ధన్‌బాద్
ధన్‌బాద్ | |
---|---|
Coordinates: 23°47′59″N 86°25′50″E / 23.7998°N 86.4305°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | ధన్‌బాద్ |
విస్తీర్ణం | |
• నగరం | 275 కి.మీ2 (106 చ. మై) |
• Metro | 577 కి.మీ2 (223 చ. మై) |
Elevation | 222 మీ (728 అ.) |
జనాభా | |
• నగరం | 11,62,472 |
• Rank | 33వ |
• జనసాంద్రత | 4,200/కి.మీ2 (11,000/చ. మై.) |
• Metro | 13,33,719 |
• Metro rank | 42nd |
భాషలు | |
• అధికారిక | హిందీ, బెంగాలీ, ఖోర్తా, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 826001 |
Telephone Code | 0326 |
Vehicle registration | JH-10 |
ధన్‌బాద్, జార్ఖండ్ రాష్ట్రం, ధన్‌బాద్ జిల్లా లోని నగరం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. జంషెడ్‌పూర్ తరువాత, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ధన్‌బాద్. ఇది భారతదేశంలో 42 వ అతిపెద్ద నగరం. 10లక్షలకు పైగా జనాభా గల పట్టణ సముదాయాల్లో భారతదేశంలో 34 వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 96 వ స్థానంలో ఉన్నట్లు సిటీ మేయర్స్ ఫౌండేషన్ గుర్తించింది. [4] పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా ధన్‌బాద్ జిల్లాకు సరిహద్దుగా ఉంది.
భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు గనులకు కేంద్రంగా ఉన్న ఈ నగరాన్ని 'కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. [5] ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఇప్పుడు ఐఐటి ధన్‌బాద్ ) సంస్థ ధన్‌బాద్ లోనే ఉంది. [6] బొగ్గుతో పాటు, ఇది సమాచార సాంకేతికత రంగంలో కూడా ఎదిగింది.
2019 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రకారం ధన్‌బాద్ భారతదేశంలో 56 వ పరిశుభ్రమైన నగరం. [7] 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అత్యంత మురికి నగరంగా పరిగణించబడిన ఈ నగరం ఒక్క ఏడాదిలో గొప్ప పరివర్తనను చూపించింది. [8] ధన్‌బాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో పచ్చదనాన్ని పెంచడానికి పనిచేస్తోంది. [9] భారతీయ రైల్వేలోని రైల్వే డివిజన్లలో, ధన్‌బాద్ రైల్ డివిజన్ ముంబై డివిజన్ తర్వాత వార్షికాదాయంలో రెండవ స్థానంలో ఉంది. [10] ఓపెన్‌సిగ్నల్ సంస్థ చేసిన సర్వేలో భారతదేశంలో అత్యధికంగా 4G మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ లభ్యతతో ధన్‌బాద్, భారతదేశంలో అగ్ర నగరంగా నిలిచింది. [11]
ప్రస్తుత జిల్లా మంభుమ్ ప్రాంతంలో భాగంగా ఉండేది. సా.శ. ఏడవ శతాబ్దం లో హ్యూయన్ త్సాంగ్ రాసిన యాత్రా చరిత్రలో దీని ప్రస్తావన ఉంది. ఇది శశాంక పాలనలో ఉంది. [12] బ్రిటిష్ పాలనలో తూర్పుభారతంలోని జిల్లాలలో మన్భుమ్ ఒకటి.
