బొకారో జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొకారో జిల్లా
జార్ఖండ్ పటంలో బొకారో జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో బొకారో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
ముఖ్య పట్టణంబొకారో
మండలాలు8
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. ధన్‌బాద్ 2. గిరిడి
Area
 • మొత్తం2,883 km2 (1,113 sq mi)
Population
 • మొత్తం20,62,330
 • Density720/km2 (1,900/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.48 %
Websiteఅధికారిక జాలస్థలి
సేవతి కొండలు
Bokaro District Montage
Clockwise from Top left: Sri Sri Kalika Maharani Temple at Kalika Vihar at Chira Chas Bokaro, Dugda Railway Station, Bokaro Steel Plant, Sewati Hills view over Lush Green Fields, Garga Dam near Bokaro Steel City

జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో బొకారో (హింది: बोकारो जिला) జిల్లా ఒకటి. భారదేశంలో అత్యధికంగా పారిశ్రమిక అభివృద్ధి సాధించిన జిల్లాగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1991లో ధన్‌బాద్ జిల్లా నుండి 2 బ్లాకులు గిరిడి జిల్లాలోని 6 బ్లాకులను కలిపి ఈ జిల్లాను రఒందించారు. 2011 గంఆకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2 మిలియన్లకు చేరుకుంది.

భౌగోళికం[మార్చు]

బొకారో వైశాల్యం 2883 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 210 మీ ఎత్తున ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న దామోదర్ నది లోయలు ఉపలోయలను రూపొందించింది. గతకొన్ని దశాబ్ధాలుగా ఈ నదీతీరంలో ఉన్న పట్టణాలకు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తుంది. అక్కడక్కడా పైకి లేచిన కొన్ని కొండలు, గుట్టలు ఈ లోయలకు మరింత అందం చేకూరుస్తూ ఉన్నాయి. జిల్లాలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి స్థిరపడిన ప్రజలు ఉన్నారు. ప్రజలలో అధికమైన విద్యావంతులు ఉన్నారు. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,777,662. [1]

ఆర్ధికం[మార్చు]

బొకొరో స్టీల్ ప్లాంట్లకు ప్రసిద్ధి చెందింది. సోవియట్ సహాయంతో భారతదేశంలో ఏర్పాటు చేయబడిన " ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ " లలో ఇది 4వది. ఇది నాణ్యమైన విద్యావిధానం కూడా కలిగి ఉంది. ఇది తూర్పు ప్రాంతం, విదేశీయాత్రికులకు పర్యాటక గమ్యంగా కూడా ప్రసిద్ధి చెందింది.

పరిశ్రమలు[మార్చు]

బొకారో నగరంలో భారతదేశం స్టీల్ అథారిటీ, భారత్ ధాతువులు లిమిటెడ్, హిందూస్తాన్ స్టీల్‌వర్క్స్ కంస్ట్రక్షన్ లిమిటెడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, బొగ్గు భారతదేశం లిమిటెడ్, ఎలెక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్, బొకారో పవర్ సప్లై కంపెనీ ప్రెవేట్ లిమిటెడ్. లిమిటెడ్ (బి.పి.సి.ఎల్), భారతీయ ఎక్ప్లోజివ్ లిమిటెడ్, జేపీ గ్రూప్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇతర పలు సంస్థలు ఉన్నాయి.

ఆర్సిలర్ మిట్టల్, 12 మి.మీ స్టీల్ ప్లాంట్, పొస్కొ 3 మి.మీ స్టీల్ ప్లాంట్, " ఎస్.ఎ.ఐ.ఎల్ " గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఆఫ్ 12 మి.మీ వంటి బృహత్తర పరిశ్రమల స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.

పారిశ్రామిక ప్రాంతం[మార్చు]

బొకారో స్టీల్ సిటీలో " బొకారో ఇండస్ట్రియల్ ఏరియా డెవెలెప్మెంట్ అథారిటీ " బొకారో ఇండస్ట్రియల్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. బొకారో ఇండస్ట్రియల్ ప్రాంతంలో దాదాపు 500 ఎస్.ఎస్.ఐ. ఉన్నాయి. వీటికి చక్కని పారిశ్రామిక మద్దతు లభిస్తుంది. బొకారో స్టీల్ సిటీలో చోటానగర్ డివిజన్‌కు చెందిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. బొకారో జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్లో భాగం.

