పురూలియా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Purulia జిల్లా
পুরুলিয়া জেলা
West Bengal పటంలో Purulia జిల్లా స్థానం
West Bengal పటంలో Purulia జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంWest Bengal
డివిజనుBurdwan division
ముఖ్య పట్టణంPurulia
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Purulia, 2. 1. Bankura (shared with Bankura district), 3. 1. Jhargram (shared with Paschim Medinipur district)
 • శాసనసభ నియోజకవర్గాలుBandwan, Balarampur, Baghmundi, Joypur, Purulia, Manbazar, Kashipur, Para, Raghunathpur
విస్తీర్ణం
 • మొత్తం6,259 కి.మీ2 (2,417 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం29,27,965
 • జనసాంద్రత470/కి.మీ2 (1,200/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత65.38 per cent
 • లింగ నిష్పత్తి912
Websiteఅధికారిక జాలస్థలి
Joychandi Pahar, popular tourist centre in Purulia district

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో పురూలియా (బెంగాలీ:পুরুলিয়া জেলা) జిల్లా ఒకటి.

చరిత్ర

[మార్చు]

చరిత్రకు ముందు

[మార్చు]

బంగా విభాగంలోని జిల్లాలులో పురూలియా జిల్లా ఒకటి.[1] జైనభగవతి సూత్ర (5వ శతాబ్దం) అనుసరించి 16 మహాజనపదాలలో ఒకటి. అంతేకాల పురాతన భారతదేశంలో ఇది వజ్రభూమిగా వర్ణించబడిందని విశ్వసిస్తున్నారు.[2][3][4] మద్యయుగంలో ఈ భూమి జార్ఖండ్‌లో భాగంగా ఉంటూ వచ్చింది. పురూలియా ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి ముందు 1765లో దివాన్‌ సుభాష్‌కు ఈ ప్రాంతం బహుమానంగా ఇవ్వబడిందని భావిస్తున్నారు.

స్వాతంత్రానికి ముందు

[మార్చు]

1805లో జంగిల్ మహల్స్ 23 పరగణాలుగా, మహల్స్‌గా విభజించబడింది. తరువాత1833 సరిగిన సంస్కరణలో జంగిల్ మహల్ జిల్లా విడగొట్టబడి కొత్తగా మంబజార్ కేంద్రంగా చేసి మంబం జిల్లా రూపొందించబడింది. ఈ జిల్లా చాలాపెద్దదిగా ఉండి ఇందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బంకురా, బర్ధామన్ అలాగే జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్,దాల్బం, సెరియకెల - ఖర్సవన్ జిల్లాల భూభాగం అంతర్భాగంగా ఉంది. 1838లో జిల్లాకేంద్రాన్ని మంబజార్ నుండి పురూలియాకు మార్చబడింది. జిల్లా రూపొందించబడిన తరువాత నిర్వహణ కొరకు సౌత్ వెస్ట్రన్ సరిహాద్దుల గవర్నర్ జనరల్ ప్రయినిధిగా ప్రింసిపల్ అసిస్టెంట్ నియామకం జరుగింది. తరువాత 1854లో ప్రధానప్రతినిధి అధికారనామాన్ని డెప్యూటీ కమీషనర్‌గా మార్చబడింది.[5]

స్వతంత్రానికి తరువాత

[మార్చు]

1956లో రాష్ట్రాల గుర్తింపు చట్టం అనుసరించి మంభుం జిల్లా బీహార్, పశ్చిమ బెంగాల్ భూభాగాలు మార్చబడ్డాయి. 1956 నవంబరు 1న ప్రస్తుత పురూలియా జిల్లా రూపొందించబడింది.[3] ఈ జిల్లా ప్రస్తుతం " రెడ్ కార్పెట్"లో భాగంగా ఉంది.[6]

భౌగోళికం

[మార్చు]

