Jump to content

వెర్మాంట్

వికీపీడియా నుండి

వెర్మాంట్, అమెరికా లోని రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగంలో న్యూ ఇంగ్లండు ప్రాంతంలో ఉంది. వెర్మాంట్ కు దక్షిణాన మస్సాచుసెట్స్, తూర్పున న్యూ హాంప్ షైర్, పడమరన న్యూయార్క్, ఉత్తరాన కెనడా భూభాగం క్యూబెక్ ఉన్నాయి. న్యూ ఇంగ్లండు ప్ర్ంతంలోని రాష్ట్రాల్లో అట్లాంటిక్ మహాసంముద్ర తీరం లేని రాష్ట్రం ఇదొక్కటే. అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఇది రెండవది. (ప్రథమ స్థానంలో వ్యోమింగ్ ఉంది). అతి తక్కువ విస్తీర్ణం గల రాష్ట్రాల్లో ఆరవది.

17 వ శతాబ్దంలో ఫ్రెంచి వలసదారులు తమ న్యూ ఫ్రాన్సులో భాగంగా ఇక్కడ స్థావరాలను నెలకొల్పారు. అ తరువాత బ్రిటిషు వారు తూర్పు తీరంలో న్యూ ఇంగ్లండును స్థాపించి విస్తరించదం మొదలుపెట్టినపుడూ ఇద్దరి మధ్య ఆధిఒపత్య పోరు జరుగుతూండేది. 1763 లో ఏడు సంవత్సరాల యుద్ధంలో ఓడిపోయాక, ఫ్రెంచి వారు, మిసిసిపీ నదికి తూర్పున తమ అధీనంలో ఉన్న ప్రాంతమంతటినీ బ్రిటిషు వారికి అప్పగించారు. ఆ తరువాత న్యూ హాంప్‌షైర్, వెర్మాంట్‌లను కూడా అప్పగించారు.

1777 లో ఈ ప్రాంతం లోని నివాసులు వెర్మాంట్ రిపబ్లిక్ అనే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అమెరికా లోని రాష్ట్రాలన్నిటి కంటే ముందు బానిసత్వాన్ని రద్దు చేసినది వెర్మాంటే.[1][2] అమెరికాలో నల్లజాతి వారికి చెందిన తొట్టతొలి గ్రాడ్యుయేటు అలెగ్జాండర్ ట్విలైట్, 1823 లో గ్రాడ్యుయేటయింది వెర్మాంట్ లోనే.

వెర్మాంట్ 1791 లో అమెరికా 14 వ రాష్ట్రంగా చేరింది. అమెరికా రాష్ట్రంగా చేరకముందు సార్వభౌమిక రాజ్యంగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో వెర్మాంట్ ఒకటి. మిగతావి టెక్సాస్, కాలిఫోర్నియా, హవాయి

భౌగోళికంగా వెర్మంట్‌ గ్రీన్ పర్వతాలతో కూడుకుని ఉంది. రష్ట్రంలో చాలా ప్రాంతం అడవులున్నాయి. మిగతా భూమిలో ఎక్కువ భాగం వ్యవసాయం కింద ఉంది. తేమతో కూడి వేడిగా ఉండే వేసవి, చల్లగా, మంచు పడుతూ ఉండే శీతాకాలాలు ఇక్కడీ శీతోష్ణస్థితి లక్షణాలు.

2018 లో వెర్మాంట్ రాష్ట్రాల జిడిపి పరంగా, $34 బిలియన్లతో, అమెరికా లోని అన్ని రాష్ట్రాల్లోకీ అట్టడుగున ఉంది.తలసరి జిడిపిలో 34 వ స్థానంలో ఉంది.


మూలాలు

[మార్చు]
  1. "Vermont Constitution of 1777". Chapter I, Section I: State of Vermont. Archived from the original on 2019-12-28. Retrieved April 12, 2019. Therefore, no male person, born in this country, or brought from over sea, ought to be holden by law, to serve any person, as a servant, slave, or apprentice, after he arrives to the age of twenty-one years; nor female, in like manner, after she arrives to the age of eighteen years, unless they are bound by their own consent, after they arrive to such age, or bound by law for the payment of debts, damages, fines, costs, or the like.
  2. Cox, Lee Ann (29 January 2014). "Patchwork Freedom". University of Vermont. Archived from the original on 2 జూలై 2019.