Jump to content

సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్

వికీపీడియా నుండి

 

సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్
పుట్టిన తేదీ, స్థలం(1832-06-10)1832 జూన్ 10
గ్రేవ్‌సెండ్, గ్రేవ్‌షామ్, కెంట్, ఇంగ్లాండ్
మరణం1904 మార్చి 24(1904-03-24) (వయసు 71)
లండన్, ఇంగ్లాండ్
వృత్తిపాత్రికేయుడు,సంపాదకుడు, కవి
జాతీయతಇಂಗ್ಲಿಷ್
విద్యయునివర్సిటి కళాశాల,ఆక్స్ ఫర్డ్
గుర్తింపునిచ్చిన రచనలుదిలైట్ ఆఫ్ ఏషియా


సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ (1832 జూన్ 10 - 1904 మార్చి 24) బుద్ధుని జీవితంపై లైట్ ఆఫ్ ఆసియా లేదా ది గ్రేట్ రినన్సియేషన్ (1870) అనే ప్రసిద్ధ కవితను రచించాడు. [1][2]ఇంగ్లాండ్‌లోని సస్సెక్స్‌లో మేజిస్ట్రేట్ కుమారుడిగా జన్మించిన అతను లండన్, ఆక్స్‌ఫర్డ్‌లలో చదువుకున్నాడు. పూణేలోని డెక్కన్ కాలేజీకి ప్రధానోపాధ్యాయుడిగా 1856 నుండి 61 మధ్య పనిచేసాడు. సంస్కృతం నుండి అనువదించబడిన అతని మొదటి రచన హితోపదేశం (1861). భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించాడు.


అతను 1861లో ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చి డైలీ టెలిగ్రాఫ్ సంపాదకీయ సిబ్బందిలో చేరాడు. తర్వాత దానికి సంపాదకుడయ్యాడు. తూర్పు ప్రపంచంలోని జీవన విధానాన్ని, ఆలోచనలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయడమే అతని లక్ష్యం. ది లైట్ ఆఫ్ ఆసియా అనే దీర్ఘ కవిత రాశాడు. అతని ఇతర రచనలలో ది సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ ఇండియా, విత్ సాడి ఇన్ ది గార్డెన్ మరియు ది టెన్త్ మ్యాన్' ఉన్నాయి.


అతని రచన ది లైట్ ఆఫ్ ఆసియా చాలా ప్రజాదరణ పొందింది. అతని కవిత సాధారణ భాషలో బుద్ధుని జీవితం, బోధనలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసింది. భారతదేశంలోని ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు కూడా ఈ కవితను మెచ్చుకున్నారు. ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అనే దీర్ఘ కవితలో, యేసు క్రీస్తు జీవితాన్ని, బోధనను వివరించడానికి ప్రయత్నించాడు. కానీ ఈ నిర్మాణం చాలా విజయవంతం కాలేదు.

మూలాలు

[మార్చు]
  1. The Feast of Belshazzar: A Prize Poem Recited in the Theatre, Oxford, June 23 1852, Francis Macpherson, Oxford
  2. "Sir Edward Arnold Dead". The New York Times. 1904-03-24. Retrieved 2024-06-23.

బాహ్య లింకులు

[మార్చు]