ముదిరాజు

వికీపీడియా నుండి
(నాయకులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ముదిరాజు : తెలంగాణా బీసీ కులాల జాబితా బి.సి.డి.గ్రూపు లోని 19వ కులం. ముదిరాజ్‌ దాదాపు కోటి జనాభా ఉంటుందని అంచనా.

చరిత్ర[మార్చు]

ముదిరాజులు పల్లవ రాజులకు సామంతులుగా క్రీస్తు శకం 655 - 851 మధ్య తమిళనాడు రాష్ట్రంలో తంజావూర్, తిరుచి, పుదుకొత్తై, పెరంబలూరు, తిరువారూరు, నాగపట్టియాన్, దిందిక్కల్, కరూర్ మరియు మధురై జిల్లాలను పాలించారు. వీరు కాకతీయ సాళువ పల్లవ రాజ వంశీకులని అంటారు. వెలమ రాజులకు, పల్లవ రాజులకు సైనికులుగా పనిచేశారు. కొంతమంది వీరు క్రీస్తు శకం 3వ శతాబ్దానికి 6 వ శతాబ్దానికి మధ్య తమిళనాడు ప్రాంతాన్ని పాలించిన కలబ్ర రాజుల వంశస్తులని అంటారు. ముదిరాజ్ లు క్షత్రియ వర్ణానికి చెందినవారని కొంతమంది అభిప్రాయం. ముదిరాజులను ముత్తరాసు, ముత్తరాచు, ముతరాచు, ముత్రాసి పేర్లతో కూడా పిలుస్తారు. తెలంగాణలో వీరు కాకతీయులుగా పిలవబడుతున్నారు. పల్లవులు కురుమ కులానికి చెందినారని చరిత్ర గ్రంథాలు తెలుపుతున్నాయి .ఊదా:- Madras Census Report, 1891. — "The Kurumbas

or Kurrubas are the modern representatives of the ancient Kurumbas or Pallavas, who were once so power- full throughout Southern India, but very little trace of their greatness now remains. In the seventh century, the power of the Pallava kings seems to have been at its zenith ; కాకతీయులు యాదవులని ఆనాటిి కాసే సర్వప్ప వ్రాసిన శితత్వసారం తెలుపుతున్నది.సాళువ వంశీయులు యాదవులని వరహపురాణం, సాళువాభ్యుధయం గ్రంథాలు, వారి శాసనాలు తెలుపుతున్నాయి.

సమకాలీనం[మార్చు]

ముదిరాజ్‌ లను తెలుగోళ్లు, తెనుగోళ్లు, బంటు, మత్తరాసి, ముతరాచ, కోలీలు, కావలికార్‌, నాయకులు, పాలయగార్ ‌, మస్కూరీలు, buttariవతన్‌దార్లు ... ఇలా చాలా పేర్లు ఈ కులస్థులకున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుంది. నల్గొండ జిల్లాలో బంటు 'గా పిలువబడుతున్న వీరు మత్స్య కార్మికులుగా జీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో `ముదిరాజు లు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీరు తెనుగు. రాష్ర్టంలో మత్స్యకారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. అటు వంటి 30 కులాలకు చేపలు పట్టుకునే హక్కును కల్పిస్తూ ప్రభుత్వం 1964లో జీఓ విడుదల చేసింది. ఈ ముప్పయి కులాలలో తెనుగు, కోలి, ముత్తరాసి, ముత్తరాచ, బంటు కులాలు కూడా ఉన్నాయి. మొదటి రాజులు మానవ జాతిని పరిపాలిఛిన మొదటి రాజులు ముదిరాజులు.ముదిరాజ్ లు పాండవుల వంశానికి చెందిన వారని చెపుతారు.పాండవులు ఆర్య జాతికి చెందిన వారు అని అంటుంటరు

ముదిరాజ్ పేరు పుట్టుక అసలు కథ[మార్చు]

ముదిరాజులు స్థానిక నాగ జాతికి చెందిన వారని చరిత్రకారుల అభిప్రాయం. మూల ద్రావిడ జాతి వారని భీమనాధుని శ్రీనివాస్ గారి అభిప్రాయం. చేపలు పట్టుకోవడం, పండ్లు అమ్ముకోవడం వీరి ప్రధాన వృత్తి. ఎక్కువమంది చేపలుపట్టి, వాటిని అమ్మటమే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. తెలంగాణ జిల్లాలలో 3,700 ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 2,800 మత్స్యసహకార సంఘాలు ముదిరాజులవే. గతంలో ముదిరాజ్‌లు అటవీ సంపదపై ఆధారపడి జీవిం చేవారు. ఇప్పుడు పట్టణాలు, గ్రామాలలో చిన్నచిన్న వ్యాపా రాలు చేసుకుంటూ బతుకుతున్నారు. . రాష్ర్ట ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ ‌. మరియు శాసనసభ సభ్యులు మరయు మంత్రి ఈటెల రాజేందర్, ముదిరాజ్ యూత్ లీడర్ పల్లెటి సింగయ్యముదిరాజ్, కొంతమంది ప్రముకులు ఉన్నారు .

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ముదిరాజు&oldid=2658804" నుండి వెలికితీశారు