పురూలియా ఉత్తర అక్షాంశం 22.60 , తూర్పు రేఖాంశంలో 23.50 డిగ్రీలు ఉంది. జిల్లా వైశాల్యం 6,259చ.కి.మీ ఉంటుంది. జిల్లా తూర్పు సరిహద్దులో బంకురా , పశ్చిమ మదీనాపూర్ జిల్లాలు, ఉత్తర సరిహద్దులో బర్ధామన్ జిల్లా, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ధన్‌బాద్ జిల్లాలు, పశ్చిమ సరిహద్దులో బొకారో జిల్లా , జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాంచి జిల్లాలు, దక్షిణ సరిహద్దులో సింగ్భూం పశ్చిమ సింగ్భూం , తూర్పు సింగ్భూం జిల్లాలు ఉన్నాయి. పురూలియా జిల్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పశ్చిమ సరిహద్దులో ఉంది. భౌగోళికంగా ఇది దాదాపు కువ్వెన ఆకారంలో ఉంటుంది.ఇది ఉష్ణమండల వర్షాపాతానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాక ఇది పారిశ్రామికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి జార్ఖండ్, ఒడిషా, మధ్య ప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు ద్వారంగా ఉంది.

వాతావరణం

[మార్చు]

వాతావరణం

[మార్చు]
విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ వర్గీకరణ ఉప ఉష్ణమండలం
శీతాకాలం గరిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
శీతాకాలం కనిష్ఠ ఉష్ణోగ్రత 3.8 ° సెల్షియస్
వేసవి కాలం గరిష్ఠ ఉష్ణోగ్రత 52 ° సెల్షియస్
వేసవి కాలం కనిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
ఇప్పటి వరకు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 54 ° సెల్షియస్
వర్షపాతం 1100-1500 మి.మీ నైరుతీ ఋతుపవనాలు
వాతావరణంలో తేమ 75%-85%
వేసవిలో వాతావరణంలో తేమ 25%- 45%
అక్షాంశం ఉత్తరం
రేఖాంశం తూర్పు

నదులు , సరసులు

[మార్చు]

పురూలియా జిల్లాలో పలు నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కంగ్సబతి, కుమారి, సిలబతి (సిలై), ద్వారకేశ్వర్, సుబర్నరేఖ, దామోదర్ నదులు ప్రధానమైనవి. ఇన్ని నదులు ప్రవహిస్తున్నా భౌగోళిక పరిస్థితుల కారణంగా నదీజలాలలో 50% వ్యర్ధంగా పోతున్నాయి.[7] జిల్లాలో చిన్నపరిమాణంలో నిర్మించబడిన ముర్గుమ, పార్ది, బుర్ద, గోలాపూర్ ఆనకట్టలు వ్యవసాయానికి అవసరమైన జలాలను అందిస్తున్నాయి.[2] పురూలియాలో ప్రబలమైన జలాశయాలలో సాహెబ్ బంధ్ జలాశయం ఒకటిగా భావించబడుతుంది. ఇది పురులియా నగరకేంద్ర భాగంలో ఉంది. ఇది డిసెంబరు, మార్చి మాసం వరకు బంగ్లాదేశ్, పాకిస్థాన్, బర్మా, బలూచిస్థాన్ దేశాల నుండి వచ్చిపోయే వలపక్షులకు ఆశ్రయంగా ఉంది.[8]

ఆర్ధికం

[మార్చు]

పురూలియా జిల్లా ఆర్థికరంగం పర్యాటకం, పరిశ్రమలు మీద ఆధారపడి ఉంది. వీటిలో పరిశ్రమలు పురూలియా ఆర్థికరంగానికి వెన్నెముకగా నిలబడిఉంది.

2001లో పశ్చిమ బెంగాల్ కొత్త పారిశ్రామిక నిబంధనలు ప్రవేశపెట్టిన తరువాత ఈ జిల్లా ఉక్కు, సిమెంటు, విద్యుత్తు ఉత్పత్తి పరిశ్రమలను ఆకర్షించింది. జిల్లాలో సంతల్ధి వద్ద సంతల్ధి ధర్మల్ పవర్ స్టేషను, భగముండి వద్ద పంప్డ్ స్టోరేజ్, మధుకుండ వద్ద ఎ.సి.సి లిమిటెడ్ దామోదర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలెక్ట్రిక్‌సిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, లిమిటెడ్‌కు చెందిన " ది పురూలియా పంప్డ్ స్టోరేజ్ " ప్రాజెక్ట్‌కు 4 యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల నుండి ఒక్కొక్కటి 220 మె.వా మొత్తం 4 యూనిట్ల నుండి 900 మె.వా విద్యుత్తు ఉత్పత్తి ఔతుంది.[9] ప్రస్తుతం రఘునాథపూర్ ఉపవిభాగం వద్ద డి.వి.సి సంస్థ 2,400 మె.వా విద్యుత్తు ఉత్పత్తి చేయగల ధర్మల్ పవర్ ప్లాంట్, ఉక్కు, సిమెంటు ఉత్పత్తి పరిశ్రమలు స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 306.17 కోట్ల ఖర్చుతో స్పాంజ్ ఐరన్ పరిశ్రమ స్థాపించబడింది.[8]

