టిబెట్ స్వాధికార ప్రాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టిబెట్ ఆటోనామస్ రీజియన్ (TAR) (టిబెట్ స్వాధికార ప్రాంతం), సంక్షిప్తంగా టిబెట్, గ్జిజాంగ్ స్వాధికార ప్రాంతంగా కూడా పిలవబడుతుంది. ఇది 1965లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) యొక్క మండల-స్థాయి స్వాధికార ప్రాంతంగా రూపొందించబడింది.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోనే, టిబెట్ స్వాధికార ప్రాంతముగా గుర్తించబడుతుంది. ఇందులో యు-త్సాంగ్ మరియు ఖాం యొక్క పశ్చిమ భాగపు సాంప్రదాయ పరగణాలతో సహా సాంప్రదాయ-సాంస్కృతిక టిబెట్ లో దాదాపు సగభాగం ఉంది. దాని సరిహద్దులు 1950లో టిబెట్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూభాగంతో సుమారుగా సరిపోతాయి. వైశాల్యం దృష్ట్యా టిబెట్ స్వాధికార ప్రాంతము చైనా యొక్క మండల-స్థాయి విభాగములలో గ్జిన్జియాంగ్ తరువాత రెండవ-అతిపెద్ద ప్రాంతము (470,000 sq mi (1,200,000 kమీ2)* పైగా విస్తరించింది). ఇతర స్వాధికార ప్రాంతముల వలె కాకుండా, అక్కడ నివసించే ఎక్కువ మంది ప్రజలు ఆ ప్రాంతానికి చెందిన వారు.

చరిత్ర[మార్చు]

1912 నుండి 1950 వరకు, ప్రస్తుత టిబెట్ స్వాధికార ప్రాంతమును (యు-త్సాంగ్ మరియు పశ్చిమ ఖాంను కలిగి ఉన్నది) దలైలామా నాయకత్వంలోని టిబెట్ ప్రభుత్వము పాలించింది. సాంప్రదాయ-సాంస్కృతిక టిబెట్ లోని ఇతర ప్రాంతములు (తూర్పు ఖాం మరియు ఆండో) పద్దెనిమిదవ శతాబ్దం మధ్య వరకు టిబెట్ ప్రభుత్వ అధికార పరిధిలో లేవు [1]; ప్రస్తుతం అవి క్విన్ఘై, గంసు, సిచుయన్ మరియు యున్నాన్ మండలముల మధ్య సర్దుబాటు చేయబడ్డాయి. (గ్జికాంగ్ మండలం కూడా చూడుము)

1950లో, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కొద్దిపాటి ప్రతిఘటనను అణిచివేస్తూ, టిబెట్ లోని చాండో ప్రాంతంపై దండయాత్ర చేసింది. 1951లో, చైనా సైనికుల ఒత్తిడిపై, టిబెట్ ప్రతినిధులు టిబెట్ పై చైనా సార్వభౌమాధికారాన్ని ధ్రువపరుస్తూ చైనా యొక్క సెంట్రల్ పీపుల్'స్ గవర్నమెంట్ తో ఒక పదిహేడు సూత్రముల ఒప్పందంపై సంతకం చేసారు. కొన్ని నెలల తరువాత లహసలో ఆ ఒప్పందం ఆమోదించబడింది.[2][3] ఆ 17-సూత్రముల ఒప్పందం దలైలామా నాయకత్వంలో ఒక స్వాధికార పాలనను అందించినప్పటికీ, కమ్యూనిస్టు విధానములలో ఒక సమాంతర పాలనా వ్యవస్థను సృష్టించటానికి 1955లో "ప్రిపరేటరీ కమిటీ ఫర్ ది ఆటోనామస్ రీజియన్ ఆఫ్ టిబెట్" (PCART) స్థాపించబడింది. 1959లో దలైలామా భారతదేశానికి వలసవెళ్ళాడు మరియు ఆ 17-సూత్రముల ఒప్పందాన్ని పరిత్యజించాడు. 1965లో PCART టిబెట్ స్వాధికార ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించబడింది, ఆ విధంగా టిబెట్ ను ఒక చైనా మండలంగా అదే చట్ట పరిధిలో ఒక పాలనా విభాగముగా తయారుచేసింది.

