Jump to content

న్యూ జెర్సీ

వికీపీడియా నుండి
(న్యూజెర్సీ నుండి దారిమార్పు చెందింది)

న్యూజెర్సీ లేదా న్యూ జెర్సీ అమెరికా లోని మధ్య అంట్లాంటిక్, ఈశాన్య ప్రాంతానికి చెందిన రాష్ట్రము. ఇంగ్లీషు ఛానెల్ లోని జెర్సీ దీవి మీదుగా దీనికి ఈ పేరు పెట్టారు. దీని సరిహద్దులుగా ఉత్తరాన న్యూయార్క్, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, నైఋతిన డెలావేర్, పశ్చిమాన పెన్సిల్వేనియా రాష్ట్రాలు ఉన్నాయి. న్యూజెర్సీలోని కొంత భాగము న్యూయార్క్, ఫిలడెల్ఫియాల మహానగర పాలనా ప్రాంతాలలో ఉంది. అమెరికా లోని అతి చిన్న రాష్ట్రాల వరుసలో న్యూ జెర్సీ నాలుగో స్థానంలో ఉంటుంది. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఇది 11 వది. 2019 లో న్యూ జెర్సీ జనాభా 88,82,190. రాష్ట్రంలో అతి పెద్ద నగరం నెవార్క్. రాష్ట్రం లోని కౌంటీల్లో ఒక్కటి తప్ప మిగతావన్నీ న్యూ యార్కు లేదా ఫిలడెల్ఫియా మహానగర ప్రాంతం లోకి వస్తాయి.

17 వ శతాబ్ది తొలినాళ్లలో డచ్చి వారు, స్వీడిష్ వారూ ఈ ప్రాంతంలో వలసలను స్థాపించారు.[1] తరువాతి కాలంలో ఇంగ్లీషు వారు ఈ ప్రాంతంపై ఆధిపత్యం సాధించారు.[2] ఆ తరువాత దీనికి న్యూ జెర్సీ అని పేరు పెట్టారు.[3] 18 వ శతాబ్దంలో అమెరికా విప్లవ యుద్ధంలో భాగంగా న్యూజెర్సీలో అనేక యుద్ధాలు జరిగాయి.

19 వ శతాబ్దంలో న్యూ జెర్సీలో విస్తృతంగా పరిశ్రమలు ఏర్పడి, పారిశ్రామిక విప్లవానికి దోహదపడింది. 2018 నాలుగో త్రైమాసికంలో న్యూ జెర్సీ జిడిపి $639.8 బిలియన్లు.[4] రాష్ట్ర మొత్తం అప్పు $239 బిలియన్లు.[5]

2018 నాటికి న్యూ జెర్సీలో తలసరి మిలియనీర్ల సంఖ్య అమెరికా లోకెల్లా అత్యధికం.[6] ఇక్కడి పబ్లిక్ పాఠశాలల వ్యవస్థ అమెరికాలోని రాష్ట్రాల్లో అత్యుత్తమ స్థానాల్లో ఉంటూ వస్తోంది..[7][8][9]

ఇవి కూడ చూడండి

[మార్చు]

ఎలీన్ వైట్

చార్లెస్ హర్బట్

మూలాలు

[మార్చు]
  1. "NJ History Outline". Usgennet.org. Archived from the original on 2010-04-30. Retrieved July 25, 2010.
  2. "Encyclopedia—New Jersey History". 2000–2011 Pearson Education, publishing as Infoplease. Archived from the original on September 30, 2011. Retrieved September 18, 2011.
  3. New Jersey. Archived from the original on October 29, 2009. Retrieved July 25, 2010 – via Webcitation.org. {{cite encyclopedia}}: |work= ignored (help)
  4. Gross Domestic Product by State, First Quarter 2019 Archived ఆగస్టు 18, 2019 at the Wayback Machine, Bureau of Economic Analysis, July 25, 2019. Accessed November 2, 2019.
  5. "How deep is NJ in debt? Very, very deep but not as bad as 2017". North Jersey Record. June 3, 2019.
  6. "Daily Mail—New Jersey now has more millionaires per capita than any other state as nearly 9 percent of households in the Garden State had assets exceeding $1million in 2018". Wealth-X. January 31, 2019. Archived from the original on 2019-09-05. Retrieved September 4, 2019.
  7. Kelly Heyboer (September 4, 2019). "N.J. has the No. 1 public schools in the nation, ranking says". New Jersey On-Line LLC. Archived from the original on 2019-09-04. Retrieved September 4, 2019.
  8. Alex Napoliello (August 4, 2014). "New Jersey has the best school systems in U.S., report says". New Jersey On-Line LLC. Archived from the original on April 24, 2019. Retrieved September 5, 2019.
  9. "The 10 Best U.S. States for Education—2. New Jersey". U.S. News & World Report. February 27, 2018. Archived from the original on May 3, 2018. Retrieved May 2, 2018.