Jump to content

మండి జిల్లా

వికీపీడియా నుండి
మండీ జిల్లా
హిమాచల్ ప్రదేశ్ పటంలో మండీ జిల్లా స్థానం
హిమాచల్ ప్రదేశ్ పటంలో మండీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంమండీ
విస్తీర్ణం
 • మొత్తం3,951 కి.మీ2 (1,525 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం9,00,987
 • జనసాంద్రత230/కి.మీ2 (590/చ. మై.)
ప్రధాన రహదార్లుNH21
Websiteఅధికారిక జాలస్థలి
Rewalsar Lake

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం 12 జిల్లాలో మండీ జిల్లా ఒకటి. మొదట ఈ జిల్లాను మాండవ్య జిల్లా అని అనేవారు. జిల్లా కేంద్రగా మండీ పట్టణం ఉంది. ఈ జిల్లాకు పురాణ, చారిత్రక ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ జిల్లాలో పురాణ ప్రాశస్త్రం కలిగిన పలు ఆలయాలు ఉన్నాయి. దీనిని భక్తులు చిన్నకాశి అని అంటారు. బియాస్ నదీతీరంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి.

బియాస్ నది ఈ జిల్లాలోని కొండలు, నగరప్రాంతంలో ప్రవహిస్తూ అత్యంత సుందరంగా ఉంటుంది. ఈ ప్రశాంత వాతావరణానికి అభివృద్ధి పనులలో నిర్మించిన రహదారులు ఆధునిక హంగులను సమకూర్చాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇది వాణిజ్యకేంద్రంగా ఉంది. కుల్లు, మనాలి నగరాలకు, ఇతర సమీప ప్రాంతాలకు ఇది ప్రధాన కూడలిలా ఉంది. చంఢీగడ్ మనాలి జాతీయ రహదారి 21, పఠాన్‌కోట - మండీ జాతీయ రహదారి 20 రహదార్ల ద్వారా ఈ జిల్లాకు ఇతర ప్రాంతాలతో రహదారి సౌకర్యం ఉంది. సరికొత్తగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో సుందర్ నగర్ ఒకటి. మండీ జిల్లాలో విద్యావంతులైన మద్యతరగతి వారిలో మాండ్యాలి భాష వాడుకలో ఉంది. మాండ్యాలి భాష హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాషలలో ఒకటైన పహరీ భాషా కుటుంబానికి చెందినది.[1] 2011 గణాంకాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ జిల్లాలలో మండీ జిల్లా అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కాంగ్రా జిల్లా ఉంది.[2]

చరిత్ర , భౌగోళికం

[మార్చు]

1948 ఏప్రిల్ 15 న మండీ రాజ్యం, సుకేత్ రాజ్యం విలీనం తరువాత మండీ జిల్లా రూపొందించబడింది. ఒకప్పుడిది హిమాచల్ ప్రదేశ్తో కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ ఉండేది. హిమాచల్ ప్రదేశ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వచ్చిన తరువాత మండీ జిల్లాగా రూపొందించబడింది. ఇక్కడ పురాణకాలంలో మాండవ్య మహర్షి నివసించిన కారణంగా ఈ పట్టణానికీ పేరు వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాధ్ట్రానికి మండీ భౌగోళిక కేంద్రంగా ఉంది. ఈ జిల్లా శివాలిక్ పాదపర్వతాల వద్ద బియాస్ నదికి ఎడమ తీరంలో ఉంది. మండీ పట్టణం సముద్రమట్టానికి 760 మీ ఎత్తున ఉంది. మండి, సుకేత్ లలో మండీ అనే పేరు " మార్కెట్ " నుండి వచ్చిందని మరొక భావన ప్రచారంలో ఉంది. ఈ జిల్లా లడఖ్, పంజాబ్ లోని హోషియార్, ఇతర ప్రాంతాలకు వ్యాపార మార్గంలో ఉన్న కారణంగా వాణిజ్యపరంగా ఈ ప్రాంతానికి ముఖ్యత్వం ఉంది.

