హజారీబాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?Hazaribagh
हज़ारीबाग़

Jharkhand • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 23°59′N 85°21′E / 23.98°N 85.35°E / 23.98; 85.35Coordinates: 23°59′N 85°21′E / 23.98°N 85.35°E / 23.98; 85.35
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 604 మీ (1,982 అడుగులు)
జిల్లా(లు) Hazaribagh జిల్లా
జనాభా 127 (2001 నాటికి)
వెబ్‌సైటు: hazaribag.nic.in/

హజారీబాగ్ (ఆంగ్లం: Hazaribagh; హిందీ: हज़ारीबाग़) భారతదేశం యొక్క జార్ఖండ్ రాష్టంలోని హజారీబాగ్ జిల్లాలో ఒక పట్టణం మరియు మున్సిపాలిటీ. ఇది ఉత్తర ఛోటానాగపూర్ విభాగం యొక్క విభాగ ప్రధాన పట్టణం. ఇది ఆరోగ్య కేంద్రంగా మరియు హజారీబాగ్ జాతీయ వనానికి (పట్టణం నుండి 17 కిమీ) ప్రసిద్ధి చెందింది.

పదచరిత్ర[మార్చు]

శబ్ద లక్షణ ప్రకారం, హజారీబాగ్ అను పదం, హజార్ అర్ధం 'వేయి', మరియు బాగ్ అర్ధం 'పులి' అను రెండు పదముల నుండి వచ్చింది. అందువలన హజారీబాగ్ కు అసలైన అర్ధం 'వేయి పులల పట్టణం'.అయినప్పటికీ తరిగిపోయిన పులుల సంఖ్య వలన, ఈ పేరు హజారీబాగ్ గా మారింది (వేయి వనముల పట్టణం). సర్ జాన్ హౌల్టన్ ప్రకారం ఈ పట్టణం దాని యొక్క పేరును చిన్న గ్రామాలైన ఓక్ని మరియు హజారి నుండి తీసుకుంది - పురాతన భౌగోళిక పటములలో ఒకన్హజ్రీగా చూపబడింది. 1782 మరియు దాని తరువాత సంవత్సరాలలో వారణాసి నుండి కోల్ కతా వరకు నిర్మించిన 'నూతన మిలిటరీ మార్గం' గుండా నడిచిపోవు సమూహాలకు మరియు ప్రయాణీకులకు ఒక మామిడి తోట మజిలీ ప్రదేశంగా ఉండుట వలన దీని పేరులోని ఆఖరి అక్షరం బహుశ ఆ కారణంగా వచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత పద్దెనిమిదొవ శతాబ్దం మధ్యలో గ్రాండ్ ట్రంక్ రోడ్ ఆ మిలిటరీ మార్గాన్ని భర్తీ చేసింది, కానీ కొన్ని ప్రదేశాలలో ముఖ్యంగా హజారీబాగ్ చూట్టూ రూపు రేఖలు మారాయి. మిలిటరీ మార్గానికి భద్రతగా ఉండిన ఒక శిథిలమైన పహారా బురుజు ఇప్పటికీ సిల్వర్ సమీపంలో టవర్ హిల్ మీద ఇప్పటికీ కనిపిస్తుంది.

Hazaribagh Map.jpg

భౌగోళిక స్థితి[మార్చు]

దామోదర్ నదికి ఉపనది అయిన కోణార్ నది ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

గాలి ద్వారా సమీప ఎయిర్ పోర్ట్, రాంచి (జార్ఖండ్ రాజధాని) కి (91 కిలోమీటర్ల) సాధారణ ఎయిర్ లైన్స్ సేవలు మరియు అనేక ఇత ప్రైవేటు ఎయిర్ లైన్స్ న్యూ ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పాట్న, లక్నో మొదలగు పట్టణాల నుండి సేవలు అందిస్తున్నాయి.

రైల ద్వారా సమీప రైల్వే స్టేషను కోడెర్మ, ఇది 69 కిమీ దూరంలోనూ ఢిల్లీ హౌరా గ్రాండ్ కార్డ్ లైన్ మీద ఉంది. అన్ని ప్రధాన రైళ్ళు రాజధానితో సహా ఇక్కడ నిలుస్తాయి. రైల్వేలు హజారీబాగ్ రోడ్ స్టేషను నుండి హజారీబాగ్ నిరంతరం బస్సు సేవలను అందిస్తున్నాయి.