బొకారో స్టీల్ ప్లాంట్[మార్చు]

బొకారో జిల్లాలో ఉన్న అతిపెద్ద " బొకారో స్టీల్ ప్లాంట్ ". ఇది " స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండయా లిమిటెడ్ " ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ పలు ఇతర మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. భారతదేశ పారిశ్రామిక వివరణా చిత్రం (మ్యాప్) లో బొకారో జిల్లా చాలాకాలంగా చోటుచేసుకుని ఉంది.

ఎలెక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్[మార్చు]

జిల్లాలో బొకారో స్టీల్ ప్లాంటు కాక ఇతర సంస్థలలో చందంకియారీలో ఎలెక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ స్థాపించబడింది.

బొకారో పవర్ సప్లై కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్[మార్చు]

బొకారో స్టీల్ ప్లాంటు ఆవరణలో " బొకారో పవర్ సప్లై కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ " స్థాపించబడింది. ఈఈప్లాంటు నుండి 302 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతూ ఉంది. ప్లాంటులో 8 బాయిలర్లు ఉన్నాయి. వీటిలో 5 బాయిలర్ల టి.పి.హెచ్. 220, 3 బాయిలర్ల టి.పి.హెచ్. 260 ఉంది. అదనంగా 12 మెగావాట్ల శక్తి కలిగిన 6 టర్బైన్ జనరేటర్లు, 55 మెగావాట్ల శక్తి కలిగిన టి.జి., 60 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగిన టి.జి. ఉన్నాయి.

బొకారో ఇండస్ట్రియల్ ఏరియా డెవెలెప్మెంటు అథారిటీ ( బి.ఐ.ఎ.డి.ఎ )[మార్చు]

బొకారో ఇండస్ట్రియల్ ఏరియా డెవెలెప్మెంటు అథారిటీ (బి.ఐ.ఎ.డి.ఎ) బొకారో, ధంబాద్, గుర్ధి జిల్లాల పారిశ్రామిక ప్రాంతాల నిర్వహణాబాధ్యత వహిస్తుంది. ఇందులో ఉన్న పారిశ్రామిక ప్రాంతం బృహత్తర, మధ్యంతర, చిన్నతరహా పరిశ్రమలకు అవసరమైన పారిశ్రామిక ఉపకరణాలను అందిస్తుంది. ఇక్కడ స్టీల్ నుండి పలు వస్తువులు తయారుచేసే మిల్లులు, సిమెంటు తయారీ మిల్లులు ఉన్నాయి.

ఇతర పరిశ్రమలు[మార్చు]

జిల్లాలో " ధర్మల్ పవర్ ప్లాంట్స్ " కూడా ఉన్నాయి.

 • బొకారో థర్మల్.
 • టెనుఘాట్ థర్మల్
 • చంద్రపురా థర్మల్.
 • సెయిల్ - డి.వి.సి. థర్మల్.
 • ఇండియన్ ఎక్స్ప్లోసివ్ లిమిటెడ్ (గుమియా) భారతదేశంలో అతిపెద్ద ఎక్స్ప్లోసివ్ సంస్థగా గుర్తించబడుతుంది.

2006లో భారతప్రభుత్వం బొకారో జిల్లాను వెనుకబడిన జిల్లా (మొత్తం వెనుకబడిన 250 జిల్లాలు) గా గురించింది.[2] బ్యాక్వర్డ్ రీజంస్ గ్రాంటు ఫండ్ ప్రోగ్రాం నుండి నిధులు అందుకుంటున్న 21 జార్ఖండ్ జిల్లాలలో ఇది ఒకటి.[2]

రాబోయే ప్రాజెక్టులు[మార్చు]

2011లో బొకారో స్టీల్ ప్లాంట్ ఆధునికీకరణ, సామర్ధ్యం 4.5 ఎం.టి. నుండి 7.5 ఎం.టి.అధికరించడం. అలాగే 2020 లోగా సెయిల్ (ఎస్.ఎ.ఐ.ఎల్) బి.ఎస్.ఎస్ సామర్ధ్యం 17 ఎ.టి వరకు అధికరించడం. 2015 లోగా సెయిల్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ స్థాపించి సామర్ధ్యం 5 ఎం.టి. వరకు అభివృద్ధి చేయడం.