ఆలయాలు

[మార్చు]

ఇక్కడ మహర్షి మాండవ్య పాపపరిహారార్ధం దీర్ఘకాలం ఈ ప్రదేశంలోని బియాస్ నదీతీరంలో తపమాచరించాడు. జిల్లాలో కొండల ఇతివృత్తంలో పైన్ వృక్షాల అరణ్యం మధ్య ఉన్న సుందర ఆలయ పట్టణం ఈ కథనానికి సాక్ష్యంగా నిలిచింది. మండి, సురేంద్రనగర్ మద్య ఉన్న బృహత్తర మైదానంలో పంటభూములు, పండ్లతోటలు ఉన్నాయి. జిల్లాలోని ఆలయాలతో తర్నా కొండ వద్ద భూతనాథ్, త్రిలోకినాథ్, పంచవక్త్ర, ష్యామకోలి ప్రాంతాలలో ఉన్న శిఖరాలలో శిలలతో చెక్కబడిన పెద్దపెద్ద కట్టడాలు ఉన్నాయి. తర్నా కొండ శిఖరం మీద సరికొత్తగా నిర్మించబడిన తర్నాదేవి ఆలయం ఉంది. ఇక్కడి నుండి సుందరమైన లోయల దృశ్యం మనోహరంగా కనిపిస్తుంది.

వ్యవసాయం

[మార్చు]

మండీ సమీపంలో బియాస్ నదీ లోయలు ఉన్నాయి. జిల్లాలోని 15% భూమిలో పండ్లతోటలు ఉన్నాయి. మండిలో ఉత్పత్తి చేయబడుతున్న ముడి పట్టుకు వ్యాపారరీత్యా ముఖ్యత్వం ఉంది. డ్రాంగ్, గుమ తయారు చేయబడుతున్న రాతి ఉప్పు జిల్లా ఆదాయంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. జిల్లాలో రాతిఉప్పు, లైమ్‌స్టోన్ నిలువలే కాక మాగ్నసైట్ కోయల్, చైనా బంకమట్టి ఉన్నట్లు కనుగొనబడింది.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

పర్యాటకులకు కుల్లు, మనాలి, లాహౌల్, స్పితి, ధర్మశాల, కాంగ్రా మొదలైన ప్రదేశాలు చేరుకోవడానికి పఠాన్‌కోట (215 కి.మి), చండీఘడ్ (202కి.మీ), సిమ్లా (150కి.మీ) నుండి బస్సులు ఉన్నాయి. ఈ రహదారి అంతా దాదాపు 300 అడుగుల ఎత్తైన శీలామయమైన కొండల పక్కగా సాగుతూ ఉంటుంది.

ప్రత్యేక సమాచారం

[మార్చు]
  • వైశాల్యం 3,950 చ.కి.మీ.
  • జనాభా 9,01,000.
  • వేసవిలో నేత దుస్తులు, శీతాకాలంలో ఉన్ని, మందపాటి ఉన్ని దుస్తులు ధరిస్తారు.
  • భాష :- హిందీ, ఆంగ్లం, పహరి, మాండ్యలి భాష మాట్లాడం, అర్ధంచేసుకుంటారు. మాండ్యలి భాషను మాట్లాడగలిగిన వారికి పర్యాటక ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి.
  • తహసీళ్ళు: మండి, చచ్యోట్, తంగ్, కర్సంగ్, జోగిందర్నగర్, పధార్, లాడ్‌భడాల్, సుందర్‌నగర్, సర్ఖఘాట్.
  • ఉప తహసీళ్ళు: బలి చోక్, సంధోల్, కోటి, బల్‌ద్వాడా, అట్, నిహ్రి, ఫ్హర్మపూర్.
  • ఉప విభాగాలు: మండి, చచ్యోట్, జోగిందర్నగర్, పధార్, సర్కఘాట్, కర్సంగ్, సుందర్నగర్.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]
  • రైలు:- మండీ జిల్లాకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషను జోగిందర్నగర్, సిమ్లాలో నేరో గేజ్ రైళ్ళు ఉన్నాయి. చండీగడ్, కల్క నుండి బ్రాడ్ గేజ్ వసతులు రైళ్ళు నడుస్తుంటాయి. ఇక్కడి నుండి బసు నిలయాలతో అనుసంధానించబడి ఉన్నాయి. మండీ జిల్లాకు 125 కి.మీ దూరంలో ఉన్న కిరాత్పూర్ రైలునిలయం అతి సమీపంలో ఉన్న రైలు నిలయంగా భావించవచ్చు.
  • రహదారి :- మండిని చేరడానికి సిమ్లా, చండీఘడ్, పఠాన్‌కోట్, ఢిల్లీ నుండి రహదారి మార్గాలు ఉన్నాయి. ఇక్కడి నుండి మనాలి, పాలమూర్, ధర్మశాలను చేరడానికి దినసరి