రోడ్డు ద్వారా హజారీబాగ్ NH 33 మీద ఉంది (జార్ఖండ్ యొక్క ఆధార గీత), రోడ్డు మార్గం ద్వారా ఇది రాంచి 91 కిమీ దూరంలో, ధన బాద్ 128 కిమీ (వయా GT రోడ్) దూరంలో, బొకారో 116 కిమీ (వయ రామ్ గడ్) దూరంలో, గయా 130 కిమీ దూరంలో, పాట్నా 235 కిమీ, డాల్టన్ గంజ్ 198 కిమీ దూరంలో, కోల్ కతా (వయ అసంసోల్-గోవిందాపూర్-బర్హి) 434 కిమీ దూరంలో కలుస్తుంది.నిరంతర బస్సు సేవలు ఈ ప్రదేశాలకు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

ప్రారంభ చరిత్ర[మార్చు]

పురాతన కాలంలో ఈ జిల్లా మొత్తం చొరబడటానికి వీలు లేని అడవులతో నిండి ఉండేవి. ఈ అడవులు నిలకడగా ముందుకు సాగుతున్న ఆర్యులకు లొంగకుండా తిరస్కరిస్తున్న ఆర్యులు కాకుండా వేరే జాతి వారికి వివిధ సమయములలో మజిలీలు. టర్కో-ఆఫ్ఘన్ శకం (1526 వరకు), వాస్తవంగా ఈ ప్రదేశం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేది. ఇదంతా కేవలం అక్బర్ 1556లో ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకోవటం మూలంగా జార్ఖండ్ మీద ముస్లిం ఆధిపత్యం పెరిగింది, ఆ తరువాత మొఘలులకు కొక్రః అని తెలుసుకున్నారు. అక్బర్ 1585లో షాబాజ్ ఖాన్ అధ్వర్యంలో చోటానాగ్ పూర్ రాజా నుండి కప్పం వసూలు చేయుటకు ఒక దళాన్ని పంపాడు. 1605 లో అక్బర్ మరణం తరువాత, ఈ ప్రదేశం తెగింపుతో తిరిగి దాని స్వాతంత్ర్యం దక్కించుకుంది. ఇది 1616లో బీహార్ గవర్నర్ మరియు మహారాణి నూర్జహాన్ కి సోదరుడు అయిన ఇబ్రహీం ఖాన్ ఫతే జంగ్ చేత దండయాత్రకు నాంది అయింది. ఇబ్రహీం ఖాన్ 46వ చోటానాగ్ పూర్ రాజాని ఓడించి దుర్జన్ సాల్ ని హస్తగతం చేసుకున్నాడు. అతను 12 సంవత్సరాలు కారాగారంలో ఉన్నాడు కాని ఆ తరువాత ఒక అసలు వజ్రానికి మరియు నకిలీ వజ్రానికి మధ్య ఉన్న తేడాను పసిగట్టగల నేర్పు ప్రదర్శించుట వలన అతను విడుదల అయ్యి తిరిగి తన సింహాసనాన్ని పొందగలిగాడు.

1632లో చోటానాగ్ పూర్ ని పాట్నా గవర్నర్ కి జాగీరుగా ఇచ్చారు, దీని కోసం సంవత్సరానికి వీరు కట్టించుకున్న కప్పం 136000 రూపాయలు. ఇది 1636 A.D.కి 161000 రూపాయలకు పెరిగింది. మహమ్మద్ షా (1719–1748) ఏలుబడిలో, అప్పటి బీహార్ గవర్నర్ సర్బల్ల్లంద్ ఖాన్ చోటానాగ్ పూర్ రాజాకు విరుద్ధంగా నడిపించి ఆయన విధేయతను పొందాడు. 1731లో బీహార్ గవర్నర్ ఫఖ్రుద్దౌల సారథ్యంలో మరొక దండ యాత్ర జరిగింది. ఈయన చోటానాగ్ పూర్ రాజాతో కొన్ని ఒప్పందాలకు వచ్చాడు.

ఈ పరిస్థితి బ్రిటీషు వారు మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకునే వరకు అలాగే ఉండింది. ముస్లింల హయాంలో ఈ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు రాంగడ్, కుండా, చాయ్ మరియు ఖారగ్దిహ. 1831లో కోల్ తిరుగుబాటు తరువాత హజారీ బాగ్ మరీ గణనీయమైన మార్పులు ఏవి జరగనప్పటికీ ఈ రాజ్యం యొక్క పరిపాలన విధానాలు మాత్రం మారాయి. రాంగడ్, ఖారగ్దిహ మరియు కుండా పరగణాలు దక్షిణ-పశ్చిమ సరిహద్దు ఏజన్సీలో భాగాలు అయ్యాయి మరియు హజారీబాగ్ పేరుతో పరిపాలన ముఖ్య పట్టణంగా ఒక విభాగంగా ఏర్పడ్డాయి.

