Jump to content

ఘాజియాబాద్ జిల్లా

వికీపీడియా నుండి
(ఘజియాబాద్ నుండి దారిమార్పు చెందింది)
ఘాజియాబాద్ జిల్లా
गाजियाबाद जिला
غازی آباد ضلع
ఉత్తర ప్రదేశ్ పటంలో ఘాజియాబాద్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఘాజియాబాద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమీరట్
ముఖ్య పట్టణంఘాజియాబాద్
మండలాలు3
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. మీరట్ లోక్‌సభ నియోజకవర్గం 2. ఘాజియాబద్ లోక్‌సభ నియోజకవర్గం
 • శాసనసభ నియోజకవర్గాలు5
విస్తీర్ణం
 • మొత్తం1,933.3 కి.మీ2 (746.5 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం46,61,452
 • జనసాంద్రత2,400/కి.మీ2 (6,200/చ. మై.)
 • Urban
54.8% (2,001)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత85%
 • లింగ నిష్పత్తి860 (2001)
ప్రధాన రహదార్లుNH58, NH24
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఘాజియాబాద్ జిల్లా (హిందీ: गाजियाबाद जिला) (ఉర్ధూ: غازی آباد ضلع) ఒకటి. ఘాజియాబాద్ పట్టణం ఈ జిల్లాకి కేంద్రం. ఘాజియాబాద్ జిల్లా మీరట్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇది ఢిల్లీకి "కమ్యూటర్ టౌన్" వంటిది. 2011 గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో ఇది మూడవది. మొదటి రెండు స్థానాలలో అలహాబాద్, మొరాదాబాద్ జిల్లాలున్నాయి.[1]

సరిహద్దులు

[మార్చు]
సరిహద్దు వివరణ జిల్లా
వాయవ్య సరిహద్దు బాగ్‌పత్
ఉత్తర సరిహద్దు మీరట్
తూర్పు సరిహద్దు హాపూర్
ఈశాన్య సరిహద్దు బులంద్‌షహర్
నైరుతీ సరిహద్దు గౌతమబుద్ధా నగర్
పశ్చిమ సరిహద్దు ఢిల్లీ (యమునాతీరంలో)

జిల్లా

[మార్చు]

మీరట్ జిల్లాలో ఒక తాలూకాగా ఉన్న ఘాజియాబాద్‌ను 1976 నవంబరు 14న జిల్లాగా మార్చారు. జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజున అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.డి తివారి ఘాజియాబాద్‌ను జిల్లాగా ప్రకటించాడు. అప్పటి నుండి ఘాజియాబాద్ సాంఘికంగా, ఆర్థికంగా, ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది.

రహదారి

[మార్చు]

జిల్లా కేంద్రం ఘాజియాబాద్ పేరును జిల్లాకు నిర్ణయించబడింది. ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్డు పక్కన హిండన్ నదీతీరంలో ఉంది.

బస్సులు

[మార్చు]

జిల్లా నుండి ఢిల్లీ, మీరట్, అలిగర్, బులంద్‌షహర్, మొరాదాబాద్, లక్నోనగరాలకు, ఇతర జిల్లాలకు రోజూ బస్సులు తిరుగుతాయి.

రైలు మార్గాలు

[మార్చు]

జిల్లాలో ఉత్తర రైల్వేకు చెందిన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ, కొలకత్తా, మొరదాబాద్, షహరాపూర్‌లకు, దేశంలోని ఇతరనగరాలకు రైలు సౌకర్యం లభిస్తుంది. జిల్లాకు పక్కన ఢిల్లీ ఉంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ జిల్లా ముఖద్వారంగా ఉంది.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

1740లో ఘాజియాబాద్ పట్టణాన్ని స్థాపించిన ఘాజి- ఉద్- దిన్ నగరానికి ఘజిద్దీన్‌నగర్ అని నామకరణం చేసాడు. ఘాజి- ఉద్- దిన్, ఈ నగరంలో 120 గదులతో, సుందరమైన ఆర్చీలతో చక్కని రాజభవనాన్ని నిర్మించాడు. ప్రస్తుతం సింహద్వారం, ప్రహరీగోడ, 14 అడ్జుగుల ఎత్తైన బ్రహ్మాండనైన స్తంభాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆవరణలో ప్రస్తుతం కొందరు ప్రజలు నివాసాలు ఏర్పరచుకున్నారు. రాజభనం ప్రస్తుతం నిలిచి ఉన్నప్పటికీ శిథిలావస్థలో ఉంది. 1763లో జాట్ రాజైన సూరజ్‌మాల్, నగరానికి సమీపంలో ఉన్న రోహిల్లాస్‌లో సంహరించబడ్డాడు. ఇక్కడ స్వాతంత్ర్య సమరవీరులు బ్రిటిష్ సైన్యాలతో పోరాడారు. ఇక్కడ రైల్వే స్టేషను ఆరంభించిన తరువాత ఘజిద్దీన్‌నగర్ అనేపేరు కాలక్రమంలో ఘజియాబాద్ గా మారింది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా గంగాయమూనా మైదానాల మద్య ఉంది. జిల్లా దాదాపు దీర్ఘచతురస్రాకారంలో ఉంది. జిల్లా పొడవు 72కి.మీ, వెడల్పు 37 కి.మీఉంది.

