ఝాన్సీ లక్ష్మీబాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి
182817 జూన్ 1858

రాణీ లక్ష్మీబాయి విగ్రహం
ఇతర పేర్లు: మను, మనికర్ణిక
జన్మస్థలం: కాశీ
నిర్యాణ స్థలం: గ్వాలియర్,భారత్
ఉద్యమం: భారత స్వాతంత్ర్యోద్యమం

ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) audio speaker iconpronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది. 1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకున్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం "జోన్ ఆఫ్ ఆర్క్" గా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.[1]

ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల 19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వ సంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది.[2] ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయిలు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనదీ, ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది.

పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. మను నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ఝాన్సీ లక్ష్మీబాయి నేపద్యం[మార్చు]

మను తండ్రి రెండవ బాజీరావు పెష్వా దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు. బాజీరావు పంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావు కు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్ వెంట మనూబాయి దుసుకొని పోయేది.

వివాహం[మార్చు]

లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది.[3] దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. బిడ్డ మరణం నుండి తేరుకోలేని గంగాధర్రావుకు 1853 లో విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బంధువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణించాడు.

ఆక్రమణ[మార్చు]

వివాహం తరువాత ఆమె పేరు లక్ష్మిబాయిగా మార్చబడింది. సభలో ఆమె తండ్రికున్న ప్రాబల్యం వలన, మిగిలిన యువతులు, ఎవరైతే జెనన కి నిర్బంధం చేయబడి ఉంటారో, వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఈమెకు వుండేది. ఆమె సాయుధ దళం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది. అంతే కాకుండా తన స్నేహితురాళ్ళందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారుచేసింది.

గంగాధర్రావు మరణించే సమయానికి డల్హౌసీ (Dalhousie) భారత గవర్నర్ జనరల్ (Governor general)గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదర్ రావు రాజా కు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున, ఈస్ట్ ఇండియా కంపనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డెల్ హౌసి (East India company governor-general Lord Dalhousie), సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక న్యాయవాది రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ న్యాయస్థానంలో దావా వేసింది. ఆ న్యాయవాది కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854 లో రాజు ఋణపడి ఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పింఛను నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.

గొప్ప తిరుగుబాటు[మార్చు]

రాణి ఝాన్సీ ని ఇవ్వకూడదని నిశ్చయించుకొన్నది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి, తమకు తాముగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సేనను తయారుచేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భు బక్షి, మోతీ బాయి, సుందర్-ముందర్, ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు .

1857 స్వాతంత్ర్య పోరాటం[మార్చు]

ఝాన్సీ రాణి, - భారతదేశంలో తిరుగుబాటు గురించి 1859లో లండన్‌లో ప్రచురితమైన Chambers's History of the Revolt in INDIA అనే పుస్తకం నుండి

ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నపుడు, మే 10, 1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసినా కాని, వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, వాళ్ళు వాడే తుపాకీలకు పందులు, ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి, ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంపబడిన వాళ్ళలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొన్నారు.

ఇంతలో, మే 1857లో భారతదేశంలో కలవరం ప్రాకడం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో, బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించవలసినదిగా నిర్బంధం రావడంతో,ఝాన్సీ ని లక్ష్మిబాయి పరిపాలించవలసిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి, ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ తన సమర్థత వలన లక్ష్మిబాయి మధ్య కాలంలో వచ్చిన సామ్రాట్ల కలవర సమయములో కూడా ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

అప్పటి వరకు, బ్రిటిష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సంశయించినా కాని, జూన్ 8 1857 జోఖన్ బాఘ్ లో బ్రిటిష్ HEIC అధికారుల, వాళ్ళ భార్య, పిల్లల "జన సంహారం"లో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదము గానే నిలిచిపోయింది. చివరికి మార్చి 23 1858 లో బ్రిటిష్ బలగాలు సర్ హుఘ్ రోజ్ వశములో ఝాన్సీ ని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది. ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగ కూడదని ఆమె నిర్ణయించుకొంది. యుద్ధము సుమారు రెండు వారాలు జరిగింది. ఝాన్సీ నిర్మూలన చాలా భయంకరమైనది. ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని , తిను బండారములను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.

ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీ కి స్వేచ్ఛ కలిగించి లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాంత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర లెక్కకి 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నా కాని, "ఏ శిక్షణ లేని వాళ్ళ కంటే" వీళ్ళు చాలా శిక్షణ పొందినవాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో,బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది. ఆ రక్షకులలో చాలా మంది తన మహిళా సైన్యం నుండి ఉన్నవారే.

1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబరు, అక్టోబరు 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా, ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.

జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవకారుణ్ణి కలుసుకోగలిగింది.

ఆమె, చిన్నవాడు అయిన దామోదర్ రావు, తన బలగాలతో కల్పి కి పారిపోయి తాంత్యా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి, తాంత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. కాని,1858 జూన్ 17,లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది[4].ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.

తనతో పాటు ఆమెను తీసుకు వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెన ను తెమ్మని పురమాయించింది. దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి వామి పైకి ఎక్కి దాన్ని తగుల బెట్టమని చెప్పింది. ఆమె అనుచరులు అలాగే చేశారు. ఇది ఫూల్ భాగ్ వద్దనున్న గుసైన్ బాగ్ వద్ద జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూశాను.[5]

తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవకారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.

మరణం[మార్చు]

మహారాణి లక్ష్మిబాయి విగ్రహము, ఆగ్రా

ఆమె 1858 జూన్ 17 లో గ్వాలియర్ లో యుద్ధ సమయములో తన ఎనిమిదవ యుద్ధ గుర్రంతో మరణించింది. అది గ్వాలియర్లోని ఫూల్ బాఘ్ దగ్గర కోతః-కి-సేరిలో జరిగింది. ఆమె యుద్ధ వీరులకు యుద్ధ బట్టలు తొడిగించి గ్వాలియర్ కోటను రక్షించటానికి యుద్ధానికి తీసుకెళ్ళింది. ఇది ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో ఉండే లక్నోకి పడమరగా 120 మైళ్ళ దూరంలో ఉంది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు గ్వాలియర్ ను ఆక్రమించుకొన్నారు. గ్వాలియర్ యుద్ధ నివేదిక ప్రకారం, గెనరల్ సర్ హుఘ్ రోస్ ఆమెని "చాలా చెప్పుకోదగిన అందమైనది, తెలివైనది, పట్టుదల కలది" అని "తిరుగుబాటు నాయకులలో కెల్లా అతి భయంకరమైనది" అని వర్ణించారు.

కాని, కొరతగా ఉన్న శవాన్ని గుర్తించి, అది రాణి అని నమ్మించారని, " పరాక్రమ" పటాలముగా చెప్పబడే ఆమె గ్వాలియర్ యుద్ధంలో చనిపోలేదని కెప్టన్ రీస్ నమ్మబడి, "[ది] ఝాన్సీ మహారాణి బ్రతికే ఉంది!" అని బహిరంగంగా ప్రకటించాడు.[6] ఆమె ఎక్కడైతే మరణిచిందో అక్కడే అదే రోజు ఆమెకు అంత్య క్రియలు జరిగాయని నమ్మకం. ఆమె పరిచారికలలో ఒకరు అంత్యక్రియల సన్నాహాలకు సహాయపడింది.

ఆమెకున్న ధైర్యము, పరాక్రమము, వివేకము, భారతదేశంలో 19 వ శతాబ్దములో మహిళలకున్న అధికారం పై ఆమెకున్న ముందుచూపు, ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపాయి. ఝాన్సీ, గ్వాలియర్ లలో ఆమె గుర్తుగా కంచు విగ్రహాలను స్థాపించారు. రెండింటిలోను ఆమె గుర్రం పైన కూర్చున్నట్టుగా చిత్రీకరించారు.

