పుష్పక్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుష్పక్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్ రైలు
స్థానికతఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర
ప్రస్తుతం నడిపేవారుఈశాన్య రైల్వే
మార్గం
మొదలుLucknow Junction (LJN)
ఆగే స్టేషనులు16
గమ్యంMumbai CST (CSMT)
ప్రయాణ దూరం1,428 కి.మీ. (887 మై.)
సగటు ప్రయాణ సమయం24 గం 20 ని
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12533 / 12534
సదుపాయాలు
శ్రేణులుAC 1st Class, AC 2 tier, AC 3 tier, Sleeper Class, General Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుAvailable
చూడదగ్గ సదుపాయాలుLarge windows
సాంకేతికత
రోలింగ్ స్టాక్LHB coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం59 km/h (37 mph) average including halts

12533 / 12534 పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లక్నోఈ జంక్షను, ముంబై ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది లక్నో జంక్షన్ నుండి ముంబై CSMT వరకు రైలు నంబర్ 12533 గాను, తిరుగు దిశలో రైలు నంబర్ 12534గానూ నడుస్తుంది.

రామాయణంలోని పుష్పక విమానం పేరు మీదుగాదీని పుష్పక్ దీనికి ఆ పేరు వచ్చింది.

12533/12534 పుష్పక్ ఎక్స్‌ప్రెస్ 1426 కిలోమీటర్ల దూరాన్ని 24 గంటల 20 నిమిషాల్లో (58.60 కిమీ/గం వేగంతో) కవర్ చేస్తుంది. తిరుగు ప్రయాణంలో 12534 పుష్పక్ ఎక్స్‌ప్రెస్, 1428 కిమీ దూరాన్ని 24 గంటల 20 నిమిషాల్లో (58.68 కిమీ/గం వేగంతో) పూర్తి చేస్తుంది.

రైలు సగటు వేగం 55 km/hr కంటే ఎక్కువ కాబట్టి దాని ఛార్జీలో సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ ఉంటుంది.

ఇంజను

[మార్చు]

2014 జూన్‌కి ముందు, ఈ రైలును 3 లోకోమోటివ్‌ల లాగేవి. లక్నో లేదా ఝాన్సీ షెడ్ నుండి WDM-3A లోకోమోటివ్ రైలును లక్నో జంక్షన్నుండి ఝాన్సీ వరకు లాగుతుంది. ఆ తర్వాత భుసావల్ -ఆధారిత WAP-4 రైలును ఇగాత్‌పురి వరకు నడుపుతుంది. దీని తర్వాత మిగిలిన ప్రయాణానికి WCAM-3 ఇంజను నడుపుతుంది.

లక్నో-ఝాన్సీ సెక్టారును విద్యుదీకరణ చెయ్యడంతో, భుసావల్-ఆధారిత WAP-4 లక్నో జంక్షన్ నుండి ఇగాత్‌పురి వరకు లాగడం ప్రారంభించింది. ఆ తర్వాత ముంబై CSMT వరకు మిగిలిన ప్రయాణాన్ని WCAM-3 నడుపుతుంది.


సెంట్రల్ రైల్వే 2015 జూన్ 6 న 1500 V DC ట్రాక్షన్‌ను 25 kV AC ట్రాక్షన్‌గా మార్చడాన్ని పూర్తి చేయడంతో, రైలును WAP-4 లాగింది. అయితే 2016 నుండి, ఈ రైలును ఇప్పుడు అజ్ని లోని WAP-7 లోకోమోటివ్ మొత్తం దూరాన్ని లాగుతోంది.