ఆర్సెలర్ మిట్టల్[మార్చు]

బొకారోలో 12 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో " ఆర్సిలర్‌మిట్టల్ " జెయింట్ స్టీల్ ప్లాంట్ స్థించడానికి ప్రణాళిక వేయబడింది. కంపెనీకి 8000 ఎకరాల స్థలం అవసరమని భావించబడుతుంది. అందులో 2,500 ఎకరాల స్థలం పతావర్ (బొకారో జిల్లా) సేకరించబడింది. ఈసంస్థ అవసరాలకు తెనూఘాట్ ఆనకట్ట నుండి 32-35 మిలియన్ క్యూబిక్ టన్నుల నీరు సేకరించడానికి అనుమతించబడింది.

రిలయంస్ స్టీల్ ప్లాంట్[మార్చు]

" రిలయంస్ స్టీల్ ప్లాంట్ ": రిలయంస్ సంస్థ అధినేత అంబానీకి స్వంతమైన రిలయంస్ ఇంఫ్రాస్ట్రక్చర్ సంస్థ బొకారోలో 40,000 కోట్ల వ్యయంతో 12 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన " ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్ " సంస్థ స్థాపించాలని ప్రణాళిక వేసింది.

సెయిల్ - పి.ఒ.ఎస్.సి.ఒ జె.వి. స్టీల్ ప్లాంట్[మార్చు]

స్టీల్ మినిస్టర్ వీరభద్రరావ్ చేత పి.ఒ.ఎస్.సి.ఒ., సెయిల్ జాయింట్ వెంచర్‌లో " సెయిల్ - పి.ఒ.ఎస్.సి.ఒ జె.వి. స్టీల్ ప్లాంట్ " స్థాపించడానికి ప్రతిపాదన చేయబడింది. ఇందులో ఫైనెక్స్ సాంకేత ఉపయోగించి ఉన్నత నాణ్యత కలిగిన స్టీల్ ఉత్పత్తి చేయబడుతుందని భావిస్తున్నారు. పెరిఫెరిలో 500 ఎకరాలలో స్థాపించబడిన ఈ సంస్థ సామర్ధ్యం 1.5 ఎం.టి.

 • " భూషన్ స్టీల్ " 3 ఎం.టి సామర్ధ్యం కలిగిన స్టీల్ ప్లాంటు స్థాపించడానికి ప్రణాళిక చేసింది.
 • డి.వి.సి., సెయిల్ జాయింట్ వెంచర్ (50:50) బొకారో పవర్ ప్లాంటు సామర్ధ్యాన్ని 500 మెగావాట్ల నుండి 1000 మెగావాట్లకు అభివృద్ధి చేయాలని ప్రణాళిక చేసింది.
 • ఒ.ఎన్.జి.సి. ప్రభాత్‌పూర్ వద్ద మెథేన్ గ్యాస్ శోధన ఆరంభించాలని ప్రణాళిక వేసింది.

సెజ్[మార్చు]

జార్ఖండ్ ప్రభుత్వం 500 ఎకరాల విస్తీర్ణంలో " బొకారో ఇండస్ట్రియల్ డెవెలెప్మెంట్ అథారిటీ "లో రెండవ సెజ్ (మొదటి సెజ్ జెంషెడ్ పూర్‌లో ఉంది) ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తుంది.

పార్శ్రామిక ప్రాధాన్యత కలిగిన నగరంగా ప్రసిద్ధిచెందిన కారణంగా వ్యవసాయరగం వెనుకబడింది. గ్రామీణప్రాంతాలలో స్వల్పంగా వరి పండించబడుతుంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,062,330,[3]
ఇది దాదాపు. బోత్వానా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 222వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 716 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.99%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 916:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.48%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

ఆర్ధికం[మార్చు]

బొకారో స్టీలు పరిశ్రమ తరువాత గత కొన్న సంచత్సరాలుగా విద్యార్థుల సాధనలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. బొకారో విద్యార్థులు పోటీ పరీక్షలలో అధికంగా విజయం సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్‌ లలో వీరు ముందంజలో ఉంటారు. నగరంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు స్కూల్స్ ఉన్నాయి.