ఝాన్సీ అధికారం పోయిన కొన్ని రోజులకే ఆమె తండ్రి అయిన మోరోపంత్ తాంబేని పట్టుకొని ఉరితీసారు. .తన దత్త పుత్రుడైన దామోదర్ రావు, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భరణం ఇవ్వబడ్డాడు, కాని అతనెప్పుడు తమ పిత్రార్జితాన్ని అందుకోలేదు. అది రాణీగారి పెంపకం

ప్రాబల్యం[మార్చు]

రాణి లక్ష్మిబాయి దేశీయ శూరురలైంది, ఆమెను వీరనారి కి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారత దేశీయ సేనలో మొదటి మహిళా సమూహమును, తయారు చేసినప్పుడు దానికి ఈమె పేరు పెట్టారు. భారత దేశ కవయిత్రి అయిన సుభద్ర కుమారి చౌహాన్ వీర రస శైలిలో ఆమె గురించి ఒక కవిత రచించారు. అది ఇప్పటికి భారత దేశ బడి పిల్లల చేత చెప్పబడుచున్నది.

1878 లో పుస్తకం ది హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ మ్యూటిని పుస్తకం ప్రకారం కొలోనెల్ మల్లెసన్ చెప్పినదేంటంటే "...ఆమె ప్రజల నమ్మకం ప్రకారం ఆమె దౌర్జన్యంగా తిరుగుబాటులోకి రప్పించబడిందని ; అది న్యాయమైనదని; ..... వాళ్లకి ఆమె ఎప్పటికి శూరురాలు."[7]

కల్పన లో[మార్చు]

  • జార్జ్ మాక్ డోనాల్డ్ ఫ్రాసేర్ ద్వారా ఫ్లాష్ మాన్ ఇన్ ది గ్రేట్ గేం, ఫ్లాష్ మాన్, రాణి భారత దేశ తిరుగుబాటు కలయికల గురించి వివరించే ఒక చారిత్రాత్మక కల్పిత కథ.
  • మైకేల్ డి గ్రేస్, ద్వారా ఫ్రెంచ్ లో ల ఫెమ్మే సాక్రి . ఝాన్సీ రాణి జీవితానికి సంబంధించిన ఒక కల్పన కథలో రచయిత, రాణికి, ఒక ఆంగ్ల వకీలుకు మధ్య ఉన్న ప్రేమ వ్యవహారము పై తనకున్న ఉహాలను రచించాడు.
  • జాన్ మాస్టర్స్ ద్వారా నైట్ రన్నర్స్ అఫ్ బెంగాల్లో లక్ష్మిబాయి ఆధారంగా, బ్రిటిష్ అధికారి ఇన రాడ్నీ సవాజ్ కు, రాణి కి మధ్య ఉన్న సంబంధం గురించి ఒక కల్పిత కథ లభిస్తోంది. 1951, జనవరిలో ప్రచురింపబడి, ఆ మాసపు పుస్తకముగా అమెరికన్ లిటరరీ గుల్డ్స్ పుస్తకము ఎంపికైనది కాని అది రాజకీయ పరిశీలనలో చాలా విమర్శలను ఎదుర్కొన్నది. ఇది భారతదేశములో బ్రిటిష్ కుటుంబాల సేవల గురించి కల్పిత చారిత్రాత్మక కథలలో ఒక భాగం.
  • ఝాన్సీ మహారాణి , ఇది మహాశ్వేతా దేవి రచించిన ఝాన్సిర్ రాణి ఆంగ్ల అనువాదం. ఈ పుస్తకము రాణి లక్ష్మిబాయి జీవితము గురించి కల్పిత కథగా తిరిగి రచింపబడింది. ఇది 1956 లో బెంగాల్లో ప్రచురింపబడింది. ISBN 81-7046-175-8
  • 1972 లో నార్మన్ పర్టింగ్తాన్ రచించిన ఫ్లో రెడ్ ది గాంజెస్ , ఒక ఆంగ్ల నవల.
  • 2007 లో జయశ్రీ మిశ్రా రచించిన రాణి , ఆంగ్లములో ఒక నవల.
  • ఝాన్సీ కి రాణి (టీవీ సీరీస్ ), భారతీయ దూరదర్శన్ అయిన జీ టీవీలో ప్రసారమైన ఒక ధారావాహిక.

