సుభద్ర కుమారి చౌహాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుభద్ర కుమారి చౌహాన్ (16 ఆగస్టు 1904[1][2] – 1948 ఫిబ్రవరి 15) ప్రముఖ హిందీ కవయిత్రి. తొమ్మిది రకాలైన రాస్ పద్ధతుల్లో ప్రధానంగా వీర్ రాస్ లో రచనలు చేశారు ఆమె.

1976లో భారతదేశపు స్టాంప్ మీద సుభద్ర కుమారి చౌహాన్

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో ఉన్న నిహల్ పూర్ గ్రామంలో  జన్మించారు సుభద్ర. అలహాబాద్ లోని క్రాస్త్ వెయిట్ గర్ల్స్ పాఠశాలలో  ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె, 1919లో మిడిల్ స్కూల్ పరీక్ష పూర్తి  చేశారు. అదే ఏడాది ఖండ్వా కు చెందిన ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ చౌహాన్ ను వివాహం చేసుకున్నారు సుభద్ర. పెళ్ళి అయిన తరువాత జబల్  పూర్ కు మారిపోయారు ఆమె.

కుటుంబం

[మార్చు]

ఆమెకు ఐదుగురు పిల్లలు. సుధ చౌహాన్, అజయ్ చౌహాన్, అశోక్ చౌహాన్, మమత చౌహాన్. మమత తప్ప మిగిలిన వారందరూ చనిపోయారు. మమత ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్నారు. అజయ్,  అశోక్ ల భార్యలు మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో ఉంటున్నారు. రైట్ టౌన్ లో సుభద్ర, ఆమె భర్త ఉన్న ఇంటిలోనే అశోక్ కుమారుడు నివాసం ఉంటున్నారు. ఆ వీధికి సుభద్ర కుమారి చౌహాన్ వార్డు అని పేరు మార్చడం విశేషం.[ఎప్పుడు?]

కెరీర్

[మార్చు]

1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు సుభద్ర. నాగపూర్ నుంచి అరెస్టు అయిన మొట్టమొదటి మహిళా సత్యాగ్రహి  సుభద్ర కావడం విశేషం. 1923, 1942 సంవత్సరాల్లో రెండు సార్లు అరెస్ట్ అయ్యారు సుభద్ర.

మూలాలు

[మార్చు]