అక్షాంశ రేఖాంశాలు: 24°12′16″N 84°52′37″E / 24.2045100°N 84.8770400°E / 24.2045100; 84.8770400

ఛత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛత్రా
పట్టణం
ఛత్రా is located in Jharkhand
ఛత్రా
ఛత్రా
జార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°12′16″N 84°52′37″E / 24.2045100°N 84.8770400°E / 24.2045100; 84.8770400
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాఛత్రా
విస్తీర్ణం
 • Total16 కి.మీ2 (6 చ. మై)
జనాభా
 (2011)
 • Total49,985
 • జనసాంద్రత3,100/కి.మీ2 (8,100/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
PIN
825401
Telephone/ STD code06541
Vehicle registrationJH

ఛత్రా, జార్ఖండ్ రాష్ట్రం, ఛత్రాా జిల్లా లోని పట్తణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం.

18 వ -19 వ శతాబ్దంలో ఛత్రా, రామ్‌గఢ్ జిల్లాకు ముఖ్యపట్టణంగా ఉండేది. ప్రఖ్యాత సంస్కర్త, రాజా రామ్మోహన్ రాయ్, 1804–05లో రామ్‌గఢ్ జిల్లాలో షెరిస్టదారుగా ఉండేవాడు. రామ్‌గఢ్, ఛత్రా రెండు చోట్లా పనిచేసేవాడు. తదనంతరం, రామ్‌గఢ్ జిల్లా నార్త్-వెస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీలో భాగమైంది. హజారిబాగ్ జిల్లా ఏర్పడింది. 1914 లో ఛత్రా, హజారిబాగ్ జిల్లాలో ఒక ఉపవిభాగంగా మారింది. 1991 లో ఇది పూర్తి స్థాయి జిల్లాగా మారింది. [1] [2]

భౌగోళికం

[మార్చు]

స్థానం

[మార్చు]

ఛత్రాా 24°12′16″N 84°52′37″E / 24.2045100°N 84.8770400°E / 24.2045100; 84.8770400 వద్ద ఉంది.

ఛత్రా చుట్టుపక్కల అనేక జలపాతాలు ఉన్నాయి: గువా జలపాతం (6 కి.మీ.), కేరిడా జలపాతం (8 కి.మీ.), మలుదా జలపాతం (8 కి.మీ.), బిచ్కిలియా (11 కి.మీ.). బల్బల్ దువారి (25 కి.మీ.) వద్ద వేడి నీటి బుగ్గ ఉంది. [3]

అవలోకనం

[మార్చు]

జనాభా వివరాలు

[మార్చు]
Population of Chatra 
CensusPop.
190110,599
19119,222-13.0%
19218,225-10.8%
19318,7586.5%
19419,63810.0%
19519,9112.8%
196112,50726.2%
197116,73733.8%
198122,73835.9%
199131,14737.0%
200142,02034.9%
201149,98519.0%
Source:[4]

2011 భారత జనగణన ప్రకారం, ఛత్రా (లొకేషన్ కోడ్ 801765) జనాభా 49,985, ఇందులో 26,555 (53%) పురుషులు, 23,430 (47%) మహిళలు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల జనాభా 7,800. ఛత్రాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 33,746 (6 సంవత్సరాలలో జనాభాలో 80.00%). [5]

2001 జనాభా లెక్కల ప్రకారం, ఛత్రా జనాభా 41,990, ఇందులో 22,331 మంది పురుషులు, 19,659 మంది మహిళలు ఉన్నారు. 27,409 మంది అక్షరాస్యులు. [6] [7]

రవాణా

[మార్చు]

ఛత్రా NH 22, NH 522 ల కూడలి వద్ద ఉంది.

చదువు

[మార్చు]

ఛత్రా కళాశాల 1961 లో స్థాపించారు. వినోబా భావే యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కాలేజీలో ఆర్ట్స్, సైన్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో కోర్సులు లభిస్తాయి. [8]

మూలాలు

[మార్చు]
  1. "The History of Chatra District". chatra.jharkhand.org. Retrieved 17 January 2021.
  2. "Profile". Chatra district website. Archived from the original on 2012-02-15.
  3. "Exploring Jharkhand". Jharkhand4u. Retrieved 2010-04-29.[dead link]
  4. "District Census Handbook Chatra, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Section II Town Directory, Statement I: Status and Growth History, Page 755. Directorate of Census Operations, Jharkhand. Retrieved 19 January 2021.
  5. "District Census Handbook, Chatra, Series 21, Part XII B" (PDF). Page 20: District Primary Census Abstract, 2011 census. Directorate of Census Operations Jharkhand. Retrieved 12 January 2021.
  6. "Census of India 2001". Table - 3 : Population, population in the age group 0-6 and literates by sex - Cities/Towns (in alphabetic order): 2001. Archived from the original on 2004-06-16. Retrieved 2010-04-09.
  7. "Pin Code of Chatra". citypincode.in. Retrieved 2014-05-12.
  8. "Chatra College, Chatra". College Dekho. Retrieved 19 January 2021.

 

"https://te.wikipedia.org/w/index.php?title=ఛత్రా&oldid=4014089" నుండి వెలికితీశారు