కాన్పూర్ దేహత్ జిల్లా
కాన్పూర్ దేహత్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
కాన్పూర్ దేహత్ జిల్లా
कानपुर देहात जिला کانپور دیہات | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | కాన్పూర్ |
ముఖ్య పట్టణం | అక్బర్‌పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | అక్బర్‌పూర్ |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. రసూలాబాద్, 2. అక్బ^పూర్ - రాణీయ 3. సికంద్రా. 4. భోగినీపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,021 కి.మీ2 (1,166 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 17,95,092.[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 77.52% |
అక్షాంశ రేఖాంశాలు | 26°20′39″N 79°58′02″E / 26.3443°N 79.96718°E - 26°18′07″N 79°58′01″E / 26.302°N 79.967°E |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కాన్పూర్ దేహత్ జిల్లా ఒకటి. అక్బర్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కాన్పూర్ డివిజన్‌లో భాగం.
చరిత్ర
[మార్చు]1977లో కాన్పూర్ జిల్లా రెండు జిల్లాలుగా విభజించబడింది. (కాన్పూర్ నగర్, కాన్పూర్ దేహత్). 1979 లో రెండు తిరిగి సమైక్యం అయ్యాయి. 1981లో తిరిగి విభజించబడ్డాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దానికి కాన్పూర్ దేహత్ జిల్లా అని పేరును నిర్ణయించింది. 2010 జూలై 1న రమాబాయ్ నగర్ జిల్లా అని పేరు మార్చారు. 2012లో తిరిగి కాన్పూర్ దేహత్ అని మార్చారు.[2]
ప్రయాణ వసతులు
[మార్చు]జిల్లా రైలు మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. కాన్పూర్ దేహత్ జిల్లా నుండి మూడు రైలు మార్గాలు ఉన్నాయి. " నార్త్ సెంట్రల్ జోనుకు " చెందిన రైలు మార్గం జిల్లా నుండి పయనిస్తుంది.
- ఢిల్లీ- హౌరా రైలు మార్గం (నార్త్ సెంట్రల్ జోనుకు):- కాన్పూర్ మీదుగా పయనిస్తుంది. ఈ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం పూర్తిగా విద్యుదీకరణ చేయబడి ఉంది. ఈ మార్గంలో
భౌపుర్, మైథ, రోషన్ మౌ, హాల్ట్, రుర, అంబియపుర్, ఝింఝక్, పర్జని హల్త్ వద్ద రైలు స్టేషన్లు ఉన్నాయి.
- రెండవది కాన్పూర్ రైలు మార్గం:- బినౌర్, రసూల్పూర్ గొగుమౌ, తిలౌంచి, పమన్, లాల్పూర్, మలస, పుఖ్రయన్, చౌన్రహ్ వద్ద రైలు స్టేషన్లు ఉన్నాయి.
ఈ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం పూర్తిగా విద్యుదీకరణ చేయబడి ఉంది.
- మూడవది నేరో గేజ్ రైలు మార్గం:- ఇది ప్రస్తుతం బ్రాడ్ గేజ్ రైలు మార్గంగా చేయబడింది. నార్త్ ఈస్టర్న్ జోనుకు చెందినది. ఈ మార్గం గంగనదికి సమాంతరంగా పయనిస్తుంది. ఈ మర్గం విద్యుదీకరణ చేయబడుతూ ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,795,092,[1] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 268వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 594 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.82%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 862:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 77.52%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
క్రీడలు
[మార్చు]జిల్లాలో క్రికెట్ ప్రధాన క్రీడగా ఉంది. లోకల్ క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజ్ పలు విధములైన టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. " రాధేశ్యాం లీగ్ " అనే ప్రముఖ క్రికెట్ లీగ్ ఇక్కడ క్రీడలలో పాల్గొంటూ ఉంది.
మినార్లు
[మార్చు]జిల్లాలోని మొగల్ రోడ్డు (గ్రాండ్ ట్రంక్ రోడ్) నుండి పలు కోస్ మినార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని సురక్షిత స్మారకచిహ్నాలుగా సంరక్షించబడుతున్నాయి. వీటిలో భొగ్నిపూర్, చాపర్ ఘట, డియోసర్, గౌర్, హలియా, జల్లపూర్, సికందర, పైల్వర్, పితంపూర్, రైగవన్, రాజ్‌పూర్ (కాన్పూర్ దేహత్), సంఖిల్న్, బుజర్గ్, సర్దార్పూర్ ప్రధానమైనవి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "Kanpur Dehat". District administration. Archived from the original on 2011-07-21. Retrieved 2010-08-18.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gambia, The 1,797,860 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nebraska 1,826,341
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with missing country
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- Pages using infobox settlement with bad settlement type
- Commons category link from Wikidata
- ఉత్తర ప్రదేశ్ జిల్లాలు
- భారతదేశం లోని జిల్లాలు