ఝాన్సీ రాణి పై తీసిన సినిమాలు[మార్చు]

  • ది టైగర్ అండ్ ది ఫేం (1953) భారతదేశంలో విడుదలైన మొదటి సాంకేతిక రంగుల చలన చిత్రం. ఇది భారతీయ చలనచిత్ర తయారీకుడైన సోరబ్ మోడి దర్శకత్వం వహించి నిర్మించింది.
  • ది రెబల్ , కేతన్ మెహతా కొత్త చలన చిత్రం. ఇది అతని చిత్రానికొక స్నేహపూరిత వస్తువు. మంగల్ పాండే: ది రైజింగ్ చంద్ర ప్రకాష్ ద్వివేది రచించిన కథ నుంచి ఫరూక్ దొండె ద్వారా చలన చిత్రంగా ప్రదర్శిపబడింది. ఈ చిత్రం ప్రస్తుతం తిరిగి నిర్మించబడుతోంది.
  • ఐశ్వర్య రాయ్ బచ్చన్ అభినయించబోయే "ఝాన్సీ కి రాణి లక్ష్మిబాయి" ఆలోచనా ప్రణాళికలో ఉంది.

ఉపసంహారం[మార్చు]

  • ఆమె తండ్రి మోరోపంత్ తాంబేను ఝాన్సీ రాజ్యం పడిపోయిన కొన్ని రోజుల తర్వాత పట్టుకొని ఉరి తీయడం జరిగింది.
  • ఆమె దత్త పుత్రుడైన దామోదర్ రావుకు బ్రిటీష్ ప్రభుత్వం అతని వారసత్వ సంపదను ఇవ్వకపోయినా భరణం మాత్రం చెల్లించింది.
  • ఝాన్సీలోనూ, గ్వాలియర్లోనూ ఉన్న రాణి కంచు విగ్రహాలు ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ మిగిలి ఉన్నాయి..

సాహిత్యం[మార్చు]

  • The Queen of Jhansi is the English translation of Jhansir Rani by Mahashweta Devi. This book is fictional reconstruction of life of Rani LaxmiBai and was originally published in Bengali in 1956, ISBN 81-7046-175-8.
  • Jhansi ki Rani, written by Subhadra Kumari Chauhan, is a heroic nationalist poem honouring the Rani, and is very popular in India.
  • Flashman in the Great Game - Two meetings between Flashman and the Rani are described in this historical fiction novel about the Indian Revolt by George MacDonald Fraser.
  • "Rani" a novel (2007) in English by Jaishree Misra.
  • Nightrunners of Bengal by John Masters provides a fictional account of the relationship between a British officer (Rodney Savage) and a Rani, based on Lakshmibai. It was the American Literary Guild's Book of the Month on publication in January 1951, but faced some criticism for perceived political views. It is part of a series of historical novels about a fictional British family serving in India.
  • Maza Pravas: 1857 cya Bandaci Hakikat (marathi "My journey: the truth about the 1857 rebellion") by Vishnu Bhatt Godse.
  • Amar Balidani by Janki Sharan Verma
  • Zila Vikas Pustika, 1996–97, Jhansi
  • Meyer, Karl E. and Shareen Blair Brysac. Tournament of Shadows. Washington D.C.: Counterpoint, Jgyjvujgujgujguj1999.

కాల రేఖ[మార్చు]

  • ఝాన్సీరాణి జీవితంలో వివిధ ఘట్టాలను కాలానుగుణంగా ఇక్కడ ఇచ్చారు [1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. బార్బరా N.రాముసాక్ , పునర్విమర్శనము చేసిన ఝాన్సీ రాణి: భారత దేశంలో ని ఆడవారి వీరత్వం గురించి ఒక అభ్యాసం , జోయస్ లిబ్రా-చాప్మన్ ద్వారా,ఆసియా చదువుల గురించి ఒక గ్రంథం , సంచిక సంఖ్య 46. 2, (మే 1987), 437.
  2. 10TV (14 August 2020). "భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు" (in telugu). Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sir John Smythe (1966). The Rebellious Rani. London: Fredrick Muller.
  4. "The India of the Nawabs". The New York Times. Retrieved 2007-05-15.
  5. "Extracts from three letters by a Mr Martin to John Venables Sturt". Archived from the original on 2008-10-16. Retrieved 2008-08-31.
  6. అశ్క్రాఫ్ట్,నిగెల్ (2009), ఝాన్సీ రాణి, బాలీవుడ్ పబ్లిషింగ్ లిమిటెడ్,ముంబై p.1
  7. Malleson, Colonel (1878), The History of the Mutiny, London: William H Allen & Co., pp. 154–155

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.