Jump to content

మల్దా జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 25°00′N 88°09′E / 25.00°N 88.15°E / 25.00; 88.15
వికీపీడియా నుండి
Malda జిల్లా
মালদা জেলা
West Bengal పటంలో Malda జిల్లా స్థానం
West Bengal పటంలో Malda జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంWest Bengal
డివిజనుJalpaiguri
ముఖ్య పట్టణంEnglish Bazar
Government
 • లోకసభ నియోజకవర్గాలుMaldah Uttar, Maldah Dakshin
 • శాసనసభ నియోజకవర్గాలుHabibpur, Gazole, Chanchal, Harishchandrapur, Malatipur, Ratua, Manikchak, Maldah, English Bazar, Mothabari, Sujapur, Baisnabnagar
విస్తీర్ణం
 • మొత్తం3,733 కి.మీ2 (1,441 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం39,97,970
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,800/చ. మై.)
 • Urban
2,40,915
జనాభా వివరాలు
 • అక్షరాస్యత62.71 per cent
 • లింగ నిష్పత్తి939
ప్రధాన రహదార్లుNH 34
Websiteఅధికారిక జాలస్థలి

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో మల్దా (బెంగాలీ: মালদা জেলা) (దీనిని మాల్దహ అని కూడా అంటారు). ఈ జిల్లా కొలకత్తాకు ఉత్తరంగా 347కి.మీ దూరంలో ఉంది. ఈ జిల్లాలో ప్రధానంగా మామిడి, జనపనార, పట్టు ఉత్పత్తి అత్యధికంగా జరుగుతుంది. జిల్లా పేరుతో కొత్త తరహా మామిడి పండ్లు పండించబడుతున్నాయి. ఇవి విడేశాలకు ఎగుమతి చేయబడుతూ అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నాయి. జిల్లాకు చెందిన గోంబియా గ్రామీణ సంస్కృతి సాధారణ ప్రజల జీవితంలోని సుఖదుఃఖాలను ప్రతిబింబిస్తూ జాతీయ, అంతర్జాతీయంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుంది.

జిల్లా కేంద్రమైన ఇంగ్లీష్ బజార్ (దీనిని మల్దా) అని కూడా అంటారు. ఇది ఒకప్పుడు బెంగాల్ రాజధానిగా ఉంది. జిల్లా పాత సంప్రదాయాన్ని, విద్యాసంప్రదాయాన్ని ఇప్పటికీ సంరక్షిస్తూ ఉంది. మహానందా, కలిండి నదుల సంగమంలో కొంచం తూర్పుగా ఉపస్థితమై ఉన్న ఓల్డ్ మల్దా ప్రస్తుతం ఇగ్లీష్ బజార్ మహానగరంలో భాగంగా ఉంది. పురాతన పండుయాకు ఓల్డ్ మల్దా రేవుపట్టణంగా సేవలు అందించింది. ఇది బియ్యం, జనపనార, గోధుమ పంటలకు వితరణ కేంద్రంగా ఉండేది. 1556లో ఇక్కడ జుమ్మా మసీదు, నిమసరై గోపురం నిర్మించబడ్డాయి. 1867లో మహానందా నదీతీరంలో ఒక పురపాలకం నిర్మించబడింది. వరి, జనపనార, నూనెగింజలు, చిక్కుళ్ళు ఈ జిల్లా పరిసర ప్రాంతాలలో ప్రధానంగా పండించబడుతున్నాయి. అత్యున్నత నాణ్యత గలిగిన జనపనార ఈ జిల్లాలో విస్తారంగా పండించబడుతుంది. జిల్లాలో అధికమైన ప్రదేశంలో మామిడి తోటలు, మలబరీ తోటలు ఆక్రమించి ఉన్నాయి. మామిడి, పట్టు జిల్లాకు ఆర్థికబలాన్ని ఇస్తున్నాయి.

చరిత్ర

[మార్చు]

గౌర్ శకం - ముందు

[మార్చు]

