Jump to content

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం

వికీపీడియా నుండి
కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం

བོད་མིའི་སྒྲིག་འཛུགས་
Bod mi'i sgrig 'dzugs / Bömi Drikdzuk
టిబెట్ పతాకం
జండా
టిబెట్ ఎంబ్లెం
ఎంబ్లెం
గీతం: గ్యాలూ
స్థాయిప్రవాస ప్రభుత్వం
కేంద్ర కార్యాలయం176215, ధర్మశాల, కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
అధికారిక భాషలుటిబెటన్
మతం
టిబెటన్ బౌద్ధం
Typeప్రవాస ప్రభుత్వం
ప్రభుత్వం
• సిక్యోంగ్
లోబ్సాంగ్ సంగే
• స్పీకర్
పెమా జంగ్నీ
శాసనవ్యవస్థకేంద్రీయ టిబెట్ ప్రభుత్వ పార్లమెంటు
స్థాపన1959 ఏప్రిల్ 28
ద్రవ్యంIndian rupee (de facto) (INR)

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం (ప్రవాస టిబెట్ ప్రభుత్వం అనేవారు) భారతదేశంలోని ధర్మశాల కేంద్రంగా పనిచేస్తున్న ఎన్నికైన టిబెట్ పార్లమెంటరీ ప్రభుత్వం. దీన్ని ప్రవాస టిబెట్ ప్రజా సంస్థ (ఎక్సైల్ టిబెటన్ పీపుల్స్ ఆర్గనైజేషన్) అని కూడా అంటారు [1] ఇందులో న్యాయవ్యవస్థ, శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖలు ఉంటాయి. 1959 లో ఏర్పడినప్పటి నుండి, ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని చైనా అధికారికంగా గుర్తించలేదు. [2] పార్లమెంటు సభ్యులను, అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం ద్వారాను, "గ్రీన్ బుక్" ను ఉపయోగించి వార్షిక ఆర్థిక సహకారాన్ని అందించడం ద్వారానూ టిబెటన్ ప్రవాసులు, కాందిశీకులూ టిబెట్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రవాస టిబెట్ ప్రభుత్వం అంతర్జాతీయంగా, సంస్థల నుండి, వ్యక్తుల నుండీ కూడా మద్దతును పొందుతుంది.

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వ అంతర్గత నిర్మాణం ప్రభుత్వాన్ని పోలి ఉంటుంది; దీన్ని "టిబెట్‌లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు రూపొందించలేదు" అని పేర్కొంటూ, "టిబెట్‌లో స్వేచ్ఛ పునరుద్ధరించబడిన వెంటనే" టిబెట్ లోపలే టిబెటన్లు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వానికి అనుకూలంగా దీన్ని రద్దు చేస్తాం అని చెప్పింది. [1] రాజకీయ ప్రాతినిధ్యం వహించడంతో పాటు, ఇది నివేదికలు, పత్రికా ప్రకటనలు తయారు చేసి ప్రచురిస్తుంది. ఇది భారతదేశం లోని టిబెటన్ల కోసం పాఠశాలలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నెట్‌వర్కు‌ను నిర్వహిస్తుంది. 1991 ఫిబ్రవరి 11 న, నెదర్లాండ్స్‌లోని హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రవాస టిబెట్ ప్రభుత్వం ప్రాతినిధ్యం లేని దేశాలు, ప్రజల సంస్థ (యుఎన్‌పిఓ) లో వ్యవస్థాపక సభ్యురాలిగా చేరింది. [3] [4]

టిబెట్‌పై అభిప్రాయం

[మార్చు]

టిబెట్ భూభాగాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పరిపాలించడాన్ని చట్టవిరుద్ధమైన సైనిక ఆక్రమణగా కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం భావిస్తుంది. టిబెట్ సుదీర్ఘ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల చరిత్ర కలిగిన ప్రత్యేక దేశం. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అభిప్రాయం భిన్నంగా ఉంది: చైనా బహుళ జాతుల ప్రజల దేశం. టిబెటన్లు గుర్తింపు పొందిన జాతుల్లో ఒకటి. 700 సంవత్సరాలుగా నిరంతరాయంగా చైనా కేంద్ర ప్రభుత్వానికి (చారిత్రికంగా దాని రూపాలన్నిటిలోనూ) టిబెట్‌పై సార్వభౌమాధికారం ఉంటూ వచ్చింది. టిబెట్‌కు స్వాతంత్ర్యం ఎప్పుడూ లేదు. 1912 - 1951 మధ్య కాలంలో ఉందని చెబుతున్న స్వాతంత్ర్యం "ఆధునిక చరిత్రలో చైనాపై దురాక్రమణ చేసిన సామ్రాజ్యవాదుల కల్పన తప్ప మరొకటి కాదు". [5]