బసుసేవీసులు ఉన్నాయి. మండీ జాతీయ రహదారి 21 ద్వారా చంఢీగడ్ చేరుకోవచ్చు. మండి, చంఢీగడ్ మద్య దూరం 200 కి.మి. చండీఘడ్ చేరుకోవడానికి రోజంతా ప్రభుత్వబసులు లభిస్తుంటాయి.ఈ ప్రయాణానికి బసు ద్వారా 5-6 గంటల సమయం, ప్రైవేట్ వాహనాల ద్వారా 3-4 గంటలసమయం ఔతుంది. మండీ రహాదారి మార్గంద్వారా హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లా (147కి.మి) చేరుకోవడానికి 5 గంటల సమయం ఔతుంది.

  • విమానం :- మండీ జిల్లాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం కుల్లు జిల్లాలోని భూతనాథ్‌లో (50కి.మి) ఉంది.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

చారిత్రిక పట్టణమైన మండీ, బియాస్ నదీతీరంలో నిర్మించబడింది. దీర్ఘకాలం నుండి ఈ ప్రాంతం ప్రముఖ వాణిజ్యకేంద్రంగా ఉంది. ఇక్కడ మాండవ్య మహర్షి తపమాచరించాడు. ఒకప్పుడు మండీ సంస్థానానికి రాజధానిగా ఉండేది. త్వరితగతిలో అభివృద్ధి చెందుతున్న ఈ పట్టణం తనసహజ గుణం, సౌందర్యాన్ని కాపాడుకుంటూ ఉంది. మండిలో 81 సంవత్సరాల శిలాలయం ఉంది. ఈ ఆలయాలలో అంతులేని శిల్పాల వరుసలు ఉన్నాయి. అందువలన ఇది పర్వతావళిలో ఉన్న కాశీగా గుర్తించబడుతూ ఉంది. ఈ పట్టణంలో పురాతనమైన కోటలు, కాలనీ సంప్రదాయానికి చెందిన కట్టడాలు ఉన్నాయి. మండీ కుల్లు మనాలి లోయలకు ద్వారంగా ఉంది. అలాగే పలు ఉత్సాహభరితమైన విహారాలకూ ఇది కేంద్రంగా ఉంది.

భూతనాథ్ ఆలయం

[మార్చు]

మండీ పట్టణానికి సమానంగా అభివృద్ధి చెందిన భూతనాథ్ పట్టణం మద్యలో భూతనాథ్ ఆలయం ఉంది. ఈ పట్టణం సా.శ. 1520 నుండి ఉనికిలో ఉందని భావిస్తున్నారు. శివరాత్రి సమయానికి ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అంతేకాక సమీపప్రాంతాల నుండి వందలాది దైవాలను భక్తులు అలంకరించిన పల్లకీలలో తీసుకు వస్తూంటారు.

రివాల్సర్ సరసు

[మార్చు]

మండీ నుండి 25 కి.మీ దూరంలో నర్ చోక్ నుండి 14 కి.మీ దూరంలో రేవల్సర్ సరసు ఉంది. ఈ సరసు తేలే రెల్లుగడ్డి ద్వీపాలకు ప్రసిద్ధిచెందింది. ఈ ఏడు ద్వీపాలు ప్రార్థనకు అనువుగా కదులుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడ 3 ఆలయాలు ఉన్నాయి. ఒకటి బౌద్ధస్థూపం, మరొకటి సిక్కుల గురుద్వారా ఇంకొకటి హిందూ ఆలయం ఉన్నాయి. హాలో పర్వతంలో ఉన్న ఈ సరసు 3 మతాలకు చెందిన వారితో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇక్కడ బోటిగ్ సౌకర్యాలు లభిస్తుంటాయి. హిమాచల్ ప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ పర్యాటకులకు భారతీయ భోజనం, నివాస వసతి కల్పిస్తుంది.

