రాయడప్ప రంగారావు
రాజా రాయడప్ప రంగారావు | |
---|---|
జననం | 1790 జనవరి 14 |
మరణం | 1830 జనవరి 17 | (వయసు 40)
జాతీయత | భారతదేశం |
పౌరసత్వం | భారతదేశం |
వృత్తి | పరిపాలన, కవి, సాహిత్య పోషణ |
గుర్తించదగిన సేవలు | సంకల్ప సూర్యోదయం |
బిరుదు | బొబ్బిలి సంస్థానాధిపతి |
పదవీ కాలం | 1802-1830 |
తరువాతివారు | శ్వేతాచలపతి రంగారావు |
జీవిత భాగస్వామి | చెలికాని చెల్లాయమ్మ, ఇనుగంటి బుచ్చియమ్మ, ఇనుగంటి లక్ష్మీనరసాయమ్మ |
పిల్లలు | 10; పు:4, స్త్రీ:6; రాజా శ్వేతాచలపతి రంగారావు, జనార్ధన రంగారావు, సీతారామచంద్ర రంగారావు, వేంకట రంగారావు |
రాజా రాయడప్ప రంగారావు (జ: 1790 జనవరి 4 - మ: 1830 జనవరి 17) బొబ్బిలి సంస్థానాధీశులు, కవులు, సాహిత్య పోషకులు. వీరు 1802 నుండి 1830 వరకు రాజ్యాన్ని పాలించారు.
బొబ్బిలి చిన రంగారావుకు సంతానం లేకపోవడం వలన పాల్తేరు వాస్తవ్యుడు సుబ్బమాంబ, అన్నారావుల పుత్రుడైన రాయడప్ప రంగారావును దత్తత తీసుకున్నారు. వీరు కందాళ వేంకటార్యుని శిష్యుడు.
వీరి ఆస్థానంలో ఇనుగంటి సీతారామస్వామిని దివానుగా వున్నట్లు అతని సహాయంతోనే సంస్థానంలో జరిగే ధర్మశాస్త్రానువాద రచనలు పూనుకున్నట్లు తెలిపారు.
వీరు "సంకల్ప సూర్యోదయం" అనే వేదాంత నాటకాన్ని రచించారు. దీనికి మూలం సంస్కృతం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బోధించే రచన. దీనిని వేదాంతదేశికులు రచించారు. పంచవిధ శారీరక శాస్త్రార్థం ఇందులో వర్ణించారు. తెలుగు ప్రబంధరూపంలోకి రాజావారు గద్యపద్య మిళితంగా 10 అధ్యాయాలతో తెలుగుచేశారు. ఈగ్రంథ రచనలో రాజావారికి గరిమెళ్ల సుబ్బాయ్య అనే కవి సహాయం చేశారు.
కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి వీరి ఆస్థాన విద్వాంసుడు. వీరు మేఘసందేశము, దిలీపచరిత్ర మనే కావ్యాలను రచించినట్లుగా, శ్వేతాచల మాహాత్మ్యం కావ్యాన్ని రచించి రాయడప్ప రంగారావు గారికే అంకితమిచ్చాడు.
వీరు చాలా చెరువులను తవ్వించినట్లుగా పేర్కొన్నారు; వానిలో రంగరాయ సాగరం అతిపెద్దది.[1] బొబ్బిలి పట్టణంలో ప్రస్తుతం ప్రసిద్ధిచెందిన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం వీరి ద్వారా ప్రారంభించబడింది. దురదృష్టవశాత్తు దేవాలయ నిర్మాణం ఫూర్తికాకమునుపే వీరు పరమపదించారు.
కుటుంబం
[మార్చు]రాయడప్ప రంగారావుకు ముగ్గురు భార్యలు, ఇద్దరిని ఒక విచిత్రమైన పరిస్థితులలో ఒకేసారి వివాహం చేసుకున్నారు. మొదటి భార్య సీతానగరానికి చెందిన చెలికాని వారి ఆడపడుచుకాగా రెండవకన్య తెర్లాం ఇనుగంటి కుటుంబానికి చెందినది. వీరిలో మొదటి భార్య చెల్లాయమ్మ గారు నలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలను అందించగా; రెండవభార్య బుచ్చియమ్మ ద్వారా ఒక్క అమ్మాయిని పొందారు. చాలా సంవత్సరాల సుఖసంసారం అనంతరం రెండవభార్య మరణించిన పిదప రాజావారు వావిలవలస ఇనుగంటి కుటుంబానికి చెందిన లక్ష్మీనరసాయమ్మను వివాహం చేసుకున్నారు. రంగారావుగారు 1830 జనవరి 17 తేదీన పరమపదించారు; వీరి కుమారులు రాజా శ్వేతాచలపతి రంగారావు, రాజా జనార్దన రంగారావు, రాజా సీతారామచంద్ర రంగారావు, రాజా వేంకట రంగారావు.
మూలాలు
[మార్చు]- ↑ Venkata Svetachalapati Rangarao (1907). " Chapter_8". https://en.wikisource.org/wiki/A_Revised_and_Enlarged_Account_of_the_Bobbili_Zemindari. Addison & co.. వికీసోర్స్.
- బొబ్బిలి సంస్థాన చరిత్ర - సాహిత్య పోషణ (2002), బోనాల సరళ, పేజీ. 120-127.