2006 లో కేంద్రీయ టిబెట్ ప్రభుత్వపు (గతంలో ప్రవాస టిబెట్ ప్రభుత్వం) సమాచార, అంతర్జాతీయ సంబంధాల విభాగం

నిధులు

[మార్చు]

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వానికి నిధులు ఎక్కువగా టిబెట్ ఫండ్, గ్రీన్ బుక్ ("ప్రవాస టిబెటన్ పాస్‌పోర్టు") ల ద్వారాను, [6] భారతదేశం, యుఎస్ వంటి ప్రభుత్వాల సహాయంతో సేకరించిన ప్రైవేట్ విరాళాల నుండీ వస్తాయి. [7] [8]

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వపు వార్షిక ఆదాయం అధికారికంగా 22 మిలియన్ డాలర్లు (US డాలర్లలో కొలుస్తారు). రాజకీయ కార్యకలాపాలకు (7 మిలియన్లు), పరిపాలనకు (4.5 మిలియన్లు) ఖర్చవుతాయి. అయితే, మైఖేల్ బ్యాక్మన్, ఈ సంస్థ చేసే పనులు చెయ్యడానికి ఈ మొత్తాలు "చాలా తక్కువ"ని, బహుశా మిలియన్ల కొద్దీ విరాళాలు కూడా వస్తూ ఉండి ఉండవచ్చుననీ అన్నాడు . CTA అటువంటి విరాళాలు వచ్చాయని గానీ, వాటికి వనరులు ఫలానా అని గానీ చెప్పదు. [9]

అమెరికా కూడా కొన్ని సమయాల్లో CTA కి నిధులు సమకూర్చింది. ఒక చైనా మూలం ప్రకారం, 1964, 1968 మధ్య, అమెరికా ఏటా 1.735 మిలియన్ డాలర్లు సమకూర్చింది. [10][note 1] అమెరికా వారి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి 1960 లలో సంవత్సరానికి US $ 1.7 మిలియన్లను అందుకున్నట్లు 1998 అక్టోబరులో CTA చెప్పింది. [11]

2012 లో, CTA కి సబ్సిడీ ఇవ్వడానికి గాను అమెరికా, 2002 టిబెటన్ పాలసీ చట్టాన్ని ఆమోదించింది. [12] [13]  2016 లో, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID), CTA కి US $ 23 మిలియన్ల గ్రాంటు ఇచ్చింది. [14]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018 లో CTA కి సహాయాన్ని ఆపాలని 2017 లో ప్రతిపాదించారు. [15] ట్రంప్ ప్రతిపాదనను డెమోక్రటిక్ పార్టీ సభ్యులు నాన్సీ పెలోసి , టామ్ లాంటోస్ మానవ హక్కుల కమిషన్ సహ అధ్యక్షుడు జిమ్ మెక్‌గవర్న్ తీవ్రంగా విమర్శించారు. [16] 2020 ఫిబ్రవరిలో వార్షిక జాతీయ ప్రార్థన అల్పాహార సమావేశానికి ట్రంప్ హాజరైనప్పుడు పెలోసి ఇలా అర్థించింది; "పంచెన్ లామా కోసం, చైనాలోని జైళ్లలో ఉన్న టిబెటన్ బౌద్ధులందరి కోసం, తమ మతాన్ని అనుసరిస్తున్నందుకు గాని గల్లంతైపోయిన వారందరి కోసం ప్రార్థిద్దాం". [17]

ప్రధాన కార్యాలయం

[మార్చు]
లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ అండ్ ఆర్కైవ్స్ 2010 లో

