మోగా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోగా జిల్లా
జిల్లా
పంజాబులో జిల్లా స్థానం
పంజాబులో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంపంజాబ్
ముఖ్య పట్టణంమోగా
విస్తీర్ణం
 • Total2,235 km2 (863 sq mi)
జనాభా
 (2011)
 • Total9,95,746
 • జనసాంద్రత444/km2 (1,150/sq mi)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో మోగా జిల్లా ఒకటి. 1995 నవంబరు 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరించింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్తింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీ భారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి అధికంగా ప్రజలు యు.ఎస్.ఎ, యు.కె, కెనడాలకు 30-40 నుండి వలస వెళ్ళారు. జిల్లా నుండి విదేశాలకు వలస పోయిన ప్రజలలో 40-45% ప్రజలు కెనడా, అమెరికా, యు.కె దేశాలకు వలస పోయారు. పంజాబు రాష్ట్రం నుండి విదేశాలకు వలసపోయిన ప్రజలు అధికంగా దోడా, జలంధర్, హోషియార్‌పూర్ జిల్లాలకు చెందిన వారు కాగా మోగా జిల్లా నుండి స్వల్ప సంఖ్యలో మాత్రమే విదేశాలకు పోయారు.

జిల్లాలో గోధుమ, వడ్లు అత్యధికంగా పండించబడుతున్నాయి. రాష్ట్రంలో వడ్లు, గోధుమ అత్యధింకా పండిస్తున్న జిల్లాగా ఈ జిల్లా గుర్తించబడుతుంది. మోగా పట్టణం, మోగా జిల్లాకు లోని ప్రజలు అధికంగా మాల్వా సంప్రదాయానికి చెందినవారు. మోగా జిల్లా రూపొందించడానికి పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై చివరికి ప్రజల వత్తిడికి అంగీకరించి ప్రభుత్వం, 1995 నవంబరు 24న ఈ జిల్లాను ఏర్పాటు చేసింది. మునుపు ఈ జిల్లా ఫరీద్‌కోట్ జిల్లాలో ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాకు మోగా పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా ఫరీద్‌కోట్, లుధియానా రహదారి మార్గంలో ఉంది.

పట్టణాలు

[మార్చు]

మోగా జిల్లాలో బఘా పురాణా, ధర్ంకోట్, నిహాల్ సింగ్ వాలా వంటి పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో సమాధ్ భాయి, బుఘిపురా, చుగువన్ వంటిగ్రామాలు ఉన్నాయి. మోగా, ఫరీద్‌కోట్ కూడలిలో బఘద్ పురాణా ఉంది. ఇది రాష్ట్రమంతటి నుండి వచ్చే బస్సులకు ప్రధాన కూడలిగా ఉంది. బఘ పురాణ పోలీస్ స్టేషను న్యాయపరిధి అతిపెద్దదిగా భావించబడుతుంది. బఘ్ పురాణా న్యాయపరిధిలో 65 కంటే అధికంగా గ్రామాలు (పిండ్) ఉన్నాయి. ఈ పట్టణం 3 భాగాలుగా విభజించబడింది: ముగు పట్టి (చాలా పెద్దది), బగ పట్టి పురాణా పట్టి. ఈ పట్టణంలో సంపన్నులు అధికంగా ఉన్నారు. సమీప గ్రామాలు, పట్టణాలతో పోల్చి చూసినట్లైతే బఘ్ పురాణాలో నివసించే సంపన్నుల సంఖ్య అధికం.

 • జిల్లాలో మునిసిపల్ కమిషన్ ఉన్న పట్టణం ధరం కోట. దరం కోట్ ప్రస్తుత అకాలి ఎం.ఎల్.ఎ తోటా సింఘ్.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 992,289,[1]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 447వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 444 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 10.9%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 893:1000,[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.6%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రముఖులు

[మార్చు]
 • నరేందర్ సింగ్ కపాని, భారతదేశంలో పుట్టిన అమెరికన్ ఫిజీషియన్, ఫైబర్ ఆప్టిక్స్ నిపుణుడు.
 • జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలే (జన్మస్థానం:రోడ్ గ్రామం) ప్రసిద్ధ తీవ్రవాది
 • లాలా లజపతి రాయ్ (ధుధికె) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు
 • జతేదర్ తోటా సింగ్ మునుపటి పంజాబు విద్యామంత్రి, వ్యవసాయ మంత్రి
 • లక్ష్మణ్ సింగ్ గిల్ పంజాబు ముఖ్యమంత్రి
 • సొనూ సూద్, చలనచిత్ర నటుడు
 • రోషన్ ప్రిన్స్ నటుడు, గాయకుడు

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415

వెలుపలి లంకెలు

[మార్చు]