Coordinates: 22°34′22″N 88°21′50″E / 22.5726723°N 88.3638815°E / 22.5726723; 88.3638815

కోల్‌కతా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kolkata
Calcutta
Clockwise from top: Victoria Memorial, St. Paul's Cathedral, Central Business District, Rabindra Setu, City Tram Line, Vidyasagar Setu
Clockwise from top: Victoria Memorial, St. Paul's Cathedral, Central Business District, Rabindra Setu, City Tram Line, Vidyasagar Setu
Location of Kolkata in West Bengal
Location of Kolkata in West Bengal
Coordinates: 22°34′22″N 88°21′50″E / 22.5726723°N 88.3638815°E / 22.5726723; 88.3638815
Country India
రాష్ట్రం West Bengal
DivisionPresidency
ముఖ్యపట్టణంKolkata
Government
 • Lok Sabha constituenciesKolkata Dakshin, Kolkata Uttar
 • Vidhan Sabha constituenciesKolkata Port, Bhabanipur, Rashbehari, Ballygunge, Chowranghee, Entally, Beleghata, Jorasanko, Shyampukur, Maniktala, Kashipur-Belgachhia
విస్తీర్ణం
 • Total185 km2 (71 sq mi)
జనాభా
 (2011)
 • Total44,96,694
 • జనసాంద్రత24,000/km2 (63,000/sq mi)
Demographics
 • Literacy98.67 per cent
 • Sex ratio990 /
Languages
 • OfficialBengali[1][2]
 • Additional officialEnglish[1]
Time zoneUTC+05:30 (భా.ప్రా.కా)
Vehicle registrationWB-01 to WB-10
Major highwaysNH-12, SH-1, SH-3
Average annual precipitation1850 mm

కోల్‌కతా జిల్లా (గతంలో కలకత్తా జిల్లాగా పిలువబడింది) భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఈ జిల్లా ప్రధానకార్యాలయం కోల్‌కతాలోఉంది. కోల్‌కతా (కలకత్తా) ఇది ఒక వలస ప్రాంతం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సా.శ. 18వ శతాబ్దంలో ఒక కృత్రిమ నదీ తీర నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కలకత్తా ప్రాంతం అభివృద్ధి చెందింది. కోల్‌కతా 1911 వరకు బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది, ఆ తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చారు. 19వ శతాబ్దంలో కోల్‌కతా వేగంగా అభివృద్ధి చెంది బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యంలో లండన్ తర్వాత, రెండవ అతి ముఖ్యమైన నగరంగా మారింది. భారతీయ తత్వాలు, సంస్కృతి, యూరోపియన్ సంప్రదాయంతో కలవడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందడం విశేషం,

చరిత్ర

[మార్చు]
సబర్నా రాయ్ చౌదరి కుటుంబానికి చెందిన పురాతన దుర్గా దేవాలయం. 1610లో లక్ష్మీకాంత గంగోపాధ్యాయచే నిర్మించబడింది.
జోరాసంకో ఠాకూర్ బారీ, ఇప్పుడు రవీంద్రభారతి విశ్వవిద్యాలయం

బ్రిటీష్ వారు భారతదేశానికి రావడానికి చాలాకాలం ముందు, కోల్‌కతా (గతంలో కాళీ క్షేత్రం, కాళీదేవి భూమి అని పిలుస్తారు) ప్రాంతంలో, బరిషానుండి హలీసాహర్ వరకుఅన్ని భూములను మొఘల్ చక్రవర్తి జహంగీర్ కుటుంబం నుండి సబర్ణరాయ్ చౌదరి అనే జమీందారు(భూపాలకుడు) స్వాధీనం చేసుకున్నాడు.[3]