ప్రషర్ సరసు

[మార్చు]

మండికి 40కి.మీ దూరంలో ప్రషార్ సరసు ఉంది. ప్రషర్ మహర్షికి అంకితమివ్వబడిన 3 అంతస్తుల పగోడా ఆలయం ఈ సరోవర తీరంలో ఉంది.

జోగిందర్ నగర్

[మార్చు]

జోగిందర్ నగర్‌లో హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్టులో ట్రాలీ పర్యాటకులను 2,500 మీ.ఎత్తున ఉన్న శిఖరాన్ని దాటించి తీసుకు వెళ్ళి అవతలి వైపున రిజర్వాయర్ వద్ద నెమ్మదిగా వదులుతుంది. పవర్ స్టేషను పైభాగానికి రైలు మార్గం కూడా ఉంది. రిజర్వాయర్ నుండి వదిలిన నీరు బరట్ వైపు ఉధృతంగా ప్రవహించి ఉల్ నదిలో కలుస్తుంది. పెంస్టాక్ పైపులు 1,000 మీటర్ల లోతుకు వేయబడి ఉన్నాయి. ట్రాలీలో తీసుకువెళ్ళబడిన ప్స్ర్యాటకుల్లు విశ్రాంతి తీసుకోవడానికి ఎలెక్ట్రిక్‌సిటీ శాఖ నిర్మించిన రెస్ట్‌హౌస్ ఉంది. ఇక్కడి నుండి రహదారి మార్గం కుల్లు జిల్లా వరకు పొడిగించబడింది. బస్సి పవర్ స్టేషను జోగిందర్‌కు 5 కి.మీ దూరంలో ఉంది. ఈ పవర్‌స్టేషను చేపలవేట నిషేధించబడిన పవిత్రమైన మచ్చియల్ అనే ప్రదేశం ఉంది. చేపలకు ఆహారం అందించడం ఇక్కడ ఆచారంగా ఉంది.

లాధ్-భరోల్

[మార్చు]

లాధ్-భరోల్ జోగిందర్ నగరుకు 25 కి.మీ దూరంలో ఉన్న అతిసుందర పట్టణం. ఈ పట్టణానికి 7 కి.మీ దూరంలో సంతాన్ దాత్రి మా, సింసా మాతా మందిర్ ఉంది. ఇక్కడ శివాలయం సమీపంలో నాగేశ్వర్ మహాదేవ్ గుహ (చాలా అద్భుతమైనది) ఉంది. బియాస్, బింవ, ప్రాంతీయంగా ప్రవహిస్తున్న నది ఒకటి సంగమించే ప్రదేశంలో త్రివేణి మహాదేవ్ మందిరం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఆలయపరిసరాలు సమీపంలో కనిపించే త్రివేణీ సంగమదృశ్యంతో అతి రమ్యంగా ఉంటుంది. త్రివేణీ మహాదేవ్ ఆలయం సమీపంలో ఉన్న పర్వతశిఖరం మీద షిమాష్జస్ట్ గ్రామంలో " సంతాన్ ధాత్రి మా షింష (శారదా) ఆలయం ఉంది. ఈ ఆలయంలో నవరాత్రి సమయంలో పిల్లలు లేని స్త్రీలు నిద్రిస్తుంటారు. ఇక్కడ పూజారి ఇచ్చే పండ్లును చూసి పుట్టబోయేది ఆడపిల్ల లేక మగపిల్లవాడు అని నిర్ణయించవచ్చని భక్తులు విశ్వసిస్తుంటారు. నాగేశ్వర్ మహాదేవ్ కుడ్ వద్ద అతి పురాతనమైన సహజసిద్ధమైన శివలింగాలు ఉన్నాయి. వీటిలో శివపార్వతుల ఏకరూపంలో సహజసిద్ధంగా కనిపిస్తున్న శివలింగం ప్రత్యేకత సంతరించుకుంది. అంతేకాక సహజసిద్ధమైన నంది , సహజసిద్ధమైన నాగరాజుతో కలిసి ఉన్న శివలింగం ఇక్కడి ప్రత్యేకతలలో ఒకటి. ఈ శివలింగం కారణంగా ఈ ఆలయానికి నాగేశ్వర్ మందిర్ అనే పేరు వచ్చింది.

