హోషియార్‌పూర్ జిల్లా
హోషియార్‌పూర్ జిల్లా ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਜ਼ਿਲਾ | |
---|---|
జిల్లా | |
హోషియార్‌పూర్ జిల్లా | |
![]() పంజాబులో జిల్లా స్థానం | |
దేశం | ![]() |
రాష్ట్రం | పంజాబ్ |
ముఖ్య పట్టణం | హోషియార్పూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,365 కి.మీ2 (1,299 చ. మై) |
జనాభా వివరాలు (2011)‡[›] | |
• మొత్తం | 1,579,160 |
• సాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
కాలమానం | UTC+5:30 (IST) |
అక్షరాస్యత | 85.40% |
జాలస్థలి | hoshiarpur |
హోషియార్పూర్ జిల్లా (పంజాబీ: ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਜ਼ਿਲ੍ਹਾ), ఉత్తర భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని జిల్లా. ఇది, పంజాబ్ లోని పురాతన జిల్లాలలో ఒకటి. దీనికి వాయవ్యంలో గురుదాస్పూర్ జిల్లా, నైరుతిలో జలంధర్, కపుర్తలా జిల్లాలు, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్ జిల్లాలైన కాంగ్రా, ఊనా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. హోషియార్పూర్ జిల్లాలో 4 ఉప డివిజన్లు, 10 కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్స్, 9 పట్టణ స్థానిక సంస్థలు, 1417 గ్రామాలు ఉన్నాయి. ఈ జిల్లా 3365 కిమీ వైశాల్యం కలిగి ఉంది. జనాభా 2001 గణన ప్రకారం 14,80,736 జనాభా కలిగి ఉంది.
భౌగోళికం[మార్చు]
హోషియార్పూర్ పంజాబులో సాంస్కృతిక కేంద్రాలలో (నవంషహర్, కపుర్తల, జలంధర్) ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లా బియాస్, సట్లైజ్ మద్యన ఉపస్థితమై ఉంది. షివాలిక్ పర్వతపాదప్రాంతంలో చండీఘడ్ - పఠాన్‌కోట కుడివైపున ఉపస్థితమై ఉన్న హోషియార్పూర్ పర్వతమయంగా ఉంటుంది. ఈప్రాంతాన్ని కండి అంటారు.బియాస్,సట్లైజ్ నదులు, ఇతర సెలయేరులు ఈప్రాంతానికి అవసరమైన నీటిని అందిస్తున్నాయి. అదనంగా కండి ప్రాంతం అంతటా సీజనల్ సెలయేరులు ప్రవహిస్తుంటాయి.
నైసర్గిక స్వరూపం[మార్చు]
జిల్లా కొండపాత్రం, మైదానప్రాంతంగా రెండుగా విభజించబడింది. జిల్లాతూర్పు భాగంలో సోలార్ సింఘీ కొండల పశ్చిమప్రాంతం ఉంటుంది. దీనికి సమాంతరంగా శివాలిక్ పర్వతశ్రేని దిగువమార్గం జిల్లా ఉత్తరదక్షిణాలుగా ఉంటుంది. పశ్చిమప్రాతం సారవంతమైన భూభాగం ఉంటుంది.గణీయమైన ప్రభుత్వ వన్యప్రాంతం ఫారెస్ట్ ఆధీనంలో ఉంటుంది. చిత్తడిమైదానాలలో వరి విస్తారంగా పండిస్తూ ఉన్నారు. ఆనంద్పూర్, దసుయా, ముకెరియన్ చింట్‌పూర్ని జరిగే ఉత్సవాలు అనేకమంది పరిసర ప్రజలను ఆకర్షిస్తూ ఉంది.
వాతావరణం[మార్చు]
కొండప్రాంతాలకు సమీప ంలో ఉన్న కారణంగా వాతావరణం చల్లాగా, తేమగా ఉంటుంది.
