డెలావేర్ హిందూ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెలావేర్ హిందూ దేవాలయం
మతం
అనుబంధంహిందూమతం
దైవంలక్ష్మీదేవి
స్థితితెరచివుంది
ప్రదేశం
ప్రదేశంహాకెస్సిన్, డెలావేర్
దేశంయునైటెడ్ స్టేట్స్
వాస్తుశాస్త్రం.
స్థాపకుడుహిందూ టెంపుల్ అసోసియేషన్ ఆఫ్ హాకెసిన్‌[1]
పూర్తైనది2002

డెలావేర్ హిందూ దేవాలయం, డెలావేర్లోని హాకెస్సిన్ ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయం. 2002లో ప్రారంభించబడిన ఈ దేవాలయం డెలావేర్‌లో నిర్మించిన మొదటి హిందూ దేవాలయమవడం దీని ప్రత్యేకత.[2][3] న్యూ కాజిల్ కౌంటీలోని భారతీయ అమెరికన్లకు "సామాజిక, సాంస్కృతిక, సమావేశ స్థలం"గా ఈ దేవాలయం వేదికగా మారిందని ది న్యూస్ జర్నల్ రాసింది.[4] లక్ష్మీదేవి ఈ దేవాలయ ప్రధాన దేవత. సంపద, అదృష్టం, శక్తి, అందం, శ్రేయస్సు అందించే దేవత.

చరిత్ర

[మార్చు]

1980లలో, డెలావేర్‌లోని ప్రవాస భారతీయ కుటుంబాలకు చెందినవారు తమతమ హిందూ పండుగలను జరుపుకోవడానికి స్థానిక చర్చీలు, పాఠశాలలను వేదికలుగా ఎంచుకునేవారు. ప్రతిసారి ఇది సాధ్యం కాకపోవడంతో అక్కడి భారతీయ కుటుంబాలు డెలావేర్‌లోఒక హిందూ దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ప్రవాస భారతీయుల జనాభా పెరగడంతో, అక్కడి వారంతాకలిసి హిందూ టెంపుల్ అసోసియేషన్ ఆఫ్ హాకెసిన్‌ను ఏర్పాటుచేసుకున్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిధుల సేకరణను ప్రారంభించి, ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ భూమిలో 1996లో దేవాలయ నిర్మాణం ప్రారంభమై, 2002లో పూర్తిచేయబడింది. అదే సంవత్సరం దేవాలయం ప్రారంభించబడింది.[5][6]

2020లో, ఆలయం ప్రవేశద్వారం వద్ద 25 అడుగుల ఎత్తులో, 60,000 పౌండ్ల బరువుతో ఒక భారీ హనుమంతుని విగ్రహం నిర్మించారు. యునైటెడ్ స్టేట్స్‌ మొత్తంలో ఎత్తైన హనుమాన్ విగ్రహమిది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Hindu Temple of Delaware".
  2. 2.0 2.1 "Hindu Temple in Hockessin welcomes 25-foot, 60,000-pound statue of Hindu god".
  3. 3.0 3.1 "Largest statue of Lord Hanuman in United States arrives at Hindu temple in Delaware".
  4. "Balancing between cultures". Delaware Online. Archived from the original on 2004-10-27. Retrieved 2022-01-20.
  5. "About Us". Hindu Temple DE.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Sarina Pasricha". Pluralism Project Archive - Harvard University.{{cite web}}: CS1 maint: url-status (link)