పనిని ఈ ప్రాంతాన్ని గౌర్పురా ప్రస్తావించాడు. ఈ ప్రాంతం గౌడా అనడానికి ఇది బలమైన కారణంగా ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికీ ఇందుకు సంబంధించిన అవశేషాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణగా ముందు పాలించిన రాజ్యాల అవశేషాలు తరువాత వచ్చిన రాజ్యాలలో స్మారకచిహ్నాలుగా మారియు. ఇవి అధికంగా గౌర్, పండుయాల మద్య ఉన్నాయి. పురాతన బెంగాల్ రాజ్యాలకు ఈ 2 పట్టణాలు రాజధానులుగా ఉన్నాయి. బెంగాలు సామ్రాజ్యానికి ఇది కేంద్రస్థానంలో ఉండడం ఇందుకు కారణం కావచ్చు. ఈ ప్రాంతంలోనే బ్రిటిష్ వారిచే ఇంగ్లీష్ బజార్ (ఇంగల్జవాద్) స్థాపించబడింది. క్రీ.పూ 5వ శతాబ్దం నుండి గౌర్ సరిహద్దులు కాలానువుణంగా మారుతూనే ఉన్నాయి. పౌరాణిక సాహిత్యం నుండి ఈ పేరు వచ్చి ఉండవచ్చు. మౌర్య సామ్రాజ్యానికి పురంద్రనగర రాజధానిగా ఉంటూ వచ్చింది. గౌర్, పుంద్రవర్ధన మౌర్యసాంంరాజ్యంలో కొన్ని ప్రాంతాలను రూపుదిద్దారని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ శిలాశాసనాలు బంగ్లాదేశ్ లోని బోగ్రా జిల్లాలో ఉన్న మహాస్థానగర్ శిలావశేషలలో లభిస్తున్నాయి.పుంద్రవర్ధనాలో హూయంత్సాంగ్ పలు అశోకస్థూపాలను చూసాడని ఆయన వ్రాతలద్వారా తెలుస్తుంది. అవిభాజిత దినాజ్‌పూర్, ఉత్తర బెంగాల్ ప్రాంతాలలో కూడా అవశేషాలు కనిపిస్తున్నాయి. అలహాబాద్ స్థూపంలో సముద్రగుప్తుని శిలాశాసనం మొత్తం ఉత్తర బెంగాల్, కామరూపలో కొంత భాగం గుప్తసామ్రాజ్యంలో భాగంగా ఉండేదని తెలియజేస్తుంది. సా.శ. 7వ శతాబ్దంలో కామసుబర్న రాజు శశాంక, గౌడ రాజు ఈ ప్రాంతాన్ని 3 దశాబ్ధాల కాలం స్వతంత్రంగా పాలినారు. 8వ శతాబ్దం మద్య నుండి 11వ శతాబ్దం చివరి వరకు బెంగాలును పాలా సామ్రాజ్యం పాలించింది. ఈ రాజులు బౌద్ధమత అవలంబీకులు. వీరి కాలంలో జగదల్ల విహారా స్థూపం నలందా, విక్రమషీలా, దేవీకోట్‌లతో సమానంగా ఉచ్చస్థితిలో ఉంది.

గౌర్ శకం

[మార్చు]

సేన్ రాజవంశం చేత పాలా సామ్రాజ్యం స్థాపించబడింది. సేనా పాలకులు తాంత్రిక బౌద్ధులు. అలాగే వారు నివసాలను రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు మార్చడం అలవాటు. ఈ సమయంలో బుద్ధిజం అబధ్రతకు లోనైంది. క్రమంగా బుద్ధిజం బెంగాల్ గణాంకాల నుండి కనుమరుగైంది. లక్ష్మన్ సేన్ కాలంలో గౌడ్ లక్ష్మణబాటిగా పిలువబడింది. సా.శ. 1204లో మొహమ్మద్ ఖిల్జీ బెంగాలును జయించే వరకు ఈ ప్రాంతాన్ని సేన్ రాజులు పాలించారు.

మొగల్ పాలన

[మార్చు]

తరువాత ఈ ప్రాంతంలో ముస్లిం పాలన మొదలైంది. సుల్తాన్ ఇయాస్ షాహ్, ఇయాస్ షాహి సామ్రాజ్యం, సికందర్ షాహ్, రాజాగణేశా, అల్లాఉద్దీన్ హుస్సేన్ షాహ్, నసీరుద్దీన్ షాహ్ మొదలైన వారు ఈ ప్రాంతాన్ని మద్య యుగంలో పాలించారు. ఆఫ్ఘన్ వీదుడు షేర్షా సూరి గౌర్ మీద దాడిచేసి ముగల్ పాలకుడు హుమాయూన్‌కు చేత తరిమి కొట్టబడ్డాడు. హుమాయూన్ గౌర్ మామిడిపండ్లంటే ఇష్టం. ఆయన ఈ ప్రాంతానికి జన్నతాబాద్ (స్వర్గలోకపు తోట) అని నామకరణం చేసాడు. ఫిరుజ్ షాహ్ తుగ్లక్, ఘియాసుద్దీన్ ముహమ్మద్ షాహ్, ముగల్ సామ్రాజ్య సైన్యం ఇక్కడ తలెత్తిన తిరుగుబాటును అణిచివేయడానికి పలుమార్లు దాడిచేసారు. గౌర్, అదినా మసీదు, క్వాట్వాలి గేట్ మొదలైన శిథిలాల అవశేషాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. ముగల్ సామ్రాజ్య కాలంలో రాజధాని ఢాకా నుండి గంగాతీరానికి మార్చబడింది. 1757లో ముగల్ పాలన ముగింపుకు వచ్చింది. గౌర్ క్షీణదశ ఆరంభం అయిన తరువాత ఈ ప్రాంతం మీద కూచ్ దాడులు అధికరించాయి.