నదులు

[మార్చు]

జిల్లాలో ప్రధానంగా గంగా, యమునా, హిందన్ నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరమంతా వ్యవవసాయభూములలు పుష్కలంగా నీరు అందించబడుతుంది. ఇవి కాకుండా వర్షాధారంగా ప్రవహిస్తున్న ఇతరనదులు కూడా జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ఇంతే కాక జిల్లాలో గంగా కాలువలు కూడా వ్యవసాయ భూములకు నీటిని అందిస్తున్నాయి. పలు శాఖల కాలువల మూలంగా జిల్లాలో వ్యవసాయ భూములకు నీరు అందించబడుతుంది. ఘాజియాబాద్ జిల్లాకు, ఢిల్లీకి గంగా కాలువలద్వారా మంచినీరు అందించబడుతుంది.

1991 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 22,47,434. (90 సంవత్సరాల ముందు కంటే 464.7%)
జిల్లా వైశాల్యం -1991లో గౌతమ బుద్ద నగర్ జిల్లా ఏర్పరచక ముందు 2590చ.కి.మీ
-గౌతమ బుద్ద నగర్ జిల్లా ఏర్పరచిన తరువాత 1933.3 చ.కి.మీ
1901:1991 జనసంఖ్య 5,81,886: నుండి 27,03,933 (ఢిల్లీలో పరిశ్రమల కారణంగా 10 సంవత్సరాల అభివృద్ధి)
జిల్లా ఏర్పాటు 1976 నవంబరు 14
2011 జనసంఖ్య 46,81,645
పురుషులు 24,88,834
స్త్రీలు 21,92,811
1చ.కి.మీ జనసాంద్రత. 1,127

ఢిల్లీలో పరిశ్రమలు అభివృద్ధి అయినందున ఉపాధి వెతుక్కుంటూ వెల్లువలా వచ్చిన ప్రజలు ఢిల్లీలో నివాసగృహాల కొరత, ఘాజియాబాద్ ఢిల్లీకి సమీపంలో ఉన్నందున జిల్లా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు స్థిరపడిన కారణంగా నగర ప్రజల సంఖ్యలో గణనీయమైన అభివృద్ధి సంభవించింది. అలాగే గ్రామీణప్రాంత ప్రజల సంఖ్య గణనీయంగా క్షీణించింది.

వాతావరణం

[మార్చు]

ఇది ఢిల్లీకి సమీపంలో ఉన్నందున వర్షపాతం, ఉష్ణోగ్రత ఢిల్లీలో ఉన్నట్లు ఉంటుంది. రాజస్థాన్ దుమ్ము తుఫాను, హిమాలయాల హిమపాతం, కుమయోన్, ఘర్వాల్ కొండలు వాతావరణం మీద ప్రభావం చూపింది. సాధారణంగా జూన్ చివరి వారం, జూలై మొదటి వారంలో వర్షపాతం ఆరంభం ఔతుంది. వర్షపాతం అక్టోబరు వరకూ కొనసాగుతుంది.

విభాగాలు

[మార్చు]
విషయ వివరణ వాతావరణ వివరణ
ముంసిపల్ కార్పొరేషన్ ఘాజియాబాద్ (1994 ఆగస్టు 31)
ముంసిపల్ కౌంసిల్స్ 5 మురద్నగర్, మోడినగర్, హపుర్, గర్హ్ముకెతెష్వర్, పిల్ఖూ
టౌన్‌పంచాయితీలు 6 లోని, నివరి, పత్ల, దస్నా, బబుగర్హ్, ఫరీద్ నగర్
గ్రామాలు 580
నివాసిత గ్రామాలు 535
నిర్జన గ్రామాలు 45

చారిత్రక ప్రాధాన్యత

[మార్చు]

ఘాజియాబాద్ చారిత్రక, పౌరాణిక, ఆర్కియాలజీ ప్రాధాన్యత, సంపన్నత కలిగిన నగరం. జిల్లాలో పురాతత్వ శాఖ నిర్వహించిన త్రవ్వకాలు, పరిశోధనలు దీనిని చక్కగా నిరూపించాయి. జిల్లాలోని కేసరి గౌండ్ వద్ద త్రవ్వకాలు నిర్వహించబడ్డాయి. కేసరి గుట్ట హిండన్ నదీతీరంలో మోహన్‌నగర్‌కు 2 కి.మీ దూరంలో ఉంది. పరిశోధనల ఆధారంగా క్రీ.పూ 2500 నుండి ఈ ప్రాంతంలో నగరికత ఆరంభం అయిందని భావిస్తున్నారు.

