గొడ్డా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Godda జిల్లా
गोड्डा जिला
Jharkhand జిల్లాలు
Jharkhand రాష్ట్రంలో Godda యొక్క స్థానాన్ని సూచించే పటం
Jharkhand రాష్ట్రంలో Godda యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Jharkhand
డివిజన్ Santhal Pargana division
ముఖ్యపట్టణం Godda
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Godda (shared with Deoghar and Dumka districts)
 • శాసనసభ నియోజకవర్గాలు 3
విస్తీర్ణం
 • మొత్తం 2,110
జనాభా (2011)
 • మొత్తం 1
 • సాంద్రత 620
జనగణాంకాలు
 • అక్షరాస్యత 57.68 per cent
 • లింగ నిష్పత్తి 933
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో గొడ్డా జిల్లా (హిందీ : गोड्डा जिला) ఒకటి. ఈ జిల్లా రాష్ట్రం ఈశాన్య భూభాగంలో ఉంది. గొడ్డా మునుపటి శాంతల్ పరగణాలు జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాకు గొడ్డా పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,110 చ.కి.మీ, జనసంఖ్య 861,000. జిల్లాలో రైలు మార్గం లేదు. జిల్లాకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషను బరాహత్ . జిల్లాకు వ్యవసాయం ప్రధానమైన ఆర్థిక వనరుగా ఉంది. జిల్లాలో వరి, గోధుమ మరియు మొక్కజొన్న ప్రధాన పంటలుగా ఉన్నాయి.

  • గొడ్డా ప్రధానంగా గిరిజన భూమి అయినా ప్రస్తుతం ఇక్కడ గిరిజనేతర ప్రజలు కూడా నివసిస్తున్నారు.

ఆర్ధికం[మార్చు]

లామహల్‌లో ఉన్న రాజ్‌మహల్ బొగ్గుగనులకు గొడ్డా ప్రఖ్యాతి చెందింది. ఇది కొండలకు మరియు చిన్న అరణ్యాలకు పసిద్ధిచెందింది. ఇక్కడ ఉన్న ఇ.సి.ఎల్ బొగ్గు గనులు ఆసియాలోనే పెద్దదని భావిస్తున్నారు.

గనులు మరియు పరిశ్రమలు[మార్చు]

1980 వరకు గొడ్డా పూర్తిగా అరణ్యాలతో నిండి ఉంది. సైన్సు మరియు టెక్నాలజీకి ఇది దూరంగా ఉంది. అంతేకాక జార్ఖండ్ రాష్ట్రంలో ఈ ప్రాంతం చాలాకాలం అంధకారంలోనే ఉండిపోయింది. " జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా " రాజ్‌మహల్ కొండల పాదాల వద్ద విస్తారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలియజేసేదాకా అది వెలుపలి ప్రపంచానికి అపరిచితంగానే ఉంది. తరువాత " సెంట్రల్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇంస్టిట్యూట్ లిమిటెడ్ " సవివరమైన సర్వే చేసింది. " ది రాజ్‌మహల్ ఓపెన్‌కాస్ట్ కోయల్ మైన్ ప్రాజెక్ట్ " 1980లో స్థాపించబడింది. ఇది ఆరంభకాలంలో " ఫరక్కా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్.టి.పి.సి "కు బొగ్గు సరఫరా చేసింది. ఆరంభకాల వార్షిక ఉత్పత్తి 5 మిలియన్ టన్నులు. తరువాత ఇది 10.5 మిలియన్ టన్నులకు అభివృద్ధి చేయబడింది. 1989లో " కెనెడియన్ కమర్షియల్ కార్పొరేషన్ " మరియు " కోయిల్ ఇండియా " నడుమ ఒప్పందం కుదిరింది. ఎం.ఇ.టి - కెమికల్స్ కెనడా ఐ.ఎన్.సి " కెనెడియన్ ఎగ్జిక్యూటివ్ బృందం ప్రాజెక్ట్ రూపకల్పన జరుగింది. 1994లో ఈ ప్రాజెక్ట్ పని పూర్తి అయింది. ప్రస్తుతం ఇది " ఈస్టర్న్ కోయిల్ ఫీల్డ్ లిమిటెడ్ " నిర్వహణలో పనిచేస్తుంది. ఇది వార్షికంగా 11.5 టన్నుల బొగ్గును ఉత్పత్తి వేస్తుంది.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గొడ్డా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విద్య[మార్చు]

జవహర్ నవోదయ విద్యాలయ Lalmatia, DAV పబ్లిక్ స్కూల్ ఊర్జా నగర్, సెయింట్ థామస్ స్కూల్లో Godda మరియు హై స్కూల్ Godda godda జిల్లాలో ప్రసిద్ధ మరియు ఉత్తమ పాఠశాల ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

గొడ్డా జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది: గొడ్డా. ఇది అదనంగా 9 బ్లాకులుగా విభజించబడ్డాయి : బోయరిజోర్, గొడ్డా, మహాగమా, మెహరమ, పథర్గమ, పొరైయహత్, సునదర్పహరి, థాకూర్గంటి మరియు బసంతరి ( సరికొత్తగా ఏర్పాటు చేయబడింది).

  • జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: పొరెయహత్, గొడ్డా మరియు మహాగమా. ఇవన్నీ గొడ్డా పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,311,382,[2]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 372వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 622 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.14%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 933:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 57.68%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. 
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est.  line feed character in |quote= at position 10 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470  line feed character in |quote= at position 14 (help)

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలిలింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గొడ్డా&oldid=1973416" నుండి వెలికితీశారు