పఠాన్‌కోట్
పఠాన్‌కోట్ | |
---|---|
Coordinates: 32°16′01″N 75°36′00″E / 32.266814°N 75.6°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | పఠాన్‌కోట్ |
Government | |
• Body | జిల్లా |
• Rank | 6th |
Elevation | 332 మీ (1,089 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,56,306 (approx2,50,000 include sub-urban) |
Time zone | UTC+5:30 (IST) |
Pin Code | 145001 |
టెలిఫోన్ కోడ్ | 0186 |
Vehicle registration | PB-35 |
అతిపెద్ద నగరం | పఠాన్‌కోట్ |
Website | https://pathankot.nic.in/ |
పఠాన్‌కోట్ భారతదేశంలోని పంజాబ్ లోని నగరం. పఠాన్‌కోట్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ జిల్లాకు పశ్చిమాన, పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. పఠాన్‌కోట్‌ను 2011 జూలై 27 న అధికారికంగా పంజాబ్ రాష్ట్ర జిల్లాగా ప్రకటించారు. ఇది గతంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఒక తహసీలుగా ఉండేది. పఠాన్‌కోట్ జిల్లా భారతదేశంలోని రెండు ఉత్తర రాష్ట్రాలైన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లకు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికీ కూడలిలో ఉంది. దాని స్థానం కారణంగా, పఠాన్‌కోట్ ఈ మూడు రాష్ట్రాలకూ ప్రయాణ కేంద్రంగా ఉంది.
పఠాన్‌కోట్‌లో మునిసిపల్ కార్పొరేషన్ ఉంది. లుధియానా, అమృత్‌సర్, జలంధర్, పటియాలా, భటిండా తరువాత పఠాన్‌కోట్ పంజాబ్ నగరాలలో 6 వ స్థానంలో ఉంది.
కాంగ్రా, డల్హౌసీ యొక్క సుందరమైన పర్వత ప్రాంతాలలో ఉన్న ఈ నగరం జమ్మూ కాశ్మీర్, డల్హౌసీ, చంబా, కాంగ్రా, ధర్మశాల, మక్లీడ్ గంజ్, జ్వాలాజీ, చింతపూర్ణి, హిమాలయాలలోకి ప్రయణించే ముందు విశ్రాంతి కేంద్రంగా ఉంది. నగరానికి దగ్గరలో చక్కీ నది ప్రవహిస్తోంది. పఠాన్‌కోట్ సమీప ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లకు విద్యా కేంద్రంగా కూడా ఉంది. ఈ రాష్ట్రాల గ్రామీణ విద్యార్థులు చాలా మంది విద్య కోసం పఠాన్‌కోట్‌కు వస్తారు.
చరిత్ర
[మార్చు]పఠాన్‌కోట్ ఒక ప్రాచీన నగరం. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నగరం కూడా. వివిధ కథనాల ప్రకారం, దీని పేరు ఆడుంబారా అని తెలుస్తోంది. పఠాన్‌కోట్‌లో లభించిన అనేక పురాతన నాణేలని బట్టి ఇది పంజాబ్‌లోని పురాతన ప్రదేశాలలో ఒకటి అని రుజువవుతోంది. పర్వతాల పాదాల వద్ద ఉన్నందున ఈ ప్రదేశానికి ఎల్లప్పుడూ గొప్ప ప్రాముఖ్యత ఉండి ఉండాలి.
పఠాన్‌కోట్ నూర్పూర్ రాజ్యానికి రాజధానిగా ఉండేది. దాని పేరు అక్బర్ పాలనలో ధమేరి (నూర్పూర్) గా మార్చారు. రాజ్‌పుత్రుల పఠానియా వంశానికి ఆ పేరు పఠాన్‌కోట్ నుండి వచ్చింది. ఈ నగరాన్ని ఆ సమయంలో పైఠాన్ అనేవారు.