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం ప్రధాన కార్యాలయం హిమాచల్ ప్రదేశ్, ధర్మశాలలోని మెక్లియోడ్ గంజ్‌లో ఉంది. టిబెట్ స్వాధికార ప్రాంతం, కింగాయ్ ప్రావిన్స్, రెండు టిబెట్ అటానమస్ జిల్లాలు, సిచువాన్ ప్రావిన్స్ లోని ఒక టిబెటన్ అటానమస్ కౌంటీ, ఒక టిబెటన్ అటానమస్ ప్రిఫెక్చర్, గన్సు ప్రావిన్స్ లోని ఒక టిబెటన్ అటానమస్ కౌంటీ, యునాన్ ప్రావిన్స్ లోని ఒక టిబెటన్ అటానమస్ ప్రిఫెక్చర్ - ఈ ప్రాంతాలన్నిటి లోని టిబెటన్ ప్రజలందరికీ ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది [18] -ఈ ప్రాంతాలన్నిటినీ కలిపి CTA, "చారిత్రిక టిబెట్" అని పిలుస్తుంది.

భారతదేశంలో సుమారు 1,00,000 మంది దాకా ఉన్న ప్రవాస టిబెటన్ సమాజపు సంక్షేమాన్ని CTA చూస్తుంది. ఇది టిబెటన్ సమాజానికి పాఠశాలలు, ఆరోగ్య సేవలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. చైనా నుండి ఏటా 1,000 మందికి పైగా శరణార్థులు ఇప్పటికీ వస్తూంటారు. [19] వీరంతా సాధారణంగా నేపాల్ ద్వారా వస్తారు. [20]

గ్రీన్ బుక్

[మార్చు]

టిబెట్ వెలుపల నివసిస్తున్న టిబెటన్లు తమ నివాస దేశంలోని కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం కార్యాలయంలో గ్రీన్ బుక్ అనే వ్యక్తిగత పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది సదరు వ్యక్తి సిటిఎకు ఇచ్చిన "స్వచ్ఛంద విరాళాలకు" రసీదు పత్రం. వారి "టిబెటన్ పౌరసత్వానికి" ఇది ఆధారం. [21]

దీని కోసం CTA, "టిబెట్‌లో జన్మించిన ఏ వ్యక్తి అయినా, లేదా తల్లిదండ్రులలో ఒకరు టిబెట్‌లో జన్మించిన వ్యక్తి అయినా" ఆ వ్యక్తి టిబెటన్‌ అని నిర్వచించింది. టిబెటన్ శరణార్థుల వద్ద వారి జన్మస్థలాన్ని ధృవీకరించే పత్రాలు లేనందున, అర్హతను సాధారణంగా ఇంటర్వ్యూ ద్వారా నిర్ధారిస్తారు. [21]

బ్లూ బుక్

[మార్చు]

బ్లూ బుక్ లేదా టిబెటన్ సాలిడారిటీ పార్ట్‌నర్‌షిప్ అనేది కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రాజెక్టు. దీనిలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల టిబెట్ మద్దతుదారులకు సిటిఎ బ్లూ బుక్‌ను అందజేస్తుంది. దీని ద్వారా టిబెటన్ పిల్లలు, శరణార్థులకు సంబంధించిన విద్యా, సాంస్కృతిక, అభివృద్ధికి మానవతా కార్యకలాపాలకూ మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఆర్థిక సహకారాన్ని అందించడానికి ప్రపంచవ్యాప్తంగా టిబెట్ మద్దతుదారులకు వీలు కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సిటిఎ కార్యాలయాలలో ఈ పుస్తకాన్ని జారీ చేస్తారు. [22]

అంతర్గత నిర్మాణం

[మార్చు]
CTA మంత్రివర్గానికి మాజీ ఛైర్మన్, సామ్‌డాంగ్ రిన్‌పోచే, 2006 ఫిబ్రవరిలో, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిధుల సేకరణ విందులో ప్రసంగించారు.

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం ప్రస్తుతం 1991 లో ఆమోదించిన "చార్టర్ ఆఫ్ ది టిబెటన్ ఇన్-ఎక్సైల్" క్రింద పనిచేస్తుంది. [23] కార్యనిర్వహణాధికారం సిక్యాంగ్ (ప్రెసిడెంట్ అని కూడా పిలుస్తారు) వద్ద ఉంటుంది. ప్రస్తుతం 2011 లో ఎన్నికైన లోబ్సాంగ్ సంగె సిక్యాంగ్‌గా ఉన్నాడు. వివిధ శాఖల వ్యవహారాలు చూసే మంత్రుల మంత్రివర్గం సిక్యాంగ్‌కు తోడ్పాటు నిస్తుంది. శాసనాధికారం కేంద్రీయ టిబెట్ ప్రభుత్వ పార్లమెంటు చేతిలో ఉంటుంది.