గౌర్- శకం- తరువాత

[మార్చు]

1757 బ్రిటిష్ పాలన ఆరంభం అయింది. ఇంగ్లీష్ వ్యాపారులు మహానందానది స్థిరపడ్డారు. ఇక్కడ కొన్ని ఇండిగో ప్లాంట్ చాంబర్లు, ట్రేడ్ సెంటర్, కార్యాలయాలు స్థాపించారు. విలియం క్యారీ ఇక్కడ పనిచేసాడు. డాక్టర్ బి హామిల్టన్ కాలంలో (1808 గజోల్, మల్దా, బమొంగొల, హబీబ్పూర్ ప్రాంతాలు దినాజ్‌పూర్ జిల్లాతో చేర్చబడ్డాయి. అలాగే హరిశ్చంద్రపూర్, ఖర్బా, రతుయా, మాణిక్చక్, కలియాచక్ ప్రాంతాలు పుర్నియా జిల్లాతో చేర్చబడ్డాయి. 1813లో కలియాచక్, సాహిబ్‌గంజ్ ప్రాంతాలు, నదులు ప్రంతాలకు కలిపి ఇంగ్లీష్ బజార్ వద్ద జాయింట్ మెజిస్ట్రేట్ నియమించబడ్డాడు. ఆయన న్యాయపరిధిలో 2 జిల్లాలను చేర్చి ఈ ప్రాంతం కేంద్రంగా చేసుకుని పలు పోలీస్ స్టేషన్లు పనిచేసాయి. అందువలన మల్దా జిల్లా ఆరంభం అయింది. 1832లో ప్రత్యేక ఖజానా ఏర్పాటు చేయబడింది. 1859 నాటికి జిల్లాకు పూర్తి స్థాయి మెజిస్ట్రేట్, కలెక్టర్ నియమించబడ్డారు. 1876 నుండి జిల్లా రాజ్షాహి డివిషన్ (విభాగం) లో భాగం యింది. 1876, 1905 మద్య ఇది భగల్పూర్ డివిషన్లో భాగం అయింది. 1905లో ఈ ప్రాంతం తిరిగి రాజ్షాహి డివిషన్లో చేర్చబడింది. 1905లో మొదటి బెంగాల్ విభజనలో ఈ జిల్లా తూర్పు బెంగాల్, అస్సాం భూభాగంలో చేర్చబడింది. రాఫిక్యూ మొండల్ నాయకత్వంలో మల్దాలో ఇండిగో ఉద్యమం తలెత్తింది. జీతూ సాయంతో శాంతల్ ప్రజలు దాడిచేసి అదినా మసీదును స్వాఫ్హీనపరచుకున్నారు. 1947లో స్వాతరం ఇచ్చే సమయంలో జరిగిన విభజన కారణంగా జిల్లా తిరిగి సమస్యాత్మకమైంది. ఆగస్టు 12-15 వరకు రాడ్‌క్లిఫ్ ఈ ప్రాంతం గురించి నిర్ణయం తీసుకోక పోవడంతో ఈ ప్రాంతం ఎటు చేరుతుందో తెలియక అయోమయ పరిస్థితి ఎదురైంది. ఈ మద్యకాలంలో ఈ జిల్లా తూర్పు బెంగాల్ మెజిస్ట్రేట్ ఆధీనంలో ఉంది. 1947 ఆగస్టు 17న రాడిక్లిఫ్ నిర్ణయం వెలువరించిన తరువాత ఈ జిల్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నవాబ్‌గంజ్ విభాగంలో చేర్చబడింది. ఆసమయంలో ఇది రాజ్షాహి జిల్లాలో ఉపవిభాగంగా ఉంది.

ఆధునిక మాల్ధా

[మార్చు]

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా దీర్ఘకాలంగా మల్దా నిర్లక్ష్యానికి గురైంది. అయినప్పటికీ ఎ.బి.ఎ హ్గనీ ఖాన్ చౌదరీ రాజకీయంగా ఎదిగిన తరువాత మల్దా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర, దేశీయ మత్రిపదవులు వహించిన ఆయన మల్దా అభివృద్ధికి ఎంతగానో సహకరించాడు. 28 సంవత్సరాల కాలం పశ్చిమ బెంగాలును ఖాన్ చౌదరి ప్రత్యర్థులు పాలించినప్పటికీ ఖాన్ చౌదరితో వారు అనుకూల సంబంధాలను ఏర్పరుకున్న కారణంగా మల్దా పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించింది. ఫలితంగా జిల్లాలో సుఖ్జీత్ స్టార్చ్ లిమిటెడ్, ఈస్ట్ ఎండ్ సిల్క్ లిమిటెడ్, ఇతర సంస్థల మా పెరిగాయి. మావిడి గుజ్జు & రా జ్యూట్ వ్యవహరిస్తుంది తిషిపూర్ Rishipur Anchal వద్ద ఈస్ట్ భారతదేశం ఆగ్రో వంటి సంస్థలు వెలిసాయి. మామిడి, జనపనార, పట్టు వంటి వ్యవసాయ ఉత్పత్తిలో మల్దా ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముస్లిం ఆధిక్యత కలిగిన 2 జిల్లాలలో మల్దా ఒకటి. రెండవది ముర్షిదాబాద్ జిల్లా. రాజకీయ కారణాల వలన మల్దా జిల్లా ఇప్పటికీ నిర్లక్ష్యానికి గురౌతూనే ఉంది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా 24°40’20" ఉ నుండి 25°32’08 ఉ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87°45’50" తూ నుండి 88°28’10" తూ డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 3733.66చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి 3,290,160. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మల్దా ముఖద్వారం అని అంటారు. ఒకప్పుడ్జు గౌర్-బంగా రాజ్యానికి రాజధానిగా ఉండేది. జిల్లా దక్షిణ సరిహద్దులోముర్షిదాబాద్, ఉత్తర సరిహద్దులో ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, తూర్పు సరిహద్దులో బంగ్లాదేశ్, పశ్చిమ సరిహద్దులో జార్ఖండ్ శాంతల్ పరగణాలు, బీహార్ రాష్ట్రంలోని పుర్నియా జిల్లాలు ఉన్నాయి.

