ఖుంటీ
ఖుంటీ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°00′50″N 85°16′21″E / 23.0140203°N 85.2724457°E | |
దేశం | India |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | ఖుంటీ |
Elevation | 611 మీ (2,005 అ.) |
జనాభా (2001) | |
• Total | 29,271 |
భాషలు | |
• అధికారిక | హిందీ, నాగ్‌పురీ, ముండారీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 835210 |
Telephone code | 06528 |
Vehicle registration | JH-23 |
Website | http://khunti.nic.in/ |
ఖుంటీ జార్ఖండ్ రాష్ట్రం, ఖుంటీ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది దక్షిణ ఛోటానాగ్‌పూర్ డివిజన్‌లో ఉంది. 2007 సెప్టెంబరు 12 న రాంచీ జిల్లా నుండి వేరు చేసి ఖుంటి జిల్లాను ఏర్పాటు చేసారు. ఇది చారిత్రికంగా బిర్సా ఉద్యమ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. 2011 నాటికి, ఖుంటీ జిల్లా లోహార్దాగా తర్వాత జార్ఖండ్‌లో రెండవ అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా. ఈ జిల్లా రెడ్ కారిడార్‌లో భాగం.
శీతోష్ణస్థితి
[మార్చు]ఖుంటీలో ఉష్ణమండల వర్షారణ్యం శీతోష్ణస్థితి ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు అత్యధిక వర్షపాతం జరుగుతుంది. ఇది మొత్తం వర్షపాతంలో 90% కంటే ఎక్కువ.
జనాభా
[మార్చు]2001 జనగణన ప్రకారం,[1] ఖుంటీ జనాభా 29,271. జనాభాలో పురుషులు 52%, మహిళలు 48% ఉన్నారు. ఖుంటీ సగటు అక్షరాస్యత రేటు 69%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీల అక్షరాస్యత 61%. ఖుంటీ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
రవాణా
[మార్చు]గాలి ద్వారా
[మార్చు]రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇది దాదాపు ఖుంటీ నుండి 33 కి.మీ.
రైలు ద్వారా
[మార్చు]ఖుంటీలో రైల్వే స్టేషన్ లేదు. సమీప స్టేషన్ హటియా రైల్వే స్టేషను. బస్సు లేదా టాక్సీల ద్వారా హటియా రైల్వే స్టేషన్, రాంచీ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు
మూలాలు
[మార్చు]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.