Jump to content

కాంగ్రా జిల్లా

వికీపీడియా నుండి
కాంగ్రా జిల్లా
काँगड़ा ज़िला
کانگرہ ضلع
జిల్లా
Located in the northwest part of the state
హిమాచల్ ప్రదేశ్‌లో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
తాలూకాలు
ముఖ్య పట్టణాంధర్మశాల
విస్తీర్ణం
 • Total5,739 కి.మీ2 (2,216 చ. మై)
జనాభా
 (2011)
 • Total15,07,223
 • జనసాంద్రత263/కి.మీ2 (680/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
176xxx
టెలిఫోన్ కోడ్91 1892 xxxxxx
అతిపెద్ద పట్టణంపాలంపూర్
శీతోష్ణ స్థితిETh (Köppen)

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని అత్యత జనసాంధ్రత కలిగిన కాంగ్రా జిల్లా. జిల్లా కేంద్రగా ధర్మశాల పట్టణం ఉంది.

భౌగోళికం

[మార్చు]

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లా పశ్చిమ హిమాలయాలలో 31°2 నుండి 32°5 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 75° నుండి 77°45 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్యనా ఉంది. జిల్లా వైశాల్యం 5,739 చ.కి.మీ. ఇది రాష్ట్రభూభాగంలో 10.31% ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 15,10,030. రాష్ట్ర జనసంఖ్యలో ఇది 22.50%. సముద్రమట్టం నుండి ఈ జిల్లా ఎత్తు 427 మీ - 6401 మీ మధ్య ఉంటుంది. ఈ జిల్లాలో వైవిధ్యమైన భూమి, భౌగోళికరూపం, భూమిని ఉపయోగించే విధానాలు, పంటలు పండించే విధానాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలను బట్టి జిల్లాను 5 ఉపవిభాగాలుగా (దౌలధర్, కాంగ్రా, శివాలిక్, కాంగ్రా లోయ, బియాస్ మైదానం) విభజించారు.

సరిహద్దులు

[మార్చు]

జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది బియాస్ నది. ఈ నది, జిల్లా లోని వ్యవసాయ భూములకు అవసరమైన నీటిని అందిస్తుంది. జిల్లా ఉత్తర సరిహద్దులలో చంబా, లాహౌల్ జిల్లాలోని లాహౌల్ లోయ, తూర్పు సరిహద్దులో కుల్లు, ఆగ్నేయ సరిహద్దులో మండీ, దక్షిణ సరిహద్దులో హమీర్‌పూర్, ఊనా జిల్లాలు ఉన్నాయి. జిల్లా పశ్చిమ సరిహద్దులో పంజాబ్ రాష్ట్రం ఉంది. కొండ ప్రదేశం కనుక జిల్లా భూభాగంలో అధిక భాగం వ్యవసాయ యోగ్యంగా ఉండదు. జిల్లా అంతటా చక్కగా రహదార్లతో అనుసంధానితమై ఉంది.

ఆలయాలు

[మార్చు]

కాంగ్రా జిల్లా ముఖ్య పట్టణమైన ధర్మశాల, ప్రవాసంలో ఉన్న టిబెట్ ఆచార్యుడు దలైలామాకు అధికారిక నివాసం. కేంద్రీయ టిబెట్ ప్రభుత్వానికి కూడా ఇదే అధికారిక కేంద్రం. ఈ జిల్లాలో జ్వాలాముఖి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధానదైవం జ్వాలాజీగా పూజలందుకుంటున్నది. ఈ ఆలయంలో సహజసిద్ధంగా నిరంతరంగా వెలిగే జ్వాలను అమ్మవారుగా పూజుంచబడుతుంది. ఇతర ప్రముఖ దేవాలయాలలో బ్రజేశ్వరీదేవి ఆలయం, చాముండీదేవి ఆలయం, చింటుపుర్ని ఆలయం, ఎం.సి లియోడ్ గంజ్‌లో ఉన్న భగ్‌సునాగ్ ఆలయం, బైజీనాథ్‌లో ఉన్న మాహాకాల్, బైజ్‌నాథ్ ఆలయం మొదలైనవి ప్రధానమైనవి. ధర్మశాలలో ప్రముఖ బుద్ధ దేవాలయాలు కూడా ఉన్నాయి. సిధ్‌భరి, టిబెటన్ కాలనీ, చారిత్రక గ్రామాలైన ప్రాగ్‌పూర్, గారి కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని అజంతా ఎల్లోరా అనబడే మాస్రూర్ గుహాలయం ఉన్నాయి. ఈ ఆలయాన్ని అరణ్యవాస సమయంలో పాండవులు నిర్మించారని విశ్వసిస్తున్నారు. బంఖండి ప్రాందంలో బగలముఖి దేవాలయం కూడా ఉంది.

