చైనీస్ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైనీస్
సంప్రదాయ చైనీస్ లిపిలో రాసిన హాన్యు (చైనీస్) (పైన), సరళీకరించిన చైనీస్ లిపిలో (మధ్యలో) ప్రత్నామ్నాయ పద్ధతిలో (కింద)
స్థానిక భాషచైనా, తైవాన్, సింగపూర్
స్వజాతీయతహాన్ చైనీస్
స్థానికంగా మాట్లాడేవారు
(1.2 బిలియన్ cited 1984–2001)
సినో-టిబెటన్
 • సినిటిక్
  • చైనీస్
ప్రామాణిక రూపాలు
ప్రామాణిక చైనీస్
కంటోనీస్
ప్రాంతీయ రూపాలు
 • మాండరిన్
 • జిన్
 • వు (షాంఘైనీస్ సహా)
 • హుయ్ జు
 • గాన్
 • జియాంగ్
 • మిన్ (అమోయ్ , టియోచూ, ఫుజావూ సహా)
 • హక్కా
 • యూ (కంటోనీస్, తైషనీస్ సహా)
 • పింగ్
సరళీకరించిన చైనీస్
సంప్రదాయిక చైనీస్

లిప్యంతరీకరణలు:
బోపోమోఫో
పిన్యిన్
జియార్జింగ్
డంగన్
చైనీస్ బ్రెయిలీ
అధికారిక హోదా
అధికార భాష
చైనా, మకావ్, హాంగ్ కాంగ్, సింగపూర్, తైవాన్
నియంత్రణనేషనల్ కమీషన్ ఆన్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ వర్క్ (చైనా)[1]
నేషనల్ లాంగ్వేజెస్ కమిటీ (తైవాన్)
సివిల్ సర్వీస్ బ్యూరో (హాంగ్ కాంగ్)
ప్రమోట్ మాండరీన్ కౌన్సిల్ (సింగపూర్)
చైనీస్ లాంగ్వేజ్ స్టాండర్డైజేషన్ కౌన్సిల్ (మలేసియా)
భాషా సంకేతాలు
ISO 639-3

చైనీస్ భాష అన్నది సినో-టిబెటన్ భాషా కుటుంబంలో విభాగం, ఒకదానికొకటి సంబంధం కలిగివుండి కూడా ఒక్కోసారి ఒక భాష మరో భాష వారికి అర్థం కాని స్థితిలోని భాషల గుంపు. చైనాలోని సంఖ్యాధిక్య హాన్లు, ఇతర జాతుల వారూ మాట్లాడుతూంటారు. దాదాపు 120 కోట్లమంది జనం ఏదోక చైనీస్ భాషా రూపాన్ని తమ మాతృభాషగా కలిగి ఉన్నారు. ఈ భాషను మాతృభాషగా కలవారు ప్రపంచం జనాభాలో 16 శాతం కలిగివున్నారు

చైనీస్ భాషా రూపాలను స్థానికులైన భాషా వ్యవహర్తలు సాధారణంగా ఒకే చైనీస్ భాషకు గల వివిధ మాండలీకాలు అని భావిస్తున్నా, భాషావేత్తలు మాత్రం అవి భాషా కుటుంబం ఎంత వైవిధ్యంగా ఉంటుందో అంత వైవిధ్యంగా ఉంటుంది[2]}} చైనీస్ లోని అంతర్గత వైవిధ్యం, రొమానిక్ భాషలతో పోలుస్తూంటారు, కానీ రొమానిక్ ని మించి ఈ వైవిధ్యం చైనీస్ లో ఉంటుంది. చైనీస్ లో 7 నుంచి 13 ప్రాంతీయ గ్రూపులు ఉండగా, వారిలో ప్రధానంగా ఎక్కువమంది మాండరిన్ (960 మిలియన్లు), ఆ తర్వాత యీ (80 మిలియన్లు), మిన్ (60 మిలియన్లు) మాట్లాడుతూంటారు. జియాంగ్, కొంతవరకూ నైఋతి మాండరీన్ మాండలీకాలు ఒకేలాంటి పదాలు పంచుకోవడం ఉన్నా చాలావరకూ ఈ గ్రూపుల్లో ఒకరి భాష/మాండలీకం ఒకరికి అర్థం కావు.

ప్రామాణిక చైనీస్ (పుటోంఘువా/గుయోయు/హ్యుయాయు) మాండరీన్ యొక్క బీజింగ్ మాండలీకం ఆధారం చేసుకుని ప్రామాణీకరించిన చైనీస్.  చైనాతైవాన్ దేశాల్లో ఇది అధికారిక భాష కాగా సింగపూర్ దేశంలోని నాలుగు అధికారిక భాషల్లో ఒకటి. అమెరికా ఆరు అధికారిక భాషల్లో ఇది ఒకటి. ప్రామాణిక భాషను రాసే పద్ధతిని చైనీస్ లిపి అంటూంటారు, ఒక్కో అక్షరం ఒక్కో శబ్దాన్ని కాక పదాన్ని సూచించే లోగోగ్రామ్ పద్ధతిలో ఉంటుంది. దీన్ని మరి ఏ ఇతర విధంగానూ ఒకరికొకరి పదాలు అర్థం కాని చైనీస్ భాషా వ్యవహర్తల్లో అక్షరాస్యులు ఉపయోగిస్తూంటారు. అయితే ఒక్కో అక్షరాన్ని తమ తమ భాషల్లోని పదాలుగా చదువుకుంటూంటారు.

ఇతర చైనీస్ రకాల్లో కంటోనెస్ హాంగ్ కాంగ్, మకావ్ లలో విస్తృతంగా మాట్లాడే భాష, ఆ ప్రాంతాల అధికారిక భాష. గువాంగ్ డాంగ్ ప్రావిన్సులోనూ, గువాంగ్జి ప్రావిన్సులో ప్రధాన భాగంలోనూ చాలా ప్రభావం కలిగివుంది కంటోనెస్. అలానే విదేశాల్లోని చైనీయులు కూడా ఎక్కువగా ఈ మాండలీకాన్ని వాడతారు. దక్షిణాది మిన్ మాండలీకాలు, మిన్ గ్రూపులో భాగం. ఈ మాండలీకాల్లో దక్షిణ ఫుజియన్ ప్రాంతంలో విస్తారంగా మాట్లాడతారు. చెప్పుకోదగ్గ మార్పుచేర్పులతో వీటిని తైవాన్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో మాట్లాడతారు. హక్కా మాండలీకాన్ని కూడా తైవాన్, ఆగ్నేయాసియాలోని డయాస్పోరాలో వినియోగిస్తారు. షాంఘైనీస్ సహా ఇతర వు మాండలీక రకాల్లో తూర్పు చైనాలోని కింది యంగ్త్జ్ ప్రాంతంలో విస్తృతంగా మాట్లాడతారు.

మండారిన్ సైనిన్

References

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. china-language.gov.cn
 2. Mair (1991), pp. 10, 21.