Jump to content

మహారాజ్‌గంజ్ జిల్లా

వికీపీడియా నుండి
మహారాజ్‌గంజ్ జిల్లా
महाराजगंज जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో మహారాజ్‌గంజ్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో మహారాజ్‌గంజ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుగోరఖ్‌పూర్
ముఖ్య పట్టణంమహారాజ్‌గంజ్
మండలాలు4
Government
 • లోకసభ నియోజకవర్గాలుమహారాజ్‌గంజ్
విస్తీర్ణం
 • మొత్తం2,934.1 కి.మీ2 (1,132.9 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం26,65,292
 • జనసాంద్రత910/కి.మీ2 (2,400/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత64.3%
 • లింగ నిష్పత్తి938
Websiteఅధికారిక జాలస్థలి
సోనౌలీ వద్ద నేపాల్-భారత్ సరిహద్దు తనిఖీ కేంద్రం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మహారాజ్‌గంజ్ జిల్లా (హిందీ:महाराजगंज जिला) ఒకటి. మహారాజ్‌గంజ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. మహారాజ్‌గంజ్ జిల్లా ... డివిజన్‌లో భాగంగా ఉంది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో నేపాల్ దేశం, తూర్పు సరిహద్దులో కుశినగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో సిద్దార్ధ్‌ నగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో సంత్ కబీర్ నగర్ జిల్లా ఉన్నాయి. జిల్లా గోరక్‌పూర్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 2,951 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లాజనసంఖ్య 2,173,878. [1]

చరిత్ర

[మార్చు]

1989 అక్టోబరు 2న గోరక్‌పూర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మహారాజ్‌గంజ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి:
  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి: మహారాజ్‌గంజ్ సాదర్, నౌతంవ, నిచలౌల్, ఫరెండా
  • మహారాజ్‌గంజ్ సాదర్ తాలూకాలో 4 మండలాలు ఉన్నాయి: మహారాజ్‌గంజ్, ఘుఘలి, పనియార, పరతవల్.
  • నౌతంవ తాలూకాలో 2 మండలాలు ఉన్నాయి: రతన్‌పూర్, లక్ష్మీపూర్.
  • నిచలౌల్ తాలూకాలో 3 మండలాలు ఉన్నాయి: నిచలౌల్, మితౌర, సిస్వ
  • ఫరెండా తాలూకాలో 3 మండలాలు ఉన్నాయి: ఫరెండా, బ్రిద్గ్‌మన్‌గంజ్, దనై.
  • జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి: మహారాజ్‌గంజ్, ఘుఘలి, పనియార, పరతవల్, రతన్‌పూర్, లక్ష్మీపూర్, నిచలౌల్, మితౌర, సిస్, ఫరెండా, బ్రిద్గ్‌మన్‌గంజ్, దనై.
  • జిల్లాలో గ్రామాల సంఖ్య:- 1258
  • జిల్లాలో 14 పోలీస్ స్టేషన్ల సంఖ్య:-ఫరెంద, నౌతన్వ, పురందర్పుర్, కొథిభర్, తుతిబరి కోత్వాలి, కొళుయి, బ్రిజ్మంగంజ్, ష్యాందెవ్రవ, పర్సమలిక్, పర్గదవ, పనియర్, చౌక్, సొనౌలి కోత్వాలి, ఘుఘుల్యి

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,665,292, [3]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.</ref> roughly equal to the nation of Kuwait[4]
అమెరికాలోని. నవాడా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 151 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 903:1000 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.61%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 938:1000, [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 64.3%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రాంతం యొక్క ప్రసిద్ధ వ్యక్తులు

[మార్చు]
  • లేట్ డాక్టర్ శివ కాంత్ మిశ్రా (శాస్త్రలో గోల్డ్ మెడలిస్ట్, అధ్యక్షుడు అవార్డు గ్రహీత, సంస్కృతం)
  • డాక్టర్ డి.కె పాండే (స్థానిక ఫేమస్ డాక్టర్)
  • డాక్టర్ రాజనీష్ కుమార్ పాండే (డెంటిస్ట్)
  • డాక్టర్ సేథ్ (డాక్టర్)
  • డాక్టర్ కే.యస్ మిశ్రా (డాక్టర్)
  • డాక్టర్ పవన్ కుమార్ రంగట (డాక్టర్)
  • శ్రీ సురేష్ కుమార్ రంగట (ఉద్యోగ్ వ్యాపార్ను మండల నగర్ పంచాయతీ మాజీ ఛైర్మన్, డైరెక్టర్ ఆంగ్లో సంస్కృత ఇంటర్ కాలేజ్)
  • శ్రీ సతీష్ కుమార్ రంగట (బిజినెస్ మ్యాన్ లీడింగ్)
  • శ్రీ రవి ప్రతాప్ సింగ్ (చైర్మన్ ఎల్.డి.బి లాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ మహారాజగంజ్)
  • శ్రీ గోరఖ్ నాథ్ పాండే (ఆస్ట్రాలజర్)
  • శ్రీ అనురాగ్ కమల్ (ఇస్రో శాస్త్రవేత్త)

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Uttar Pradesh". india,gov,in website. Retrieved 7 May 2010.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kuwait 2,595,62
  5. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nevada 2,700,551