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వపు ఆర్థిక శాఖలో ఏడు విభాగాలు, అనేక ప్రత్యేక కార్యాలయాలూ ఉంటాయి. 2003 వరకు ఇది, ప్రచురణ, హోటళ్ళు, హస్తకళల పంపిణీ సంస్థలతో సహా 24 వ్యాపారాలను నిర్వహించింది.

డాక్టర్ లోబ్సాంగ్ సంగే, సిటిఐ సిక్యాంగ్ (అధ్యక్షుడు)

1959 లో స్థాపించబడిన సమయంలో, 14 వ దలైలామా కేంద్రీయ టిబెట్ ప్రభుత్వానికి అధిపతి. తరువాతి దశాబ్దాలలో, ప్రజాస్వామ్య పాలన దిశగా క్రమంగా పరివర్తన చెందింది. ప్రవాస పార్లమెంటుకు మొదటి ఎన్నికలు 1960 సెప్టెంబరు 2 న జరిగాయి. ఆ తరువాత దలైలామాతో కార్యనిర్వాహక అధికారాన్ని పంచుకునేందుకు సిక్యాంగ్ కు అధికారం కల్పించారు. సిక్యాంగ్‌ను మొదట దలైలామా నియమించారు. కాని, 2001 నుండి, ఈ స్థానాన్ని టిబెటన్ ప్రవాస ఓటర్లు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటూ వస్తున్నారు. ఎన్నికైన మొట్టమొదటి సిక్యాంగ్, 62 ఏళ్ల బౌద్ధ సన్యాసి, లోబ్సాంగ్ టెన్జిన్ (సామ్‌డాంగ్ రిన్‌పోచే అని పిలుస్తారు). [24] 2011 మార్చి 10 న, దలైలామా ప్రవాస చార్టర్‌లో మార్పులను ప్రతిపాదించాడు. ఈ మార్పుల ప్రకారం సంస్థలో అతడి అధికారాన్ని తొలగిస్తుంది. ఈ మార్పులు 2011 మే 29 న ఆమోదించారు. ఫలితంగా సిక్యాంగ్ అత్యున్నత స్థాయి పదవిగా నిలిచింది. [25]

మంత్రివర్గం

[మార్చు]
ఆర్థిక మంత్రి సెరింగ్ ధొండప్ (ముందు వరుస, ఎడమ నుండి రెండవ) 2013 లో తైవాన్ శాసన యువాన్‌ను సందర్శించారు

మంత్రివర్గం లోని గత సభ్యులలో, కేబినెట్ ఛైర్మన్గా, భద్రతా మంత్రిగా పనిచేసిన దలైలామా పెద్దన్నయ్య గ్యాలో తోండప్, ఆరోగ్య, విద్యా మంత్రిగా పనిచేసిన దలైలామా చెల్లెలు జెట్సన్ పెమా ప్రనుఖులు. [9] అమెరికా లో 14 వ దలై లామా ప్రతినిధిగా పనిచేసిన లోబ్సాంగ్ న్యాండాక్ జాయుల్ [26] వివిధ మట్రివర్గాల్లో సభ్యుడిగా పనిచేసాడు. [27] [28] [29] ప్రస్తుతం అతను టిబెట్ ఫండ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. [30]

  • లోబ్సాంగ్ సంగే - సిక్యాంగ్ (CTA అధ్యక్షుడు)
  • వెన్ కర్మ గెలేక్ యుతోక్ - మత, సాంస్కృతిక శాఖ మంత్రి
  • సోనమ్ తోప్‌గాల్ ఖోర్లాట్‌సాంగ్ - హోంమంత్రి
  • కర్మ యేషి - ఆర్థిక మంత్రి
  • డాక్టర్ పెమా యాంగ్చెన్ - విద్యా మంత్రి
  • ఫగ్పా త్సేరింగ్ లాబ్రాంగ్ - భద్రతా మంత్రి
  • లోబ్సాంగ్ సంగే - సమాచార, అంతర్జాతీయ సంబంధాల మంత్రి
  • చోక్యోంగ్ వాంగ్చుక్ - ఆరోగ్య మంత్రి