స్వాతంత్ర్యం తరువాత
[మార్చు]నగరపు వ్యూహాత్మక స్థానం కారణంగా, భారత వైమానిక దళం పఠాన్‌కోట్‌లో ఒక వైమానిక దళ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భారత సైన్యానికి కూడా ఇక్కడ గణనీయమైన ఉనికి ఉంది.
భౌగోళికం
[మార్చు]పఠాన్‌కోట్ సగటు ఎత్తు 332 మీటర్లు. ఇది రావి, చక్కీ నదుల మధ్య ఉన్న పచ్చని పట్టణం. దక్షిణాన, తూర్పున శివాలిక్ పర్వతాలతో, ఉత్తరాన మంచుతో కప్పబడిన హిమాలయాల నేపథ్యంతో ఉంటుంది.
రవాణా
[మార్చు]పఠాన్‌కోట్‌కు దేశంలోని ఇతర ప్రాంతాలతో చక్కటి రైలు, రోడ్డు సౌకర్యాలున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్ లోని ఇతర నగరాలకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బస్సు సర్వీసులున్నాయి ఈ రాష్ట్రాల్లోని ఢిల్లీ, మనాలి చండీగఢ్, జమ్మూ, ధర్మశాల, డల్హౌసీ, అమృత్‌సర్ లకు చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కాంగ్రా లోయకు, జమ్మూ సిటీ మన్సర్ సరస్సు, శ్రీనగర్, ఉధంపూర్, అమర్నాథ్ వద్ద పవిత్ర గుహకు, పట్ని టాప్, మాతా వైష్ణో దేవి (కాత్రా) కి ఇది ముఖద్వారం లాంటిది.
గాలి ద్వారా
[మార్చు]- పఠాన్‌కోట్ విమానాశ్రయానికి ఉడాన్ పథకం కింద అలయన్స్ ఎయిర్ ద్వారా ఢిల్లీకి విమాన సౌకర్యం కల్పించింది . సమీప అంతర్జాతీయ విమానాశ్రయం అమృత్‌సర్‌లో ఉంది.
రైలు
[మార్చు]దీనికి ఢిల్లీ, జమ్మూ, ఇతర భారతీయ నగరాలతో ప్రత్యక్ష రైలు సంబంధాలు ఉన్నాయి. జమ్మూ వెళ్లే రైళ్లన్నీ పఠాన్‌కోట్ కంటోన్మెంటు స్టేషన్ గుండా వెళతాయి. ముఖ్యమైన రైళ్లలో రాజధాని, స్వరాజ్ ఎక్స్‌ప్రెస్, పూజా ఎక్స్‌ప్రెస్, శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. సూపర్ ఫాస్ట్ రైళ్లు నగరంలోని పఠాన్‌కోట్ స్టేషన్‌లోకి ప్రవేశించవు. పఠాన్‌కోట్ జంక్షన్ & పఠాన్‌కోట్ కంటోన్మెంటు రైల్వే స్టేషన్ నుండి కేవలం 4 కి.మీ. దూరంలో ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం పఠాన్‌కోట్ పట్టణ సముదాయంలో జనాభా 1,59,909. వీరిలో పురుషులు 84,145, స్త్రీలు 75,764. అక్షరాస్యత 88.71%. [2]
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- సన్నీ డియోల్ ( MP ) [4]
- వినోద్ ఖన్నా ( MP )
- రాజేందర్ నాథ్ రెహబర్ (కవి, గేయ రచయిత)
- మాస్టర్ మోహన్ లాల్ (మాజీ ఎమ్మెల్యే)
- సిద్దార్థ్ కౌల్ (క్రికెటర్)
- రాజ్‌బీర్ సింగ్ (నటుడు)
మూలాలు
[మార్చు]- ↑ Ancient India, from the earliest times to the first century, A.D by Rapson, E. J. p.154
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
- ↑ "Pathankot City Population Census 2011 - Punjab".
- ↑ http://india.gov.in/my-government/indian-parliament/vinod-khanna