అమృత్‌సర్ జిల్లా
అమృత్‌సర్ జిల్లా | |
---|---|
జిల్లా | |
![]() పంజాబ్‌లో స్థానం | |
నిర్దేశాంకాలు: 31°35′N 74°59′E / 31.583°N 74.983°ECoordinates: 31°35′N 74°59′E / 31.583°N 74.983°E | |
దేసం | ![]() |
రాష్ట్రం | పంజాబ్ |
పేరు వచ్చినవిధం | అమృత సరోవరం |
ముఖ్య పట్టణం | అమృత్‌సర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,683 కి.మీ2 (1,036 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 24,90,656 |
• సాంద్రత | 930/కి.మీ2 (2,400/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
కాలమానం | UTC+5:30 (IST) |
వాహనాల నమోదు కోడ్ | PB-01(commercial) PB-02, PB-14, PB-17, PB-18, PB-81, PB-89 |
అక్షరాస్యత (7+) | 76.27% |
జాలస్థలి | amritsar |
పంజాబ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో అమృత్‌సర్ జిల్లా ఒకటి. అమృత్‌సర్ నగరం ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ జిల్లా రాష్ట్రం లోని మాఝా ప్రాంతంలో ఉంది.
2011 నాటికి ఇది లుధియానా తరువాత పంజాబ్‌లో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో రెండవ స్థానంలో ఉంది.
చరిత్ర[మార్చు]
బ్రిటిషు పాలనా కాలంలో అమృత్‌సర్ జిల్లా, లాహోర్ డివిజన్‌లో భాగంగా ఉండేది. పరిపాలనాపరంగా అమృత్‌సర్, అజ్నాలా, తరన్ తారన్ అనే 3 తహసీళ్ళుగా విభజించబడి ఉండేది. [2] అయితే, 1947 లో భారతదేశ విభజనలో భాగంగా అమృత్‌సర్ జిల్లాను మిగతా డివిజన్ నుండి వేరుచేసి భారతదేశంలో చేర్చారు. అయితే, పట్టి, ఖేమ్ కరణ్ వంటి కొన్ని భాగాలు లాహోర్ జిల్లాకి చెందినప్పటికీ, విభజనలో ఈ పట్టణాలు అమృత్‌సర్ జిల్లాలో భాగమయ్యాయి. విభజన కాలంలో, జిల్లాలోని ముస్లిం జనాభా 46% పాకిస్తాన్కు తరలిపోయింది. కొత్తగా సృష్టించిన పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ నుండి హిందువులు, సిక్కులు భారత్ వైపు వలస వచ్చారు. 1947 అమృత్‌సర్ జిల్లాలో విభజనకు ముందు జనాభాలో 52% టొ సిక్కులు, హిందువులు (37%, 15.38%) మెజారిటీగా ఉందెవారు.
వాతావరణం[మార్చు]
అమృత్‌సర్‌లో సెమీ అరిడ్ (అర్థ శుష్క) వాతావరణం ఉంటుంది. ఇది వాయవ్య భారతదేశానికి ప్రత్యేకమైన వాతావరణం ఇది. ఇక్కడ ప్రధానంగా నాలుగు ఋతువులుంటాయి: శీతాకాలం (డిసెంబరు నుండి మార్చి వరకు, ఉష్ణోగ్రతలు −1 °C (30 °F) కి పడిపోతాయి, వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) - ఉష్ణోగ్రతలు 45 °C (113 °F) వరకూ చేరుకోవచ్చు, వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబరు వరకు), వర్షాకాలం తరువాత (అక్టోబరు నుండి నవంబరు వరకు). వార్షిక వర్షపాతం 703.4 మి.మీ. [3] జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత −3.6 °C (25.5 °F) 1996 డిసెంబరు 9 న నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత 47.8 °C (118.0 °F), 1995 జూన్ 9 న నమోదింది. [4] నగరానికి అధికారిక వాతావరణ కేంద్రం రాజాసాన్సీలోని విమానాశ్రయంలో ఉంది. 1947 నవంబరు 15 నుండీ ఇక్కడ శీతోష్ణస్థితి రికార్డులు ఉన్నాయి.