ఆవాస శిబిరాలు

[మార్చు]

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం, భారత ప్రభుత్వంతో కలిసి, 2020 నాటికి టిబెటన్ శరణార్థుల కోసం భారతదేశంలో 45 కి పైగా "స్థావరాలను" నిర్మించింది. [31] టిబెటన్ రీ-సెటిల్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ (టిఆర్ఆర్) స్థావరాల స్థాపన 1966 లో ప్రారంభమైంది. [32] : 120, 127–131  దక్షిణ భారతదేశం, డార్జిలింగ్, సిక్కింలలోని : 120, 127–131  స్థావరాలు అధికారికంగా "రక్షిత ప్రాంతాలు" గా ఏర్పడ్డాయి. ప్రత్యేక ప్రవేశ అనుమతి లేనిదే వీటిలో ప్రవేశించే వీలు లేదు.: 120 

మీడియా కార్యకలాపాలు

[మార్చు]

1978 లో మెల్విన్ గోల్డ్‌స్టెయిన్ చేసిన అధ్యయనం, 1983 లో దక్షిణ భారతదేశంలోని ప్రవాస టిబెటన్ కమ్యూనిటీలపై లిన్ పుల్మాన్ చేసిన అధ్యయనం ఇలా చెప్పాయి: CTA ఒక "వెనక్కి వెళ్ళే ఆలోచన" ను కాపాడుకుంటూ, టిబెటన్ సాంస్కృతిక, రాజకీయ జాతీయతా భావనను తీవ్రస్థాయిలో పెంపొందింపజేస్తూ ఆయా సమాజాల్లో ఒక ఆవశ్యకమైన భాగంగా నిలబడేందుకు ఈ వైఖరిని అవలంబించింది [33] : 408–410  [32] : 158–159  టిబెటన్ తిరుగుబాటు దినోత్సవం, టిబెటన్ జాతీయ గీతం, స్థానిక టిబెటన్ భాషా మాధ్యమాలపై CTA నియంత్రణ ద్వారా "టిబెటన్ జాతిని నిర్మూలించే" చైనా ప్రయత్నాల ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా ఇది సాధించిందని ఈ అధ్యయనాలు పేర్కొన్నాయి. : 410–417  : 159–161  1990 ల నుండి, టిబెట్ ప్రవాస పోరాటాన్ని నొక్కిచెప్పడానికి, ప్రవాసంలోను టిబెట్‌లోనూ ఉన్న టిబెటన్ల విధేయతను పొందడానికీ, టిబెటన్ జాతీయతను ప్రోత్సహించడానికీ, యావత్తు టిబెట్ దేశం.పేరున సిటిఎ చట్టబద్ధతను ప్రచారం చేసుకోడానికీ స్థానిక మీడియాతో పాటు హాలీవుడ్ చిత్రాలను కూడా సిటిఎ ఉపయోగించుకుంది. [34]

విదేశీ సంబంధాలు

[మార్చు]

కేంద్రీయ టిబెట్ ప్రభుత్వాన్ని ఏ దేశమూ సార్వభౌమ ప్రభుత్వంగా గుర్తించలేదు. కాని భారతదేశంలోని టిబెటన్ ప్రవాస సమాజంలో చేసే సంక్షేమ పనుల కోసం ప్రభుత్వాల నుండి, అంతర్జాతీయ సంస్థల నుండీ ఆర్థిక సహాయం పొందుతుంది. 

అమెరికా

[మార్చు]

1991 లో, అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యు బుష్ టిబెట్‌ను "ఆక్రమిత దేశం" అని పిలిచే ఒక కాంగ్రెస్ చట్టంపై సంతకం చేశాడు. దలైలామాను, కేంద్రీయ టిబెట్ ప్రభుత్వాన్నీ "టిబెట్ యొక్క నిజమైన ప్రతినిధులు" గా గుర్తించాడు. [35]

1998 అక్టోబరులో, కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం 1960 లలో యుఎస్ ప్రభుత్వం నుండి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా సంవత్సరానికి US $ 1.7 మిలియన్లను అందుకున్నట్లు అంగీకరించింది, [11] వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడానికి, చైనీయులకు వ్యతిరేకంగా గెరిల్లా ఆపరేషన్లను నిర్వహించడానికీ, కార్యాలయాలు తెరవడానికీ, అంతర్జాతీయ లాబీయింగ్ కోసమూ ఈ నిధులను ఉపయోగించింది. కొలరాడోలోని క్యాంప్ హేల్‌లో గెరిల్లా దళానికి శిక్షణ ఇచ్చినట్లు కూడా సమాచారం. [36]