టిబెట్ లోకి పాశ్చాత్య ప్రభుత్వపు రహస్య మధ్యవర్తిత్వము 1959 CIA మద్దత్తు ఉన్న తిరుగుబాటుకు ముందే ప్రారంభమైంది. బ్రిటిష్ MI6 ప్రతినిధి సిడ్నీ విగ్నాల్, ఇటీవలి తన జీవితచరిత్రలో, [4] 1955లో జాన్ హారోప్ తో కలిసి తను పర్వతారోహకులుగా నటిస్తూ టిబెట్ వెళ్ళినట్లు వెల్లడించాడు. చైనా అధికారులకు పట్టుబడినప్పుడు, అప్పటికే ఇద్దరు CIA ప్రతినిధులు చైనావారి నిర్బంధములో ఉన్నట్లు తెలిసి తాను ఆశ్చర్యపడ్డానని విగ్నెల్ జ్ఞాపకం చేసుకున్నాడు. కొలరాడోలోని ఒక CIA శిబిరములో శిక్షణ పొందిన టిబెట్ దేశబహిష్కృతులు 1959లో టిబెటన్ నూతన సంవత్సర వేడుకల సమయంలో చైనా బలగములపై దాడిచేశారు. దాని తర్వాత CIA సహకారంతో, 14వ దలైలామా రాజకీయ బహిష్కారానికి గురైన భారతదేశానికి వెళ్ళాడు. 1959 తర్వాత, CIA టిబెట్ గెరిల్లాలకు శిక్షణ ఇచ్చింది మరియు చైనాపై చేసే యుద్ధం కొరకు ధనాన్ని మరియు ఆయుధాలను అందించింది. అయినప్పటికీ, 1970ల మొదలులో రిచర్డ్ నిక్సన్ చైనాతో సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు నిర్ణయించినప్పుడు ఆ ప్రయత్నం ఆగిపోయింది. CIA'స్ సీక్రెట్ వార్ ఇన్ టిబెట్ [5] లో, కెన్నెత్ కాన్బోయ్ మరియు జేమ్స్ మోరిసన్ చైనాకు వ్యతిరేకంగా టిబెటన్ ఉద్యమాన్ని CIA ఏవిధంగా ప్రోత్సహించిందో — మరియు చిట్టచివరకు అప్పుడే రెక్కలు విప్పుతున్న ప్రతిఘటన ఉద్యమాన్ని ఏవిధంగా నియంత్రించగలిగిందో వెల్లడించారు. దలైలామా ప్రభుత్వము 1960లలో CIA నుండి సంవత్సరానికి $1.7 మిలియన్లు అందుకున్నట్లు అంగీకరించింది అని 1998 అక్టోబరు 2న న్యూయార్క్ టైమ్స్ నివేదించింది, కానీ ఆ టిబెటన్ నాయకుడు $180,000 వార్షిక రాయితీ నుండి వ్యక్తిగతంగా లాభపడ్డాడనే నివేదికలను ఖండించింది. ప్రతిఘటన ఉద్యమం కొరకు కేటాయించిన ధనం కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటానికి మరియు చైనాకు వ్యతిరేకంగా జరిగే గెరిల్లా కార్యకలాపములకు చెల్లించటానికి ఖర్చు చేయబడింది అని అజ్ఞాతంలో ఉన్న టిబెటన్ ప్రభుత్వం పేర్కొంది.[6][7]

భౌగోళిక స్థితి[మార్చు]

టిబెట్ స్వాధికార ప్రాంతం భూమిపైన అత్యంత ఎత్తైన ప్రాంతమైన టిబెట్ పీఠభూమిపై ఉంది. టిబెట్ యొక్క ఉత్తర భాగపు ఎత్తులు సుమారు 4,572 metres (15,000 ft) పైగా ఉంటాయి. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్తో టిబెట్ సరిహద్దు పైన ఉంది.