ఒకప్పుడు అభివృద్ధి చెందిన సప్తగ్రామ్ ఓడరేవు క్షీణించడంతో, వ్యాపారులు బసక్స్, షెత్‌లు, ఇతరులు వ్యాపారులు దక్షిణం ప్రాంతం వైపు వెళ్లడం ప్రారంభించి, వారు గోబిందాపూర్ వంటి ప్రదేశాలలో స్థిరపడి అభివృద్ధి చెందారు. సుతానూతిలో పత్తి, నూలు వ్యాపారం ప్రారంభించారు. చిత్పూర్ ఒక నేతకేంద్రం, బారానగర్ మరొక వస్త్రకేంద్రం. కాళీఘాట్ ఒక పుణ్యక్షేత్రంగా ఉండేది. హుగ్లీ అంతటా సాల్కియా, బెటోర్ వంటి ప్రదేశాలు ఉండేవి. కాలికట్ అంతగా తెలియని ప్రదేశం.1687 నాటి థామస్ బౌరీ, 1690 నాటి జార్జ్ హెరాన్ పాత పటాలలో సుతానూతి, గోబిందాపూర్ రెండూ కనిపించినప్పటికీ, రెండింటి మధ్య ఉన్న కాలికట్ ఉనికి చూపలేదు. అయినప్పటికీ అబుల్ ఫజల్ ఐన్-ఇ-అక్బరీ (1596)లో 'కల్‌కతా' అనే పేరుగా రూపాంతరం చెందినట్లు ప్రస్తావించబడింది.[3][4] ఆ సమయంలో ఇది సిర్కార్ సత్గావ్ ఆదాయ జిల్లాగా నమోదు చేయబడింది.[5]

1698లో చార్లెస్ ఐర్, ప్రారంభ వలస పాలనాధికారి, జాబ్ చార్నాక్ అల్లుడు, సబర్ణ రాయ్ చౌదరి కుటుంబం నుండి గోబిందాపూర్, కాలికట, సుతానుతి ప్రాంతాలపై జెమిందారీ హక్కులను పొందాడు.[4] బెంగాల్ చివరి స్వతంత్ర నవాబు సిరాజ్-ఉద్-దౌలా పతనం తరువాత, ఆంగ్లేయులు 1758లో మీర్ జాఫర్ నుండి 55 గ్రామాలను కొనుగోలు చేశారు. ఈ గ్రామాలను ఎన్-బ్లాక్ దీహి పంచన్నగ్రామంగా పిలిచేవారు.[3]

అలహాబాద్ ఒప్పందం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి 1765లో బెంగాల్-బీహార్-ఒడిషా తూర్పు రాజ్యంలో దివానీ హక్కులు (పన్నులు వసూలు చేసే హక్కు) ఇవ్వబడ్డాయి.1772లో ఈస్టిండియా కంపెనీ భూభాగాలకు కోల్‌కతా రాజధానిగా మారింది 1793లో ఆంగ్లేయులు నగర ప్రావిన్స్‌పై పూర్తి నియంత్రణను పొందారు. అప్పటి నుండి కోల్‌కతా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభమైంది. 19వ శతాబ్దం ప్రారంభంలో, నగరం చుట్టూ ఉన్న చిత్తడినేలలు ఎండిపోయాయి.19వ శతాబ్దంలో కోల్‌కతా పరిసర ప్రాంత స్వరూపం మార్చేసామాజిక-సాంస్కృతిక ఉద్యమం, బెంగాల్ పునరుజ్జీవనం కేంద్రంగా మారింది. 20వ శతాబ్దం కోల్‌కతాలో జరిగిన చారిత్రక సంఘటనలు - స్వదేశీ ఉద్యమం, మతపరమైన మార్గాల్లో బెంగాల్ మొదటి విభజన, 1911లో జాతీయ రాజధానిని కోల్‌కతా నుండి ఢిల్లీకి మార్చడం, కోల్‌కతా స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉద్భవించింది.1943 నాటి బెంగాల్ కరువు, గ్రేట్ కలకత్తా హత్యలు, బెంగాల్ చివరి విభజన, దేశ స్వాతంత్ర్యం అనుభవం, జ్ఞాపకాలతో కోల్‌కతా, పొరుగున ఉన్న తూర్పు పాకిస్తాన్ నుండి (తరువాత అది బంగ్లాదేశ్) లక్షలాది మంది శరణార్థులు తరలిరావడంతో, కోల్‌కతా సవాళ్లతో కూడిన కొత్త యుగానికి వెళ్లింది.[3]