గురుముఖేశ్వర్

[మార్చు]

ప్రజలకు ముక్తిని ప్రసాదించే గర్ముఖేశ్వర్ గంగానదీ తీరంలో పూత్ గ్రామం వద్ద ఉంది. ఈ ప్రాంత ప్రస్తావన మహాభారత కాలంలో ఉంది. సమీపంలో ఉన్న అహర్ భూభాగం జనమేజయుడు సర్ప యాగం నిర్వహించిన ప్రదేశమని భావిస్తున్నారు. లోనీకోట లవణాసురునిదని భావిస్తున్నారు. లవణాసురుని తరువాత ఈ కోటపేరు క్రమంగా లోనిగా మారిందని చరిత్రకారులు భావిస్తున్నారు.

సముద్రగుప్తుడు

[మార్చు]

జిల్లా తూర్పు సరిహద్దులో ఉన్న కోట్ గ్రామంలో సముద్రగుపుడు కోట్ కుల్జాం కోటను విధ్వంసం చేసిన తరువాత అశ్వమేధయాగం నిర్వహించాడు. ఆకాలంలో కోట్ రాజవంశానికి చెందిన కోట్ కుల్జియం అత్యంత చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. .

సుల్తాన్ మొహమ్మద్

[మార్చు]

1313 మొహమ్మద్ బీన్ తుగ్లక్ పాలనా సమయంలో ఈ భూభాగం మొత్తం పెద్ద యుద్ధరంగంగా మారుంది. నిరాడంబరతకు, నిజాయితీకి చిహ్నంగా నిలిచిన సుల్తాన్ నసీరుద్దీన్ షాహ్ తన బాల్యాన్ని ఇక్కడ ఉన్న లోని కోటలో గడిపాడు. తైమూర్ లోని కోటమీద దాడి చేసిన సమయంలో తైమూర్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన సామూహిక మానవ హత్యలు చరిత్రలో చెరగని ముద్రవేసాయి. లోని ప్రామఖ్యత మొగల్ పాలనలో అధికం అయింది. మొగల్ చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని వేట, విశ్రాంతి ప్రదేశంగా వాడుకున్నారు. అందుకు చిహ్నంగా ఇప్పటికీ ఇక్కడ బాగే రణాప్ నిలిచి ఉంది.

యుద్ధాలు

[మార్చు]

సమీపకాల పరిశోధనల ఆధారంగా ఈ భూభాగంలో 7 యుద్ధాలు జరిగాయని భావిస్తున్నారు. 4వ శతాబ్దంలో లోని వద్ద తౌమూర్, ఇండియన్ వీరులకు మధ్య కోట్ యుద్ధం జరిగింది. మరాఠా - మొగల్ రాజులైన భరత్‌పూర్ రాజు - నజాబ్ రాజుల మధ్య హిండన్ నదీతీరంలో యుద్ధం జరిగింది. తరువాత 1803లో జనరల్ లేక్, మరాఠీ సైన్యాలకు మద్య యుద్ధం జరిగింది. హిండన్ నదీతీరంలో 1807 మే 30-31 న బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ యుద్ధం జరిగింది. స్వాతంత్ర్య సమరంలో ఇది మొదటి యుద్ధంగా అభివర్ణించబడింది. తరువాత ఈ ప్రాంతానికి ప్రత్యేకత కలిగింది. 1857లో జరిగిన యుద్ధానికి జిల్లా మొత్తం సాక్ష్యంగా నిలిచింది. దాద్రి, అమరవీరుడు రాజా ఉమారావ్ సింగ్, గొప్ప త్యాగం చేసిన పిల్ఖువా (ముకింపూర్), రాజా గులాబ్ సింగ్, ధహౌలానాకి చెందిన 14 అమరవీరులు (సుమర్ సింగ్, కిత్న సింగ్, చందన్ సింగ్, మఖన్ సింగ్, జియ సింగ్, దౌలత్ సింగ్, జిరై సింగ్, మషాబ్ సింగ్, వాజిర్ సింగ్, లాల జానికి మాల్, సింఘాల్) లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. జిల్లాకు చెందిన పలువురు గ్రామస్థులు అమరవీరుడు మాలాగర్ వాలిదాద్ ఖాన్ నాయకత్వంలో ఈ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధంలో పాల్గొన్న అమరవీరుల జన్మస్థానం పవిత్రప్రదేశంగా భావించబడింది. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు స్వాతంత్ర్య సమరంలో తమ గ్రామానికి చెందిన అమరవీరులును గురించి సగర్వంగా స్మరించుకుంటున్నారు.