మన్భూమ్ సెటిల్మెంట్ రిపోర్టులో (1928) సర్వే సెటిల్మెంట్ కార్యకలాపాల సమయంలో రాతి శాసనాలు, రాగి పలకలు లేదా పాత నాణేలు కనబడలేదని, రాగి రేకులుగానీ, తాళపత్రాలు గానీ ఒక్కటి కూడా కనబడలేదనీ పేర్కొనబడింది. పురాతన ప్రామాణికమైన పత్రాలు అన్నీ కూడా కాగితంపై ఉన్నవే. అన్నీ కేవలం వంద సంవత్సరాల లోపు వయస్సు కలిగినవే. [13] ధన్‌బాద్ నగరం 1928 నుండి 1956 వరకు మన్భూమ్ జిల్లాలో ఉంది. [13] అయితే, 1956 అక్టోబర్ 24 న, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సు నోటిఫికేషన్ 1911 ప్రకారం ధన్‌బాద్ జిల్లా ఏర్పడింది. [14]
జర్నలిస్ట్ సతీష్ చంద్ర నాయకత్వంలో ఇది జరిగింది. 2006 సంవత్సరంలో, ధన్‌బాద్ స్వతంత్ర జిల్లాగా, ధన్‌బాద్ దాని ముఖ్యపట్టణంగా 50 సంవత్సరాల వేడుక జరుపుకుంది. 1956 నుండి 2000 నవంబర్ 14 న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడే వరకు, ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. [15] ఈ ప్రాంతంలో బొగ్గు యొక్క గొప్ప నిక్షేపాల వలన నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందింది,[16]
భౌగోళికం
[మార్చు]వాతావరణం
[మార్చు]ధన్‌బాద్‌లో శీతోష్ణస్థితి తేమతో కూడిన ఉపఉష్ణమండల స్థితి (కోపెన్:Cwa), ఉష్ణమండల తడి, పొడి శీతోష్ణస్థితుల (Aw) మధ్య మారుతూంటుంది. [17] వేసవి మార్చి చివరి వారంలో మొదలై జూన్ మధ్యలో ముగుస్తుంది. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 48 ° C కి చేరుకుంటుంది. ధన్‌బాద్‌లో వర్షపాతం ఎక్కువగానే ఉంటుంది. శీతాకాలంలో, కనిష్ట ఉష్ణోగ్రత 10 °C చుట్టూ ఉంటుంది. గరిష్టంగా 22 °C ఉంటుంది.
జనాభా
[మార్చు]2011 జనగణన ప్రకారం, ధన్‌బాద్ నగర జనాభా 11,62,472. జనాభాలో పురుషులు (6,14,722) 53%, స్త్రీలు (547,750) 47%. లింగనిష్పత్తి 891. ధన్‌బాద్ సగటు అక్షరాస్యత 79.47%. ఇది జాతీయ సగటు 74.04%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 86.14%, స్త్రీల అక్షరాస్యత 71.96%. జనాభాలో 10.57% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]ధన్‌బాద్ ఈ ప్రాంతం లోని పురాతన, అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటి. పరిశ్రమలకు కేంద్రం. ఇది బొగ్గు గనులకు, పారిశ్రామిక సంస్థలకూ ప్రసిద్ధి చెందింది. నగరం చుట్టుపక్కల 112 బొగ్గు గనులు ఉన్నాయి [18] ఈ గనుల్లో మొత్తం బొగ్గు ఉత్పత్తి 2.75 కోట్ల టన్నులు. బొగ్గు వ్యాపారం ద్వారా ఏడాదికి 700 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. అక్కడ అనేక బొగ్గు వాషరీ లున్నాయి.
భారత్ కోకింగ్ కోల్ (బిసిసిఎల్) ప్రధాన కార్యాలయం ధన్‌బాద్‌లో ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), టాటా స్టీల్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ (ముగ్మా వద్ద) కూడా తమ స్వంత బొగ్గు గనులను నిర్వహిస్తున్నాయి. ఓం బెస్కో రైల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే పబ్లిక్ లిమిటెడ్ రైలు బండి తయారీ సంస్థ [19] హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ (ప్రస్తుతం వేదాంత రిసోర్సెస్ ), [20] మైథాన్ పవర్ లిమిటెడ్, హిందుస్థాన్ మల్లేబుల్స్ & ఫోర్గింగ్స్ లిమిటెడ్ వంటి పలు సంస్థలు ధన్‌బాద్ చుట్టుపక్కల పనిచేస్తున్నాయి.
ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు సింద్రీ ప్రాజెక్టును మళ్ళీ మొదలుపెడుతోంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ కు చెందిన 5 డివిజన్లలో ఒకటి ధన్‌బాద్‌లో ఉంది.
విద్య
[మార్చు]విశ్వవిద్యాలయాలు, కళాశాలలు
[మార్చు]- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్), ధన్‌బాద్, 1926 లో బ్రిటిష్ వారు స్థాపించారు.
- బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సింద్రీ పురాతన ప్రభుత్వాలలో ఒకటి.