తన పరిపాలనలో, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కేంద్రీయ టిబెట్ ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇచ్చాడు [37] దలైలామాతో నాలుగుసార్లు సమావేశమయ్యాడు [38] - 2015 నాటి వార్షిక జాతీయ ప్రార్థన అల్పాహారంతో సహా. [39]

అంతర్జాతీయ సంస్థలు

[మార్చు]

1991 ఫిబ్రవరి 11 న నెదర్లాండ్స్‌లోని హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో CTA, ప్రాతినిధ్యం లేని దేశాలు, ప్రజల సంస్థకు వ్యవస్థాపక సభ్యురాలు అయింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. చైనీస్: 美国政府的一份解密文件显示,1964至1968年,美国给予达赖集团的财政拨款每年达173.5万美元,其中包括给达赖喇嘛个人津贴18万美元 "A declassified document from the U.S. government shows that from 1964 to 1968, the U.S. financial allocation to the Dalai Group amounted to $1.735 million per year, including a personal allowance of $180,000 to the Dalai Lama."

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Central Tibetan Administration". [Central Tibetan Administration. Archived from the original on 3 August 2010. Retrieved 28 August 2010.
  2. "外交部:中方从来不承认所谓的西藏"流亡政府"" (in చైనీస్). 中国西藏网. 18 March 2016. Archived from the original on 29 September 2017. Retrieved 1 March 2020.
  3. Ben Cahoon. "International Organizations N–W". Worldstatesmen.org. Retrieved 27 November 2011.
  4. "Members". UNPO. Archived from the original on 2 డిసెంబరు 2020. Retrieved 27 November 2011.
  5. "Tell you a true Tibet – Origins of so-called "Tibetan Independence"". National People's Congress of the People's Republic of China. 18 March 2009. Archived from the original on 18 సెప్టెంబరు 2009. Retrieved 27 September 2009.
  6. Fiona McConnell, Rehearsing the State: The Political Practices of the Tibetan Government-in-Exile, p. 138
  7. Namgyal, Tsewang (28 May 2013). "Central Tibetan Administration's Financial Viability". Phayul. Archived from the original on 27 సెప్టెంబరు 2017. Retrieved 27 September 2017.
  8. Central Tibetan Administration. "Department of Finance". Central Tibetan Administration. Retrieved 27 September 2017.
  9. 9.0 9.1 Backman, Michael (23 March 2007). "Behind Dalai Lama's holy cloak". The Age. Retrieved 20 November 2010.
  10. 美印出资养活达赖集团 – 世界新闻报 – 国际在线. gb.CRI.cn (in సరళీకృత చైనీస్). Archived from the original on 8 జూలై 2013. Retrieved 1 October 2017.
  11. 11.0 11.1 "World News Briefs; Dalai Lama Group Says It Got Money From C.I.A." The New York Times. 2 October 1998.
  12. "Tibetan Policy Act of 2002". 2001-2009.State.gov. Retrieved 1 October 2017.
  13. "U.S. government intends to withdraw aid to exiled Tibetans (美政府拟撤销对流亡藏人援助 )". news.dwnews.com (in చైనీస్). 31 May 2017.
  14. "Grant Funding for the Tibetan Exile Community Thanks to USAID – Tibetan Magazine for Tibet News & Issues". ContactMagazine.net. 5 October 2016. Retrieved 1 October 2017.
  15. "Trump administration makes 'tough choices,' proposes zero aid to Tibetans; wants other countries to follow suit". FirstPost.com. 26 May 2017. Retrieved 1 October 2017.
  16. "McGovern: America Must Stand Up for Human Rights in Tibet". 2 May 2017. Retrieved 27 September 2017.
  17. Tibet’s disappeared Panchen Lama remembered in US National Prayer Breakfast, (7 February 2020), Tibetan Review, https://www.tibetanreview.net/tibets-disappeared-panchen-lama-remembered-in-us-national-prayer-breakfast/ Archived 2020-11-01 at the Wayback Machine
  18. "Map of Tibet". Tibet.net. Retrieved 1 October 2017.
  19. "India: Information on Tibetan Refugees and Settlements". United States Bureau of Citizenship and Immigration Services. 30 May 2003. IND03002.ZNY. Retrieved 3 June 2019 – via Refworld.
