సాహిబ్‌గంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sahibganj జిల్లా

साहिबगंज जिला
Jharkhand లో Sahibganj జిల్లా స్థానము
Jharkhand లో Sahibganj జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంJharkhand
పరిపాలన విభాగముSanthal Pargana Division
ముఖ్య పట్టణంSahibganj
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుRajmahal
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం1,599 కి.మీ2 (617 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం11,50,038
 • సాంద్రత720/కి.మీ2 (1,900/చ. మై.)
 • పట్టణ
13.86
జనగణాంకాలు
 • అక్షరాస్యత53.73 per cent[1]
 • లింగ నిష్పత్తి948
జాలస్థలిఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో (హిందీ: साहिबगंज जिला) షాహిబ్‌గంజ్ జిల్లా ఒకటి. షాహిబ్‌గంజ్ జిల్లాకు కేంద్రంగా ఉంది.

చరిత్ర[మార్చు]

1983 మే 17న మునుపటి శాంతల్ జిల్లా ఉపవిభాగాలైన రాజ్‌మహల్, పాకూర్‌లను విడదీసి జిల్లా అంతస్తు ఇవ్వబడింది. 1994 జనవరి 28లో పాకూర్ జిల్లా నుండి పాకూర్ ఉపభాగాన్ని తిరిగి వేరుచేసారు. ప్రస్తుత జిల్లా భూభాగం 1592లో రాజామాన్‌ సింగ్ బెంగాల్ సుబాహ్‌లో ఉండేది. రాజామాన్‌ సింగ్ ముగల్ చక్రవర్తి అక్బర్ సామ్రాజ్యంలో సైనికాధికారిగా ఉండేవాడు. 1639లో ఇది బెంగాల్ సుబాహ్ రాజధాని అయింది. తరువాత నియమించబడిన షాహ్ షుజా 1960 వరకూ అలాగే ఉన్నాడు.

భౌగోళికం[మార్చు]

జిల్లా 24°42’, 25°20’ ఉత్తర అక్షాంశం, 87°25’ and 87°54’ తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 1599 చ.కి.మీ ఉంది.

 • జిల్లా భౌగోళిక ఆధారంగా 2 విభాగాలుగా విభజించబడి ఉంది.
 • మొదటి విభాగం డామిన్-ఇ- కొల్హ్‌లో బొరియో, మండ్రొ, బార్‌హైట్, పథ్నా, తాల్ఝరి బ్లాకులు ఉన్నాయి. ఇందులో ఒకప్పుడు కొండచరియలు

దట్టమైన అరణ్యాలతో నిండి ఉన్నాయి. ప్రస్తుతం అరణ్యాలు పలుచబడి ఉన్నాయి.

 • రెండవ విభాగంలో షాహిబ్‌గంజ్, రాజ్‌మహల్, ఉద్వా, బర్హవా బ్లాకులు ఉన్నాయి. మైదాన భూభాగంలో ఎగువభూములు, ఎగుడు దిగుడుగా ఉండే కొండ గట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో

గంగా, గుమని, బంస్లాయి నదులు ప్రవహిస్తున్నాయి.

ఆర్ధికం[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో షాహిబ్‌గంజ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

విభాగాలు[మార్చు]

 • జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది : షాహిబ్‌గజ్, రాజ్మహల్.
 • షాహిబ్‌గంజ్ ఉపవిభాగంలో 4 బ్లాకులు ఉన్నాయి: షాహిబ్‌గంజ్, మండ్రొ, బొర్డొ, బర్హైట్.
 • రాజ్‌మహల్ ఉపవిభాగంలో 5 బ్లాకులు ఉన్నాయి : థాల్ఝరి, రాజ్‌మహల్,ఉద్వా, పత్నా, బర్హర్వా.
 • జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాజ్‌మహల్, బొరియో, బార్హైట్. ఇవన్నీ రాజ్‌మహల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,150,038,[3]
ఇది దాదాపు. టైమర్ లస్తే దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. రోడ్ ద్వీపాలు నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 407వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 719 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.96%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 948 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 53.73%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.
 • జిల్లాలో బెంగాలీ ప్రధాన భాషగా ఉంది.

వృక్షసంపద , జంతుసంపద[మార్చు]

జిల్లాలో " ఉద్వా బర్డ్ శాక్చ్యురీ " ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒకేఒక పక్షులశరణాయంగా ఇది గుర్తింపు పొందింది. ప్రాంతీయులు దీనిని " పఠౌడా సరసు " అంటారు. ఇక్కడికి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి పక్షులు శీతాకాలంలో ఇక్కడికి వలస వస్తుంటాయి. ప్రధానంగా సైబీరియా దేశం నుండి కూడా పక్షులు వస్తుంటాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "District-specific Literates and Literacy Rates, 2011". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2011-12-11. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. మూలం (PDF) నుండి 2012-04-05 న ఆర్కైవు చేసారు. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est. Cite web requires |website= (help)
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]