బ్రిటీషు వారి ఏలుబడిలో ఎవరైనా హజారీబాగ్ కు పోవాలంటే రైల్లో గిరిడిలో దిగి పుష్-పుష్ అనే వాహనంలో ప్రయాణం చేయాల్సి వచ్చేది. వీటిని మానవ బలంతో నెట్టుకుంటూ కొండ ప్రాంతాలలో లాక్కుంటూ వెళ్ళేవారు. నదుల మధ్య మరియు బందిపోట్లు మరియు కౄర జంతువులు పొంచి ఉండే దట్టమైన అడవుల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక ఉత్కంఠ భరిత ప్రయాణంగా ఉండేది. 1885లో ఈ మార్గంలో పుష్-పుష్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రయాణించారు. ఆయన చోటానాగ్ పూర్ ఫామిలీస్ అనే ఒక వ్యాసంలో తన అనుభవాలను వ్రాశారు. 1906లో గ్రాండ్ కార్డ్ ప్రారంభం అయిన తరువాత హజారీబాగ్ రోడ్డు స్టేషను పట్టణానికి కలుపబడింది. చాలా సంవత్సరాల వరకు, లాల్ మోటార్ కంపెనీ వారు హజారీ బాగ్ పట్టణం మరియు హజారీబాగ్ రోడ్డు స్టేషను మధ్య రైలు-మరియు-బస్సు సౌకర్యాన్ని నడిపారు.

సైనిక శిక్షణ శిబిర పట్టణం[మార్చు]

1790లో ఈ పట్టణం ఒక సైనిక శిక్షణ శిబిరంగా మారింది, రాంగడ్ దళము పది సంవత్సరముల ముందుగానే ఏర్పడింది. ఆ తరువాత ఇది రాంగడ్ జిల్లాలో ఒక భాగం అయింది. 1834లో ఇది జిల్లా ప్రధాన ప్రాంతంగా మారింది. ఈ శిక్షణ శిబిరం 1884 వరకు వర్ధిల్లింది.ఇది ఒక క్రమమైన పాత నగరానికి మార్గం వేసింది. దానిని రూపొందించిన అధికారి పేరు మీద పట్టణంలో ఈ ప్రాంతముని బొద్దాం బజార్ అని పిలుస్తారు. బ్రిటీషు హయాంలో చాలా మంది ఆంగ్ల అధికారులు హజారీబాగ్ లో స్థిర పడ్డారు. వారు ఎక్కువగా జాలువారుతున్నట్లు ఉండే పైకప్పులతో ఉండే పెద్ద బంగ్లాల వంటి గృహములు కట్టుకున్నారు. వీరిలో చాలా మంది మంచి వేటగాళ్ళు ఉన్నారు మరియు వారి వేటకు సంబంధించిన విశేషాలు పట్టణంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. వీరిలో చాలా మంది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వెళ్ళిపోయారు. టుటు ఇమాం పట్టణంలోని నైపుణ్యం కల వేటగాళ్ళ జాబితాను తయారుచేసారు. ఒక శతాబ్దం ముందు వరకు పట్టణం పొలిమేరలలో ఉండే పశువుల కొరకు పులులు మరియు చిరుతలు పొంచువేసి ఉండేవి.

హజారీబాగ్ కేంద్ర కారాగారం లో Dr. రాజేంద్ర ప్రసాద్ సహా భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న అనేక మంది నాయకులు ఉన్నారు, ఆ తరువాత ఆయన భారత దేశ మొట్ట మొదటి రాష్ట్రపతి అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఈ కారాగారంలో ప్రముఖ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ని బంధించి ఉంచారు. స్థానికుల సహాయంతో ఆయన అధిక భద్రత ఉండే ఈ కారాగారం నుండి తప్పించుకొన్న సంఘటన భారత స్వాతంత్ర్యసమర చరిత్రలో లిఖించతగ్గది.

రెండవ ప్రపంచ యుద్ధంనికి ముందు సంవత్సరాలలో జర్మనీ పౌరుల కొరకు పట్టణంలో ఒక కారాగార శిబిరం ("పరోల్ శిబిరం") ఉండేది. 1942 జూన్ లో ఇది 36 మహిళలు, 5 పురుషులు మరియు 16 పిల్లలను నిర్బంధించారు. 21 మహిళలను 13 మంది పిల్లలతో 1942 ఫిబ్రవరి 25 డియాతలావ నుండి బదిలీ మీద వచ్చారు. శరత్కాలంలో వారిని పురంధర్ లేదా సతారాలోని కుటుంబ శిబిరాలకు బదిలీ చేసారు.[1]

పూర్వ బెంగాలి నివాసితులు[మార్చు]

ఈ ప్రదేశము బెంగాల్ సంస్థానంలో ఉన్నప్పుడు మరియు బ్రిటీషు పరిపాలన ఆంగ్ల విద్యలో ప్రావీణ్యం ఉన్న వారికోసం చూస్తున్నప్పుడు ఒక చిన్నదైనదే కాని ప్రభావవంతమైన బెంగాలీ వర్గం పంతొమ్మిదవ శతాబ్దంలో హజారీబాగ్ లో స్థిరపడింది. ఈ చిన్న వర్గం ఈ ప్రదేశాన్ని అభివృద్ధిలో గణనీయంగా పాలు పంచుకున్నారు.