  20. "Dangerous Crossing" (PDF). The International Campaign for Tibet. 2003. Archived from the original (PDF) on 13 June 2008.
  21. 21.0 21.1 "China: The 'Green Book' issued to Tibetans; how it is obtained and maintained, and whether holders enjoy rights equivalent to Indian citizenship (April 2006)" (Responses to Information Requests (RIRs)). Immigration and Refugee Board of Canada. 28 April 2006. CHN101133.E. Retrieved 3 June 2019 – via Refworld.
  22. "Blue Book: Frequently Asked Questions (Updated 2020)". Central Tibetan Administration.
  23. Staff. "Constitution: Charter of the Tibetans in Exile". Central Tibetan Administration. Archived from the original on 27 January 2010. Retrieved 3 February 2010.
  24. "Snow Lion Publications". Snowlionpub.com. 5 September 2001. Retrieved 27 November 2011.
  25. The CTA's website lists "Head of State" as "Kalon Tripa".
  26. "Protests, Self-Immolation Signs Of A Desperate Tibet". NPR.org (in ఇంగ్లీష్). Retrieved 13 March 2020.
  27. Halper, Lezlee Brown; Halper, Stefan A. (2014). Tibet: An Unfinished Story (in ఇంగ్లీష్). Oxford University Press. ISBN 978-0-19-936836-5.
  28. "Finance Kalon speaks on the financial status of the Central Tibetan Administration". Central Tibetan Administration (in అమెరికన్ ఇంగ్లీష్). 6 October 2005. Retrieved 13 March 2020.
  29. "EU Sidesteps Human Rights to Promote Trade, Says Kalon Lobsang Nyandak". Central Tibetan Administration (in అమెరికన్ ఇంగ్లీష్). 28 July 2005. Retrieved 13 March 2020.
  30. "Harford Community College". www.harford.edu. Archived from the original on 7 ఆగస్టు 2020. Retrieved 13 March 2020.
  31. Punohit, Kunal (24 September 2020). "Tibetan SFF soldier killed on India-China border told family: 'we are finally fighting our enemy'". South China Morning Post. Retrieved 24 September 2020. Choglamsar, one of more than 45 "settlements" – special colonies for Tibetan refugees – constructed by the Central Tibetan Authority (CTA), the Tibetan government-in-exile and Indian authorities.
  32. 32.0 32.1 Pulman, Lynn (1983). "Tibetans in Karnataka" (PDF). Kailash. 10: 119–171.
  33. Goldstein, Melvyn C. (1978). "Ethnogenesis and resource competition among Tibetan refugees in South India: A new face to the Indo-Tibetan interface". In Fisher, James F. (ed.). Himalayan Anthropology: The Indo-Tibetan Interface. Walter de Gruyter. pp. 395–420.
  34. Römer, Stephanie (2008). The Tibetan Government-in-Exile: Politics at Large. Routledge. pp. 150–152.
  35. Goldstein, Melvyn C., The Snow Lion and the Dragon, University of California Press, 1997, p. 119
  36. Conboy, Kenneth; Morrison, James (2002). The CIA's Secret War in Tibet. Lawrence, Kansas: Univ. Press of Kansas. pp. 85, 106–116, 135–138, 153–154, 193–194. ISBN 978-0-7006-1159-1. [citation needs quotation]
  37. His Holiness the Dalai Lama and Former US President Barack Obama Meet in Delhi, Call for Action for World Peace, (2017), https://tibet.net/his-holiness-the-dalai-lama-and-former-us-president-barack-obama-meet-in-delhi-call-for-action-for-world-peace/ Archived 2020-11-03 at the Wayback Machine
  38. Tenzin Gaphel, His Holiness arrives in Washington for annual National Prayer Breakfast, (4 February 2015), https://tibetexpress.net/1051/his-holiness-arrives-in-washington-for-annual-national-prayer-breakfast/
  39. David Jackson, Obama praises Dalai Lama at prayer breakfast, USA TODAY, (5 February 2015), https://usatoday.com/story/news/politics/2015/02/05/obama-national-prayer-breakfast-dalai-lama/22914569/