1830

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1830 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1827 1828 1829 - 1830 - 1831 1832 1833
దశాబ్దాలు: 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
 • ఫిబ్రవరి 5: లండన్‌లో అర్గిల్ రూమ్స్ అనే సంగీత సభాభవనం కాలిపోయింది. ఆ కాలం లోనే కొత్తగా రంగ ప్రవేశం చేసిన ఆవిరితో నడిచే అగ్ని మాపక యంత్రం మంటలను ఆర్పి, మంటలు వ్యాపించకుండా కాపాడింది.
 • మార్చి 28: జావా యుద్ధం ముగిసింది
 • మే 13: గ్రాన్ కొలంబియా నుండి ఈక్వడార్ విడిపోయింది.
 • మే 18: ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రను చెన్నపట్నం నుండి ప్రారంభించాడు.
 • మే 28: అమెరికా కాంగ్రెసు, నేటివ్ అమెరికనులను తమ స్వస్థలాల నుండి బలవంతాన వెళ్ళగొట్టే ఇండియన్ రిమూవల్ యాక్ట్‌ను చేసింది. దీనివలన ఉత్తర అమెరికాలో బైసన్ ల సామూహిక నాశనానికి దారితీసింది.[1]
 • జూన్ 20: ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం సంగమేశ్వరం గ్రామంలో మజిలీ చేశాడు.
 • జూన్ 25: విలియం IV బ్రిటిషు రాజయ్యాడు
 • జూలై 5: ఫ్రాన్సు, అల్జీరియాను ఆక్రమించింది.
 • జూలై 13: కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్, రాజా రామమోహన్ రాయ్ లు జనరల్ అసెంబ్లీ కాలేజీ (స్కాటిష్ చర్చి కాలేజీ) ని స్థాపించారు.
 • జూలై 17: నిముషానికి 200 కుట్లు వేసే సామర్థ్యం ఉన్న కుట్టుమిషనుకు బార్తెలెమీ తిమోన్నియర్ ఫ్రెంచి పేటెంటు పొందాడు
 • జూలై 18: ఉరుగ్వే తన మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించింది
 • ఆగస్టు 31: ఎడ్విన్ బియర్డ్ బడ్డింగ్ కు లాన్ మొవర్ కు గాను బ్రిటను పేటెంటు లభించింది.
 • సెప్టెంబరు 15: లివర్‌పూల్ మాంచెస్టర్ రైల్వే మొదలైంది.
 • తేదీ తెలియదు: రాజా వేంకట శ్వేతాచలపతి రంగారావు-1 బొబ్బిలి సంస్థానం గద్దెనెక్కాడు

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
ఫోరియర్

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Timeline of American Bison". US Fish and Wildlife Service. Archived from the original on 2019-04-01. Retrieved 2020-06-24.
"https://te.wikipedia.org/w/index.php?title=1830&oldid=3848472" నుండి వెలికితీశారు