రాయ్ బహదూర్ జడునాథ్ ముఖోపాధ్యాయ్ (ముఖర్జీ) ముందుగా వచ్చి స్థిరపడినవారుగా చెప్తారు. ఈయన పట్టణంలో దుర్గ పూజ మండపం, బ్రహ్మో సమాజ్ మరియు మొదటి బాలికల పాఠశాల స్థాపించుటకు సహాయపడ్డారు. చంచల నియోగి 1895 ప్రాంతంలో మొట్టమొదట పాఠశాల వెళ్ళిన అమ్మాయి. ఆ రోజుల్లో ప్రజలు వారి ఆడపిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించుట అంటే వారి వైధవ్యానికి వారే మార్గాన్ని ఏర్పరుస్తున్నట్లుగా భావించేవారు. 1920 ప్రాంతంలో, బ్రజ కుమార్ నియోగి చొరవ తీసుకుని ముఖ్యంగా రాజా రాంగడ్ ఎస్టేటు నిధులతో నూతన పాఠశాల భవనమును నిర్మించారు. మహేష్ చంద్ర ఘోష్, మరియు ధీరేంద్రనాథ్ చౌదరి వంటి గొప్ప విద్యార్థులు ఆ పట్టణాన్ని తమ స్వంత నివాసం చేసుకున్నారు. కవయిత్రి కామిని రాయ్ ఈ పట్టణంలో కొన్ని సంవత్సరాలు నివసించారు. మన్మథనాథ్ దాస్ గుప్తా, ఒక బ్రహ్మ సమాజ సభ్యుడు అణగారిన వర్గాల కోసం పనిచేస్తూ చాలా సంవత్సరాలు హజారీబాగ్ లో నివసించారు. శరత్ కుమార్ గుప్తా పట్టణమును అభివృద్ధి పరచు కార్యక్రమములలో అనేక విధములుగా పాలు పంచుకున్నారు. వైద్యులు మందింద్ర భూషణ్ బెనర్జీ (పన్నా బాబు), బికాష్ కుమార్ సేన్, శంభునాథ్ రాయ్ మరియు బెనోయ్ చంద్ర చటర్జీ వంటి వారు ప్రముఖ వ్యక్తులు. సుజాత వంటి అనేక హిందీ చిత్రాల రచయిత ప్రముఖ బెంగాలి గ్రంథకర్త మరియు రచయిత సుబోద్ ఘోష్ హజారీబాగ్ లో పుట్టి పెరిగారు. ఆయన అనేక కథలు ఈ ప్రాంతంలోనే వ్రాసారు.

గొప్ప బ్రహ్మ సమాజ నాయకుడు కేశబ్ చందర్ సేన్ తన ఆరోగ్య స్వస్థత కొరకు త్రైలోక్యనాథ్ సన్యాల్ తో కలిసి 1874లో హజారీబాగ్ ని దర్శించారు. ఆయన అక్కడ గడిపిన ఆ తక్కువ సమయం గురించి చాలా వ్రాశారు మరియు భద్రోత్సవ్ ఉత్సవాలలో పాల్గొన్నారు. 1884లో ఆయన మరణం తరువాత ప్రధాన రహదారిలో ఉన్న ఒక బహిరంగ మందిరముకు ఆయన స్మృతిగా కుశబ్ హాల్ అని పేరు పెట్టారు. బ్రహ్మ సమాజకులలో తరచుగా హజారీబాగ్ దర్శించిన వారు ప్రమతలాల్ సేన్.

రాయ్ బహదూర్ కలిపాడ సర్కార్ ప్రముఖ న్యాయవాది. ఈయన మున్సిపాలిటీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు, న్యాయవాది మండలి అధ్యక్షుడు మరియు పరిషత్తు సభ్యుడు. సమయానుకూలంగా, KP సర్కార్ హజారీ బాగ్ మున్సిపాలిటీకి మొట్టమొదటి భారతీయ అధ్యక్షుడు అయ్యారు.

