జోసెఫ్ ఫోరియర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోసెఫ్ ఫోరియర్
జీన్ బాప్తిస్తే జోసెఫ్ ఫోరియర్
జననం(1768-03-21)1768 మార్చి 21
ఫ్రాంస్
మరణం1830 మే 16(1830-05-16) (వయసు 62)
ప్యారిస్, ఫ్రాంస్
నివాసం France
జాతీయతఫ్రాన్స్ ఫ్రాంస్
రంగములుగణితజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త, and చరిత్రకారుడు
పరిశోధనా సలహాదారుడు(లు)జోసెఫ్ లాగ్రాంజె
ప్రసిద్ధిఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్, ఫోరియర్ సిరీస్

జీన్ బాప్తిస్తే జోసెఫ్ ఫోరియర్ (మార్చి 21, 1768 - మే 16 1830), ఫ్రాన్స్కు చెందిన ఒక భౌతిక, గణిత శాస్త్రవేత్త. ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్, ఫోరియర్ శ్రేణి లను కనుగొన్న శాస్త్రవేత్తగా లోకానికి సుపరిచితుడు.

జీవితం

[మార్చు]

ఫోరియర్

గ్రీన్‌హౌస్ ప్రభావం ఆవిష్కరణ

వాతావరణంలో వాయువుల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగొచ్చన్న విషయాన్ని కనుక్కున్న ఘనత 1824లో ఫోరియర్ కి దక్కిందని చెప్పుకుంటారు. ఈ ప్రక్రియకే తదనంతరం గ్రీన్‌హౌస్ ప్రభావంగా పేరొచ్చింది. 1824లో ఈ ప్రక్రియని వివరంగా వర్ణించాడు. తరువాత 1827లో అలాంటి మరో పత్రంలోనే గ్రహాల చుట్టూ ఉన్న వాతావరణం వల్ల వాటి ఉపరితలంలోని వాతావరణం వేడెక్కొచ్చని పేర్కొన్నాడు. ఆ విధంగా గ్రహాల యొక్క శక్తి సమతూనిక అన్న భావనకు, గ్రహాల ఉష్ణోగ్రతని పెంచే మూలాలు అనేకం ఉంటాయన్న భావనకూ ప్రాణం పోశాడు. పరారుణ వికిరణాల వల్ల కూడా గ్రహాలు శక్తిని (దానికి చీకటి వేడిమి అని పేరు కూడా పెట్టాడు) పోగొట్టుకుంటాయని కూడా అన్నాడు. ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్ది ఆ శక్తిని కోల్పోయే వేగం కూడా ఎక్కువవతుంది. ఆ విధంగా ఒక దశలో ఉష్ణనష్టానికి, ఉష్ణలబ్ధికి మధ్య సమతూనిక ఏర్పడుతుంది. వాతావరణం ఉండడం వల్ల ఉష్ణనష్టం నెమ్మదిస్తుంది. లబ్ధికి, నష్టానికి మధ్య సమతూనిక అధిక ఉష్ణోగ్రతల దిక్కుగా జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్ది పరారుణ వికిరణ రేటు పెరుగుతుందని ఫోరియర్ కి తెలుసు. కాని ఆ ప్రక్రియకి ఒక సంఖ్యాత్మక రూపాన్నిచ్చే స్టెఫాన్-బోల్జ్మాన్ నియమం తదనంతరం యాభై ఏళ్ల తరువాత గాని కనుక్కోబడలేదు.


భూమికి ప్రాథమిక శక్తి మూలం సూర్యరశ్మేనని గుర్తించాడు ఫోరియర్. సూర్యరశ్మికి పృథ్వీ వాతావరణం ఇంచుమించు పారదర్శకంగా ఉంటుందని, భూగర్భ ఉష్ణం యొక్క పాత్ర ఇక్కడ ఎక్కువగా లేదని కూడా గుర్తించాడు. అయితే గ్రహాంతర అంతరిక్షం నుండి వచ్చే కిరణాలు కూడా భూమి మీద వేడిమిని పెంచడంలో ముఖ్య పాత్ర ధరిస్తాయి అని భావించి ఫోరియర్ పొరబడ్డాడు.

ఓ నల్లని పెట్టెని ఎండలో పెట్టి మ్. ద ససూర్ చేసిన ప్రయోగాన్ని ఫోరియర్ పేర్కొన్నాడు. ఆ పెట్టె మూతని ఓ సన్నని అద్దంతో మూసి ఉంచితే పెట్టెలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. పన్నెండేళ్ల తరువాత విలియం హెర్షెల్ కూడా పరారుణ కాంతిని కనుక్కున్నాడు.

మూలాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]
  • ఫోరియర్ విశ్లేషణ
  • ఫోరియర్ నంబర్
  • ఫోరియర్ సిరీస్
  • ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్
  • ఫోరియర్స్ న్యాయము
  • హీట్ ఈక్వేషన్

బయటి లింకులు

[మార్చు]