గ్జిన్జియాంగ్, క్విన్ఘై మరియు సిచుయాన్ మొదలైన చైనీస్ ప్రాంతములు ఆ ప్రాంతానికి ఉత్తరము మరియు తూర్పు భాగంలో ఉన్నాయి. చైనాకి దక్షిణ టిబెట్ యొక్క మాక్ మహోన్ రేఖతో సహా దక్షిణంవైపు గణతంత్ర భారతందేశంతో సరిహద్దు తగాదాలు ఉన్నాయి. వివాదాస్పద అక్సై చిన్ భూభాగం పశ్చిమాన ఉంది, మరియు ఆ ప్రాంతంతో దాని సరిహద్దు నిర్వచించబడలేదు. మయన్మార్, భూటాన్ మరియు నేపాల్ దక్షిణం వైపు ఉన్న ఇతర దేశములు. యునాన్ ప్రావిన్స్ తో కూడా టిబెట్ ఒక చిన్న ఆగ్నేయ సరిహద్దును పంచుకుంటోంది.

ఎవరెస్ట్ పర్వతం
యాండ్రోక్ సరస్సు

భౌగోళికంగా, టిబెట్ స్వాధికార ప్రాంతం రెండు భాగములుగా విభజించబడుతుంది. అవి పశ్చిమాన మరియు వాయువ్యంలో "సరస్సు ప్రాంతం" మరియు ఈ ప్రాంతపు తూర్పు, దక్షిణ మరియు పశ్చిమ భాగములు అన్నింటి పైనా విస్తరించిన "నదీ ప్రాంతం". ఈ రెండు ప్రాంతములు హిమాలయముల యొక్క వర్షపాత అవరోధ ప్రాంతములో ఉండటంతో కొద్దిపాటి వర్షపాతాన్ని అందుకుంటాయి, అయినప్పటికీ ఆ ప్రాంతాల పేర్లు వాటి హైడ్రోలాజికల్ నిర్మాణముల మధ్య భేదాన్ని, మరియు సరస్సు ప్రాంతంలో సంచారిగా మరియు నదీ ప్రాంతంలో వ్యవసాయ సంబంధంగా ఉన్న వారి భిన్న సాంస్కృతిక ప్రయోజనములలోని భేదములను ఎత్తి చూపుటలో కూడా ఉపయోగపడతాయి.[8] దీనికి దక్షిణమున హిమాలయములు, ఉత్తరమున విశాలమైన పర్వతములు ఉన్నాయి. ఈ పర్వత వరుసలు ఎక్కడా కూడా సన్ననై ఏక శ్రేణికి చేరవు; అక్కడ సాధారణంగా దాని వెడల్పులో మూడు లేదా నాలుగు వరుసలు ఉంటాయి. ఏక మొత్తంగా ఆ వరుస బంగాళాఖాతంలోకి ప్రవహించే నదులైన – సింధు, బ్రహ్మపుత్ర మరియు సల్వీన్ మరియు దాని ఉపనదులు – మరియు ఉత్తరాన ఉన్న నీరు ఇంకని ఉప్పునీటి సరస్సులలోనికి ప్రవహించే కాలువల మధ్య పరీవాహక స్థలాన్ని ఏర్పరుస్తుంది.

సరస్సు ప్రాంతం లడఖ్ లోని పాన్గాంగ్ త్సో సరస్సు, రక్షస్తల్ సరస్సు, యాండ్రాక్ సరస్సు మరియు సింధు నది జన్మస్థలానికి సమీపంలో ఉన్న మానసరోవర్ సరస్సు నుండి, సల్వీన్, మెకాంగ్ మరియు యాంగ్ట్జే నదుల జన్మస్థానముల వరకు విస్తరించింది. ఇతర సరస్సులలో దాగ్జే కో, నామ్ కో, మరియు పాగ్సం కో మొదలైనవి ఉన్నాయి. ఈ సరస్సు ప్రాంతము నిర్జలమైన మరియు గాలి వీచే ఎడారి ప్రాంతము. ఈ ప్రాంతాన్ని టిబెట్ ప్రజలు చాంగ్ తాంగ్ (బయంగ్ సాంగ్) లేదా 'ఉత్తర పీఠభూమి' అని పిలుస్తారు. ఇది 1100 కిలోమీటర్ల (700 మైళ్ళు) వెడల్పు ఉంటుంది, మరియు సుమారు ఫ్రాన్సుకు సమానమైన వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. మహాసముద్రం నుండి చాలా ఎక్కువ దూరంలో ఉండటం వలన అక్కడ ఒక్క నీటి చుక్క కూడా ఉండదు మరియు అక్కడ ఒక్క నది కూడా లేదు. పర్వత శ్రేణులు విస్తరించి, గుండ్రంగా ఉండి, తక్కువ లోతున్న చదునైన లోయల ద్వారా విడదీయబడతాయి.