- SSLNT మహిళా కళాశాల 1956 లో స్థాపించబడిన తూర్పు భారతదేశంలోని పురాతన మహిళా సైన్స్, ఆర్ట్స్ కళాశాలల్లో ఒకటి.
- K. K. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, గోవింద్‌పూర్
- పాటలీపుత్ర వైద్య కళాశాల, ఆసుపత్రి, 1971 లో స్థాపించబడింది
- ధన్‌బాద్ లా కళాశాల 1976 లో స్థాపించబడింది.
- గురు నానక్ కళాశాల
- రాజా శివ ప్రసాద్ కళాశాల, 1949 లో రాజా రాజా స్థాపించారు
- పి.కె. రాయ్ మెమోరియల్ కళాశాల, 1977 లో స్థాపించబడింది.
- అల్ ఇక్రా టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్, గోబింద్‌పూర్
- B.S.S మహిళా కళాశాల
- భోలారం శిబాల్ ఖార్కియా కళాశాల, మైథాన్
- బినోద్ బిహారీ మహతో కోయిలాంచల్ విశ్వవిద్యాలయం, 2017 లో స్థాపించబడిన ప్రభుత్వ విశ్వవిద్యాలయం.
రవాణా
[మార్చు]రైలు
[మార్చు]ధన్‌బాద్ నుండి ఢిల్లీ, ముంబై, పాట్నా, కోల్‌కతా, భాగల్పూర్, ముంగేర్, గయ, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, కొచ్చి, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, జైపూర్, విశాఖపట్నం, జోధ్పూర్, నాగపూర్, పూణే, వారణాసి, గౌహతి, బెంగళూరు వంటి ప్రధాన ప్రాంతాలకు చక్కటి రైలు సౌకర్యం ఉంది. ముంబై రైల్వే డివిజన్ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆదాయ ఉత్పత్తిదారు ధన్‌బాద్ రైల్వే డివిజన్.
ధన్ బాద్ రైల్ డివిజన్ తూర్పు మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. హౌరా న్యూఢిల్లీని కలిపే గ్రాండ్ కార్డ్ రైలు మార్గం ధన్‌బాద్ జంక్షన్ గుండా వెళుతుంది. CIC రైలు మార్గం ధన్‌బాద్ నుండి ప్రారంభమై మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి వద్ద ముగుస్తుంది. జిల్లా గుండా మరో రైలు మార్గం ఉంది, ఇది ఖరగ్‌పూర్‌లో మొదలై గోమోహ్ వద్ద ముగుస్తుంది, ఈ రైలు మార్గం సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోకి వస్తుంది.
2011 అక్టోబరు 1 న, హౌరా ధన్‌బాద్ ల మధ్య భారతదేశపు మొట్టమొదటి AC డబుల్ డెక్కర్ రైలు మొదలైంది. దీనితో మల్టీ-డెక్ రైళ్లను నడిపే ఐరోపా, ఉత్తర అమెరికాల సరసన భారత్ చేరింది. 2011 అక్టోబరు నాటికి, ఆదివారం తప్ప ప్రతిరోజూ రైలు నడుస్తోంది. దీని గరిష్ఠ వేగం 110 కిలోమీటర్లు (68 మై.). [21] [22] [23]
రోడ్లు
[మార్చు]జాతీయ రహదారి 19, జాతీయ రహదారి 18 ధన్‌బాద్ గుండా వెళ్లే ప్రధాన రహదారులు. [24] NH 19 స్వర్ణ చతుర్భుజి హైవే నెట్‌వర్క్‌లోని ధన్‌బాద్ ఢిల్లీ - కోల్‌కతాలో మార్గంలో భాగం. [25] NH19 ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా మార్చబడింది; NH 18 ధన్‌బాద్ నుండి బొకారో, జంషెడ్‌పూర్‌ని కలుపుతుంది. [25]
గాలి
[మార్చు]ధన్ బాద్ విమానాశ్రయాన్ని ప్రైవేటు విమానాలకు, చిన్న విమానాలు, హెలికాప్టర్లకూ వినియోగిస్తున్నారు. ఇక్కడి నుండి షెడ్యూల్డు విమాన సేవలు లేవు. ధన్ బాద్ కు సమీపం లోని వాణిజ్య విమానాశ్రయాలు
- కాజీ నజ్రుల్ ఇస్లాం విమానాశ్రయం, అసన్సోల్ - దుర్గాపూర్ 85 కిలోమీటర్లు (53 మై.)