జిల్లాలో జన్మించిన ప్రముఖులు

[మార్చు]
  • బాబా కాన్షీరామ్ :జిల్లా లోని దాదాసిభా గ్రామంలో జన్మించాడు.ఇతను భారతీయ కవి. భారతస్వాతంత్ర్యోద్యమ కార్యకర్త

వాతావరణం

[మార్చు]

కాంగ్రా జిల్లా సముద్రమట్టానికి మిలావన్ వద్ద 400- బారా భంగాల్ వద్ద 5500 మీ ఎత్తు ఉంది. కాంగ్రా లోని ఇండోరా బ్లాక్ వద్ద సెమీ హ్యూమిడ్, సబ్ ట్రాపికల్ భూభాగంలో ఉంది. ఈ ప్రాతపు వర్షపాతం సుమారుగా 1000 మి.మీ అలాగే ఉష్ణోగ్రత 24డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. డెహ్రాగోపిపూర్, నూపుర్ బ్లాకుల వద్ద హ్యూమిడ్ వాతావరణం, సబ్ ట్రాపికల్ భూభాగంలో ఉంటుంది. ఇక్కడ వర్షపాతం 900-2350 ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 2-24 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. పాలంపూర్, ధర్మశాల తడిభూములతో ఉంటుంది. ఉష్ణోగ్రతలు 15-19 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. వర్షపాతం 2500 మి.మీ ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యత తేమభూమి ఉన్న ప్రాంతం ఇది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతం పర్వతప్రాంతం. ఉష్ణోగ్రతలు 13-15 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. వర్షపాతం 1800-3000 మి.మీ ఉంటుంది.

శీతాకాలం అక్టోబరు మద్య నుండి మార్చి వరకు కొనసాగుతుంది. శీతాకాలపు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. చలిగాలుల కారణంగా శీతాకపు వర్షం ఉంటుంది. వేసవి కాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 25 నుండి 38 సెల్షియస్ ఉంటుంది. తరువాత వర్షపాతం ఆరంభమై హేమంతం వరకు వర్షపాతం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ వాతావరణం పైన్ వృక్షాల అరణ్యాలను ఆహ్లాదకరంగా మారుస్తుంది. ప్రధానంగా చాముండేశ్వరి ఆలయసమీపంలో దీనిని ప్రత్యక్షంగా చూడవచ్చు. అరణ్యాలను నరికివేస్తున్న కారణంగా ఈ ప్రాంతపు ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ప్రాంత ప్రశాంతతను రక్షించడానికి మరిన్ని చెట్లను నాటి సంరక్షించవలసిన అవసరం ఉంది.

శీతోష్ణస్థితి డేటా - Dharamshala
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 13.5
(56.3)
17.8
(64.0)
21.6
(70.9)
26.9
(80.4)
29.1
(84.4)
30.5
(86.9)
27.2
(81.0)
26.1
(79.0)
24.6
(76.3)
23.7
(74.7)
19.8
(67.6)
16.4
(61.5)
23.1
(73.6)
సగటు అల్ప °C (°F) 5.1
(41.2)
10.3
(50.5)
14.7
(58.5)
16.3
(61.3)
20.1
(68.2)
22.9
(73.2)
21.4
(70.5)
20.2
(68.4)
17.5
(63.5)
14.8
(58.6)
10.7
(51.3)
7.4
(45.3)
15.1
(59.2)
సగటు అవపాతం mm (inches) 114.5
(4.51)
100.7
(3.96)
98.8
(3.89)
48.6
(1.91)
59.1
(2.33)
202.7
(7.98)
959.7
(37.78)
909.2
(35.80)
404.8
(15.94)
66.3
(2.61)
16.7
(0.66)
54.0
(2.13)
3,054.4
(120.25)
Source: http://www.bbc.co.uk/weather/world/city_guides/results.shtml?tt=TT004930

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 1,507,223,[1]
ఇది దాదాపు గాబన్ దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని హవాయ్ నగర జనసంఖ్యకు సమం [3]
640 భారతదేశ జిల్లాలలో 331 వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 263 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 12.56%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 1013: 1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 86.49%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

కాంగ్రి జిల్లాలో ప్రధాన భాష కాంగ్రి (పహాడి). ఇది పంజాబీ భాషకు దగ్గరగా ఉంటుంది. జిల్లాలో హిందూ బ్రాహ్మణులు అత్యధికసంఖ్యలో ఉన్నారు. తరువాత బనియాలు, షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగలు, టిబెట్ ప్రజలు ఇతరులు బుద్ధిజం అనుసరిస్తున్నారు. అంతే కాక గుర్తించతగిన సంఖ్యలో సిక్కులు, ముస్లిములు, క్రిస్టియన్లు ఉన్నారు. పురుషులు కుర్తా, ఫైజామా చలికాలంలో ఉలెంజాకెట్ ధరిస్తుంటారు. స్త్రీలు సాధారణంగా సల్వార్ కమీజ్, చున్నీ (చద్రు) ధరిస్తుంటారు.