నంత్సో సరస్సు

ఈ దేశంలో చిన్న, పెద్ద సరస్సులు అనేకం ఉన్నాయి. ఇవి సాధారణంగా ఉప్పునీటివి లేదా క్షారములు, మరియు కొన్ని కాలువలు వీటిలో కలుస్తాయి. చాంగ్ తాంగ్ పైన అక్కడక్కడ ఉన్న శాశ్వత మంచు కారణంగా, ఆ భూమి బురదగా ఉండి దట్టమైన గడ్డితో ఉంటుంది. దీనితో ఆ ప్రాంతము సైబీరియన్ టండ్రాలను పోలి ఉంటుంది. ఉప్పు నీటి మరియు మంచి నీటి సరస్సులు రెండూ కలిసిపోతాయి. సాధారణంగా ఆ సరస్సులు బయటకు పారటానికి మార్గం ఉండదు, లేదా మురికి నీరు పోవటానికి కేవలం ఒక చిన్న బహిర్మార్గాన్ని కలిగి ఉంటాయి. నిక్షేపములలో సోడా, పొటాష్, బొరాక్స్ మరియు సాధారణ ఉప్పు ఉంటాయి. ఆ సరస్సు ప్రాంతం అనేక వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి చెందింది. ఇవి హిమాలయములకు మరియు 34° ఉత్తరానికి మధ్య ఎక్కువగా వ్యాపించి ఉన్నాయి, కానీ తెంగ్రి నార్ యొక్క పశ్చిమ భాగాన (లహస యొక్క వాయువ్యంలో) మరింత ఎక్కువగా ఉన్నాయి. టిబెట్ యొక్క ఈ ప్రాంతంలో చలి ఎంత అధికంగా ఉంటుందంటే కొన్నిసార్లు ఈ బుగ్గలను మంచు స్తంభములను బట్టి గుర్తించవచ్చు, ఎలాగంటే దాదాపు మరుగుతున్న నీరు పైకి చిమ్మగానే గడ్డకట్టి పోతుంది.

నదీ ప్రాంతములో సారవంతమైన పర్వత లోయలు ఉన్నాయి మరియు యార్లంగ్ త్సాంగ్పో నది (బ్రహ్మపుత్ర యొక్క పై కాలువ) మరియు దాని ప్రధాన ఉపనది అయిన, నయంగ్ నది, సల్వీన్, యాంగ్ట్జే, మెకాంగ్, మరియు ఎల్లో నది ఉన్నాయి. ఈ నదిలోని గుర్రపు లాడం వంపు వలన ఏర్పడిన యార్లంగ్ త్సాంగ్పో కాన్యాన్ ప్రపంచములో అత్యంత లోతైన మరియు అతి పొడవైన పెనులోయ. ఈ ప్రాంతంలో ఈ నది నంచ బర్వా చుట్టూ ప్రవహిస్తుంది.[9] పర్వతముల నడుమ సన్నని లోయలు అనేకం ఉన్నాయి. లహస, షిగట్సే, గ్యాన్త్సే మరియు బ్రహ్మపుత్ర లోయలలో నేల శాశ్వతముగా మంచుతో కప్పబడి ఉండదు, మంచి మృత్తికతో కప్పబడి చెట్ల తోపులను కలిగి ఉంటుంది, మంచి నీటిపారుదలను కలిగి ఉండి, చక్కగా సేద్యం చేయబడుతుంది.