చిన్నతరహా పరిశ్రమలలో లక్క, సెరికల్చర్ పరిశ్రమలు జిల్లా ఆదాయానికి మరింత సహకరిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని 90% లక్క పురూలియాలో ఉతపత్తి చేయబడుతుంది. పురూలియాలోని అన్ని బ్లాకులలో లక్క పండినబడుతూ ఉంది. ఈ పరిశ్రమలో దాదాపు 70,000 మంది పనిచేస్తున్నారు, సెరికల్చర్ పరిశ్రమలో పట్టుపురుగుల ఉత్పత్తికి సహకరిస్తుంది. [10]

జిల్లాలో మరొక ఆర్థిక వనరు పర్యాటకం. అరణ్యాలు, గుట్టలు, ఉపనదుకు, సెలఏళ్ళు, వన్యమృగాలు, వృక్షసంపద & జంతుసంపద పర్యాటకరంగానికి చక్కగా సహకరిస్తుంది. జిల్లాలో అజోధ్య కొండలు, మాథ, ముర్గుమ ఆనకట్ట, కుయిలపాల్ అరణ్యాలు, జయచంఢి పహర్, పంచకోట్ రాజ్, దుయర్సిని కొండలు, అరణ్యాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. కఠినమైన వాతావరణం, అననుకూల భూమి కారణంగా పురూలియా వ్యవసాయపరంగా వెనుకబడి ఉన్నప్పటికీ లక్క, పట్టు ఉత్పత్తిలో ముందున్నది.

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పురూలియా జిల్లా ఒకటి అని గుర్తించింది.[11] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 11జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[11]

విభాగాలు

[మార్చు]

ఉపవిభాగాలు

[మార్చు]
 • పురూలియా జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడ్జింది: పురూలియా సరదార్ ఈస్ట్, పురూలియా సరదార్ వెస్ట్, రఘునాథ్‌పూర్.
 • పురూలియా సరదార్ ఈస్ట్ ఉపవిభాగం :- పురూలియా పురపాలకం, 7 కమ్యూనిటీ బ్లాకులు (మంబజార్-1,మంబజార్-2, బంద్వన్, పురూలియా-1, పురూలియా-2, హౌరా, పంచ. ఉన్నాయి.
 • పురూలియా సాదర్ వెస్ట్ ఉపవిభాగం :- ఝల్దా పురపాలకం, 7 కమ్యూనిటీ బ్లాకులు (ఝల్దా-1, ఝల్దా-2, జైపూర్, అర్ష, బగుముండి, బలరాంపూర్, బారాబజార్.
 • రఘునాథ్‌పూర్ ఉపవిభాగం :- రఘునాథ్‌పూర్ (పురూలియా) పురపాలకం, 6 కమ్యూనిటీ బ్లాకులు (పారా, రఘునాథ్‌పూర్-1, రఘునాథ్‌పూర్-2, నెతురియా, సతూరి, కాషీపూర్.

[12]

 • పురూలియా పట్టణం జిల్లా కేంద్రంగా పురూలియా పట్టణం ఉంది. జిల్లాలో 20 పోలీస్ స్టేషన్లు, 20 డెవెలెప్మెంటు బ్లాకులు, 3 పురపాలకాలు, 170 గ్రామపంచాయితీలు

[13], 2,459 గ్రామాలు, ఉన్నాయి.

[14] ఒక్కోక ఉపవిభాగంలో ఒక పురపాలకం, కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు, గ్రామీణప్రాంతాలు, పట్టణాలు ఉన్నాయి .[15] మొత్తంగా 11 నగరప్రాంతాలు, 3 పురపాలకాలు, 9 పట్టణాలు ఉన్నాయి.

