Jump to content

ఖుంటీ జిల్లా

వికీపీడియా నుండి
ఖుంటీ జిల్లా
खूंटी जिला
జార్ఖండ్ పటంలో ఖుంటీ జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో ఖుంటీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుదక్షిణ ఛోటా నాగ్‌పూర్
ముఖ్య పట్టణంఖుంటీ
Government
 • లోకసభ నియోజకవర్గాలుఖుంటీ
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం2,611 కి.మీ2 (1,008 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం5,30,299
 • జనసాంద్రత200/కి.మీ2 (530/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత64.51 %
 • లింగ నిష్పత్తి994
Websiteఅధికారిక జాలస్థలి
పెరూ గాగ్ జలపాతం

జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో కుంతీ జిల్లా (హిందీ: खूंटी जिला) ఒకటి. ఇది చోటానాగపూర్ డివిజన్‌లో భాగం. 2007 సెప్టెంబరు 17 న రాంచీ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి కుంతీ జిల్లా ఏర్పాటు చేయబడింది. చారిత్రాత్మకంగా " బిర్సా ముండా " ఉద్యమానికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది.[1] కుంతీ పట్టణం జిల్లాకు కేంద్రంగ ఉంది. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన జిల్లాలలో రెండవదిగా ఇది గుర్తించబడింది. మొదటి స్థానంలో లోహర్‌దర్గా జిల్లా ఉంది.[2] ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్లో భాగం.[3]

విభాగాలు

[మార్చు]
  • కుంతీ జిల్లాలో 6 కమ్యూనిటీ విభాగాలు ఉన్నాయి : అర్కి, కర్రా, కుంతి, ముర్హు, రాణియా, తొర్ప.
  • కర్రా బ్లాక్ ధుర్వాకు 30 కి.మీ దూరంలో, కుంతీ నుండి 18 కి.మీ దూరంలో ఉంది. సాయి గ్రామంలో సాయిబాబా మందిరం ఉంది. పురాతన కాలంలో గజిపూర్‌నుండి వ్యాపారులు ఇక్కడికి వచ్చి స్థిరపడినప్పటి నుండి కర్రా ప్రాంతానికి ఉత్తరప్రదేశ్తో సంబంధాలు ఉన్నాయి. పొరుగునా నవాకెల్, డాక్ఘర్, బరైక్తొలి స్టేషను, మహ్తో టోలి, మాస్మనొ, కర్రాచక్ టోలీలు ఉన్నాయి.

అమరేశ్వర్ ధాం (అంగ్రబరి) లో పలు ఆలయాలు ఉన్నాయి. వీటిలో అధికంగా శివాలయాలు ఉన్నాయి. అమరేశ్వర్ ధాం ఆలయానికి శ్రావణ మాసంలో భక్తులు అత్యధికంగా వస్తుంటారు. మహతో టోలీలో దుర్గా ఘర్, గౌరీ దేవి ఆలయాలు ఉన్నాయి. శ్రీ జానకి సాహు స్థాపించిన దాక్ఘర్ శివాలయం, నవాకెల్ దేవి గౌరీ ఆలయం ఉన్నాయి. కర్రాలో 2 చర్చిలు ఉన్నాయి. శ్రామిక వర్గాలు మహుయా, చింతపండు, రాగి,, వరిని రాంచి, లక్నో వంటి ఇతరప్రదేశాలకు ఎగుమతి చేసే పనికి మారారు. జిల్లాలో అత్యధికంగా ముండా, ఓరాన్, క్రైస్తవ వర్గాలకు చిందినవారు.ఇతరులలో బారియాక్, రాజ్పుత్రులు (గంఝు), బనియా, హల్వై, బ్రాహ్మణ, ధోబి, చామర్, నై. ముస్లిములు మొదలైన వారు ఉన్నారు. కర్రా స్వీట్ ఉర్లగడ్డలకు ప్రసిద్ధి చెందింది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 530,299,[2]
ఇది దాదాపు. కేప్ వర్దే దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 541వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 215 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.96%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 994:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 64.51%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు

[మార్చు]
  1. "Jharkhand Police". Retrieved 2009-03-10. [dead link]
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cape Verde 516,100 July 2011 est.

వెలుపలి లింకులు

[మార్చు]
  • [1] List of places in Khunti