బెంగాల్ విభజనకు ముందు కోల్‌కతా తూర్పు బెంగాల్‌లోని ప్రజలకు విద్య, ఉద్యోగ అవకాశాలను అందించింది. విభజనకు చాలా కాలం ముందు కోల్‌కతా పావు మిలియన్ తూర్పు బెంగాలీ వలసదారులను ఆదుకుంది. బెంగాల్ విభజన తర్వాత, తూర్పు బెంగాల్ నుండి వలస వచ్చిన శరణార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటాన, జనాభా సాంద్రత, కారణంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు పెద్ద పట్టణాలుగా రూపాంతరం చెందాయి. ముఖ్యంగా అధిక శరణార్థుల జనాభా ఉన్న ప్రాంతాలలో, వేగంగా పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయి. కోల్‌కతా వెలుపలి సరిహద్దులు పొడిగించబడ్డాయి. పట్టణీకరణ ప్రక్రియ మొత్తం వేగవంతమైంది.

1976 సర్వే ప్రకారం, పశ్చిమ బెంగాల్ వెలుపల నుండి వచ్చిన కార్మికుల నిష్పత్తి జనపనార పరిశ్రమలో 71%, నూలు మిల్లులలో 58% మంది, ఇనుము, ఉక్కు పరిశ్రమ లందు 73%. హిందీ హార్ట్‌ల్యాండ్‌కు చెందిన చామర్‌లు. వీరిలో చాలా మంది తోళ్ళ పరిశ్రమలో పనిచేస్తున్నారు. వారు శతాబ్దానికి పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు.1951 జనాభా లెక్కల ప్రకారం, కోల్‌కతా నివాసులలో కేవలం 33.2% మంది మాత్రమే నగరంలో జన్మించారు.విదేశీయుల చిన్నసమూహంతో సహా మిగిలినవారు వలస వచ్చినవారు 12.3% పశ్చిమ బెంగాల్‌లోని ఇతర ప్రాంతాల నుండి, 26.3% భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి, 29.6% తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులు.[6][7][8][9]

భౌగోళిక శాస్త్రం

[మార్చు]
విక్టోరియా మెమోరియల్

కోల్‌కతా జిల్లా 22.037', 22.030' ఉత్తర అక్షాంశ, 88.023', 88.018' తూర్పు రేఖాంశం మధ్య సముద్ర మట్టానికి 6.4 మీటర్లు (17 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. ఇది దిగువ గంగా డెల్టాలో హుగ్లీ తూర్పు తీరాన్నిఆక్రమించింది. జిల్లాలో ఎక్కువ భాగం ఒండ్రు మైదానం, చిత్తడి నేలలతో కలిగిన భూమిని కలిగి ఉంది. ప్రస్తుతం ఉన్న తూర్పు కోల్‌కతా చిత్తడి నేలలు రామ్‌సర్ కన్వెన్షన్ ద్వారా "అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేల"గా గుర్తించబడింది.[10]

కోల్‌కతా జిల్లాకు ఉత్తరాన,తూర్పున ఉత్తర 24 పరగణాల జిల్లా,దక్షిణాన దక్షిణాన 24 పరగణాల జిల్లా,పశ్చిమాన హుగ్లీ మీదుగా హౌరా జిల్లాసరిహద్దులుగాఉన్నాయి.[10]

విస్తీర్ణ పరంగా ఈ జిల్లా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జిల్లాలలో ఇది అతి చిన్నది. అయినా అత్యధిక జనసాంద్రతతో కలిగి ఉంది. రాష్ట్రంలో వంద శాతం పట్టణ జనాభా ఉన్న ఏకైక జిల్లా ఇదే. ఇది రాష్ట్రంలో అత్యల్ప షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు (5.38%) మంది కాగా, షెడ్యూల్డ్ తెగలకు చెందిన జనాభా (0.24%) మంది ఉన్నారు. కోల్‌కతా జిల్లా 2001–2011 దశాబ్దంలో ప్రతికూల వృద్ధి రేటు (−1.7%)తో రాష్ట్రంలో ఉన్న ఏకైక జిల్లా. అలాగే రాష్ట్రంలో రెండవ అత్యధిక అక్షరాస్యత రేటు (86.3%) కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[11]

