1832
స్వరూపం
1832 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1829 1830 1831 - 1832 - 1833 1834 1835 |
దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 13: జమైకాలో బానిసల తిరుగుబాటును బ్రిటిషు సైన్యం సాయంతో శ్వేత జాతి ప్లాంటర్సు అణచివేసారు. 300 పైచిలుకు బానిస తిరుగుబాటుదార్లను బహిరంగంగా ఉరితీసారు.[1]
- ఫిబ్రవరి 12: లండన్లో కలరా అంటువ్యాధి వ్యాపించి, 3000 మంది మరణించారు
- ఫిబ్రవరి 12: ఈక్వడార్ గలాపగోస్ దీవుల్ని ఆక్రమించింది
- ఫిబ్రవరి 28: చార్లెస్ డార్విన్ హెచ్ఎమ్ఎస్ బీగిల్ లో దక్షిణ అమెరికా చేరుకున్నాడు.
- మే 11: గ్రీసు సర్వసత్తాక దేశంగా అవతరించింది.
- ఆగస్టు 27: నేటివ్ అమెరికను జాతి అయిన సౌక్ లకు నాయకుడు బ్లాక్ హాక్ లొంగిపోవడంతో, నేటివ్ అమెరికనులకు, అమెరికాకూ మధ్య జరిగిన బ్లాక్ హాక్ యుద్ధం ముగిసింది.
- సెప్టెంబరు 22: ఆట్టోమన్ సుల్తాను మహమూద్-2, జెరూసలేంలో తమ గవర్నరుగా ఉన్న సయ్యద్ ఆఘాను తొలగించి అతడి స్థానంలో కాసిం అహ్మద్ ను నియమించాడు.[2]
- డొక్కల కరువు ఏర్పడిన సంవత్సరం
- పెద్ద బాలశిక్ష మొట్టమొదటిసారిగా ముద్రించినది
- మద్రాస్ క్రానికల్ వార్తాపత్రిక ప్రచురణ మొదలైంది
- తేదీ తెలియదు: బీహార్ లోని ముంగేర్ జిల్లాను ఏర్పాటు చేసారు.
- తేదీ తెలియదు: మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాను ఏర్పాటు చేసారు
జననాలు
[మార్చు]- జనవరి 6: గస్టావ్ డోరే, ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి (మ.1883)
- జనవరి 27: లెవిస్ కరోల్, బ్రిటిషు రచయిత (జ. 1898)
- జూన్ 10: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (మ.1904)
- జూన్ 17: విలియం క్రూక్స్, బ్రిటిష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. (మ. 1919)
- అక్టోబరు 8: ఆమోస్ విట్నీ, మెకానికల్ ఇంజనీరు, ప్రాట్ & విట్నీ కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. (మ. 1920)
మరణాలు
[మార్చు]- జనవరి 27: మద్రాసు కాలేజీని స్థాపించిన ఆండ్రూ బెల్ (జ. 1753)
- మార్చి 22: గేథే, జర్మనీ రచయిత. (జ.1749)
- సెప్టెంబర్ 21: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771)