డెలావేర్
డెలావేర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అట్లాంటిక్ సాగర తీరాన అమెరికాకు దక్షిణ భాగాన ఉన్నది. ఇక్కడ ప్రవహిస్తున్న డెలావేర్ నది వలన ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది. డెలావేర్ నదికి ఆ పేరును థామస్ వెస్ట్, డి లా వర్ 3వ జమీందారు (1577-1618) పేరిట ఖాయపరిచారు. [1] బ్రిటీషు వారిపై తిరుగుబాటు చేసిన తొలి పదమూడు కాలనీలలోనూ డెలావేర్ ఒకటి. అమెరికా సంయుక్త రాజ్యాంగాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. అందుకని ఈ రాష్ట్రాన్ని "ప్రథమ రాష్ట్రం" అని వ్యవహరించడం కద్దు. ఇక్కడ డెలావేర్ హిందూ దేవాలయం ఉంది.
ఇతర నామాలు
[మార్చు]డైమండ్ రాష్ట్రం: తూర్పు సముద్రతీరంలో ఈ రాష్ట్రపు వ్యూహాత్మక ప్రాముఖ్యతకు మురిసి థామస్ జెఫర్సన్ ఈ రాష్ట్రాన్ని ఇలా సంబోధించాడని ప్రతీతి.
నీలి కోడి రాష్ట్రం: ఈ రాష్ట్రంలో లభ్యమయ్యే నీలిరంగు ఈకలు కలిగిన కోళ్ళ వలన ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది.
చిన్ని అద్భుతం: పరిమాణంలో చిన్నది అయినప్పటికీ, దేశానికి చేసిన సేవలకు గాను, ఇక్కడి ప్రకృతి శోభ వలన ఈ పేరు ప్రసిద్ధమయ్యింది.
మూలాలు
[మార్చు]- ↑ "Delaware". Online Etymology Dictionary. Retrieved 2007-02-24.