130.00 km/h (80 mph) maximum
70 km/h (43 mph) (average with halts)
పూర్వా ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు, తూర్పు రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.ఈ రైలు పశ్చిమ బెంగాల్లో గల హౌరా నుండి దేశ రాజధాని అయిన క్రొత్త ఢిల్లీ వరకు నడుస్తుంది.పూర్వా అను పదం భారతదేశం యొక్క తూర్పు భాగాన్ని సూచిస్తుంది.ఈ రైలు తూర్పు భారత రాష్టాలయిన పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ల మీదుగా ప్రయాణిస్తుంది.2013, ఏప్రిల్ 30 నుండి పూర్వా ఎక్స్‌ప్రెస్ కు యల్.హెచ్.బి భోగీలను అమర్చుట జరిగింది. దీని అత్యధిక వేగం గంటకు 130 కిలో మీటర్లు.ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బండ్ల తరువాత తూర్పు భారత రాష్టాలలో అత్యంత రద్ధి కలిగిన ఎక్స్‌ప్రెస్.
12303 నెంబరుతో పూర్వా ఎక్స్‌ప్రెస్ పాట్నా మీదుగా క్రొత్త ఢిల్లీ, సోమ, మంగళ, శుక్ర, శని వారాల్లో హౌరా నుండి ఉదయం 08గంటల 05నిమిషాలకు బయలుదేరి ముసటి రోజు ఉదయం 06గంటల 05నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషనుకు చేరుతుంది.
12381 నెంబరుతో పూర్వా ఎక్స్‌ప్రెస్ గయ మీదుగా క్రొత్త ఢిల్లీ, ఆది, బుధ, గురు వారాల్లో హౌరా నుండి ఉదయం 08గంటల 15నిమిషాలకు బయలుదేరి ముసటి రోజు ఉదయం 06గంటల 05నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషనుకు చేరుతుంది.
పూర్వా ఎక్స్‌ప్రెస్ లో మొదటి తరగతి ఎ.సి భోగీలు 1, రెండవ తరగతి ఎ.సి భోగీలు 2, మూడవ తరగతి ఎ.సి భోగీలు 5, స్లీపర్ భోగీలు 9, అరక్షిత భోగీలు 2, జనరేటర్ 2 కలిపి మొత్తం 21 భోగీలుంటాయి.
2014 డిసెంబరు 14 న హౌరా నుండి క్రొత్త ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్‌ప్రెస్ స్వల్ప ప్రమాదానికి గురవడంతో 11స్లీపర్,1 పాంట్రీ కార్ పట్టాలు తప్పాయి.ఆ సమయంలో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండడంతో ఎవరికి గాయాలు కాలేదు.