20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగంలోని మరియొక ప్రముఖ బెంగాలి వ్యక్తి రాయ్ బహదూర్ సురేంద్రనాథ్ రాయ్, ఈయన ప్రముఖ ప్రభుత్వ న్యాయవాది మరియు మంచి కళా పోషకుడు. సురేన్ బాబు 1902లో హజారీ బాగ్ సివిల్ న్యాయస్థానములో న్యాయవాద వృత్తిని చేపట్టుటకు రఘునాథ్ పూర్ (నాడియా, బెంగాల్) అనే గ్రామం నుండి వలస వచ్చారు, ఆయన అక్కడ ఒక జమిందార్ (জমিদার) మరియు 'రాయ్ బహదూర్' అనే నామమును బ్రిటీషువారు ఆయనను సంబోధించునప్పుడు ఉపయోగించేవారు. ఒక సమయంలో ఆయన న్యాయవాద మండలికి అధ్యక్షుడిగా ఉన్నారు మరియు అన్నడ ఉన్నత పాఠశాలకు (బెంగాలి పాఠశాల) సహ వ్యవస్థాపకుడు. ఈయన మినార్ కామాఖ్య నారాయణ్ సింగ్ కి ప్రతినిధిగా కూడా వ్యవహరించారు, రాంగడ్ రాంగడ్ రాజ్ కి మాజీ రాజు.

ఆర్థికవ్యవస్థ[మార్చు]

బొగ్గు గనులు మరియు విద్యుత్ కేంద్రం[మార్చు]

హజారీబాగ్ బొగ్గు నిల్వలో జార్ఖండ్ లో రెండవ స్థానంలో ఉంది (మొదటి స్థానంలో ధన్ బాద్ ప్రాంతం ఉంది) మరియు అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలానే ఉంది. ఇటీవల ఈ ప్రాంతంలో కోల్ ఇండియా లిమిటెడ్ ఉపశాఖ అయిన కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు త్రవ్వకాల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అక్కడ NTPC యొక్క 3000MW ఉత్పత్తి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, మరియు రిలయన్స్ పవర్స్ 3600MW థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉత్పత్తి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి. ఒక ముఖ్య NTPC టౌన్ షిప్ కూడా పట్టణానికి 10 కిమీ దూరంలో రాబోతుంది. బొగ్గు, నీరు మరియు విద్యుత్తు సమీపంలో ఉండుట మూలంగా అనేక ఉక్కు కర్మాగారాలు మరియు అనేక ఇతర కర్మాగారాలు ఇటువైపు దృష్టి సారిస్తున్నాయి. దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ కు హజారీబాగ్ లో అనేక కార్యాలయాలు ఉన్నాయి.

హజారీబాగ్ కు ఇప్పటికి రైలు మార్గము లేదు (అడవులు మరియు కొండ ప్రాంతాలతో నిండి ఉండుట వలన) అయినప్పటికీ కోడెర్మ స్టేషనుతో రైలు మార్గమును అనుసంధానిస్తూ ఏర్పరుస్తున్న పని దాదాపు పూర్తి కావస్తుంది (గ్రాండ్ కార్డ్ లైన్)

విద్య[మార్చు]

హజారీబాగ్ చల్లని వాతావరణం మరియు ప్రశాంతమైన పరిసరాలు విద్యావేత్తలను ఈ పట్టణంలో విద్యా సంస్థలను నెలకొల్పుటకు ఆకర్షించాయి. డబ్లిన్ మిషన్ విద్యా సంస్థలతో మరియు మహిళల యొక్క ఆసుపత్రితో గొప్ప ఉనికిని చాటింది. హజారీబాగ్ మిషన్ యొక్క కార్యకలాపాలు ట్రినిటి కళాశాల, డబ్లిన్, ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో 1890లో మొదలయ్యాయి. బీహార్ లో St. కొలంబస్ కళాశాల ప్రాచీనమైనది. ఎ.ఎఫ్.మర్ఖంకి కళాశాలతో చాల సంవత్సరాల అనుబంధం ఉంది, అతని జీవిత కాలంలో ఇది ఒక గొప్ప విషయం. ఆ తరువాత అతను రాంచి విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయ్యారు. హజారీబాగ్ కు ఇప్పుడు పట్టణ సరిహద్దులలో సెయింట్ వినోబాభావే పేరుమీద వినోబా భావే విశ్వవిద్యాలయం ఉంది. ఇది జార్ఖండ్ యొక్క రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయం. సెయింట్ కొలంబస్ కళాశాల, ధన్ బాద్ వైద్య కళాశాల మరియు అనేక ఇంజనీరింగ్ మరియు స్థానిక కళాశాలలు ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి.