మల్దానగరం

[మార్చు]

మల్దా జిల్లా కేంద్రంగా మల్దా పట్టణం ఉంది. అరంభకాలంలో ఇది మహానందా నదీతీరంలో మొదలై క్రమంగా అభివృద్ధిచెందింది. ఈ ప్రాంతాన్ని ప్రద్తుతం ఫుల్భరిగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ పురాతనమైన గృహాలు కొన్ని ఉన్నాయి. 1925-1930 నుండి ఈ నగరం అభివృద్ధి మొదలైంది. ఈ నదరంలో దాదాపు 5 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇది అతిపెద్ద నగరంగా గుర్తించబడుతుంది. మునుపటి గౌర్ ప్రాంతంలో ఇది భాగంగా ఉంది. ఈ నగరం ఇంగ్లీష్ బజార్ పురపాలకంగా ఉండేది. నగరంలో మల్దా టౌన్ రైల్వే స్టేషను ఉంది.

ఆర్ధికరంగం

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మల్దా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు

[మార్చు]

ఉపవిభాగం

[మార్చు]
  • జిల్లా రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది :- చంచల్, సాదర్.
  • చంచల్ ఉపవిభాగంలో 6 కమ్యూనిటీ డెవెలెప్మెంట్బ్లాకులు ఉన్నాయి: చంచల్-1, చంచల్-2, రతుయా -1, రతుయా-2, హరిశ్చంద్రపూర్-1, హరిశ్చంద్రపూర్-2.
  • మల్దా సాదర్ ఉపవిభాగంలో9 కమ్యూనిటీ డెవెలెప్మెంట్ బ్లాకులు ఉన్నాయి: ఇంగ్లీష్ బజార్, గజోల్, హబీబ్పూర్, కలియాచక్-1, కలియాచక్-2, కలియాచక్-3,మాణిక్చక్,ఓల్డ్ మల్దా,బమంగొల.[2] జిల్లా కేంద్రంగా ఇంగ్లీష్ బజార్ ఉంది. జిల్లాలో 11 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.[3] జిల్లాలో 15 కమ్యూనిటీ డెవెలెప్మెంట్ బ్లాకులు, 146 గ్రామపంచాయితీలు, 3,701 గ్రామాలు ఉన్నాయి.[2][4] పురపాలకాలే కాక, ఒక్కొక ఉపవిభాగంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలతో కూడిన కమ్యూనిటీ డెవెలెప్మెంట్ బ్లాకులు ఉన్నాయి.[5] జిల్లాలో మొత్తంగా 10 నగర ప్రాంతాలు, 2 పురపాలకాలు, 3 పట్టణాలు ఉన్నాయి: ఇంగ్లీష్ బజార్, ఓల్డ్ మల్దా.

చంచల్ ఉపవిభాగం

[మార్చు]
  • చంచల్ 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • చంచల్ 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • రతుయా 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • రతుయా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హరిశ్చంద్రపూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హరిశ్చంద్రపూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

మాల్ధా సాదర్ ఉపవిభాగం

[మార్చు]
  • ఇంగ్లీష్ బజార్ : మునిసిపాలిటీ
  • పాత మాల్ధా: మునిసిపాలిటీ
  • ఇంగ్లీష్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 11 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • గజోల్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 15 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హబీబ్పూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 11 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు 3 ప్ట్టణాలు (కచు పుకూర్, కెందుయా (పశ్చిమ బెంగాల్), అయిహో) ఉన్నాయి.
  • కలియా చక్ 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 14 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • కలియా చక్ 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • కలియాచక్ 3 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 14 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • మాణిక్చక్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 11 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • పాత మాల్ధా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 6 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బమంగిలా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 6 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,997,970,[6]
ఇది దాదాపు. లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. అరగాన్ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 58 వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 1071 [6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.5%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 938:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.71%.[6]
జాతియ సరాసరి (72%) కంటే.
మాల్ధా జిల్లాలో మతం
మతం శాతం
ఇస్లాం
  
52.05%
హిందు
  
46.97%
ఇతరులు
  
0.98%

దాదాపు 32,90,160 ప్రజలు నివసిస్తున్న మల్దా జిల్లాలో రాజభోంగ్షి (పొలియా), షెర్ షాహ్ సూరి (షెర్సాబాడియా సమాజం), బెంగాలి, మత్స్యకారులు, శాంతల్ ప్రజలు నివసిస్తున్నారు.

