పశ్చిమ రైల్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పశ్చిమ రైల్వే
9వ నెంబరు

భారత దేశంలోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన పశ్చిమ రైల్వే (Western Railway) దేశంలోనే అత్యధిక రద్దీ కల రైల్వే జోన్ లలో ముఖ్యమైనది. భారతదేశంలోని పశ్చిమానున్న ముఖ్య నగరాలు ఈ రైల్వే జోన్ కిందికి వస్తాయి. ఈ జోన్‌లో 6 డివిజన్లు ఉన్నాయి. భావ్‌నగర్, ముంబాయి సెంట్రల్, రత్లాం, రాజ్‌కోట్, బరోడా, అహ్మదాబాదు డివిజన్లు కల పశ్చిమ రైల్వేకు ప్రధాన స్థావరం ముంబాయి.

చరిత్ర[మార్చు]

పశ్చిమ రైల్వే జోన్ 1951, నవంబర్ 5న అది వరకు రాష్ట్రాల అధీనంలో ఉన్న బాంబే, బరోడా అండ్ సెంట్రల్ రైల్వే (BB&CI), సౌరాష్ట్ర, రాజ్‌పుటానా, జైపూర్ రైల్వేవిలీనం చేసి ఏర్పాటుచేశారు. 1867లో ముంబాయిలో మొదటి సబర్బన్ రైలును ప్రారంభించారు. 1870లో దీనిని చర్చ్‌గేట్ వరకు పొడిగించారు. 1900 నాటికి 45 రైళ్ళు 10లక్షల ప్రయాణీకులను చేరవేసే సామర్థ్యాన్ని సంపాదించింది. సంస్థానాల అధీనంలో ఉన్న పలు రైల్వేలు కూడా పశ్చిమ రైల్వేలో భాగమైనాయి. 1949లో బరోడా గైక్వార్‌ల అధీనంలో ఉన్న గైక్వార్స్ బరోడా స్టేట్ రైల్వే GBSR) దీనిలో విలీనమైంది. సౌరాష్ట్ర రైల్వే 1948లో దీనిలో కలిసింది. 2002లో జైపూర్, అజ్మీర్ డివిజన్లు ఈ జోన్ నుంచి విడదీసి కొత్తగా ఏర్పాటైన వాయువ్య రైల్వేలో విలీనం చేయబడింది. 2003లో కోటా డివిజన్ నూతనంగా ఏర్పాటైన పశ్చిమ మధ్య రైల్వేలో కలుపబడింది.

రాష్ట్రాలు, డివిజన్లు[మార్చు]

ప్రస్తుతం పశ్చిమ రైల్వే జోన్‌ పరిధిలో గుజరాత్ రాష్ట్రం పూర్తిగాను, రాజస్థాన్ రాష్ట్రపు తూర్పు భాగం, మధ్య ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాలు, మహారాష్ట్ర తీరప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలోని ముఖ్య రేవులైన ముంబాయి, కాండ్లా, పోరుబందర్, ఓఖా, భావ్‌నగర్ లకు పశ్చిమ రైల్వే సదుపాయాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ జోన్ పరిధిలో 6 రైల్వే డివిజన్లు ఉన్నాయి.

రైలుమార్గం నిడివి[మార్చు]

పశ్చిమ రైల్వే జోన్ 10020 కిలోమీటర్ల నిడివిని కలిగి ఉంది. దేశంలోనే అత్యధిక విద్యుదీకరించిన రైలుమార్గం ఈ జోన్‌లో ఉంది.

రైల్వే గేజి రకం కిలోమీటర్ల
బ్రాడ్‌గేజి 4305
మీటర్‌గేజి 4838
నారోగేజి 877
మొత్తము 10020

ముఖ్యమైన రైల్వే స్టేషన్లు[మార్చు]

పశ్చిమ రైల్వే జోన్‌లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లు

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూసలు , వర్గాలు[మార్చు]