్టణం క్లాస్ 'ఎ' మునిసిపాలిటీగా ఉంది. [2] మునిసిపల్ కౌన్సిల్ పట్టణ పరిపాలనను చూసుకుంటుంది. ఈ పట్టణం భటిండా - జింద్ - ఢిల్లీ రైలు మార్గంలోను, బర్నాలా - సర్దుల్‌గఢ్ - సిర్సా రాష్ట్ర రహదారిపైనా ఉంది.
జనాభాలో ఎక్కువమంది పంజాబీ మాట్లాడుతారు. పట్టణ ప్రజలు మాల్వా సంస్కృతికి వారసులు.
భౌగోళికం
[మార్చు]మాన్సా, పంజాబు కాటన్ బెల్ట్ లో ఉంది. వ్యవసాయం జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. నవంబరు, డిసెంబరు నెలలలో ఈ ప్రాంతమంతా పత్తి యొక్క పాల లాంటి తెల్లటి రంగుతో ముచ్చట గొలుపుతుంది. మాన్సా పట్టణానికి ఆగ్నేయంలో బాబా భాయ్ గురుదాస్ జీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్ సీజన్లలో ఒక ఉత్సవం జరుగుతుంది.
చరిత్ర
[మార్చు]మాన్సా గతంలో ఫుల్కియన్ సిక్కు రాజవంశం (1722-1948) పాలనలో ఉండేది. ఆ తరువాత కైతాల్ సిక్కు రాజ్యం (1762–1857) లో భాగమైంది.
మాన్సా జిల్లాలోని ధింగర్ నుండి వచ్చిన భాయ్ గురుదాస్ ఈ నగరాన్ని స్థాపించినట్లు ప్రతీతి. అతను ఈ ప్రదేశంలో ధలివాల్ జాట్ సిక్కులలో పెళ్ళి చేసుకున్నడు. ఒకసారి అతను తన భార్యను తనతో పాటు తీసుకెళ్లడానికి తన అత్తమామల వద్దకు వెళ్ళాడు. కాని వాళ్ళు ఆమెను పంపించడానికి నిరాకరించారు. అప్పుడు, భాయ్ గురుదాస్ తన అత్తగారి ఇంటి ముందు ధ్యానంలో కూర్చున్నాడు. కొంత సమయం తరువాత, బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను భాయ్ గురుదాస్‌తో పంపించడానికి అంగీకరించారు. కానీ ఇప్పుడతడు ఆమెను తనతో తీసుకెళ్లడానికి నిరాకరించాడు. తానిపుడు ఐహిక సుఖాలను త్యజించానని చెప్పాడు. అతని జ్ఞాపకార్థం, అతని సమాధి వద్ద ఏటా మార్చి-ఏప్రిల్‌లో ఒక ఉత్సవం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉత్సవానికి హాజరవుతారు. సమాధి వద్ద లడ్డూలు, బెల్లాన్ని సమర్పిస్తారు.
రవాణా
[మార్చు]మాన్సా పట్టణానికి సమీప విమానాశ్రయాలు న్యూ ఢిల్లీ (248 కి.మీ.), చండీగఢ్ (180 కి.మీ.) లలో ఉన్నాయి. భటిండాలోని అంతర్జాతీయ విమానాశ్రయం, లుధియానా లోని కొత్త విమానాశ్రయాలు త్వరలో పని చేయనున్నాయి.
మాన్సా నుండి ఇతర నగరాలకు, ముఖ్యంగా జాతీయ రాజధాని ఢిల్లీకి చక్కటి రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలున్నాయి. ఢిల్లీ - భటిండా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, ఫిరోజ్‌పూర్ ముంబై జనతా ఎక్స్‌ప్రెస్, బికనీర్ గువహాటి (అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్), పంజాబ్ మెయిల్ వంటి అనేక రైళ్లు మాన్సా రైల్వే స్టేషన్ గుండా వెళ్తాయి. అంతేకాకుండా, న్యూ ఢిల్లీ, మాన్సా మధ్య రోజూ అనేక ప్రయాణీకుల రైళ్లు నడుస్తున్నాయి. మాన్సా నుండి పంజాబ్ లోని అన్ని నగరాలకు బస్సులు నడుస్తున్నాయి
పట్టణ ప్రముఖులు
[మార్చు]- హర్భజన్ సింగ్ మన్షాహియా - మాజీ క్యాబినెట్ మంత్రి (ఎక్సైజ్, టాక్సేషన్) ఎస్.లచ్మాన్ సింగ్ (పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి (1967)
- డాక్టర్ ముఖ్దీప్ సింగ్ మన్షాహియా - విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు
- సావర్న్ సింగ్ - ఒలింపియన్ అర్జున అవార్డు గ్రహీత. మహారాజా రంజిత్ సింగ్ రాష్ట్ర అవార్డు. విల్. దలేల్వాలా
- సుఖ్మీత్ సింగ్ - ఆసియా గేమ్స్ 2018 బంగారు పతక విజేత
- గేవీ చాహల్ - నటుడు
- దీప్ ధిల్లాన్ - సింగర్
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, మాన్సా జనాభా 82,956. అక్షరాస్యత 58.08%: పురుషుల అక్షరాస్యత 63.70%, స్త్రీ అక్షరాస్యత 51.74%. మాన్సా జనాభాలో 11.02% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
మూలాలు
[మార్చు]- ↑ "Sub-District Details". Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 27 March 2012.
- ↑ "Mansa - A Little Land For A Quiet Travel". Native Planet.
{{cite web}}
: CS1 maint: url-status (link)