పురూలియా సాదర్ తూర్పు విభాగం

[మార్చు]
 • పురూలియా : ముంసిపాలిటీ
 • మంబజార్ 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
 • మంబజార్ 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
 • బదుయాన్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో8 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
 • పురూలియా 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
 • పురూలియా 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలను 2 పట్టణాలు ఉన్నాయి.
 • హౌరా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలను ఉన్నాయి..
 • పంచా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలను ఉన్నాయి.

పురూలియ సరదార్ పశ్చిమ ఉప విభాగం

[మార్చు]
 • ఝల్దా :- ముంసిపాలిటీ
 • ఝల్దా : 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
 • ఝల్దా 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
 • జైపూర్, పురూలియా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి..
 • అర్ష కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి..
 • బగ్ముంది కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
 • బలరాంపూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు 1 పట్టణం (బలరాంపూర్) ఉన్నాయి.
 • బారాబజార్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఒక పట్టణం ( బారాబజార్) ఉన్నాయి.

రఘునాథపూర్ ఉపవిభాగం

[మార్చు]
 • రఘునాథ్పూర్ ముంసిపాలిటీ:
 • పరా (పురూలియా) కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలను 2 పట్టణాలు ఉన్నాయి. శంతలదిహ్, చపారి.
 • రఘునాథపూర్ : కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలను పట్టణం (అర్రా (ఇండియా)) ఉన్నాయి.
 • రఘినాథపూర్ 2 : కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 6 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు 1 పట్టణం (నాబగరం (పురూలియా) ) ఉన్నాయి.
 • నెతురియా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలను 2 పట్టణాలు ( హిజులి, పార్ బెలియా) ఉన్నాయి.
 • శంతురి కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 6 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు న్నాయి.
 • కషిపూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 13 గ్రామపచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలను 1 పట్టణాలు (ఆద్రా (ఇండియా)) ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

జిల్లా 11 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడింది:- [16]

 1. బంద్వన్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 233)
 2. మంబజార్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 234),
 3. బలరాంపూర్ (పురులియా) (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 235),
 4. అర్ష (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 236),
 5. ఝల్ద (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 237),
 6. జోయ్‌పూర్ ( పురులియా) (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 238),
 7. పురులియా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 239),
 8. పారా (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 240.),
 9. రఘునాథ్ (పురులియా) (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 241),
 10. కాశీపూర్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 242.),
 11. హుర (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 243).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

[మార్చు]
 • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :-బందుయాన్, బలరాంపూర్, కాషిపూర్,, పారా నియోజకవర్గాలు.
 • పురూలియా పార్లమెంటరీ నియోజకవర్గం :-బందుయాన్, బలరాంపూర్, మన్‌బజార్, అర్సా, ఝల్దా, జైపూర్, పురూలియా.
 • బంకురా పార్లమెంటరీ నియోజకవర్గం :-పారా, రఘునాథ్పూర్, హురా., బంకురా జిల్లా నుండి 3 శాసనసభ నియోజక వర్గాలు.

పునర్విభజన తరువాత అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

పశిమబెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం పురూలియా జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 9 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది. [17]

 1. బంద్వన్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 238)
 2. బలరాంపూర్ ( పురులియా) (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 239),
 3. బఘ్ముండి (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 240),
 4. జాఉపూర్, పురులియా (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 241),
 5. పురులియా (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 242),
 6. మంబజార్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 243),
 7. కాశీపూర్ (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 244),
 8. పారా (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 245) ,
 9. రఘునాథ్, పురులియా (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 246.).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

[మార్చు]
 • షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- బందుయాన్ , మంబజార్ నియోజకవర్గాలు. పారా , రఘునాథ్‌పూర్ నియోజకవర్గాలు.
 • ఝార్గ్రాం పార్లమెంటరీ నియోజకవర్గం:- బందుయాన్, పశ్చిమ మదీనాపూర్ జిల్లా నుండి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు.
 • పురూలియా పార్లమెంటరీ నియోజకవర్గం :- బందుయాన్, భగ్ముండి, జైపూర్, పురూలియా, మంబజార్, కాషీపూర్ , పారా నియోజకవర్గాలు.
 • బంకురా పార్లమెంటరీ నియోజకవర్గం :- రఘునాథ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం , బంకురా జిల్లా నుండి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,927,965,[18]
ఇది దాదాపు. జైమైకా దేశ జనసంఖ్యకు సమానం.[19]
అమెరికాలోని. అర్కంసాస్ నగర జనసంఖ్యకు సమం.[20]
640 భారతదేశ జిల్లాలలో. 129 వ స్థానంలో ఉంది.[18]
1చ.కి.మీ జనసాంద్రత. 468 [18]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.43%.[18]
స్త్రీ పురుష నిష్పత్తి. 955:1000 [18]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.38%.[18]
జాతియ సరాసరి (72%) కంటే.