జనాభా శాస్త్రం

[మార్చు]
కాళీఘాట్ కాళీ ఆలయం, 1887లో ఆది గంగతో

2011 భారత జనాభా లెక్కల ప్రకారం కోల్‌కతా జిల్లా జనాభా 44,96,694,[12] ఇది జనాభా పరంగా సుమారుగా క్రొయేషియా దేశానికి సమానం [13] లేదా యుఎస్ఎ లోని లూసియానా రాష్ట్రంతో సమానం.[14] ఇది భారతదేశంలో జనభా పరంగా దేశంలోని మొత్తం 640 జిల్లాలలో కోల్‌కతా జిల్లా 35వ స్థానంగా ఉంది.[12] జిల్లాలో 24,252 inhabitants per square kilometre (62,810/sq mi).[12] 2001–2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 1.88%నికి పెరిగింది.[12] కోల్‌కతాలో ప్రతి 1000 మంది పురుషులకు 899 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.[12] అక్షరాస్యత రేటు 87.14% ఉంది. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 5.38% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.24% మంది ఉన్నారు.[12]

మతాాల ప్రకారం

[మార్చు]
కోల్‌కతా జిల్లాలో మతాల ప్రకారం
మతం జనాభా (1941) [15] : 75  శాతం (1941) జనాభా (2011) [16] శాతం (2011)
హిందూమతం 15,51,512 73.57% 34,40,290 76.51%
ఇస్లాం 4,97,535 23.59% 9,26,414 20.60%
క్రైస్తవ మతం 16,431 0.78% 39,758 0.88%
ఇతరులు [a] 43,413 2.06% 90,232 2.01%
మొత్తం జనాభా 21,08,891 100% 44,96,694 100%

మొత్తం జనాభాలో జైనులు చాలా తక్కువుగా 0.5% మంది (21,178) ఉన్నారు. సిక్కులు 0.3% (13,849) మంది ఉన్నారు. బౌద్ధులు 0.1% మంది (4,771) ఉన్నారు. ఇతర మతాలను అనుసరించే వ్యక్తుల సంఖ్య 1,452 మంది ఉన్నారు.మతాన్ని పేర్కొనని వ్యక్తులు 1.1% మంది (48,982) ఉన్నారు.[17]

కోల్‌కతా జిల్లాలో హిందువుల నిష్పత్తి 1961లో 83.9% నుండి 2011 నాటికి 76.5%కి తగ్గింది.ఇదే కాలంలో ముస్లింలు 12.8% నుంచి 20.6% శాతానికి పెరిగారు.[17]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కోల్‌కతా జిల్లా జనాభా మొత్తంలో 17,95,740 మంది కార్మికులు (ప్రధాన, ఉపాంత) 39.93% మంది ఉన్నారు. మిగిలిన జనాభా 27,00,954 (60.07%) కార్మికులు కాని వర్గానికి చెందినవారు. జిల్లా మొత్తం పురుష జనాబాలో 59.93% మంది కార్మికులు కాగా, 40.07% మంది కార్మికులు కానివారు ఉన్నారు.అలాగే మొత్తం స్త్రీల జనాభాలో 17.91% మొత్తం కార్మికులు కాగా, 82.09% మంది కార్మికులు కానివారు ఉన్నారు.[18]

ఎన్నికల నియోజకవర్గాలు

[మార్చు]

కోల్‌కతా జిల్లాలోని లోక్‌సభ (పార్లమెంటరీ), విధానసభ (రాష్ట్ర శాసనసభ) నియోజకవర్గాలు క్రింది విధంగా ఉన్నాయి:[19][20]