విభాగాలు

[మార్చు]
  • దక్షిణ మల్దా జిల్లాలో 59% ముస్లిములు ఉన్నారు. సుజాపూర్ మసీదు భారతదేశంలో అతిపెద్ద మసీదుగా గుర్తించబడింది. జిల్లాలో 40% మంది హిందువులు ఉన్నారు.
  • మల్దా జిల్లా మొత్తంలో ముస్లిములు 52%, హిందువులు 47%, ఇతరులు 1% ఉన్నారు.
  • 2001 అసెంబ్లీ నియోజకవర్గాల వరుసలో మతపరమైన గణాంకాలు.
అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం జనసంఖ్య హిందువులు ముస్లిములు హిందు % ముస్లిం%
హబీబ్‌పూర్ 272667 244498 13076 89.67% 04.80%
గజోల్ 294715 222610 65650 75.53% 22.28%
చంచల్ 266179 87347 175226 32.81% 65.83%
హరిశ్చంద్రపూర్ 268433 83586 184498 31.13% 68.73%
మాలతీపూర్ 248560 68034 178692 27.37% 71.89%
రతువా 297023 93446 202968 31.46% 68.33%
మాణిక్‌చక్ 278308 154525 122671 55.52% 44.08%
మల్దహా 266206 201886 57853 75.84% 21.72%
ఇంగ్లీష్ బజార్ 294651 209926 83902 71.25% 28.48%
మోతబరి 255241 73607 181518 28.84% 71.12%
సుజపూర్ 267100 30823 236090 11.54% 88.39%
బైసమబ్గర్ 284376 148358 135654 52.17% 47.70%

ఈ జిల్లాలో అత్యధిక మంది ప్రజలు బెంగాలీ భాషను మాటాడుతుంటారు.

సంస్కృతి

[మార్చు]

మల్దాలో గొభిరా,అల్కప్, కవిగన్ మొదలైన సంస్కృతులు ఉన్నాయి.

పండుగలు

[మార్చు]

దాదాపు అన్ని ప్రధాన మత పండుగలు వంటి ఉత్సవాలు ఉంటాయి

  • దుర్గా పూజ
  • కాళి పూజ
  • ఐడి ఉల్ ఫితర్
  • కుర్బాని /ఐడి -ఉజ్ జోహా
  • గురు నానక్ జయంతి, ప్రత్యేకంగా (ఓల్డ్ మాల్డాలో)
  • ఎక్స్ మాస్

ఉత్సవాలు

[మార్చు]

జిల్లా ఎక్కువగా ప్రముఖ సాంస్కృతిక వేడుకలు కొన్ని

  • రాంకెలి ఫెయిర్, గౌర్ ( పశ్చిమ బెంగాల్ )
  • గజోల్ ఉత్సాబ్
  • కార్తీక పూజ ఫెయిర్
  • చారు బాబు మేళా
  • చరక్ ఫెయిర్
  • పిరాన్-ఇ-పీర్ ఫెయిర్ (షింగాబాద్, రిషిపూర్ వద్ద )
  • చొబ్బిష్ (24) ప్రహార్ వద్ద వార్షికంగా బుక్ ఫెయిర్ అండ్ ఎక్స్‌పో నిర్వహిస్తారు.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
Early 19th century lithograph of the Muslim ruins of Dakhil Darwaza at Gour
  • అడినా పునరావశేషాలు
  1. అడినా మస్జిద్
  2. గోల్ ఘర్
  3. ఎకలకి మసీదు
  4. ఆడినా డీర్ పాత్క్
  • గౌర్ యొక్క పునరావశేషాలు
  1. ఫిరోజ్ మినార్
  2. చిల్క మసీదు
  3. క్వుత్వలి గేట్
  4. 12-నియంత్రించబడిన మసీదు
  5. క్యుదం-ఇ-రసూల్, మందిరంలో ముహమ్మద్ ప్రవక్త పాదముద్ర ఉందని విశ్వసిస్తున్నారు.
Temple of Jahura Kali Bari, Malda
  • నిమై సారై లైట్ హౌస్ గోపురం
  • జామి మసీదు
  • పన్దుఎ పుణ్యక్షేత్రం
  • పిరాన్-ఇ-పీర్ పుణ్యక్షేత్రం.
  • జగ్జీవంపూర్ లాస్ట్ ఆశ్రమంలో
  • ఆలయం రామకృష్ణ మిషన్ జహురా కాళీ
  • ఆలయం (దేవత చండి స్థానిక అవతార్)
  • చంచల్ ప్యాలెస్
  • వినోద పార్క్ ( ఆక్వాటిక్ బెంగాల్)
  • సుజాపూర్ జాతీయరహదారి 34 వద్ద నైముజా ఐ డి డి-గా.
  • సుజాపూర్ జేమ్ మసీదు

