తూర్పు సింగ్‌భూమ్ జిల్లా

వికీపీడియా నుండి
(తూర్పు సింగ్‌భుం జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తూర్పు సింగ్‌భుం జిల్లా
पूर्वी सिंहभूम जिला
జార్ఖండ్ పటంలో తూర్పు సింగ్‌భుం జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో తూర్పు సింగ్‌భుం జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుకొల్హన్
ముఖ్య పట్టణంజంషెడ్‌పూర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుజంషెడ్‌పూర్
 • శాసనసభ నియోజకవర్గాలు6
Area
 • మొత్తం3,533 km2 (1,364 sq mi)
Population
 (2011)
 • మొత్తం22,91,032
 • Density650/km2 (1,700/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత76.13 %
 • లింగ నిష్పత్తి949
Websiteఅధికారిక జాలస్థలి
ఘట్‌శిలలోని సిద్దేశ్వరి ఆలయం నుండి దృశ్యం

జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో దేవ్‌ఘర్ (హింది: पूर्वी सिंहभूम ) జిల్లా ఒకటి. 1990 జనవరి 16 న ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది. సింగ్‌భుం అంటే " సింహాల భూమి " అని అర్ధం. జిల్లాలో 50% కంటే అధికంగా దట్టమైన అరణ్యాలు, పర్వతాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ వన్యమృగాలు స్వేచ్ఛగా సంచరించాయి. ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగం. [1]

భౌగోళికం[మార్చు]

జిల్లా తూర్పు సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మిడ్నాపూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో పురూలియా జిల్లా, పశ్చిమ సరిహద్దులో పశ్చిం సింగ్‌భుం దక్షిణ సరిహద్దులో ఒడిషా రాష్ట్రానికి చెందిన మయూర్బని జిల్లాలు ఉన్నాయి.

ఆర్ధికం[మార్చు]

జార్ఖండ్ రాష్ట్రంలో తూర్పు సింగ్‌భుం జిల్లా గనులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందినది. దేశంలో ప్రధాన పారిశ్రామిక నగరమైన జెంషెడ్‌పూర్ ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. 50 సంవత్సరాల చరిత్ర ఉన్న " హిందూస్థాన్ కాపర్ " సంస్థ ఘట్శిలా వద్ద ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో సుబర్నరేఖా నది ఉంది. ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్న ధంజౌరీ పర్వతశ్రేణిలో రాగి, యురేనియం గనులు ఉన్నాయి. అధికమైన రాగి గనులు బనలోపా, బడియా, పథర్గొరా, ధిబ్ని, కెండదిహ్, రాఖ, సుర్ద ఉన్నాయి. వీటన్నింటిలో సుర్దలో మాత్రమే త్రవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధాన యురేనియం గనులు జడుగొర, నర్వపహర్, భతిన్, తురందిహ్, భగ్జంత ఉన్నాయి. జిల్లా ఆగ్నేయంలో ఉన్న చకులియా పట్టణం రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, వాషింగ్ సోప్ (బట్టలు ఉతికే సబ్బు) తయారీ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. జాతీయ రహదారి 6 పక్కన ఉన్న మరొక ప్రాధాన్యత కలిగిన బహరగొండ ఉంది.

గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో తూర్పు సింగ్‌భుం జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు[మార్చు]

జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది: ధాల్భుం, ఘట్‌షిల.

  • ధల్భం ఉపవిభాగంలో 4 బ్లాకులు ఉన్నాయి: గోల్మురి లేక జుగ్సలై, పొత్క, పతంద, బొరం.
  • ఘట్షిల ఉపవిభాగంలో 7 బ్లాకులు ఉన్నాయి: ఘట్షిల, ముసాబని, దుమరియా, గుడబంద, ధల్భుంగర్, బహరగొర, చకులియా.
  • జిల్లాలో 6 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి : బహరగొర, ఘట్షిల, పొత్క, జుగ్సలై, తూర్పు జంషెడ్‌పూర్, పశ్చిమ జంషెడ్‌పూర్. ఇవిన్నీ జంషెడ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెంది ఉన్నాయి.

సస్కృతి[మార్చు]

జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో శాంతలి, హిందీ, బెంగాలీ, ఒరియా భాషలు ప్రధానమైనవి. ప్రముఖ హిందీ కవి సౌరవ్ రాయ్ [3] ఈ జిల్లాకు చెందినవాడే. దుర్గాపూజ, వసంత పంచమి, మకర సంక్రాంతి, సొహ్రై, దీపావళి పండుగలు జరుపుకుంటారు.

  • భహరగొరా బ్లాకుకు 12 కి.మీ దూరంలో ఉన్న చిత్రేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు స్వయంభువుగా వెలిశాడని ప్రతీతి. ఈ ఆలయానికి ప్రతిరోజూ అనేక మంది శివభక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో బృహత్తరమైన శివలింగం ఉంది. భువనేశ్వర్ లోని అతి పెద్ద శివలింగం లింగరాజా శివలింగం తరువాత చితృశ్వర్ శిలింగం ఉందని భావిస్తున్నారు.
  • బహరగొరా బ్లాకులో భూతేశ్వర్ ఆలయం అనే మరొక శివాలయం ఉంది.
  • ప్రఖ్యాత బెంగాలీ కవి బిభూతి భూషన్ రాయ్ నివసించిన ప్రదేశం ఘట్శిలా పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది.
  • మైనింగ్ టౌన్‌గా ప్రసిద్ధి చెందిన జదుగొరా వద్ద ఉన్న రాంకిని ఆలయం భక్తులను ఆకర్షిస్తూ ఉంది. శక్తికలిగిన దైవమని భావిస్తున్న రాంకిని దేవి ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలనేగాక ఇతర భక్తులను కూడా ఆకర్షిస్తుంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,291,032,[4]
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 199 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 648 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.53%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 949:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 76.13%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.
శీతోష్ణస్థితి డేటా - Jamshedpur, India
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °F (°C) 76
(24)
81
(27)
91
(32)
98
(36)
98
(38)
93
(33)
88
(31)
88
(31)
87
(30)
86
(30)
82
(27)
76
(24)
87
(30)
సగటు అల్ప °F (°C) 57
(14)
62
(16)
70
(21)
78
(25)
81
(27)
81
(27)
80
(26)
79
(26)
78
(25)
73
(22)
65
(18)
57
(13)
72
(22)
సగటు అవపాతం inches (cm) 0.43
(1.08)
0.52
(1.33)
0.76
(1.94)
0.70
(1.77)
2.16
(5.49)
6.8
(17.28)
9.09
(23.09)
9.95
(25.27)
6.53
(16.58)
2.15
(5.45)
0.34
(0.87)
0.23
(0.59)
39.66
(100.74)
Source: Weatherbase[7] and MSN Weather[8]

మూలాలు[మార్చు]

  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. "Author's Website". Archived from the original on 2020-06-27. Retrieved 2020-07-09.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  7. "Weatherbase: Historical Weather for Jamshedpur, India". Weatherbase. Retrieved 1 April 2010.
  8. "Monthly Averages for Jamshedpur, IND". MSN Weather. Retrieved 1 April 2010.[permanent dead link]

వెలుపలి లింకులు[మార్చు]