స్వాతంత్ర్యసమర యోధులు

[మార్చు]

జిల్లా భూమి పలువురు స్వాతంత్ర్య సమరయోధులకు జన్మ ఇచ్చింది. 1949 గాంధీ నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లాలోని అమరవీరుల సంతానంకూడా దేశరక్షణ విభాగంలో చేరి తమ సేవలను దేశానికి అందించారు. జిల్లాలోని గ్రామప్రాంతాలు, నగర శివారు ప్రాంతాలు మాహారాజాకు నిధిసహాయం చేసేవారి (దస్నా) వారి పేరుతో ఉండడం విశేషం. ముర్దానగర్ మురద్ బెగమాబాద్ (ప్రస్తుత మోదీ నగర్) చేత స్థాపించబడింది. మరాఠా సైనికాధిపతి జనరల్ మహాద్జిన్ కుమార్తె బాలాబాయి జాగీర్ జలాలాబాద్ అయింది. 1857 ఉద్యమంలో కేంద్రస్థానం వహించిన హర్‌పూర్ ఒకప్పుడు రాజకుటుంబ ఏనుగుల స్థావరంగా ఉండేది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో బాబుగర్ వద్ద గుర్రాల స్థావరంగా మారింది. జిల్లాలోని ఈ ప్రాంతాలు చారిత్రక ప్రాంతాలుగా గుర్తించబడుతూ జిల్లాకు గర్వకారణంగా నిలిచాయి.

చరిత్ర

[మార్చు]

1709-1725 మద్య గజియాబాద్‌ను మొగల్ సామ్రాజ్య సైనికాధికారి ఘజియుద్ధీన్ సిద్దిగి ఫెరోజ్ స్థాపించాడు. ఘజియుద్ధీన్ సిద్దిగి ఫెరోజ్ హైదరాబాదు మొదటి నిజాం కుమారుద్దీన్ పెద్ద కుమారుడు.[2]

గజుద్దీన్

[మార్చు]

గజుద్దీన్ నగరం స్థాపించినప్పుడు నగరాన్ని నాలుగు బలమైన ద్వారాల (దస్నా ద్వారం, సిహాని ద్వారం, ఢిల్లీ ద్వారం షాహీ ద్వారం) మద్య నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఒక ద్వారం కొంత భాగం ప్రహరీ గోడ, 14 అడుగుల ఎత్తైన బ్రహ్మాండమైన స్తంభాలు నిలిచి ఉన్నాయి. కాలక్రమంలో షాహి ద్వారానికి బజార్ గేట్ అని మరొక పేరు పెట్టబడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దీనికి తిరిగి జవహర్ గేట్ అని మరొక పేరు మార్చబడింది. మిగిలిన మూడు ద్వారాల పేర్లు అలానే ఉన్నాయి. గజుద్దీన్ మౌసోలియం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. [3] చారిత్రక, సంప్రదాయక, పౌరాణిక, పురాతత్వ పరిశోధనకు ఘాజియాబాద్ ప్రాముఖ్యత కలిగిన నగరం.

పరిశోధన

[మార్చు]

పరిశోధకులు ఈ ప్రాంతంలో 7 యుద్ధాలు జరిగాయని నిరూపిస్తున్నాయి.[4]

2011 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 4,661,452, [1]
ఇది దాదాపు. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. దక్షిణ కరోలినా నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 28 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 3967 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 41.66%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 878:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 85%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
విషయాలు వివరణలు
జనసంఖ్య 4,661,452 (2.33%) (యు.పిలో 3వ స్థానం)
పురుషులు 2,481,803
స్త్రీలు 2,179,649
జనసాంధ్రత 4060 చ.కి.మీ
జనసంఖ్య అభివృద్ధి 40.66%.
అక్షరాస్యత 85% (యు.పిలో ప్రథమ స్థానం) [7]
మైనారిటీలు 25%
అసెంబ్లీ స్థానాలు లోని, మురద్‌నగర్, షాహిబాబాద్, ఘాజియాబాద్, దౌలానా
[8] 

ఘాజియాబాద్‌లో రైల్వేస్టేషన్ (ఘాజియాబాద్ జంక్షన్) ఉంది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. ghaziabad.nic.in
  3. [1]
  4. [2]
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Ireland 4,670,976 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. South Carolina 4,625,364
  7. http://www.censusindia.gov.in/2011-prov-results/data_files/up/Census2011UttarPradeshPaper1.pdf
  8. MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS WERE HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS. Archived 2011-09-30 at the Wayback Machine F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS