ఫరీద్‌కోట్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరీద్‌కోట్ జిల్లా
జిల్లా
Faridkot in Punjab (India).svg
దేశంభారతదేశం
రాష్ట్రంపంజాబ్
ముఖ్యపట్టణంఫరీద్‌కోట్
స్థాపించిన వారురాజా మొకల్సి
పేరు వచ్చినవిధంషేక్ ఫరీదుద్దీన్ గంజ్‌షకర్
ప్రభుత్వం
 • డిప్యూటీ కమిషనరుMalwinder Singh Jaggi , IAS
విస్తీర్ణం
 • మొత్తం1,458 కి.మీ2 (563 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
196 మీ (643 అ.)
జనాభా
(2011)
 • మొత్తం617,508
 • ర్యాంకు17
 • సాంద్రత424/కి.మీ2 (1,100/చ. మై.)
పిలువబడువిధం (ఏక)ఫరీద్‌కోటియన్, ఫరీద్‌కోటియా
భాషలు
 • అధికారికపంజాబీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
151203
Telephone code+91-1639
లింగ నిష్పత్తి1000/890 /
జాలస్థలిwww.faridkot.nic.in

భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఫరీద్‌కోట్ జిల్లా ఒకటి. ఫరీద్‌కోట్ పట్టణం ఈ జిల్లాకు ప్రధాన కార్యాలయం. ఈ జిల్లా పూర్వపు ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో ఒక భాగం. 1996 సంవత్సరంలో ఫరీద్‌కోట్, భటిండా, మాన్సా జిల్లాలను కలిపి ఫరీద్‌కోట్ పట్టణం ప్రధాన కార్యాలయంగా ఫరీద్‌కోట్ డివిజన్ స్థాపించారు.

శబ్దవ్యుత్పత్తి[మార్చు]

ఫరీద్‌కోట్ నగరం పేరిట జిల్లాకు ఈ పేరు పెట్టారు. దీనికి సూఫీ సాధువు, ముస్లిం మిషనరీ అయిన బాబా ఫరీద్ గౌరవార్థం పట్టణానికి ఆ పేరు వచ్చింది. ఫరీద్‌కోట్ పట్టణాన్ని 13 వ శతాబ్దంలో మొకల్హర్‌ అనే పేరుతో రాజా మొకల్సి స్థాపించాడు. ఇతడు రాజస్థాన్‌లోని భట్నైర్ భట్టి నేత రాయ్ ముంజ్‌కు మనవడు. ప్రసిద్ధ జానపద కథల ప్రకారం, బాబా ఫరీద్ ఈ పట్టణాన్ని సందర్శించినపుడు రాజా, పట్తణం పేరును ఫరీద్‌కోట్ గా మార్చాడు. మొకల్సి తరువాత పాలించిన జైర్సీ, వైర్సీ ల కాలంలో ఇదే రాజధానిగా ఉండేది.

చరిత్ర[మార్చు]

స్వాతంత్ర్యానికి ముందు, జిల్లాలో ఎక్కువ భాగం ఫరీద్‌కోట్ మహారాజా పాలనలో ఉండేది. తరువాత ఇది 1948 లో పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పిఇపిఎస్‌యు) లో భాగమైంది. ఫరీద్‌కోట్‌ను 1972 ఆగస్టు 7 న పూర్వ భటిండా జిల్లా లోని కొంత భాగాన్ని (ఫరీద్‌కోట్ తహసిల్) , ఫిరోజ్‌పూర్ జిల్లా లోని కొంత భాగాన్నీ (మోగా, ముక్తసార్ తహసిళ్ళు) కలిపి ప్రత్యేక జిల్లాగా రూపొందించారు. మళ్ళీ, 1995 నవంబరులో, ఫరీద్‌కోట్ జిల్లాను మూడు ముక్కలు చేసారు. జిల్లా లోని మోగా, ముక్తసార్ ఉపవిభాగాలను విడదీసి విడివిడిగా జిల్లాల హోదా ఇచ్చారు.

ప్రభుత్వ పాలన[మార్చు]

ఫరీద్‌కోట్ జిల్లాకు వాయువ్యంలో ఫిరోజ్‌పూర్, నైరుతిలో ముక్తసార్, దక్షిణాన భటిండా, పశ్చిమాన మోగా జిల్లాలు ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 1469 కిమీ 2. ఇది రాష్ట్ర మొత్తం వైశాల్యంలో 2.92%. జిల్లా జనాభా 552,466. ఇది రాష్ట్ర మొత్తం జనాభాలో ఇది 2.27%. జిల్లాలో ఫరీద్‌కోట్, జైటో అనే రెండు ఉపవిభాగాలు / తహసీళ్ళు ఉన్నాయి, అవి కోట్కాపురా, సాదిక్ అనే రెండు ఉప తహసీళ్ళు, మొత్తం 171 గ్రామాలూ ఉన్నాయి. జిల్లాలో ఫరీద్‌కోట్, కోట్కాపురా అనే రెండు డెవలప్‌మెంట్ బ్లాకులు ఉన్నాయి.

జిల్లాలో ఫరీద్కోట్, కోట్కాపురా, జైతు అనే 3 నగరాలున్నాయి. ఫరీద్‌కోట్ ప్రాంతంలో బజాఖానా, పంజ్‌గరైన్ కలాన్, దీప్ సింగ్ వాలా, గోలేవాలా, ఝోక్ సర్కారి, దోడ్, ఘుగియానా, సాదిక్, చంద్ భాన్ అనే 7 ముఖ్యమైన పట్టణాలు / గ్రామాలు ఉన్నాయి.. ఫరీద్‌కోట్ విద్యా సంస్థలకు కేంద్రంగా ఉంది. ఉత్తర భారతదేశంలోని ఏకైక వైద్య విశ్వవిద్యాలయం బాబా ఫరీద్ పేరుతో ఫరీద్‌కోట్‌లో ఉంది

జనాభా వివరాలు[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19511,82,145—    
19612,44,718+34.4%
19712,93,475+19.9%
19813,70,556+26.3%
19914,55,005+22.8%
20015,50,892+21.1%
20116,17,508+12.1%

2011 జనాభా లెక్కల ప్రకారం ఫరీద్‌కోట్ జిల్లా జనాభా 617,508. [1] ఇదిసోలమన్ దీవుల దేశానికి [2] లేదా యుఎస్ రాష్ట్రమైన వెర్మోంట్కు సమానం. [3] జనాభా పరంగా ఈ జిల్లా భారతదేశపు జిల్లాల్లో 519 వ స్థానంలో ఉంది. (మొత్తం 640 జిల్లాల్లో ). జిల్లా జనసాంద్రత 424 మంది/చ.కి.మీ. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 12.18%. ఫరీద్‌కోట్ లో లింగ నిష్పత్తి 889 / 1000. అక్షరాస్యత రేటు 70.6%

మూలాలు[మార్చు]

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 2011-09-30. Vermont 625,741