ఉత్పత్తులు[మార్చు]
జిల్లాలో నూలు వస్త్రాలు తయారుచేయబడుతున్నాయి. చెరకు, వరి, ఇతర ధాన్యాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. పొగాకు, ఇండిగో ఎగుమతి చేయబడుతున్నాయి. హోషియార్పూర్ జిల్లా సన్యాసుల నగరంగా పిలువబడుతూ ఉంది. జిల్లాలో అనేక డేరాలు కనిపిస్తూ ఉంటాయి.
చరిత్ర[మార్చు]
ప్రస్తుత హోషియార్పూర్ జిల్లా ప్రాంతం " సింధు లోయ నాగరికత " ప్రాంతాలలో ఒకటి. జిల్లాలో పలు ప్రాంతాలలో నిర్వహించిన త్రవ్వకాలలో లభించిన ఆధారాలను అనుసరించి శివాలిక్ పర్వతపాదాలలో పాలియోలిథిక్ మానవుడు నివసించాడని భావిస్తున్నారు. అంతేకాక ప్రొటోహిస్టారిక్, హిస్టారిక్ కాలం నుండి ఈ ప్రాంతంలో మానవ ఆవాసాలు ఉన్నయని భావిస్తున్నారు.
పురాణ కథనాలు[మార్చు]
పురాణ కథనాలను అనుసరించి ఈ జిల్లాలోని పలు ప్రాంతాలు పాండవులకు సంబంధించి ఉన్నాయని భావిస్తున్నారు. పాండవులకు అఙాతవాసంలో సహకరించిన విరాటరాజ్యం ఇదేనని భావిస్తున్నారు. మహిల్‌పూర్‌కు 11 కి.మీ దూరంలో ఉన్న భం ప్రాంతంలో పాండవులు అఙాతవాసం గడిపారని భావిస్తున్నారు. జైజాన్‌కు ఉత్తరంలో 19 కి.మీ దూరంలో ఉన్న శిలాలయం పాండవుల కాలంనాటిదని పరిశోధకులు భావిస్తున్నారు. చైనాయాత్రికుడు హూయంత్సాంగ్ వ్రాతలలో ఇక్కడ పలు శతాబ్దాలు చంద్రపుత్ర రాజవంశీయులు స్వతంత్ర పాలకులుగా నివసించారని దాదాపు మహమ్మదీయుల దండయాత్రలు కొనసాగేవరకు వారి పాలన కొనసాగిందని భావిస్తున్నారు.
కోతక్[మార్చు]
జలంథర్‌కు చెందిన కటోచ్ సామ్రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉంటూ వచ్చింది. తరువాత ఈ ప్రాంతం చీలిపోయింది. ప్రస్తుత జిల్లా ప్రాంతం రాజా దాతర్పూర్, జస్వాన్‌లకు విభజించబడింది. 1759 నుండి సిక్కు సంస్థానాధీశులు నిశ్శబ్ధంగా ఈ ప్రాంతంలోని పర్వతప్రాంతాలలో ఆక్రమణలు అధికం చేయడం ఆరభించే వరకు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. 1815లో రంజిత్ సింగ్ జస్వన్ మీద వత్తిడి చేసిన తరువాత రాజా జస్వన్ కొంత రాజ్యం స్వీకరించి బదులుగా ఈ ప్రాంతం మీద అధికారాన్ని వదులుకున్నాడు. 3 సంవత్సరాల తరువాత దాతాపూర్ రాజా కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎదుర్కొన్నాడు. 1818 నాటికి సట్లైజ్ నుండి బీస్ వరకు ఉన్న ప్రాంతం పూర్తిగా లాహోర్ ఆధీనంలోకి వచ్చింది.
