పటియాలా జిల్లా
పటియాలా జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 30°20′N 76°23′E / 30.34°N 76.38°E | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
Founded by | బాబా ఆలా సింగ్ |
ముఖ్య పట్టణం | పటియాలా |
విస్తీర్ణం | |
• Total | 3,222 కి.మీ2 (1,244 చ. మై) |
జనాభా (2011)‡[›] | |
• Total | 18,95,686 |
• జనసాంద్రత | 590/కి.మీ2 (1,500/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
టెలిఫోన్ కోడ్ | పటియాలా: 91-(0)175, రాజ్‌పురా: 91-(0)1762, సమానా: 91-(0)1764, నాభా: 91-(0)1765 & అమ్లోహ్: 91-(0)1768 |
అక్షరాస్యత | 75.28% |
శాసనసభ నియోజకవర్గం | 9 |
హైవేలు | NH 1, NH 64, NH 71 |
పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాల్లో పటియాలా జిల్లా (డోయాబీ: ਪਟਿਆਲਾ ਜ਼ਿਲਾ) ఒకటి. పటియాలా పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం.
భౌగోళికం
[మార్చు]పటియాలా జిల్లా పంజాబు రాష్ట్రపు ఆగ్నేయ భాగంలో, 29 49 ', 30 47 ' ఉత్తర అక్షాంశం మధ్య 75 58 ', 76 54 ' తూర్పు రేఖాంశాల మద్య ఉంది. దీనికి ఉత్తరాన ఫతేగఢ్ సాహిబ్, రూప్ నగర్, మొహాలి జిల్లాలు, పశ్చిమాన ఫతేగఢ్ సాహిబ్, సంగ్రూర్ జిల్లాలు, ఈశాన్యాన హర్యానా లోని అంబాలా, పంచకులా జిల్లాలు, తూర్పున హర్యానా లోని కురుక్షేత్ర జిల్లా, నైఋతిలో హర్యానా లోని ఖైతాల్ జిల్లా ఉంది.
చరిత్ర
[మార్చు]భటిండా జిల్లాలోని రాంపూర్ ఫుల్‌కు చెందిన సైనికాధికారి " బాబా ఆలా సింఘ్ " (1691-1765) తన యువ సైనికులతో పటియాలాకు వచ్చి 1722లో సరికొత్తగా సామ్రాజ్యస్థాపన చేసాడు. తరువాత బాబా ఆలా సింఘ్ లెహల్ గ్రామానికి వెళ్ళి అక్కడ నగరాన్ని నిర్మించి దానికి పటియాలా అని నామకరణం చేసాడు. తరువాత ఆయన స్థిరమైన సామ్రాజ్యానికి పునాదులు వేసాడు. పటియాలాను చుట్టి ఆయన అనేక గ్రామాలను స్థాపించాడు. తరువాత సిఖ్ఖుమతానికి చెందిన పలు గురుద్వారాలు నిర్మించాడు. బాబా ఆలా సింఘ్ కాలం నుండి పటియాలా సిర్హింద్ రాజ్యంలో భాగంగా ఉంది. సిర్హింద్ లో భాగంగా సిరిండ్, తొహనా, మాన్సా, భటిండా, సంగ్రూర్, బర్నాలా ఉన్నాయి.
బ్రిటిష్ పాలన
[మార్చు]1809 లో ఫుల్కియాన్ రాజవంశానికి చెందిన మహారాజా సాహిబ్ సింగ్ (1773-1813) నుండి ఈ ప్రదేశం బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. లాహోర్ రాజు సట్లెజ్ నది దాటి ఈ ప్రాంతం మీద దండెత్తి వస్తాడని భావించిన సాహిబ్ సింగ్ రక్షణ కొరకు బ్రిటిషు ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. 1807-1947 వరకు ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 1948లో పటియాలా రాజాస్థానం భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. 1992 ఏప్రిల్ 13 న పటియాలా జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఫతేగఢ్ సాహిబ్ జిల్లాను ఏర్పాటు చేసారు. జిల్లాలోని ప్రజలు ప్రధానంగా సిక్ఖు మతాన్ని అవలంబిస్తున్నారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు స్వల్పసంఖ్యలో ఉన్నారు. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 18,92,282. రాష్ట్రంలో జనసంఖ్యాపరంగా ఈ జిల్లా 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలలో అమృత్‌సర్, లుధియానా, జలంధర్ జిల్లాలు ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]పటియాలా జిల్లాలో శివాలిక్ పర్వతశ్రేణులలోని పలు చిన్న పర్వతశ్రేణులు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,892,282,[1] |
ఇది దాదాపు. | లెసోతొ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | మిసిసిపి నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 248వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 596 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.4%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 888:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 76.3%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
వాతావరణం
[మార్చు]పటియాలా జిల్లా వాతావరణం తీచ్రంగా ఉంటుంది. వేసవి అధిక వేడిగాను. శితాలాలాలు అత్యంత చలిగానూ ఉంటాయి. వార్షిక సరాసరి వర్షపాతం 688 మి.మీ ఉంటుంది. వర్షాకాలం దాదాపు 3 మాసాలకాలం ఉంటుంది. ఇప్పటి వరకు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 43.1˚ డిగ్రీల సెల్షియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 2.1 సెల్షియస్.
భూస్వరూపం
[మార్చు]జిల్లాలోని అత్యధిక భూభాగం వ్యవసాయభూమిగా ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న ఘాఘర్ నది సంవత్సరంలో అత్యధికభాగం ఎండిపోతుంది. అయినప్పటికీ వర్షాకాలంలో మాత్రం ఈ నిదిలో నీరు ప్రవహించడమే కాక సమీపగ్రామాలలో వరదలకు కారణం ఔతుంది. వరదల తాకిడికి పంటలు, పశువులు, మానవ ప్రాణాలకు నష్టం కలిగిస్తుంది.అంతేకాక జిల్లాలో తంగ్రి, పటియాలా వాలి, సిరిండ్ చో, జంబోవాలి చో నదులు ఉన్నాయి. సహజసిద్ధమైన నదీజలాలతో జిల్లాలో బక్రా ప్రధాన కాలువ, నావానా శాఖ, ఘాఘర్ సంగమం వ్యవసాయభూములకు నీటిని అందిస్తుంది. జిల్లాలోని వ్యవసాయానికి ఈ నదీ కాలువలు వెన్నెముకగా నిలిచాయి.
విభాగాలు
[మార్చు]పాటియాల జిల్లాలో 5 ఉపవిభాగాలు (తాలూకాలు: సమనా, పత్రన్, నాభా, రాజపుత్ర, పటియాలా ), 3 ఉప తాలూకాలు, 8 బ్లాకులూ ఉన్నాయి: అలాగే 942 గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Lesotho 2,124,886
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Mississippi 1,852,994