ప్రాట్ & విట్నీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాట్ & విట్నీ
తరహాSubsidiary of UTC
స్థాపన1860
స్థాపకులుఫ్రాంసిస్ ప్రాట్
అమోస్ విట్నీ
ప్రధానకేంద్రముతూర్పు హార్ట్‌ఫర్డ్, కనెక్టికట్ రాష్ట్రం, అమెరికా
కీలక వ్యక్తులుస్టీవెన్ ఫింగర్, అధ్యక్షుడు
పరిశ్రమవిమాన సంబంధిత
ఉత్పత్తులుజెట్, గ్యాస్ ఇంజెన్లు
వెబ్ సైటుpw.utc.com

ప్రాట్ & విట్నీ (Pratt & Whitney) అమెరికాకు చెందిన విమానాల ఇంజెన్ తయారు చేసే కంపెనీ. ఇది ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఇంజెన్ తయారిదారు.

చరిత్ర

[మార్చు]
ప్రాట్ & విట్నీ మొదటి లోగో

ప్రాట్ & విట్నీ కంపెనీని 1860లో ఫ్రాంసిస్ ప్రాట్, ఆమోస్ విట్నీ, అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫర్డ్ నగరంలో స్థాపించారు. మెదట్లో ప్రాట్ & విట్నీ కుట్టు మెషిన్లు, తుపాకులను తయారుచేసే యంత్రాలు తయారుచేసేది.

1925లో ఫ్రెడెరిక్ రెంష్లర్, తాను ఒక విమాన ఇంజెను తయారుచేయటం కొరకు ప్రాట్ & విట్నీ కర్మాగారము బాడిగకు కోరాడు. ఇది ప్రాట్ & విట్నీ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ మొదలు. ప్రాట్ & విట్నీ మొదటి విమాన ఇంజెను 1925 డిసెంబరు 24న పూర్తయ్యింది.