యార్లంగ్ జాంగ్బో నది యొక్క మధ్య మలుపులలో దక్షిణ టిబెట్ లోయ ఏర్పడింది. ఇక్కడ ఈ నది పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తుంది. ఆ లోయ సుమారు 1200 కిలోమీటర్ల పొడవు మరియు 300 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ లోయ సముద్ర మట్టము పైన 4500 మీటర్ల నుండి 2800 మీటర్ల క్రిందకి దిగుతుంది. ఆ లోయకు ఇరువైపులా ఉన్న పర్వతములు సుమారు 5000 మీటర్ల ఎత్తు ఉంటాయి.[10][11] ఇక్కడి సరస్సులలో పైకు సరస్సు మరియు ప్యూమా యంకో సరస్సు ఉన్నాయి.

ప్రభుత్వం[మార్చు]

టిబెట్ స్వాధికార ప్రాంతం పీపుల్'స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ఒక మండల-స్థాయి అస్తిత్వము. దీనిని ఛైర్మన్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వము పాలిస్తోంది. అయినప్పటికీ, ఆచరణలో ఛైర్మన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క శాఖాధికారికి తాబేదారుడు. ఒక ఆచారముగా, ఛైర్మన్ ఎల్లప్పుడూ ఒక టిబెట్ జాతీయుడు కాగా, పార్టీ సెక్రటరీ ఎల్లప్పుడూ టిబెట్ జాతీయుడు కాకుండా ఉంటాడు. ప్రస్తుత ఛైర్మన్ పద్మ చోలింగ్ మరియు ప్రస్తుత పార్టీ సెక్రటరీ జాంగ్ క్విన్గ్లీ.[12]

పరిపాలనా విభాగాలు[మార్చు]

టిబెట్ స్వాధికార ప్రాంతం ఒక మండల-స్థాయి నగరం మరియు ఆరు మండలములుగా విభజించబడింది.

పటం # పేరు హాంజీ హాన్యు పిన్యిన్ Tibetan Wylie Administrative Seat
Xizang prfc map.png
— Prefecture-level city —
5 లాసా 拉萨市 Lāsà Shì ལྷ་ས་གྲོང་ཁྱེར་ Lha-sa Grong-khyer Chengguan District
— Prefecture —
1 న్గారి 阿里地区 Ālǐ Dìqū མངའ་རིས་ས་ཁུལ་ Mnga'-ris Sa-khul Gar County
2 నాగ్‌కు 那曲地区 Nàqū Dìqū ནག་ཆུ་ས་ཁུལ་ Nag-chu Sa-khul Nagqu County
3 కామ్‌దో 昌都地区 Chāngdū Dìqū ཆབ་མདོ་ས་ཁུལ་ Chab-mdo Sa-khul Qamdo County
4 షిగాజె 日喀则地区 Rìkāzé Dìqū གཞིས་ཀ་རྩེ་ས་ཁུལ་ Gzhis-ka-rtse Sa-khul Xigazê
6 షానన్ 山南地区 Shānnán Dìqū ལྷོ་ཁ་ས་ཁུལ་ Lho-kha Sa-khul Nêdong County
7 న్యింగ్‌చి 林芝地区 Línzhī Dìqū ཉིང་ཁྲི་ས་ཁུལ་ Nying-khri Sa-khul Nyingchi County

ఇవి తిరిగి మొత్తం డెబ్భై-ఒక్క తాలూకాలు, ఒక జిల్లా (చెంగ్యుయాన్ డిస్ట్రిక్ట్, లహస) మరియు ఒక తాలూకా-స్థాయి నగరము (గ్జిగజే) గా పునర్విభజించబడ్డాయి.

జనాభా[మార్చు]

టిబెట్ స్వాధికార ప్రాంతం చైనా యొక్క మండల-స్థాయి ప్రాంతములన్నింటిలో అతి తక్కువ జన సాంద్రత కలిగి ఉంది. దీనికి ముఖ్య కారణం దాని పర్వత ప్రాంతములు మరియు కఠినమైన భౌగోళిక పరిస్థితులు.