బ్రిటిష్ పాలన[మార్చు]
1846లో మొదటి అంగ్లో - సిఖ్ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకువచ్చింది. పదవీ చ్యుతులైన దాతాపుర్, జస్వన్ రాజాలు భరణం అందుకుంటూ వచ్చారు. అయినప్పటికీ వారు కోల్పోయిన గత వైభవం తిరిగి పొందలేక వారు నిరాశకు గురైయ్యారు. 1848లో రెండవ అంగ్లో - సిఖ్ యుద్ధంలో పదవీచ్యుతులైన రాజులు తిరుగుబాటుదారులలో చేరారు. వారు చేసిన తిరుగుబాటులో రాజులిద్దరూ, తిరుగుబాటు నాయకులు మాత్రం బ్రిటిష్ సైన్యాలకు పట్టుబడ్డారు. వారి రాజ్యాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. హిందూ కావ్యకాలంలో హోషియార్పూర్ కేంద్రంగా ఉండేది. ప్రస్తుత నగరంలోని ఉనారోడ్డుకు 4కి.మీ దూరంలో ఉన్న బజ్వారాలో పాండవులు అఙాతవాసం పూర్తిచేసారని విశ్వసిస్తున్నారు.
సంస్కృతి[మార్చు]
భృగు సంహిత[మార్చు]
హోషియార్పూర్ అత్యధికంగా పురాతన జ్యోతిషశాస్త్రంతో సంబందితమై ఉంది. ఇక్కడ భూత, వర్తమాన, భవిష్యత్తులో జన్మించబోయే వ్యక్తుల వివరాకను వివరించగలిగిన పురాతన దస్తావేజులు ఉన్నాయని ప్రాంతీయ వాసులు విశ్వసిస్తున్నారు. అవి వివరంగా వ్రాయబడి ఇక్కడ సురక్షితంగా బద్గ్రపరచబడి ఉన్నాయని విశ్వసిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి అనేకమంది వారి భూత, వర్తమాన, భవిష్య జన్మలగురించి తెలుసుకోవడానికి ఇక్కడకు వస్తుంటారు.
జైజాన్[మార్చు]
హోషియార్పూర్ జిల్లాలో ఉన్నవ్పురాతన సాంస్కృతిక కేంద్రాలలో జైజాన్ ఒకటి. దీనిని 11వ శతాబ్దంలో జైజ్జత్ ఋషి శివాలిక్ పర్వతపాదప్రాంతంలో స్థాపించాడని భావిస్తున్నారు. జైజాన్ వాణిజ్యకేంద్రంగా వర్ధిల్లింది. ఇది తూర్పు ఆసియా విద్యాకేంద్రంగా ప్రసిద్ధిచెందింది. ప్రముఖ సంస్కృతం, జ్యోతిషం, ఆయుర్వేదం, సంగీత విద్వాంసులు ఈప్రాంతంలో సమావేశం అయ్యారని భావిస్తున్నారు. సంగీతదర్శకుడు హుస్సేన్ లాల్, భగత్ రాం, ప్రముఖ పాకిస్తాన్ కవి తుఫైల్ హోషియార్పురి ఈప్రాంతానికి చెందినవారే.గతించిన ఆయుర్వేద పండితుడు గోవింద్ రాం వాత్సాయన్, కీ.శే. సంస్కృత సాహిత్యకారుడు ఆచార్య విశ్వనాథ్ జైజాన్ చెందినవారే. చండీగఢ్ ఉనికిలోకి వచ్చిన తరువాత జైజాన్ ప్రాముఖ్యత కోల్పోయింది. ప్రస్తుతం ఇది పంజాబు సరిహద్దులు, శివాలిక్ పర్వతప్రాంతాలలో ఉన్న జైజాన్ నగరం నిద్రిస్తున్ననగరంగా భావించబడుతుంది. శివాలిక్ పర్వతప్రాంతాలలో ఉన్న మహిల్పూర్‌ను చైనా యాత్రికుడు హ్యూయంత్సాంగ్ సందర్శించాడు. ఈప్రాంతాన్ని మహిపాల్పూర్ అని ప్రస్తావించాడు.
శివాలిక్ లోయలో గర్శంకర్ సమీప ంలో సదార్పూర్ అనే చిన్న గ్రామం ఉంది.
