గోల్డెన్ టెంపుల్ మెయిల్
![]() | |||||
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్టు/మెయిల్ | ||||
స్థానికత | మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ | ||||
తొలి సేవ | సెప్టెంబరు 1 1928 | ||||
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ రైల్వే మండలం | ||||
మార్గం | |||||
మొదలు | ముంబై సెంట్రల్ | ||||
ఆగే స్టేషనులు | 34 as 12903 గోల్డెన్ టెంపుల్ మెయిల్, 35 as 12904 గోల్డెన్ టెంపుల్ మెయిల్ | ||||
గమ్యం | అమృత్‌సర్ | ||||
ప్రయాణ దూరం | 1,891 కి.మీ. (1,175 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 32గంటల 15నిమిషాలు as 12903 Golden Temple Mail, 31గంటల 55నిమిషాలు as 12904 Golden Temple Mail | ||||
రైలు నడిచే విధం | రోజువారి | ||||
రైలు సంఖ్య(లు) | 12903 / 12904 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎ.సి మొదటి తరగతి,రెండవ తరగతి,మూడవ తరగతి,స్లీపర్ క్లాస్,అరక్షిత | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలదు | ||||
ఆహార సదుపాయాలు | పాంట్రీకార్ కలదు | ||||
చూడదగ్గ సదుపాయాలు | No rake sharing but maintains 4 separate rakes for service | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | Standard Indian Railway coaches | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 110 km/h (68 mph) maximum 58.94 km/h (37 mph), including halts | ||||
|
గోల్డెన్ టెంపుల్ మెయిల్ భారతీయ రైల్వేలు, పశ్చిమ రైల్వే మండలం ద్వారా నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైలు.ఇది మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నుండి పంజాబ్ లో గల అమృత్ సర్ వరకు పయనిస్తుంది.
చరిత్ర
[మార్చు]1928 సెప్టెంబరు 1 ఫ్రాంటియర్ మెయిల్ పేరుతో గోల్డెన్ టెంపుల్ మెయిల్ ను ప్రారంభించారు.భారతదేశ స్వాతంత్రానికి పూర్వం ప్రారంభింపబడ్డ ఈ రైలు ముంబై నుండి పెషావర్ వరకు ప్రయాణించేది.అప్పటి బ్రిటీషు అధికారులు బాల్లర్డ్ నుండి పెషావర్ చేరుకోవడానికి ఈ రైలును ఉపయోగించేవారు.భారత దేశానికి స్వాతంత్రనంతరం ఈ రైలును అమృత్ సర్ వరకు పరిమితం చేసారు.1996 లో ఫ్రాంటియర్ మెయిల్ పేరును గోల్డెన్ టెంపుల్ మెయిల్ గా మర్చారు.
సర్వీసు
[మార్చు]12903 నెంబరుతో ప్రయాణించు గోల్డెన్ టెంపుల్ మెయిల్ ముంబై నుండి తొలిరోజు రాత్రి 09గంటల 25నిమిషాలకు బయలుదేరి మూడవ రోజు ఉదయం 05గంటల 30నిమిషాలకు అమృత్‌సర్ చేరుతుంది.అలాగే 12904 నెంబరుతో ప్రయాణించు గోల్డెన్ టెంపుల్ మెయిల్ రోజు రాత్రి 09గంటల 30నిమిషాలకు అమృత్‌సర్ లో బయలుదేరి మూడవ రోజు ఉదయం 05గంటల 20నిమిషాలకు ముంబై సెంట్రల్ చేరును.
ప్రయాణ మార్గం
[మార్చు]12903 నెంబరుతో ప్రయాణించు గోల్డెన్ టెంపుల్ మెయిల్ ముంబై నుండి బయలుదేరి సూరత్,కోట,మధుర,హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్,ఘజియాబాద్,అంబాలా,జలంధర్ మీదుగా ప్రయాణించి అమృత్‌సర్ చేరుతుంది. 12904 నెంబరుతో ప్రయాణించు గోల్డెన్ టెంపుల్ మెయిల్ అమృత్‌సర్ నుండి బయలుదేరి జలంధర్,అంబాలా,ఘజియాబాద్,హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్,మధుర,కోట,,కోట,సూరత్,దాదర్ ల మీదుగా ప్రయాణించి ముంబై సెంట్రల్ చేరుతుంది.
కోచ్ల అమరిక
[మార్చు]గోల్డెన్ టెంపుల్ మెయిల్ లో 2అరక్షిత భోగీలు,9స్లీపర్ క్లాస్ భోగీలు,5 మూడవ తరగతి ఎ.సి భోగీలు,ఒక మూడవరెండవ తరగతి భోగి,2 రెండవ తరగతి భోగీలు,1 మొదటి తరగతి ఎ.సి భోగి,ఒక పాంట్రీకార్ భోగి,2 యస్.ఎల్.ఆర్ భోగీలతో కలిపి మొత్తం 24 భోగీలుంటాయి.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | అర్.ఎం.యస్ | హెచ్.ఎ1 | ఎ1 | ఎ2 | బి.ఈ1 | బి1 | బి2 | బి3 | బి4 | బి5 | PC | ఎస్1 | ఎస్2 | ఎస్3 | ఎస్4 | ఎస్5 | ఎస్6 | ఎస్7 | ఎస్8 | ఎస్9 | జనరల్ | SLR | ![]() |
ట్రాక్షన్
[మార్చు]గోల్డెన్ టెంపుల్ మెయిల్ కు WCAM 2/2P లోకోమోటివ్లను ముంబై సెంట్రల్ నుండి వడోదర వరకు ఉపయోగించి, అక్కడినుండి అమృత్‌సర్ వరకు వడోదర అధారిత WAP 4 లోకో మోటివ్లను ఉపయోగించేవారు.ప్రస్తుతం ముంబై సెంట్రల్ నుండి అమృత్‌సర్ వరకు వడోదర అధారిత WAP 4E లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.
చిత్ర మాలిక
[మార్చు]-
12903 Golden Temple Mail
-
Golden Temple Mail - AC 3 tier coach
-
The Mail coach of Golden Temple Mail
విశేషాలు
[మార్చు]- గోల్డెన్ టెంపుల్ మెయిల్ లోనే మొదటగా ఆకాశ వాణి ప్రసారాలను ప్రారంభించారు.
- గోల్డెన్ టెంపుల్ మెయిల్ భారత్ ద్వీపకల్పములో మొదటగా ఎ.సి భోగీలను నియోగించిన మెయిలు.