సుందర్ నగర్

[మార్చు]

మండీ నుండి 26 కి.మీ దూరంలో సిమ్లా మార్గంలో ఉన్న సుందర్ నగర్ ఆలయాలకు ప్రసిద్ధిచెందునది. సముద్రమట్టానికి 1,174 మీ ఎత్తున ఉన్న పంటభూములతో నిండి ఉన్న లోయ ఇది. సుందర్ నగర్‌లోని ఎత్తైన వృక్షాలమద్య అతి సుందరంగా ఉంటుంది. పర్వతశిఖరం మీద ఉన్న మాయాదేవి ఆలయం , శుకదేవ్ ఆలయానికి ప్రతి సంవత్సరం వేలాది భక్తులు విచ్చేస్తుంటారు. ఆసియాలో బృహత్తర హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ అయిన " బియాస్ సట్లైజ్ ప్రాజెక్ట్ " ఉత్తరభారతదేశంలోని 1/4 వ్యవసాయభూములకు అవసరమైన నీటిని అందిస్తుంది. బియాస్ సట్లైజ్ లింక్ కాలనీ హిమాచల్ ప్రదేశ్ లో అతిపెద్ద కాలనీగా భావించబడుతుంది.

జంజెహిల్

[మార్చు]

మండీ నుండి 80 కి.మి జెంజెహిల్ పర్వతారోహకులకు స్వర్గంగా మారింది. ఈ ప్రదేశం సముద్రమట్టానికి 3,300 మీ ఎత్తున ఉంది. ఈ మార్గం మోటర్ వాహనాలలో పయనించడానికి అనుకూలంగానూ అదే సమయం పర్వాతారోహకులను ఉత్సాహపరిచే విధంగా ఉంది. కర్సంగ్‌తో అనుసంధానితమై ఉన్న ఈ మార్గం శీతాకాలంలో కొన్ని వారాలు తప్ప మిగిలిన కాలమంతా తెరిచే ఉంటుంది. మండీ నుండి బగ్గీ, చైల్ చౌక్ , తునాగ్ (తెహ్సిల్ కేంద్రం) మీదుగా ఇక్కడకు చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది. దట్టమైన అరణ్యం మద్య (గోహర్ నుండి 15 కి.మి దూరంలో) బజహి వద్ద చక్కని వసతులతో ఉన్న " రెస్ట్ హౌస్ " ఉంది. పర్యాటకుల్లు ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. అక్కడి నుండి 20 కి.మీ దూరం వరకు దారి ఇరుకుగా ఉంటుంది. చండి , కర్సంగ్ ప్రదేశాలు ధ్యానం చేయడానికి అనువుగా ఉంటాయి. జన్లెహ్లి పర్వతారోహణ, నైట్‌సఫారి, స్కీయింగ్ వంటి సాహసకృత్యాలకు పేరుపొందింది. జెంజెహ్లీకి 10 కి.మి దూరంలో షికారీ మాత ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధానదైవం షికారీ దేవి. భక్తులు షికారీదేవిని దర్శించడానికి తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడి పర్వతాలు మేఘమాలికల మద్య అద్భుతదృశ్యాలుగా చూపరులను కనువిందు చేస్తుంటాయి. తెహ్సిల్ కేంద్రంగా ఉన్న తుయాంగ్ వద్ద అద్భుతమైన రెస్ట్‌హౌస్ ఉంది. అంటేకాక దేవదార్ వృక్షాలు అధికంగా ఉన్న ఈ ప్రదేశం ఎం.ఎల్.ఎ & గత రాష్ట్ర మంత్రి ఎస్.హెచ్ జై రాం ఠాకూర్ స్వస్థలం అన్నది మరొక ప్రత్యేకత. జన్‌జెల్హి , తుయాంగ్ మద్య ఉన్న సుందర ప్రదేశమే జరోల్.