స్వాతంత్ర్యానంతరం రోమన్ కాథలిక్కులు, మౌంట్ కార్మెల్ అను బాలికల పాఠశాలను స్థాపించారు. దీనికి సమాంతరంగా రెవరెండ్ ఫాదర్ జాన్ మూరే, ఒక ఆస్ట్రేలియా దేశ జెసూట్ మిషనరీ, 1952లో సెయింట్ జేవియర్స్ ను ఏర్పాటు చేసారు.

హజారీబాగ్ లో మొత్తం జార్ఖండ్ యొక్క రక్షకభట శిక్షణాలయం ఉంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (BSF) కు కూడా గొప్ప ఉనికి ఉంది. ఇక్కడ అడవిలో కొండలతో కూడిన భూభాగంతో తూర్పు భారత దేశం యొక్క అతి పెద్ద శిక్షణ కేంద్రం ఉంది.
హజారీబాగ్ నేషనల్ పబ్లిక్ స్కూల్ 1977 లో స్థాపించారు. N.P.S విద్యార్థులు పరీక్షలలో అధ్బుతమైన ప్రతిభను చూపుతారు.

'మా ప్రచారక వర్గం', నేషనల్ పబ్లిక్ స్కూల్, న్యూ ఏరియా, హజారీబాగ్, వివేచానాత్మక వైవిధ్యం మరియు విభిన్న సంస్కృతుల నేపథ్యం కలిగిన విద్యార్థులకు అనేక విభాగాలలో ఒక ఉన్నత స్థాయి శిక్షణను అందిస్తుంది. ఒక ఆదరమైన మరియు ప్రేమపూరితమైన లోగిలిలో నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యా నైపుణ్యాలకు విలువనిస్తూనే మరొక వైపు శిశు వికాశంలో సృజనాత్మక, సామాజిక మరియు ఉద్వేగభరిత కోణాలు వెలికితీస్తుంది.

మా మార్గదర్శక సూత్రాలు నేషనల్ పబ్లిక్ స్కూల్, హజారీబాగ్ విద్యార్థులకు వారి యొక్క సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుకొనుటకు అద్భుతమైన ఉపకరణ సౌకర్యాలు, అమితమైన వ్యవస్థ యొక్క ఆదరణ మరియు విస్తారమైన అవకాశాలను అందిస్తుంది. ఈ పాఠశాల దాని యొక్క విద్యార్థులకు ఒక ప్రపంచ వ్యాప్త పౌరులుగా ఎదుగుదల, స్వంతంత్ర ఆలోచనపరులుగా తయారు చేయగల ఆధునిక, పవిత్ర మరియు సమైక్య సిద్ధాంత విద్యను అందిస్తుంది. మా పాఠ్యంశాలు మరియు శిక్షణ విధానాలు మారుతూ ఉండే సామాజిక అవసరాలకు మరియు మారుతున్న శాస్త్రీయ ప్రపంచాన్ని అనుసరిస్తూ సాగుతాయి. ఈ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుత పోకడల గురించి వారి యొక్క విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొనుటకు మరియు వారిని వారు ప్రపంచంలోని ఆధునిక అభివృద్ధులకు పరిచయం చేసుకునే విధంగా ప్రేరణను ఇస్తాయి. నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులలో పౌర కర్తవ్య భావనను మరియు సమాజం పట్ల చూపాల్సిన బాధ్యతను పెంపొందిస్తుంది. కుటుంబం మరియు పాఠశాల మధ్య ఉండే పరస్పర అనుబంధం విద్యార్థియొక్క విజయానికి మరియు ఎదుగుదలకు పునాది అని ఒక విద్యా వ్యవస్థగా, మా నమ్మకం. ఈ విద్యా సంస్థ యొక్క గుమ్మాలు దాటే విద్యార్థులు వారు చేసే పని పట్ల చిత్తశుద్ధి మరియు నిభద్ధతను కలిగి ఉంటారు. కల....... కలలను సాకారం చేసుకోవటం ఆలోచన.........ఆలోచనలకు స్పష్టతను మరియు ఆకారమును ఇచ్చుట ఊహించుట.... మానవాళి కొరకు ఒక ఉపయుక్తమైన భవిష్యత్తు

DAV పబ్లిక్ స్కూల్, హజారీబాగ్ 1992లో స్థాపించారు. సెయింట్ స్టీఫెన్స్ స్కూల్, స్వామి వివేకానంద్ స్కూల్, ఈస్ట్ పాయింట్ స్కూల్, సరస్వతి విద్యా మందిర్, నామన్ విద్య మరియు ఏంజెల్స్ హై ఇటీవల ఇక్కడ ప్రారంభించిన నూతన పాఠశాలలు. B.D.J.J ఇంటర్ కాలేజీ గ్రామీణ హజారీబాగ్ విద్యా వ్యవస్థకు సహాయం చేస్తున్న వేరొక కళాశాల. దివంగత గ్యాని రామ్ పేరు మీద 2008లో స్థాపించిన గ్యాన్-జ్యోతి మెమోరియల్ కాలేజీ మరో ఉత్తమ కళాశాల, ఈ కళాశాల యాజమాన్యం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేస్తుంది.