2008లో టిబెట్ జనాభా 5.4 మిలియన్లు.[13] జనాభా[14]లో 92.8% ఉన్న సాంప్రదాయ టిబెటన్లు, ముఖ్యంగా టిబెటన్ బౌద్ధమతము మరియు బాన్ ను అనుసరిస్తారు, అయినప్పటికీ అక్కడ సాంప్రదాయ టిబెటన్ ముస్లిం సంఘం ఉంది.[15] హ్వీ మరియు సలార్ వంటి ఇతర ముస్లిం సాంప్రదాయ వర్గములు చాలాకాలం క్రిందటే టిబెట్ స్వాధికార ప్రాంతంలో నివసిస్తున్నారు. టిబెటన్ బౌద్ధమతం మరియు క్షుద్ర పూజల మిశ్రమాన్ని అనుసరించే మోన్ప మరియు ల్హోబ వంటి చిన్న గిరిజన వర్గములు, ఆ ప్రాంతం యొక్క ఆగ్నేయ భాగాలలో ఎక్కువగా కనిపిస్తారు.

TAR లోని హాన్ చైనీస్ లో అనేక మంది (మొత్తం జనాభాలో 6.1%) [14] ఇటీవల వలస వచ్చినవారు, ఎందుకనగా హాన్ లు అందరూ బ్రిటిష్ దండయాత్ర తర్వాత PRC స్థాపన వరకు ఔటర్ టిబెట్ నుండి బహిష్కరించబడ్డారు.[16] TAR ను క్విన్ఘై ప్రావిన్స్ తో కలిపే క్వింగ్జాంగ్ రైల్వే 2006లో పూర్తి అయినప్పటినుండి, హాన్ వలసలు పెరుగుతాయని సాంప్రదాయ టిబెట్ మద్దత్తుదారులు భయపడ్డారు.[17]

టిబెట్ లోని పట్టణములు మరియు గ్రామములు[మార్చు]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

పొలం దున్నుతున్న ఒక టిబెట్ రైతు; టిబెట్ లో ఇప్పటికీ జడల బర్రెలే పొలాలు దున్నుతాయి

టిబెట్ వాసులు జీవనోపాధి కొరకు వ్యవసాయంపై ఆధారపడతారు. అయినప్పటికీ, 1980లలో, చైనీస్ ఆర్థిక సంస్కరణ తరువాత టాక్సీ నడపటం మరియు హోటల్ టోకు పని వంటి ఇతర ఉపాధులు అందుబాటులోకి వచ్చాయి. 2009లో, టిబెట్ యొక్క నామకార్ధ GDP 44.1 బిలియన్ యుయాన్ (US$6.5 బిలియన్) పతాక స్థాయికి చేరుకుంది, ఇది 2000లోని 11.78 బిలియన్ యుయాన్ (US$1.47 బిలియన్) లకు సుమారు నాలుగు రెట్లు ఎక్కువ. గత ఐదు సంవత్సరాలలో, టిబెట్ యొక్క వార్షిక GDP సరాసరి 12% పెరిగింది.

సాంప్రదాయక వ్యవసాయము మరియు పశు పోషణ ఆ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తుండగా, 2005లో దాని GDP పెరుగుదలలో సగానికి పైగా తృతీయ రంగ సహకారం ఉంది. మొదటిసారి ఇది ఆ ప్రాంతపు ప్రాథమిక పరిశ్రమను అధిగమించింది.[18][19] వసంత ఋతువు చివరలో / వేసవి ప్రారంభంలో పోగయ్యే జీడిపురుగు నాచు (కార్డీసెప్స్ సైనెన్సిస్, టిబెటన్ లో యార్త్స గుంబుగా ప్రసిద్ధమైంది) అనేక ప్రాంతములలో గ్రామీణ కుటుంబములకు అతి ముఖ్యమైన మూల రాబడి. ఇది గ్రామీణ ధన ఆదాయానికి సరాసరి 40% మరియు TAR యొక్క GDP కి 8.5%ను అందిస్తుంది.[20] నతులా రహదారి (భారతదేశంతో దక్షిణ టిబెట్ సరిహద్దుపైన) యొక్క పునః ప్రారంభము సినో-ఇండియన్ సరిహద్దు వ్యాపారానికి వీలు కల్పించాలి మరియు టిబెట్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి.[21]