ఉపవిభాగాలు

[మార్చు]
  • " కాంగ్రా ఉపవిభాగాలు:- " కాంగ్రా, పాలంపూర్, ధర్మశాల, నూపుర్, దేహ్రా, గోపియర్, బైజ్‌నాథ్, జ్వలి, జైసింగ్‌పుర్.
  • కాంగ్రాలో తెహ్సిల్స్:- నూపుర్, ఇండోరా, జ్వలి, కాంగ్రా, పాలంపూర్, బదోహ్, కస్బ, కోట్ల, జస్వన్, దేహ్రా గోపియర్, ఖుండియన్, జైసింగ్‌పూర్, బైజ్‌నాథ్, ఫతేపూర్, ధర్మశాల, షాహ్‌పూర్.
  • కాంగ్రాలో ఉప తెహ్సిల్స్:- హర్‌క్కియన్, ధిర, రాక్డ్, తురల్,నాగ్‌రోటా సురియన్, గంగథ్, ముల్తాన్.

ఆర్ధికం

[మార్చు]

కాంగ్రా జిల్లా ఆర్థికపరంగా తోటల పెంపకం, వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. టీ పంట జిల్లా ఆర్థికరంగంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కాంగ్రా టీ చక్కటి వాసన, రంగు, రుచి వలన ప్రపంచ ప్రదిద్ధిచెందింది. ఈ జిల్లాలో మంచినీటి ప్యాకింగ్, నిర్మాణరంగ వస్తుసామాగ్రి, ఉర్లగడ్డ చిప్స్ తయారీ సంస్థలు ఉన్నాయి. పాలంపూర్, బైజ్నాథ్ ప్రాంతాలలో పచ్చని టీ తోటలు ఉన్నాయి. జిల్లా ఆర్థికరంగానికి పర్యాటకరంగం ప్రధానపాత్ర పోషిస్తుంది. బిర్ ప్రాంతం ఎకోపర్యాటకం, ఎయిరోస్పోర్ట్‌లకు ప్రధాన కేంద్రంగా మాతింది.[4]

చరిత్ర

[మార్చు]

ప్రపంచంలోని పురాతన సామ్రాజ్యాలలో ఒకటైన కటోచ్ సామ్రాజ్యానికి సేవలందించింది. 1846లో మొదటి ఇండో- చైనా యుద్ధంలో ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి వశమైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ జిల్లాను హమీర్‌పూర్, కులు, లాహౌల్ కలిపి బ్రిటిష్ ప్రొవింస్ అయిన పంజాబ్ భూభాగంలో కలిపింది. మొదట జిల్లాకు కాంగ్రా పట్టణం ప్రధానకేంద్రంగా ఉంది. తరువాత ఇది 1855లో జిల్లా కేంద్రం ధర్మశాలకు తరలించబడింది.[5][6] 1905లో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పంజాబ్ భూభాగం భారతదేశం, పాకిస్తాన్ లకు పంచబడింది. కంగ్రాతో చేర్చిన తూర్పు భాగం భారతీయ పంజాబ్ భూభాగంతో చేర్చబడింది. 1960లో లాహౌల్ ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది. 1962లో కులు, 1966లో కాంగ్రా, ఉన ప్రాంతాలను హిమాచల్ ప్రదేశ్‌లో కలిపి భరతీయ కేంద్రపాలిత ప్రాంతం చేసారు. 1971లో హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్ర అంతస్తు ఇవ్వబడింది. 1972లో కాంగ్రా లోని కొంత భూభాగం వేరుచేసి హమీర్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్) జిల్లా రూపొందించబడింది. హరిపూర్ - గులార్ కూడా కాంగ్రాలో ప్రధానమైన పట్టణాలలో ఒకటి. ఇది మొగల్ కాలంలో పలువురికి ఆశ్రయం ఇచ్చి తమదేశభక్తిని చాటుకుంది. గులర్ చిత్రాలు కుడా ప్రఖ్యాతిగాంచాయి. కాంగ్రా భూభాగంలోని చారిత్రాత్మక ప్రాంతాలలో ప్రాగ్‌పూర్ గ్రామం ఒకటి .

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-28. Retrieved 2014-06-21.
  5. Kangra District The Imperial Gazetteer of India, v. 14, p. 380. .
  6. Dharamshala The Imperial Gazetteer of India, v. 11, p. 301.

బయటి లింకులు

[మార్చు]