2001లో జిల్లాలోని జనసంఖ్య 2,538,233. వీరిలో షేడ్యూల్డ్ కులానికి చెందిన వారు 19.35%, 19.22% షేడ్యూల్డ్ జాతికి చెందిన వారు ఉన్నారు. పురుషుల అక్షరాస్యత 74.18%, స్త్రీల అక్షరాస్యత 37.15% ఉన్నారు. జిల్లాలో హిందువులు 83.42%, ముస్లిములు 7.12% ఉన్నారు.

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]

పురూలియా జిల్లా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలతో రహదారి, రైలుమార్గాలతోచక్కగా అనుసంధానించబడింది.[8]

రైలు

[మార్చు]

జిల్లాకు ఆగ్నేయ రైల్వే 3 అనుసంధానాలను అందిస్తుంది. ఒకలైను దక్షిణంలో ఉన్న జార్ఖండ్ నుండి ఆద్రా విభాగం మీదుగా అసంసోల్ వరకు వేయబడి ఉంది. రెండవ లైను బంకురా, ధన్‌బాద్ వరకు వేయబడి ఉంది. మూడవ లైను పురూలియాను జార్ఖండ్‌తో ఆద్రా విభాగం మీదుగా అనుసంధానితమై ఉంది. రాంచి, టాటానగర్, పాట్నా, హౌరా, ధన్‌బాద్,అసనోల్, భుదనేశ్వర్, దుర్గాపూర్, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాననగరాలు పురూలియాతో నేరుగా మెయిల్, ఎక్స్‌ప్రెస్‌లతో చక్కగా అనుసంధానించబడి ఉంది.

రోడ్డు

[మార్చు]

పురూలియా జిల్లాలో అదనంగా రహదారి మార్గంతో చక్కగా అనుసంధానితమై ఉంది. రహదారి మార్గాలలో తగినంత బస్, వస్తురవాణా సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రహదారి 32 జిల్లాను జెంషెడ్‌పూర్, బొకారో, చాస్, ధన్‌బాద్ లతో అనుసంధానం చేస్తూ ఉంది. జాతీయరహదారి 60 పురూలియాను రాష్ట్రీయ రహదారి 9 తో బంకురా వద్ద అనుసంధానమై ఉంది. జాతీయ రహదారి 2 జిల్లాను దుర్గాపూర్‌తో అనుసంధానం చేస్తూ ఉంది. రాష్ట్రీయ రహదారి 5 పురూలియాను రఘునాథ్‌పూర్, అద్రా, సంత్లదిహ్, నెతురియాలతో అనుసంధానమై ఉంది. జాతీయరహదారి 2 పురూలియాకు నీమత్పూర్, అసంసోల్ వరకు రవాణా సౌకర్యం కలిగిస్తుంది. రాణిగంజ్- అసనాల్ ఇండస్ట్రియల్ బెల్టుతో పురూలియా రైలు, రహదారి మార్గంతో అనుసంధానమై ఉంది. " దక్షిణ బెంగాల్ స్టేట్ ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ " పురూలియా నుండి కొలకత్తా వరకు 4 బసులను నడుపుతుంది. రాష్ట్రీయ రహదారి పురూలియాను రఘునాథ్పూర్, ఆద్రా, నెతూరియా, ఆసనల్ ఇండస్ట్రియల్ బెల్ట్, రాణిగంజ్, దుర్గాపూర్, బర్దావన్‌లతో అనుసంధానం చేస్తుంది.