2008లో, చైనా వార్తా మాధ్యమము టిబెట్ లోని నగర మరియు గ్రామ వాసుల తలసరి వినియోగార్హ ఆదాయములు వరుస క్రమంలో సరాసరి 12,482 యుయాన్ (US$1,798) మరియు 3,176 యుయాన్ (US$457) ఉంటాయి.[22]

టిబెట్ స్వాధికార ప్రాంతంతో సహా, పశ్చిమ చైనాలో ఆర్థికాభివృద్ధిని పెంచటానికి కేంద్ర ప్రభుత్వము 2000లో చైనా పాశ్చాత్య అభివృద్ధి విధానమును అనుసరించింది.

 • లహస ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధి మండలి

పర్యాటకరంగం[మార్చు]

TAR రాజధాని, లహాసలోని పాటల ప్యాలెస్

టిబెట్ స్వాధికార ప్రాంతమును సందర్శించటానికి 1980లలో యాత్రికులకు మొదటిసారి అనుమతి లభించింది. లహసలోని పోటల ప్యాలెస్ ముఖ్య ఆకర్షణ కాగా, జోఖాంగ్ దేవాలయము, నంత్సో సరస్సు, మరియు తషిల్హంపో విహారముతో సహా అక్కడ పలు ఇతర ప్రముఖ యాత్రా స్థలములు ఉన్నాయి. కొన్ని ప్రదేశములలో ఇప్పటికీ యాత్రికులకు అనుమతి లేదు.

విమానాశ్రయాలు[మార్చు]

లహస గాన్గార్ విమానాశ్రయము, [23] క్వామ్డో బంగ్డా విమానాశ్రయము, నయింగ్చీ విమానాశ్రయము, మరియు గుంస విమానాశ్రయము టిబెట్ లోని పౌర విమానాశ్రయములు.

నగరి మండలంలోని గుంస విమానాశ్రయము 2010 జూలై 1 న కార్యకలాపములు ప్రారంభించి, చైనా యొక్క టిబెట్ స్వాధికార ప్రాంతములో నాలుగవ పౌర విమానాశ్రయము అయింది.[24]

గ్జిగాజే మండలం కొరకు నిర్మించబడుతున్న పీస్ విమానాశ్రయము 2010 ముగిసేలోపు పూర్తి కావలసి ఉంది.[25]

సముద్ర మట్టానికి 4,436 మీటర్ల ఎత్తులో నిర్మించబడుతున్న నగ్క్వు డగ్రింగ్ విమానాశ్రయము 2011 నాటికి ప్రపంచములోనే ఎత్తైన విమానాశ్రయము అవుతుందని అంచనా.[26]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • టిబెట్ చరిత్ర (1950-ప్రస్తుతం)
 • చైనా టిబెటాలజీ పరిశోధనా కేంద్రం
 • టిబెట్ లోని విశ్వ విద్యాలయములు మరియు కళాశాలల జాబితా

గమనికలు[మార్చు]