సుప్రసిద్ధ వ్యక్తులు

[మార్చు]
  • షిబ్రం చక్రవర్తి, (బెంగాలీ) వ్యంగ్య
  • ఎ. బి.ఎ ఘనీ ఖాన్ చౌదరి, భారతదేశం మాజీ రైల్వే మంత్రి (1982-84)
  • బెనాయ్ కుమార్ సర్కార్, ఎకనామిస్ట్
  • అసిం దాస్గుప్తా, వెస్ట్ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి, మాల్డా జిల్లా స్కూల్ పూర్వ విద్యార్థి
  • రమేష్ చంద్ర ఘోష్, న్యాయవాది, రాజకీయ నాయకుడు.
  • రాంహొరీ రాయ్, మాజీ విధానసభ సభ్యుడు ( శాసన సభ్యులు)
  • డాక్టర్ జయంతి కుమార్ ఘోష్, నార్తంబెర్లాండ్, ఇంగ్లాండ్, యు.కెలో పలుకుబడి వైద్యుడు
  • శుభాధిష్ సేన్, ఇండిపెండెంట్ హిస్టారికల్ పరిశోధకులు, స్పెషల్ విద్యావంతుల & ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
  • ప్రొఫెసర్ అజిత్ కుమార్ ఘోష్, బిజోయ్ కృష్ణ గర్ల్స్ కాలేజ్, హౌరా మాజీ ప్రిన్సిపాల్
  • ప్రొఫెసర్ సంతోష్ కె.ఆర్ చక్రభర్తీ
  • ప్రొఫెసర్ దుర్గ కింకర్ భట్టాచార్జీని మాజీ ప్రిన్సిపాల్ మాల్డా కాలేజ్.
  • డాక్టర్ పినాకి రంజన్ రాయ్. ప్రసిద్ధ ఐ స్పెషలిస్ట్
  • పండిట్. విష్ణు సేవక్ మిశ్రా, ప్రముఖ కళాకారుడు (హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం).
  • నిరెన్ చంద్ర సిన్హా, మాజీ శాసన సభ్యులు, హెడ్ మాస్టర్, కహల ఎన్.కె.బి.బి హై స్కూల్ (హెచ్.ఎస్ ).
  • సౌరీంద్ర మోహాన్ మిశ్రా, మాజీ డిప్యూటీ. విద్య మంత్రి, వెస్ట్ బెంగాల్
  • ప్రొఫెసర్ సంతోష్ ఘోష్, మాజీ చీఫ్ ఆర్కిటెక్ట్ కోలకత్తా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సి.ఎం.డి.ఎ), కలకత్తా
  • సుభాష్ భోమిక్, మాజీ భారతదేశం ఫుట్బాల్ ఫెడరేషన్
  • డాక్టర్ రణజిట్ కుమార్ ఘోష్, మాల్డా టౌన్ జనరల్ ఫిజీషియన్
  • డాక్టర్ రాధాగోబిందా ఘోష్, మాజీ గురువు రామకృష్ణ మిషన్ విద్యామందిర్ మాల్డా (టీచర్స్ కోసం గెలుపొందిన జాతీయ అవార్డు)
  • డాక్టర్ సయ్యద్ ముయాజం ఆలీ, జనరల్ ఫిజీషియన్, మాల్డా

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]

వృక్షాలు

[మార్చు]

జిల్లాలోని గ్రామాలలోని తడిలేని భూములలో ఉన్న బరిండ్ అడవులలో పొదలు కనిపిస్తుంటాయి. ఈ భూములు పంటభూములు కాదు. నదీతీరాలలో ఉన్న ఇసుక దిబ్బల మీద దట్టమైన సహజమైన మొక్కలు, చెట్లతో నిండి ఉంది. పురాతన నదీతీర ఇసుకదిబ్బలు, నీటి మడుగులు, చిత్తడి భూములు, ఇతర జలప్రాంతాలు, విపరీతమైన వల్లిస్నేరియా, ఇతర మొక్కలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు తరచుగా జలమయం ఔతుంటాయి కనుక సాధారణంగా సీడీ గ్రాసెస్ (విత్తనసహిత గడ్డి) తో నిండి పోతుంది. అలాగే చిత్తడి నేలలలో రోసైంవొలుక్రట పుష్కలంగా ఉంటాయి. బరిండ్ ప్రాంతంలో కొంతభాగం అరణ్యాలతో నిండి ఉంది. ఇక్కడ ప్రధానంగా స్క్రబ్- పొదలు, అత్తి, రావి, బాంబాక్స్, పాకుర్, నేపాల్ వెదురు చెట్లతో నిండి ఉన్నాయి. పండుయా ప్రాంతాలలో ఉన్న గ్రామాలు తోమీ వెదురు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటుంది. గౌర్ నదీతీరాలలో దట్టమైన పొదలు విస్తారంగా వేప, పనస, చింత, వెదురు, మర్రి, మామిడి చెట్లు ఉంటాయి. జిల్లా పశ్చిమ భూభాగంలో మలబరీ, మామిడి చెట్లు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. మామిడి పంటకు ఈ జిల్లా ప్రఖ్యాతిగాంచింది.

జంతువులు

[మార్చు]

గత శతాబ్దం నుండి మల్దా వేట జంతువులకు పేరుపొందింది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ జిల్లకు తన సహజ సౌందర్యం, పేరు ప్రల్హ్యాతులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బరిండ్ ప్రాంతం, గౌర్ అరణ్యాలలో జంతువులకు సంతోనోత్పత్తి సౌకర్యాలు తరుగుతూ వస్తున్నాయి. మల్దా జిల్లా తరవుగా " ఉత్తర బెంగాల్ క్రీడా ప్రదేశం " (బెస్ట్ స్పోర్టింగ్ గ్రౌండ్ ఆఫ్ ఉత్తర బెంగాల్) అని వర్ణించబడింది. పలువురు యురేపియన్లు గౌర్ చిత్తడి నేలలలో మొసళ్ళను చూసారు. 1919లో ఈ ప్రాంతంలో చివరిసారిగా పులి కనిపించింది. 1965లో మల్దాలో చివరిసారిగా చిరుతపులి చంపబడింది.

