కుల్లు జిల్లా
కుల్లు జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | కుల్లు |
మండలాలు | కుల్లు, నిర్మంద్, బంజార్, మనాలి |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,503 కి.మీ2 (2,125 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 3,79,865 |
• జనసాంద్రత | 69/కి.మీ2 (180/చ. మై.) |
• Urban | 7.92% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 63.45% |
• లింగ నిష్పత్తి | 105% |
Website | అధికారిక జాలస్థలి |
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో కుల్లు జిల్లా ఒకటి. జిల్లా దక్షిణ సరిహద్దులో రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్), ఉత్తర సరిహద్దులో రోహ్తంగ్ పాస్ ఉన్నాయి. జిల్లాలోని అతి పెద్ద లోయను కుల్లు లోయ అంటారు. దీనిని " దేవతా లోయ " అని కూడా అంటారు. ఈ లోయ మద్య భాగంలో బియాస్ నదీతీరంలో కుల్లు పట్టణం ఉంది. జిల్లాలోని మరొక లోయ పేరు లగ్ లోయ. ఇక్కడి నుండి ఒప్పందదారులు 150 సంవత్సరాల నుండి నిరంతరంగా కలపను తరలిస్తూనే ఉన్నారు.[1]
ఉత్తరంగా అదనంగా మణలి (హిమాచల్ ప్రదేశ్) ఉంది. కుల్లు పట్టణానికి 12 కి.మీ దూరంలో పురాతన కుల్లు రాజ సంస్థానానికి చెందిన నగ్గర్ కోట ఉంది. 17వ శతాబ్దంలో " రాజా సిధ్ సింగ్ " ఈ కోటను నిర్మించి తన నివాసాన్ని కోటకు మార్చుకున్నాడని (1637-72) భావిస్తున్నారు. దీనిని దుల్తాన్‌పూర్ అని పిలిచారు. ఈ కోటలో " రూపి ప్యాలెస్, పలు ఆలయాలు , పొడవైన అంగడి వీధి ఉన్నాయి.బ్రిటిష్ ప్రభుత్వం 1846లో కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్) , సిక్కుల నుండి కుల్లు స్వాధీనపరచుకున్నారు. ఈ కోటలో ఇప్పటికీ రాజకుటింబీకుల్లు నివసిస్తున్నప్పటికీ పురాతన నగ్గర్ కోటలో చాలాభాగం బ్రిటిష్ ప్రభుత్వానికి విక్రయించబడింది. కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అశాంతి కారణంగా భారతదేశంలోని వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి పర్యాటకుల్లు ఇప్పుడు మణలి , కుల్లు లోయలను వేసవి విహారానికి ఎంచుకుంటున్నారు. జిల్లా తూర్పు భూభాగంలో ఉన్న మనికరన్‌లో సిక్కూ , హిందూ ఆలయాలు , ప్రబల ఉష్ణగుండాలు ఉన్నాయి. ప్రముఖ " హిడింబా దేవి ఆలయం " ఈ జిల్లాలోని మణలి వద్ద ఉంది. జిల్లాలో మనికరన్ సమీపంలో పలు సిక్కు గ్రామాలు ఉన్నాయి. కుల్లు లోయ ఈశాన్యంలో ప్రముఖ మలానా లోయ ఉంది.
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 437,474, [2] |
ఇది దాదాపు | మాల్టా దేశ జనసంఖ్యకు సమానం [3] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 553వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత | 79 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 14.65%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి | 950:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 80.14%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
ప్రత్యేక విశేషాలు
[మార్చు]- కుల్లు జిల్లాలో ఉప విభాగాలు:కుల్లు, అన్ని, బంజర్, మనలి.
- కుల్లు జిల్లాలో తెహ్సిల్స్ : కుల్లు, నిర్మండ్, బంజర్, మనలి, అన్ని.
- కుల్లు జిల్లాలో ఉప- తెహ్సిల్స్ సైంజ్.
- అదనపు సమాచారం కొరకు [1] , కుల్లు జిల్లా అధికారిక వెబ్‌సైట్
చిత్రమాలిక
[మార్చు]-
మణికరణ్, కుల్లు జిల్లా, 2004
-
శివాలయం, కుల్లు, 2004
-
రాజా రూపి కుల్లు ప్యాలెస్, 2004
సరిహద్దులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "History of Ropeways in Kullu". Archived from the original on 2003-05-23. Retrieved 2014-06-21.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Malta 408,333 July 2011 est.