లోక్ సభ నియోజకవర్గం కేటాయింపు విధానసభ నియోజకవర్గం కేటాయింపు జిల్లాతో సమూహం

చేయబడింది

కోల్‌కతా మహా నగరపాలక సంస్థ వార్డులు
కోల్‌కతా ఉత్తర ఏదీ లేదు చౌరంగీ ఏదీ లేదు కోల్‌కతా 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 ,62
ఎంటల్లీ ఏదీ లేదు కోల్‌కతా 54, 55, 56, 58 ,59
బేలేఘట ఏదీ లేదు కోల్‌కతా 28, 29, 30, 33, 34, 35, 36 , 57
జోరాసాంకో ఏదీ లేదు కోల్‌కతా 22, 23, 25, 27, 37, 38, 39, 40, 41, 42 ,43
శ్యాంపుకూర్ ఏదీ లేదు కోల్‌కతా 7, 8, 9, 10, 17, 18, 19, 20, 21, 24 , 26
మాణిక్తలా ఏదీ లేదు కోల్‌కతా 11, 12, 13, 14, 15, 16, 31 , 32
కాశీపూర్-బెల్గాచియా ఏదీ లేదు కోల్‌కతా 1, 2, 3, 4, 5 ,6
కోల్‌కతా దక్షిణ (పాక్షికంగా) ఏదీ లేదు కోల్‌కతా పోర్ట్ ఏదీ లేదు కోల్‌కతా 75, 76, 78, 79, 80, 133, 134 , 135
భబానీపూర్ ఏదీ లేదు కోల్‌కతా 63, 70, 71, 72, 73, 74, 77 , 82
రాష్‌బెహారి ఏదీ లేదు కోల్‌కతా 81, 83, 84, 86, 87, 88, 89, 90 , 93
బల్లిగంజ్ ఏదీ లేదు కోల్‌కతా 60, 61, 64, 65, 68, 69 ,85

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 "Fact and Figures". Wb.gov.in. Retrieved 5 July 2019.
 2. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). Nclm.nic.in. Ministry of Minority Affairs. p. 85. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 5 July 2019.
 3. 3.0 3.1 3.2 3.3 "District Census Handbook Kolkata, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Pages 6–10: The History. Directorate of Census Operations, West Bengal. Retrieved 20 February 2018.
 4. 4.0 4.1 Cotton, H.E.A., Calcutta Old and New, 1909/1980, pages 1, 11, General Printers and Publishers Pvt.
 5. Cotton, H.E.A., Calcutta Old and New, 1909/1980, page 3
 6. Chakraborty, Satyesh C., "The Growth of Calcutta in the Twentieth Century", in “Calcutta, The Living City” Vol II, Edited by Sukanta Chaudhuri, Pages 4–6, First published 1990, 2005 edition, ISBN 0-19-563697-X
 7. Chatterjee, Partha, "Political Culture of Calutta", in “Calcutta, The Living City” Vol II, Edited by Sukanta Chaudhuri, Page 29, First published 1990, 2005 edition, ISBN 0-19-563697-X
 8. Bandyopadhyay, Raghab, "The Inheritors: Slum and Pavement Life in Calcutta", in “Calcutta, The Living City” Vol II, Edited by Sukanta Chaudhuri, Page 79, First published 1990, 2005 edition, ISBN 0-19-563697-X
 9. Chatterjee, Nilanjana, "The East Bengal Refugees: A Lesson in Survival", in “Calcutta, The Living City” Vol II, Edited by Sukanta Chaudhuri, Page 70, First published 1990, 2005 edition, ISBN 0-19-563697-X
 10. 10.0 10.1 "District Census Handbook Kolkata, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Page 12: Administrative set-up of the district, Page 19: Physical features. Directorate of Census Operations, West Bengal. Retrieved 20 February 2018.
 11. "District Census Handbook Kolkata, Census of India 2011, Series 20, Part XII B" (PDF). Page 25: District Highlights 2011 census, Pages 26–27: Important Statistics. Directorate of Census Operations, West Bengal. Retrieved 20 February 2018.
 12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
 13. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 13 June 2007. Retrieved 1 October 2011. Croatia 4,483,804 July 2011 est.
 14. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011. Louisiana 4,533,372
 15. "CENSUS OF INDIA, 1941 VOLUME VI BENGAL PROVINCE" (PDF). Retrieved 13 August 2022.
 16. "Table C-01 Population by Religion: West Bengal". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
 17. 17.0 17.1 "District Census Handbook Kolkata, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Page 64: religion. Directorate of Census Operations, West Bengal. Retrieved 15 February 2018.
 18. "District Census Handbook Kolkata, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Table 30, Page 71: Number and percentage of main workers, marginal workers and non-workers by sex in Kolkata (M.Corp), 2011, Table 35, Page 72: Distribution of workers by sex in four categories of economic activities in towns, 2011. Directorate of Census Operations, West Bengal. Retrieved 20 February 2018.
 19. "Kolkata (North) district".
 20. "Kolkata (South) district".
 1. Including Jainism, Christianity, Buddhism, Zoroastrianism, Judaism, Ad-Dharmis, or not stated