మల్దా అరణ్యాలలో అధికంగా శాంతల్, పహారియాలు నివసిస్తున్నారు. వీరు బరిండ్, ఇతర ప్రాంతాలలో స్థిరపడడానికి గంగానదిని దాటి ఇక్కడకు వచ్చారు. ఈ ప్రాంతం లోని పర్యావరణ అసమతుల్యతకు ఇది కారణమైంది. నదులు, మడుగులతో మల్దా వివిధ జాతిచేపలకు ఆలవాలమైంది. జిల్లాలో లభిస్తున్న చేపలలో రోహు, కట్ల, చితల్, బోల్, మగుర్, షోల్, హిలిష, పబ్బ, వివిధ పీతల జాతులు, రొయ్యలు, తాబేళ్ళు ఉన్నాయి. ఆధునిక సైంటిఫిక్ సాంకేతిక ప్రణాళికలతో జిల్లాలో పిస్కికల్చర్ ను అభివృద్ధి చేస్తున్నారు.

విద్య

[మార్చు]

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అతి తక్కువ అక్షరాస్యత కలిగిన జిల్లాలలో మల్దా జిల్లా ఒకటి. జిల్లాలో రాష్ట్రంలో పేరుపొందిన స్కూల్స్ అనేకం ఉన్నాయి. జిల్లాలో ఉన్న స్కూల్స్‌లో గుర్తించతగినవి మాల్డా జిల్లా స్కూల్, రామకృష్ణ మిషన్ వివేకానంద Vidyamandir బార్లో గర్ల్స్ 'హై స్కూల్, ఎసి ఇన్స్టిట్యూషన్, లలిత్ మోహన్ శ్యామ్ మోహిని హై స్కూల్, మాల్డా టౌన్ హై స్కూల్, సిసి గర్ల్స్ 'హై స్కూల్, సెయింట్ జేవియర్స్ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), సెయింట్ మేరీస్ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం) జింగిల్ బెల్ స్కూల్ (ఒక ఆంగ్ల మాధ్యమంలో బోధించే పాఠశాల), ఉషా మార్టిన్ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), హోలీ చైల్డ్ ఇంగ్లీష్ అకాడమీ, నార్త్ పాయింట్ ఇంగ్లీష్ అకాడమీ కూడా జిల్లాలోని పలు ప్రముఖ పాఠశాలలలో కొన్నిగా గుర్తింపు పొందాయి.

మల్దా జిల్లా స్కూల్

[మార్చు]

జిల్లాలో ఉన్న " మల్దా జిల్లా స్కూలు"ను హంటర్ కమీషన్ సిఫార్సుతో 1858లో స్థాపినచబడింది. ఇది జిల్లాలో మొదటి స్కూలుగా పశ్చిమ బెంగాల్ పురాతన స్కూళ్ళలో ఒకటిగా గుర్తించబడుతుంది. మల్దాకు చెందిన కేంద్ర రైల్వే మంత్రి ఎ.బిఎ గని ఖాన్ చౌదరి చేత 1982-1983 లో ఆరంభించబడిన కేంద్రియ విద్యా మందిర్ విద్యార్థులకు ఇంగ్లీష్ , హిందీ మాధ్యమంలో విద్యాబోధన చేయబడుతుంది. సాధారణంగా బెంగాల్‌లో బెంగాలీ మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. దీనిని తరచుగా బదిలీలు జరిగే ఉద్యోగుల పిల్లల కొరకు స్థాపించారు. ఇందులో భారతీయ రైల్వే, సరిహద్దు రక్షణ దళం , పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగుల పిల్లలు చదువుకుంటున్నారు.జిల్లాలో అదనంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేటు యాజమాన్యంతో నిర్వహించబడుతున్న సాంకేతిక విద్యా సంస్థలు (అధికంగా కప్యూటర్ కోర్సులు) ఉన్నాయి.

కేంద్రియ విద్యామందిర్ ఫ్లాగ్‌షిప్‌తో స్థాపించబడిన " ఉషామార్టిన్ గ్రూప్ " స్కూల్స్ అత్యాధునిక సౌకర్యాలను అన్నింటినీ కలిగి ఉంది. జాతీయ రహదారి -31 పక్కన ఉన్న దీనిలో ఎ.సి హాస్టల్ వసతి కలిగి ఉంది.

మల్దా కాలేజ్

[మార్చు]

ఉత్తర బెంగాల్ కాలేజీలలోని ఉత్తమ కాలేజీలలో మల్దా కాలేజ్ ఒకటి. ఇప్పుడు ఇది " యూనివర్శిటీ ఆఫ్ గౌర్ బంగా " ఆధ్వర్యంలో ఉంది. ఈ యూనివర్శిటీ పరిసర ప్రాంతాలైన ఉత్తర , దక్షిణ దినాజ్‌పూర్ కాలేజీలు, మరి కొన్ని కాలేజీలు ఈ యూనివర్శిటీలో భాగంగా ఉన్నాయి. ఈ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, కొన్ని ప్రైవేట్ యాజమాన్య టెక్నికల్ ఇంస్టిట్యూషన్లు (అధికంగా కంప్యూటర్ సంబంధిత కోర్సులు) , వైద్య కళాశాల ఉన్నాయి.