మునం పబ్లిక్ స్కూల్, మహారాజ్ గంజ్ 1995లో స్థాపించారు.ఇది జార్ఖండ్ లో అక్ష్యరాస్యతాపరంగా బాగా వెనుకబడి ఉన్న ప్రాంతం మహార్జ్ గంజ్, చుపరన్, హజారీబాగ్ లో ఉంది. ఈ సంస్థను హజారత్ మునం పాక్ తలీని మఠం వారు శ్రీ మతినుల్ హసన్ గారి అధ్వర్యంలో స్థాపించారు.ఈ మఠం వారు జార్ఖండ్ యొక్క గ్రామీణ ప్రాంతాల కొరకు మరియు అల్ప సంఖ్యాక ముస్లిం వర్గాల వారి కొరకు మరియు పేద తండా ప్రజల కొరకు పని చేస్తారు. గడచిన శతాబ్దంలో మునం పబ్లిక్ స్కూల్ ప్రాథమిక భాగం నుండి ఉన్నత పాఠశాలగా మారింది మరియు ఇది ఇప్పుడు న్యూఢిల్లీకి C.B.S.E అనుబంధ సంస్థగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ పాఠశాల నుండి 100 మంది బాలబాలికలు ఉత్తీర్ణులై వివిధ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో ప్రవేశం పొందుతున్నారు.

జనాభా[మార్చు]

As of 2001భారత జనాభాలెక్కలు [2] ప్రకారం హజారీబాగ్ జనాభా సంఖ్య 51,342. మొత్తం జనాభాలో పురుషులు 53%, మహిళలు 47% మంది ఉన్నారు. హజారీబాగ్ సగటు అక్ష్యరాస్యత శాతం 76%, ఇది 59.5%గా ఉన్న జాతీయ సగటు అక్ష్యరాస్యత శాతం కన్నా ఎక్కువ హజారీబాగ్ లో 13% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సును కలిగినవారు.

ఈ ప్రాంతం మరియు పట్టణం యొక్క ప్రజలు బ్రహ్మాండంగా హిందీ మాట్లాడుతారు.ఇక్కడ అక్కడక్కడ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సంతాలి మాట్లాడే ప్రజలు కనిపిస్తారు. ఇక్కడ తగు మాత్రం ముస్లిం ప్రజలు ఉన్నారు. బెంగాలీలు, మార్వాడీలు మరియు పంజాబీలు అల్ప సంఖ్యలో ఉన్నారు.

రాజకీయాలు[మార్చు]

రాంగడ్ రాజాకి ఈ ప్రదేశంలో మంచి ఘనత ఉంది, బ్రిటీషు పాలనకు ముందు మరియు స్వాతంత్ర్యానంతరం ఆయన జనతా పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీకి ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలు ప్రజాదరణ ఉండేది. వారి స్వస్థలం పద్మ బార్హి మార్గం మీద ప్రముఖ ప్రదేశం.

ఒక ప్రముఖ స్వంతంత్ర సమర యోధుడు మరియు ఆ తరువాతి కాలంలో బీహార్ ముఖ్య మంత్రి అయిన కృష్ణ వల్లభ్ సహాయ్ (తండ్వా ప్రదేశంలోని ఒక గ్రామం అయిన ఖాదియ లో జన్మించారు) హజారీబాగ్ కు చెందినవారు. రెవిన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బీహార్ లోని జమీందారి వ్యవస్థను నిర్మూలించుటకు కృషి చేసారు. 1952లో దేశంలో అటువంటి శాసనాలలో అదే మొట్టమొదటిది. కామాఖ్య నారాయణ్ సింగ్, రాంగడ్ రాజా మరియు కె.బి.సహాయ్ ల మధ్య ఉన్న రాజకీయ విరోధం ఇరవైయ్యోవ శతాబ్దంలోని యాభైలలో పట్టణంలో పెద్ద చర్చగా ఉండేది.