Amritsar Airport-వాతావరణం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | సంవత్సరం |
అత్యధిక °C (°F) | 26.8 | 32.2 | 36.2 | 44.1 | 47.7 | 47.8 | 45.6 | 40.7 | 40.6 | 38.3 | 34.2 | 28.5 | 47.8 (nil) |
సగటు అధిక °C (°F) | 18.4 | 21.7 | 26.8 | 34.2 | 39 | 39 | 35 | 34.2 | 34.1 | 32 | 27.1 | 21.1 | 30.2 |
సగటు అల్ప °C (°F) | 3.4 | 6.3 | 10.9 | 16.1 | 21.3 | 24.3 | 25.3 | 24.9 | 22.1 | 15.4 | 8.7 | 4.1 | 15.2 |
అత్యల్ప °C (°F) | -2.9 | −2.6 | 2 | 6.4 | 9.6 | 15.6 | 18.2 | 18.8 | 13 | 7.3 | -0.6 | −3.6 | −3.6 (nil) |
వర్షపాతం mm (inches) | 26.2 | 38.6 | 38.4 | 21.4 | 26.7 | 61.2 | 210.1 | 167.3 | 77.5 | 16.1 | 6.3 | 13.6 | 703.4 |
స.
వర్షపు రోజులు(≥ 1.0 mm)
|
2.1 | 3.3 | 3.2 | 2 | 2.4 | 3.8 | 8.6 | 6.9 | 3.5 | 1.1 | 0.6 | 1.4 | — |
తేమ % | 74 | 70 | 64 | 47 | 38 | 48 | 72 | 77 | 69 | 67 | 73 | 76 | — |
Mean monthly sunshine hours | 181.7 | 192.7 | 219.4 | 265.0 | 294.7 | 269.0 | 215.5 | 227.7 | 240.8 | 253.2 | 220.1 | 182.2 | — |
Source: [5][6] |
జనాభా వివరాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్‌సర్ జిల్లా జనాభా 24,90,656, [1] ఇది కువైట్ దేశానికి [8] లేదా అమెరికా రాష్ట్రమైన నెవాడాకు సమానం. [9] అమృత్‌సర్ జిల్లాలో అక్షరాస్యుల సంఖ్య 16,84,770 (67.6%). అందులో 9,32,981 (70.8%) పురుష అక్షరాస్యులు, 751,789 (64.1%) మహిళా అక్షరాస్యులు. జిల్లాలో 7 వ తరగతి, ఆ పైన చదివిన వారు 76.27%. ప్రతి 1,000 మంది పురుషులకు 889 మంది స్త్రీలున్నారు. మొత్తం షెడ్యూల్డ్ కుల జనాభా 7,70,864. 2011 లో జిల్లాలో 4,88,898 గృహాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, సిక్కులు జనాభాలో 69% ఉండగా, హిందువులు 28%, కొద్దిమంది మైనారిటీ క్రైస్తవులు (2%), ముస్లింలు ఉన్నారు .
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 7,64,821 | — |
1911 | 6,57,936 | −14.0% |
1921 | 6,94,261 | +5.5% |
1931 | 8,34,497 | +20.2% |
1941 | 10,44,457 | +25.2% |
1951 | 8,80,667 | −15.7% |
1961 | 10,10,093 | +14.7% |
1971 | 12,09,374 | +19.7% |
1981 | 14,60,497 | +20.8% |
1991 | 16,98,090 | +16.3% |
2001 | 21,57,020 | +27.0% |
2011 | 24,90,656 | +15.5% |
అమృత్‌సర్ జిల్లాలో తహసీళ్ళు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్‌సర్ జిల్లాలో నాలుగు తహసీళ్ళు ఉన్నాయి.
# | తహసీలు | జిల్లా |
---|---|---|
1 | అమృత్‌సర్- II | అమృత్‌సర్ |
2 | అజ్నాలా | అమృత్‌సర్ |
3 | బాబా బకాలా | అమృత్‌సర్ |
4 | అమృత్‌సర్ -I | అమృత్‌సర్ |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Census of India: Amritsar district". censusindia.gov.in. Retrieved 12 October 2019.
- ↑ "Imperial Gazetteer2 of India, Volume 5, page 319 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library".
- ↑ "Amritsar Climate Normals 1981-2010" (PDF). Indian Meteorological Department, Pune. Retrieved 31 March 2020.
- ↑ "Amritsar Climate Normals 1981-2010" (PDF). Indian Meteorological Department, Pune. Retrieved 31 March 2020.
- ↑ "Amritsar Climate Normals 1981-2010" (PDF). Indian Meteorological Department, Pune. Retrieved 31 March 2020.
- ↑ "Amritsar Climate Normals 1971–1990". National Oceanic and Atmospheric Administration. Retrieved 11 January 2014.
- ↑ "C-1 Population By Religious Community Data - Census 2011 - Amritsar district, Punjab". censusindia.gov.in.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 1 October 2011.
Kuwait 2,595,62
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011.
Nevada 2,700,551