 1. గ్రన్ఫెల్డ్, A. టాం, ది మేకింగ్ ఆఫ్ మోడరన్ టిబెట్, M.E. షార్ప్, p245.
 2. గ్యాట్సో, టెంజిన్, దలైలామా XIV, ముఖాముఖీ, 25 జూలై 1981.
 3. గోల్డ్ స్టీన్, మెల్విన్ C., అ హిస్టరీ ఆఫ్ మోడరన్ టిబెట్, 1913-1951 , యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1989, p. 812-813.
 4. [అ స్పై ఆన్ ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్]
 5. మొర్రిసన్, జేమ్స్, ది CIA'స్ సీక్రెట్ వార్ ఇన్ టిబెట్, 1998.
 6. http://query.nytimes.com/gst/fullpage.html?res=9C0CEFD61538F931A35753C1A96E958260 Dalai Lama Group Says It Got Money From C.I.A. మార్చి 29, 2008 న పొందుపరచబడింది
 7. http://www.fpif.org/briefs/vol5/v5n09tibet_body.html Archived 2006-09-06 at the Wayback Machine. - Reassessing Tibet Policy http://www.fpif.org/pdf/vol5/09iftibet.pdf Archived 2006-10-25 at the Wayback Machine. (same)
 8. "Tibet: Agricultural Regions". మూలం నుండి 2007-08-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-08-06. Cite web requires |website= (help)
 9. "The World's Biggest Canyon". www.china.org. Retrieved 2007-06-29. Cite web requires |website= (help)
 10. Yang Qinye and Zheng Du (2004). Tibetan Geography. China Intercontinental Press. pp. 30–31. ISBN 7508506650. http://books.google.com/?id=4q_XoMACOxkC&pg=PA30&dq=%22South+Tibet+Valley%22. 
 11. Zheng Du, Zహాన్g Qingsong, వు Shaohong: మౌంటైన్ జియోఎకాలజీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది టిబెటన్ ప్లేటో (Kluwer 2000), ISBN 0-7923-6688-3, p. 312;
 12. "Leadership shake-up in China's Tibet: state media". France: France 24. Agence France-Presse. 2010-01-15. మూలం నుండి 2010-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-29. Cite news requires |newspaper= (help)
 13. http://ngm.nationalgeographic.com/geopedia/China#China%20by%20the%20Numbers
 14. 14.0 14.1 BBC News http://news.bbc.co.uk/2/shared/spl/hi/guides/456900/456954/html/nn5page1.stm. Missing or empty |title= (help)
 15. హాన్nue, డైలాగ్స్ టిబెటన్ డైలాగ్స్ హాన్
 16. Grunfeld, A. Tom (1996). The Making of Modern Tibet. East Gate Books. pp. 114–119.
 17. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-11-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-08. Cite web requires |website= (help)
 18. Xinhua - Per capita GDP tops $1,000 in Tibet
 19. Tibet posts fixed assets investment rise
 20. Winkler D. 2008 యార్త్స గుంబు (Cordyceps sinenis) and the fungal commodification of rural Tibet. Economic Botany 62.3. See also హాన్nue, Dialogues Tibetan Dialogues హాన్
 21. హిమాలయముల మీదుగా చైనా మరియు ఇండియా వ్యాపారము | ప్రపంచ వార్తలు | ది గార్డియన్
 22. టిబెటన్ల రిపోర్ట్ ఆదాయం పెరిగింది
 23. http://news.xinhuanet.com/english/2009-05/12/content_11357826.htm Gongkhar Airport in Tibet enters digital communication age
 24. [1]
 25. 2010 సంవత్సరం చివరి నాటికి టిబెట్ ఐదవ పౌర విమానాశ్రంయమును నడిపించాలి
 26. ప్రపంచములో అతి ఎత్తైన విమానాశ్రయము టిబెట్ లో కట్టాలని యోచించబడింది

మరింత చదవటానికి[మార్చు]

 • హనూ, డైలాగ్స్ టిబెటన్ డైలాగ్స్ హాన్, టిబెట్ యాత్రా విశేషములు - ఒక దశాబ్దానికి పైగా టిబెట్ చుట్టూ ప్రయాణిస్తున్న ఒక మహిళ రచించినది, ISBN 978-988-97999-3-9
 • సోరెల్ విల్బీ, జర్నీ అక్రాస్ టిబెట్: అ యంగ్ ఉమన్'స్ 1900-మైల్ ట్రెక్ అక్రాస్ ది రూఫ్ టాప్ ఆఫ్ ది వరల్డ్, కంటెంపరరీ బుక్స్ (1988), హార్డ్ కవరు, 236 పేజీలు , ISBN 0-8092-4608-2.

బాహ్య లింకులు[మార్చు]