Jump to content

ఇండియానా

వికీపీడియా నుండి
ఇండియానాపొలిస్ లోని ఇండియానా స్టేట్ హౌస్.

ఇండియానా అమెరికా దేశంలో ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికా మధ్యపశ్చిమ ప్రాంతంలోని భాగం. వైశాల్యం దృష్ట్యా ఇండియానా అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 15వ అతిపెద్ద రాష్ట్రం. అయితే జనసాంద్రత పరంగా ఈ రాష్ట్రం 17వ స్థానంలో ఉంది.[1] ఇండియానాలో అతి పెద్ద నగరం, రాజధాని ఇండియానాపోలిస్.

ఇండియానా ఒక విభిన్నమైన రాష్ట్రము. కొన్ని పెద్ద నగరాలతో పాటు, చాలా పారిశ్రామిక పట్టణాలు, అనేక చిన్న పట్టణాలతో కూడుకొని ఉంది. దేశవ్యాప్తంగా ఇండియానా రాష్ట్రపు క్రీడాజట్టులు, క్రీడాసమారోహాలకు ప్రసిద్ధి చెందినది. అందులో జాతీయ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్.ఎఫ్.ఎల్) జట్టైన ఇండియానా కోల్ట్స్, వ సూపర్ బౌల్‌ను గెలుపొందిన ఎన్.బి.ఏ జట్టు ఇండియానా పేసర్స్, దృఢమైన బాస్కెట్‌బాల్ సాంప్రదాయం కలిగిన హూజియర్ హిస్టీరియా జట్టు, ఇండీ 500గా ప్రసిద్ధి చెందిన ఇండియానాపోలిస్ 500 మోటర్ కార్ల రేసు ముఖ్యమైనవి. ఇండీ 500 రేసు ప్రపంచములోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం.

ఇండియానా వాసులను హూజియర్స్ గా వ్యవహరిస్తారు. ఈ పదం పుట్టుక వెనుక అనేక కథలున్నా, దీని వ్యుత్పత్తి కచ్చితంగా తెలియదు. ఈ రాష్ట్రపు పేరుకి అర్ధం "ఇండియన్ల ప్రదేశం". ఈ పేరు 1768లో స్థాపించబడిన ఇండియానా లాండ్ కంపెనీ కాలం నుండి ఉంది. ఈ పేరును ఇండియానా ప్రాంతాన్ని సృష్టించే సమయంలో కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా ఉపయోగించింది. అప్పట్లో ఈ ప్రాంతం ఇంకా స్థానిక ఇండియన్ల ఆధీనంలో ఉన్న భూమి.[2][3]

మూలాలు

[మార్చు]
  1. States ranked by population density
  2. Stewart, George R. (1967) [1945]. Names on the Land: A Historical Account of Place-Naming in the United States (Sentry edition (3rd) ed.). Houghton Mifflin. pp. 191.
  3. Indiana Historical Bureau. "The naming of Indiana". IN.gov. Retrieved 2008-09-29.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇండియానా&oldid=3462301" నుండి వెలికితీశారు