1951లో జరిగిన మొట్టమొదటి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ నుండి నాగేశ్వర్ ప్రసాద్ సిన్హా హజారీబాగ్ తూర్పు స్థానాన్ని మరియు స్వతంత్ర అభ్యర్థి బాబూ రాంనారాయణ్ సింగ్ హజారీబాగ్ పశ్చిమ స్థానాన్ని గెలుచుకున్నారు. 1957లో రాంగడ్ రాజా కుటుంబానికి చెందిన లలిత రాజ్యలక్ష్మి ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. కామాఖ్య నారాయణ్ సింగ్ చిన్న తమ్ముడైన బసంత్ నారాయణ్ సింగ్, వరుసగా 1962, 1967 మరల తరువాత 1977 మరియు 1980లో మొత్తం నాలుగు పర్యాయములు ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ పాండే 1971లో అక్కడ గెలుపొందారు. 1989లో BJPకి చెందిన యదునాథ్ పాండే గెలుపొందారు. 1991 మరియు 2004లో CPI కి చెందిన భువనేశ్వర్ ప్రసాద్ మెహతా గెలుపొందారు. 1996 లో BJPకి చెందిన మహాబీర్ లాల్ విశ్వకర్మ ఆ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. BJPకి చెందిన యశ్వంత్ సిన్హా 1998లో ఆ స్థానంలో గెలుపొంది ఆర్థికశాఖ మంత్రి అయ్యి ఆ తరువాత NDA ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా చేసారు. ఈయన 2009 లోక్ సభ ఎన్నికలలో కూడా ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. CPI నుండి భువనేశ్వర్ ప్రసాద్ మెహతా చివరిసారిగా హజారీబాగ్ లో గెలుపొందారు.

హజారీబాగ్ టైమ్స్ ఒక స్థానిక వార్తాపత్రిక.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

 1. హజారీబాగ్ జాతీయ వనం తిప్పలతో, లోతైన కాలువలతో, దట్టమైన ఉష్ణమండల అడవులుతో మరియు పచ్చని మైదానాలతో ఉంటుంది. ఈ అభయారణ్యం క్రూర ఎలుగుబంట్లు, సాంబార్, మనుబోతులు, దుప్పి మరియు కాకర్ (మొక్కలను మరియు చిన్న చిన్న జీవులను తినే ఒక జీవి), ఎలుగు బంట్లు, పులి మరియు చిరుతపులిలను కలిగి ఉంది.
 2. కానరీ కొండ ప్రకృతి ఆరాధకులకి పేరుగాంచిన ప్రదేశం. కొండలపైన ఒక అథితి గృహం మరియు ఒక పహారా బురుజు ఉన్నాయి. ఇటీవల ఆ ప్రదేశంలో పులులు మరియు జింకల ఒక సహజ వేట ప్రయాణమును ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదనను సమర్పించారు.
 3. హజారీబాగ్ సరస్సు దగ్గర ఉన్న స్వర్ణజయంతి కెఫిటేరియా ఒక గొప్ప కుటుంబ ఆకర్షణ.
 4. పాంచ్ మందిర్
 5. విష్ణు భగవానుని యొక్క నరసింహ అవతారానికి (అవతారం) అర్పించబడిన నరసింహాలయం.
 6. సూరజ్ కుండ్ వేడి నీటి బుగ్గ.

సమీప ప్రదేశాలు[మార్చు]

 1. హజారీబాగ్ కెఫిటేరియా సరస్సుచే ఆవరింపబడి ఉంది.
 • కోడెర్మ ప్రపంచం మొత్తం మీద 60%-65% వరకు మైకాని ఉత్పత్తి చేస్తుంది, ఇది పట్టణం నుండి 60 కిమీ దూరంలో ఉంది.
 • బార్కర్ నది మీద కట్టిన తిలియ ఆనకట్ట చిన్న చిన్న కొండలతో చాలా అందంగా ఉంటుంది మరియు దానికి దగ్గరలో ఒక సైనిక పాఠశాల కూడా ఉంది.
 • కోణార్ ఆనకట్ట హజారీబాగ్ నుండి 51 కిమీ ఉంటుంది.
 • సూరజ్ కుండ్ వేడి నీటి బుగ్గ హజారీబాగ్ నుండి 72 కిమీ దూరంలో ఉంటుంది. దీనిలో వేడిగా మరుగుతూ ఉండే నీరు చర్మవ్యాధుల మరియు కీళ్ళవాతం చికిత్సకు ఉపయోగపడుతుంది. ఇది బరకత్తకి దగ్గరలో బెల్కప్పి నుండి 2 కిమీ దూరంలో గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద బార్హి మరియు బాగోదర్ మధ్య సగం దారిలో ఉంటుంది.

సూచనలు[మార్చు]

 1. Auswärtiges Amt; 6. Merkblatt über die Lage der Deutschen in Britisch-Indien; die Internierungslager auf Ceylon und Jamaica; Berlin 1941; (Dez. 1942)
 2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

https://web.archive.org/web/20180414060730/http://suwidha.com/

దయచేసి పర్యాటక వివరాలను గమనించండి -

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

మూస:North Chotanagpur Division