కొట్లి

[మార్చు]

మండికి 22 కి.మి దూరంలో ఉన్న(మండి-జలంధర్ జాతీయరహదారి - 70) మండీ జిల్లాలోని సబ్ తెహ్సిల్ కొట్లి ఉంది. అర్నోడి " ఖాడ్ " తంగల్ లోయల గుండా ప్రవహిస్తూ బియాస్ నదిలో కున్ కా తార్ వద్ద సంగమిస్తుంది. ఇక్కడ ప్రబలమైన కోట్లి శివాలయం ఉంది. రాచెహ్రా ఆలయం కోట్లి , రాచెహ్రా కొండ, జనిత్రి దేవి ఆలయం (జంత్రి హిల్), ఝగ్రు దేవ్ ఆలయం, కస్ల దేవ్ , కమర్వ దేవ్ ఆలయం (కోట్లి), సర్గని దేవి ఆలయం, మహాన్ దేవ్ ఆలయం, తేజ్ బహదూర్ సింఘ్ ఆలయం, ట్రొక వలి దేవి ఆలయం, నగ్ని దేవి ఆలయం మొదలైన ప్రబల ఆలయాలు ఉన్నాయి. అంతేకాక సైగలూ, మహాదేవ్ , జనిత్రి దేవి ఉత్సవాలలో నిర్వహించబడుతున్న సంతలు కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

రహదార్లు

[మార్చు]
  • మండీ జలంధర్; జాతీయరహదారి 70; జైల్ రోడ్డు మార్గంలో 22 కి.మి దూరంలో ఉంది.
  • మండీ కోటి ; హాస్పిటల్ రోడ్డు మార్గంలో 25 కి.మీ దూరంలో ఉంది.
  • జోహిందర్ నగర్ -కోటి 44 కి.మీ
  • ధరంపూర్ - కోటి 35 కి.మీ.
  • మండీ దవహన్ 29 కి.మీ

మండీ జిల్లాలోని సరసులు

[మార్చు]
  • బిర్ తుంగ
  • నల్హోగ్
  • బార్యార
  • రివల్సర్ సరసు
  • ప్రషర్ సరసు
  • మచ్చిలాల్ సరసు
  • శివ్ సాంభు సరసు

ఆలయాలు

[మార్చు]
  • దవహన్ ఆలయం
  • పిజు పాల్ దేవ్ ఆలయం

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 999,518,[2]
ఇది దాదాపు ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని మోంటానా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో 446వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత 253 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 10.89%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి 1012 : 1000 [2]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 82.81%.[2]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

ఉపవిభాగాలు

[మార్చు]

మండీ జిల్లాలోని గ్రామాలలో ఒకటైన జంఝెలి కుల్లు-మనాలి సమీపంలో భంటర్ విమానాశ్రయానికి 90 కి.మీ దూరంలో, కుల నుండి 67 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ దట్టమైన అరణ్యాలు, సెలఏళ్ళు, పర్వతారోహణా మార్గాలు ఉంటాయి. హిమాచల్ సాంస్కృతిక కేంద్రంగా గుర్తిపు పొందిన షికరీ దేవి ఒక పర్యాటక ఆకర్షణగా, హిమాచల్ సంప్రదాయాలను తెలియచేసే సంప్రదాయక ప్రదేశంగా ఉంది.[5]

క్రీడలు

[మార్చు]

మండీ జిల్లా " బండి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా " [6] ఇది ఐ.ఒ.సి గుర్తింపు పొందింది. [7] " ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బండీ " 2011 ఆసియన్ వింటర్ క్రీడలకు తన బృదాన్ని పంపడానికి ప్రయత్నాలు చేసింది. బండీ క్రీడలలో భారతదేశం పాల్గొనడం ఇదే ప్రథమం.

మూలాలు

[మార్చు]
  1. Lewis, M. Paul (2009). "Mandeali". Ethnologue: Languages of the World, Sixteenth edition. Dallas, TX: SIL International. Retrieved 2009-10-03.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-22. Retrieved 2020-01-15.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-10-04. Retrieved 2014-06-21.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-10-03. Retrieved 2014-06-21.

భౌగోళిక స్థానం

[మార్చు]

వెలుపలి లింకులg

[మార్చు]