ప్రాంతం[మార్చు]
హోషియార్పూర్, వైశాల్యం 3198 చ.కి.మీ.గ్రామాల సంఖ్య 1,449.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,579,160,[1] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 31వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 603 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.95%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 992:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 85.40%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
షెడ్యూల్డ్ కులాలు | 32% |
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సరాసరి శాతం 28% కంటే | అధికం |
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సరాసరి శాతంలో | 5 వ స్థానం |
4 మండలాలలో షెడ్యూల్డ్ కులాల శాతం | 40% |
హోషియార్పూర్1-2 షెడ్యూల్డ్ కులాల శాతం | 48% |
బుంగా మండలం షెడ్యూల్డ్ కులాల శాతం | 41% |
మిగిలిన మండలాలు షెడ్యూల్డ్ కులాల శాతం | 40 కంటే తక్కువ |
ఆర్ధికం[మార్చు]
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో హోషియార్పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పంజాబు రాష్ట్ర ఒకేఒక జిల్లాలో ఈ జిల్లా ఒకటి.[4]
ఉపవిభాగాలు[మార్చు]
హోషియార్పూర్ జిల్లాలో 4 ఉపవిభాగాలు, 10 మండలాలు, 8 ముంసిపల్ కౌంసిల్స్ ఒక ఏరియా కమిటీ ఉన్నాయి:
అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లు[మార్చు]
- హోషియార్పూర్
- దసుయా
- ముకెరియన్
- గర్షంకర్
- తాండా
అభివృద్ధి విభాగములు[మార్చు]
- హోషియార్పూర్-1
- హోషియార్పూర్-2
- భుంగ
- తాండా
- దసుయా
- ముకరియన్
- తల్వారా
- హాజీపూర్
- మహిల్పూర్
- గర్షంకర్
మున్సిపల్ కార్పొరేషన్[మార్చు]
- హోషియార్పూర్
మున్సిపల్ కౌన్సిల్స్[మార్చు]
- గర్దివాలా
- హరియానా
- తాండా
- నాంగల్ ఖుగా
- ఖుడ్డా
- దసుయా
- ముకెరియన్
- షాంచురాసి
- తల్వారా
తెలియబరచిన ఏరియా కమిటీ[మార్చు]
- మహిల్పూర్
- హోషియార్పూర్
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gabon 1,576,665
{{cite web}}
: line feed character in|quote=
at position 6 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Idaho 1,567,582
{{cite web}}
: line feed character in|quote=
at position 6 (help) - ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
బయటి లింకులు[మార్చు]
- Hoshiarpur district Archived 2021-01-27 at the Wayback Machine
- Hoshiarpur District at Maps of India
- Bhrigu Samhita
This article incorporates text from a publication now in the public domain: Chisholm, Hugh, ed. (1911). Encyclopædia Britannica (11th ed.). Cambridge University Press.
{{cite encyclopedia}}
: Cite has empty unknown parameters:|HIDE_PARAMETER15=
,|HIDE_PARAMETER13=
,|HIDE_PARAMETER2=
,|separator=
,|HIDE_PARAMETER4=
,|HIDE_PARAMETER8=
,|HIDE_PARAMETER11=
,|HIDE_PARAMETER5=
,|HIDE_PARAMETER7=
,|HIDE_PARAMETER10=
,|HIDE_PARAMETER6=
,|HIDE_PARAMETER9=
,|HIDE_PARAMETER3=
,|HIDE_PARAMETER1=
,|HIDE_PARAMETER14=
, and|HIDE_PARAMETER12=
(help); Invalid|ref=harv
(help); Missing or empty|title=
(help)
ఇవి కూడా చూడండి[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Hoshiarpur district. |
- Pages with non-numeric formatnum arguments
- CS1 errors: invisible characters
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- CS1 errors: empty unknown parameters
- CS1 errors: missing title
- CS1 errors: invalid parameter value
- Commons category link from Wikidata
- పంజాబ్ జిల్లాలు