సంస్కృతి

[మార్చు]

పురూలియా జిల్లాకు సంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయం ఉంది. జిల్లాలో బెంగాల్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల మిశ్రితసంస్కృతి ఉంది. ఈ ప్రాంతం ఈ రాష్ట్రాలలో విభిన్న సామయాలలో భాగమై ఉండడం అనుదుకు కారణం. [8][21] ఆర్కియోలాజికల్ సాక్ష్యాలు, ప్రాంతీయ ఉత్సవాలు ఇదుకు సాక్ష్యాంగా ఉన్నాయి. ఒక్కోక సాంస్కృతిక ఉత్సవం వెనుక పురూలియాకు చెందిన చక్కని గిరిజన నేపథ్యం ఉంటుంది. జిల్లా ప్రజలు అఫ్హికంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తుంటారు. పురులియా గ్రామీణ వాతావరణం వారి జీవితాలలో ప్రతిబింబిస్తుంటుంది. ప్రత్యేకమైన వారి జీవనశైలిలో కుటుంబ అనుబంధం, భావాలు, విచారము, ప్రేమైకభావం, వీరం కలగలుపుగా ఉంటుంది. పురూలియా ప్రత్యేకమైన ఝుమూర్, తుసు, భడు జానపద గీతాల సంపద కలిగి ఉంది. బెంగాల్ చౌ నృత్యం జన్మస్థానం పురూలియా అన్నది విశేషం.[8]

పర్యాటకం

[మార్చు]

పురూలియాకు ప్రతిసంవత్సరం వేలాది పర్యాటకులు వస్తుంటారు. అయోధ్య, తుర్గ జలపాతాలు, పి.పి.ఎస్.పి దిగువ, ఎగువ ఆనకట్ట, కెస్ట్రో బజార్ ఆనకట్ట, లహోరియా, శివ్ మందిర్, మాతా, కుయిలపల్ జలపాతాలు, అజోధ్య హిల్స్‌లో ఉన్న గిరిజన నివాసాలు, బగ్ముండీ ఆనకట్ట, ఫుతుయారీ, పంచకోట్ రాజ్ ప్యాలెస్ సంప్రదాయక భవనం, పఖి పహర్, రఘునాథపూర్ వంటి పర్యాటక ప్రదేశాలతో దుయర్సిని, డోలడంగ, జమున వంటి నదీతీరాలు, జానపద గీతాలు, గిరిజన నృత్యాలు పురూలియా ప్రత్యేకతలుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

Bengali language movement in Bihar

మూలాలు

[మార్చు]
 1. "History, Tradition, Culture, Heritage, Tourism & Festivals of Purulia". Archived from the original on 4 నవంబరు 2012. Retrieved 17 January 2013.
 2. 2.0 2.1 "Ecological Importance, Forest Divisions in Purulia District". Archived from the original on 16 ఫిబ్రవరి 2013. Retrieved 15 January 2013.
 3. 3.0 3.1 "History of Purulia, Bharatonline.com". Archived from the original on 12 మే 2013. Retrieved 17 January 2013.
 4. "An Overview of Purulia District, Sabjanta.com". Archived from the original on 27 మార్చి 2013. Retrieved 17 January 2013.
 5. "HISTORICAL BACKGROUND, Purulia District". Archived from the original on 16 జనవరి 2013. Retrieved 17 January 2013.
 6. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
 7. "River, About the District WestBengalOnline". Archived from the original on 5 జూన్ 2013. Retrieved 15 January 2013.
 8. 8.0 8.1 8.2 8.3 8.4 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; puruliazp అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 9. "Purulia Pumped Storage Project". 17 January 2013. Archived from the original on 27 మే 2013. Retrieved 20 జూలై 2014.
 10. "Purulia: History, Geography, Tourism, Map". Archived from the original on 10 మే 2013. Retrieved 17 January 2013.
 11. 11.0 11.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 12. "List of Districts/C.D.Blocks/ Police Stations with Code No., Number of G.Ps and Number of Mouzas". West Bengal. Directorate of census operations. Retrieved 2008-10-14.
 13. "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-11-12.
 14. "Administrative Units". Purulia district. National Informatics Centre. Archived from the original on 2007-12-22. Retrieved 2008-10-14.
 15. "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". West Bengal. Directorate of census operations. Retrieved 2008-10-14.
 16. "General election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-11-16.
 17. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Retrieved 2008-11-16.
 18. 18.0 18.1 18.2 18.3 18.4 18.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 19. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est
 20. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Arkansas 2,915,918
 21. Huntington, Susan L. The "Pāla-Sena" Schools of Sculpture - Volume 10. Vol. 10. Brill Archive. p. 178. Retrieved 17 January 2013.

వెలుపలి లింకులు

[మార్చు]