కొన్ని గుర్తింపు పొందిన పాఠ్శాలలు:

 • ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బొకారో - సెకండరీ
 • సెయింట్ జేవియర్స్ స్కూల్ -.1
 • ఆదర్శ్ విద్యా మందిర్ (బొకారో ) - చాస్, బొకారో
 • పెంతెకోస్తు అసెంబ్లీ స్కూల్ (బొకారో) -
 • చిన్మయ విద్యాలయ, బొకారో -
 • కేంద్రీయ విద్యాలయ -
 • డి.ఎ.వి పబ్లిక్ స్కూల్ -
 • శ్రీ అయ్యప్ప పబ్లిక్ స్కూల్
 • జి.జి.పి.ఎస్ (బొకారో )
 • బొకారో ఇస్పాట్ విద్యాలయం
 • ఎ.ఆర్.ఎస్ పబ్లిక్ స్కూల్
 • పి.టి.జి.ఎం . సరస్వతి విద్యా మందిర్

- కళాశాలలు & ఇన్స్టిట్యూట్స్ '

 • మేనేజ్మెంట్ & కంప్యూటర్ ఎడ్యుకేషన్ (సి.ఎం.సి.ఇ), నియర్ కేకే సింగ్ కాలనీ, చిరా చాస్, బొకారో వెబ్సైట్ కాలేజ్ ఆఫ్ - www.cmce.ac.in
 • చాస్ కాలేజ్ చాస్, దివంగంగ్ ( బొకారో )
 • బొకారో స్టీల్ సిటీ కాలేజ్
 • బొకారో మహిళా కళాశాల
 • ఉమెన్స్ కాలేజ్
 • ఆర్.బి.ఎస్ కాలేజ్
 • టెక్నికల్ ఆఫ్ బొకారో ఇన్స్టిట్యూట్
 • గురు గోబింద్ సింగ్ సాంకేతిక క్యాంపస్ & చాస్, బొకారో
 • బీబి అమిన లా కాలేజ్
 • బిర్సా ముండా డెంటల్ కాలేజ్
 • డెంటల్ కాలేజ్
 • బొకారో బాలికల పాలిటెక్నిక్
 • (ఐ.సి.డబ్ల్యూ .ఎ.ఐ కోసం) కాస్ట్ అకౌంటెంట్స్ బిఎస్ సిటీ అధ్యాయము
 • విస్తపీఠ్ కళాశాల ( బలిదీహ్)
 • ఐ.ఐ.టి - జె.ఇ.ఇ, ఏ.ఐ.ఇ.ఇ.ఇ, ఏ.ఐ.పి.ఎం.టి లకు బొకారో కేంద్రంగా ఉంది.

నగరంలో పలు సాంకేతిక విద్యాసంస్థలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, మల్టీమీడియా వంటి రంగాలకు చెందిన విద్య అందుబాటులో ఉంది. పోటీ పరీక్షలకు హాజర్ కావడానికి అవసరమైన శిక్షను అందించడానికి పలు చిన్న చిన్న విద్యా సంస్థలు ఉన్నాయి. ఆంగ్లంలో ఎలా మాట్లాడాలి వంటి శిక్షణా సంస్థలుకూడా ఉన్నాయి. విద్యా సంద్థలు నగరానికి కేంద్రస్థానంలో ఉన్నాయి.

ఐ.ఐ.టి - జె.ఇ.ఇ,, సి.బి.ఎస్.సి, మెడికల్ విద్యార్థులకు బొకారో లక్ష్యంగా ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన పలువురు యు.ఎస్., యు.ఏ.ఇ, ఐరోపా, ఆశ్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో పనిచేస్తున్నారని విద్యాసంస్థలు సగర్వంగా చెప్పుకుటుంటాయి.

మూలాలు[మార్చు]

 1. Bokaro District Population Census 2011, Jharkhand literacy sex ratio and density Archived 2014-07-14 at the Wayback Machine. Census2011.co.in. Retrieved on 2013-07-29.
 2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Botswana 2,065,398
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

మూలాలు[మార్చు]

 • [1] List of places in Bokaro

రాంఘర్ జిల్లా

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]