- బిర్సా ముండా విమానాశ్రయం, రాంచీ 140 కిలోమీటర్లు (87 మై.)
- గయ విమానాశ్రయం 207 కిలోమీటర్లు (129 మై.)
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోల్‌కతా 269 కిలోమీటర్లు (167 మై.)
- లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం, పాట్నా 271 కిలోమీటర్లు (168 మై.)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Dhanbad City". Archived from the original on 2021-06-24. Retrieved 2021-09-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Dhanbad City Info".
- ↑ 3.0 3.1 "Dhanbad City Census 2011 data". Census2011. Archived from the original on 11 May 2017. Retrieved 23 March 2017.
- ↑ "City Mayors: World's fastest growing urban areas (1)". www.citymayors.com. Retrieved 10 November 2019.
- ↑ "The Sad State of India's Coal Capital". Wall Street Journal. 5 April 2010.
- ↑ "Mines' school faces big dip in popularity as it readies to don IIT avatar". Times of India. 12 March 2015. Archived from the original on 11 February 2018. Retrieved 10 June 2017.
- ↑ "Swachh Survekshan 2019". swachhsurvekshan2019.org. Archived from the original on 31 ఆగస్టు 2019. Retrieved 10 November 2019.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Swachh Survekshan results: Mysuru cleanest city; Dhanbad, Varanasi among 10 least clean cities". Zee News (in ఇంగ్లీష్). 15 February 2016. Retrieved 10 November 2019.
- ↑ 18 Feb, Bhupendra Srivastava | TNN | Updated; 2016; Ist, 9:29. "Green belt to fight pollution in Dhanbad | Ranchi News – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 10 November 2019.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Dhanbad Rail Division OVERVIEW". The Telegraph. Calcutta, India. 4 April 2012. Archived from the original on 18 October 2013. Retrieved 10 October 2013.
- ↑ undefinedMarch 28, Amritanshu Mukherjee; March 29, 2019UPDATED; Ist, 2019 12:03. "Dhanbad, Ranchi in Jharkhand have highest 4G availability in India, Delhi and Mumbai don't fare in top 10". India Today. Retrieved 10 November 2019.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "DHANBAD DISTRICT OVERVIEW". Archived from the original on 17 March 2011. Retrieved 6 October 2011.
- ↑ 13.0 13.1 Dhanbad Introduction/Jharkhand-Dhanbad Sightseeing-Dhanbad Jharkhand Transport-Places of Interest in Dhanbad Archived 13 మార్చి 2009 at the Wayback Machine.
- ↑ "History | District Dhanbad, Government of Jharkhand | India". Retrieved 2020-06-10.
- ↑ BIHAR REORGANISATION ACT,2000
- ↑ "In real life: Coal mafia gang wars continue in Wasseypur". Hindustan Times. 30 July 2014. Archived from the original on 22 April 2017. Retrieved 21 April 2017.
- ↑ "Dhanbad, India Köppen Climate Classification (Weatherbase)". Weatherbase. Retrieved 2020-09-27.
- ↑ LIST OF COAL MINES IN DHANBAD. dhanbad.nic.in
- ↑ "OmBesco Railway Wagons Manufacturer India". www.ombesco.in. Archived from the original on 10 నవంబరు 2019. Retrieved 10 November 2019.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Zinc officers in labour custody". www.telegraphindia.com. Retrieved 2020-01-09.
- ↑ National Highways and their Length Archived 27 జనవరి 2018 at the Wayback Machine National Highway Authority of India (NHAI)
- ↑ The Public Website of Dhanbad (Black Diamond City of India) Archived 8 జనవరి 2016 at the Wayback Machine. dhanbad.jharkhand.org.in.
- ↑ BIHAR REORGANISATION ACT,2000
- ↑ National Highways and their Length Archived 27 జనవరి 2018 at the Wayback Machine National Highway Authority of India (NHAI)
- ↑ 25.0 25.1 The Public Website of Dhanbad (Black Diamond City of India) Archived 8 జనవరి 2016 at the Wayback Machine. dhanbad.jharkhand.org.in.