ప్రముఖ ఉపాధ్యాయులు

[మార్చు]

మల్దా జిల్లాలో ప్రముఖులలో కొలకత్తా యూనివర్శిటీ ప్రొఫెసర్ బెనాయ్ సేకర్, మల్దా జిల్లా స్కూల్ పాత విద్యార్థిరమేష్ చంద్రఘోష్ ముఖ్యులు. చంద్రఘోష్ చైపై నవాబ్గంజ్ , మల్దా వద్ద లాయర్‌గా ప్రాక్టిస్ చేసాడు. స్వాతంత్ర్య ఉద్యమకర్తలలో ఒకరైన చంద్రఘోష్ బ్రిటిష్ వారి చేత ఖైదు చేయబడ్డాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఈయన సహవిద్యార్థి. మహేష్మతి వద్ద ఆయన నివాసం శీతల్‌కుటీరం ఉంది.

రవింద్ర అవెన్యూ ఆఫ్ ది టౌన్

[మార్చు]

కొలకత్తా]] సమీపంలో ఉన్న హౌరా గరల్స్ కాలేజ్‌కు (బిజాయ్ కృష్ణా గరల్స్ కాలేజ్) అజిత్ కుమార్ ఘోష్ ప్రొఫెసర్ పనిచేసాడు. " మాల్దా ఇన్ కొలకత్తా"కు ఆయన కార్యదర్శిగా ఉన్నాడు. దీనికి బెనాయ్ దేశాయ్ చైర్మన్‌గా ఉన్నాడు. ఆయన " ఫెడరేషన్ ఆఫ్ హాఫ్ ఐరోపా " 1948లో ప్రచురితమైంది.

ఇతర ప్రముఖులు

[మార్చు]

మాల్దా జిల్లకు చెందిన ఇతర ప్రముఖులు :- అత్యంత ప్రాచుర్యం పొందిన వైద్యుడు డాక్టర్ రణజిట్ ఘోష్,; ప్రొఫెసర్ సంతోష్ ఘోష్, ఎం.ఆరిక్ . (యు.ఎస్.ఎ), కలకత్తా చీఫ్ వాస్తుశిల్పి అయ్యారు,, డాక్టర్ జయంతి కుమార్ ఘోష్, (బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ పని, రాయల్ సొసైటీ అఫ్ మెడిసిన్ ఆఫ్ బ్లిత్ నార్తంబెర్లాండ్,) యు.కె, బొండికార్ మెడికల్ గ్రూప్ జనరల్ మెడికల్ ప్రాక్టీస్ ఫెలో షిప్ పొందారు. డాక్టర్ జయంతి కుమార్ ఘోష్, ప్రస్తుతం లండన్‌లో స్థిరపడ్డారు ఇప్పుడు

ట్రాములు

[మార్చు]

బ్రిటిష్ కాలం నుండి మల్దా రహదారులలో ప్రస్తుతం ట్రాములు నడుస్తున్నాయి. అయినప్పటికీ సౌకర్యం కొరకు అవి ఇప్పుడు తొలగించబడ్డాయి. జిల్లాలో అధికంగా హిందువులు ఉన్నారు. తరువాత స్థానాలలో ముస్లిములు, క్రైస్తవులు మొదలైన వారు ఉన్నారు.

కళాశాలలు , విశ్వవిద్యాలయాలు

[మార్చు]
  • గౌర్ బంగా విశ్వవిద్యాలయం
  • మాల్డా కాలేజ్ 2003 -
  • ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఐ.ఎం.పి.ఎస్ కాలేజ్ స్థాపించబడిన
  • మాల్డా పాలిటెక్నిక్ 2011 -
  • మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఏర్పాటు 2010 -
  • ఇంజనీరింగ్ & టెక్నాలజీ యొక్క ఘనీ ఖాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ (జి.కె.సి.ఐ.ఇ.టి), ఏర్పాటు
  • మాల్డా మహిళా కళాశాలలో
  • గౌర్ మహావిద్యాలయ
  • గజోల్ మహావిద్యాలయ
  • కలిచక్ కాలేజ్ (సుల్తాన్ కాలేజ్)
  • చంచల్ కాలేజ్
  • హరిశ్చంద్రపూర్ కాలేజ్
  • సంసి కాలేజ్
  • దక్షిణ మాల్డా కాలేజ్
  • పకుయాహత్ డిగ్రీ కళాశాల.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-11-10.
  3. "Census of India 2001, Final Population Totals, West Bengal, Rural Frame". West Bengal. Directorate of census operations. Retrieved 2008-11-10.
  4. "District Profile". Official website of the Malda district. Archived from the original on 2011-07-19. Retrieved 2008-11-10.
  5. "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". West Bengal. Directorate of census operations. Retrieved 2008-11-10.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oregon 3,831,074

బయటి లింకులు

[మార్చు]

25°00′N 88°09′E / 25.00°N 88.15°E / 25.00; 88.15

వెలుపలి లింకులు

[మార్చు]