సట్లెజ్ నది
Jump to navigation
Jump to search
ఐదునదులు ప్రవహించే భూమిగా పేరుపొందిన పంజాబ్‌లో ప్రవహించే ఐదు నదులలో పెద్దదైన సట్లెజ్ నది వింధ్య పర్వతాలకు ఉత్తరాన, హిందూకుష్, హిమాలయా పర్వతాలకు దిగువన భారతదేశం, పాకిస్తాన్ లలో ప్రవహిస్తుంది. టిబెట్టులోని కైలాస పర్వత శిఖరాలలో జన్మించి, పశ్చిమ నైరుతి దిక్కులలో ప్రవహించి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ పంజాబ్ రాష్ట్రంలో బియాస్ నదిలో కలుస్తుంది.బియాస్ నది సింధూనదికి ఉపనది. చివరికి సింధూనది పాకిస్తాన్ గుండా ప్రవహించి అరేబియా సముద్రములో కలుస్తుంది.
భారతదేశంలో ప్రముఖ బహుళార్థసాధక ప్రాజెక్టులలో ఒకటైన భాక్రానంగల్ ప్రాజెక్టును ఈ నదిపైనే నిర్మించారు. సింధూనది ఒప్పందం ప్రకారం ఈ నది నీటిలో భారత్-పాకిస్తాలు వాటాలకు కలిగియున్నాయి. వేదకాలంలో ఈ నదిని సుతుద్రిగా పిలువబడింది.[1]